కృతిమతులీ యూరిని గన శతాధికులె యైన నేమి సభలో నిట స మ్మతి తో చేరిన వారలు శతావధానమున నర్ధశత పృచ్ఛకులే.
అరకొర పారితోషికమ టంచుదలంచిన పెక్కు మంది స ర్వరసులు రామటంచు తెలుపన్ మన కింకను దారి లేక యొ క్కరికిట రెండు మారులవకాశము నిచ్చెద మోయి యప్పుడీ భరతు శతావధానమునఁ బ్రాశ్నికు లేఁబదిమంది చాలరా.
కం:అతిగా మెచ్చకు మయ్యా! మతి లేదా మాకు? మధ్యమమ్మిది, కనగా చతురత గల ప్రాశ్నికు లీ శతావధానమున నర్ధశత పృచ్ఛకులే” (ఏది జరిగినా వంక పెట్టే వాళ్లు కొంద రుంటారు. చాల్లేవయ్యా! మంచి సమస్యలు 50 మందివే.మిగతా వన్నీ అంతంత మాత్రమే అన్నాడు.)
ఉ.
రిప్లయితొలగించండిశ్రీయుత భావ సంభృత విశేష సమంచిత పద్య రత్నముల్
మాయక వెల్గ చక్కని సమస్యలు వర్ణనలున్ సభన్ విధిం
బాయక నిచ్చు సన్మతులు పండుగ గూర్తురు, వాణి గుండెలన్
వ్రాయు, శతావధానమున బ్రాశ్నికు లేబది మంది చాలరా !
కందం
రిప్లయితొలగించండికృతనిశ్చయమ్మునన్ సా
హితీ క్రతువు జరుపనెంచ నితమిత్థముగా
శతమేల? చాలు పాత్రులు
శతావధానమున నర్ధశత పృచ్ఛకులే!
ఉత్పలమాల
తీరిన వారితో జరుప దివ్యముగానవధానమొప్పెడున్
లేరని పృచ్ఛకుల్ శతము లేదన బోక, వధాని సిద్ధమై
పేరిమి సాగగన్ గ్రుతువు విజ్ఞులు నిద్దరికొక్కరట్లుగన్
' వారు' ,శతావధానమునఁ 'బ్రాశ్నికు లేఁబదిమంది' చాలరా?
గతదినము నందు జరిగిన
రిప్లయితొలగించండిశతావధానమున , నర్ధశత పృచ్ఛకులే !
మతిస్థిరతతో బెదరక
చతురత జూపి యవధాని జయమును పొందెన్
కృతిమతులీ యూరిని గన
రిప్లయితొలగించండిశతాధికులె యైన నేమి సభలో నిట స
మ్మతి తో చేరిన వారలు
శతావధానమున నర్ధశత పృచ్ఛకులే.
అరకొర పారితోషికమ టంచుదలంచిన పెక్కు మంది స
ర్వరసులు రామటంచు తెలుపన్ మన కింకను దారి లేక యొ
క్కరికిట రెండు మారులవకాశము నిచ్చెద మోయి యప్పుడీ
భరతు శతావధానమునఁ బ్రాశ్నికు లేఁబదిమంది చాలరా.
చతురత గలిగిన వారై
రిప్లయితొలగించండిప్రతి యొ క్కరు మెచ్చు రీతి ప్రశ్న లు వే సే
మతి మంతులు చాలు ను గద
శతా వ ధానమున నర్ధ శత పృచ్ఛ కు లే
కం॥ అతులిత విజ్ఞతఁ బొందిన
రిప్లయితొలగించండిచతురులు జటిలమగు ప్రశ్న సంధించు విధిన్
సతము చను వారు చాలును
శతావధానమున నర్ధశత పృచ్ఛకులే
ఉ॥ శూరులు విజ్ఞతా కలిత సూక్ష్మముఁ బాటవ మొంది స్ఫూర్తితో
ధారణ కష్టమౌ పగిదిఁ ద్రచ్చి వధానము నొప్పు ప్రశ్నలన్
బేరిచి వాటినే యడుగఁ బేరిమి వీడక సాగు శ్రేష్ఠులౌ
వారు శతావధానమునఁ బ్రాశ్నికు లేఁబది మంది చాలరా
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి గారి బెంగుళూరు త్రిభాషా శతావధానములో రమారమి 50 మందే ఉన్నట్టు గుర్తండి)
కం:అతిగా మెచ్చకు మయ్యా!
రిప్లయితొలగించండిమతి లేదా మాకు? మధ్యమమ్మిది, కనగా
చతురత గల ప్రాశ్నికు లీ
శతావధానమున నర్ధశత పృచ్ఛకులే”
(ఏది జరిగినా వంక పెట్టే వాళ్లు కొంద రుంటారు. చాల్లేవయ్యా! మంచి సమస్యలు 50 మందివే.మిగతా వన్నీ అంతంత మాత్రమే అన్నాడు.)
చ: భరతశతావధాన మను భారము దాల్చుచు,సంఖ్య లింతయున్
రిప్లయితొలగించండిమరువక గాంచు నట్టి మరుమాముల వా రిటు పల్కి రయ్య! మా
భరత శతావధానమునఁ బ్రాశ్నికు లేఁబదిమంది చాల, రా
గురుతర పద్య కేళి కయి కూర్చరె యేబది మందు నింకయున్.
(శతావధానానికి ఇప్పటికి యాభై మంది ప్రాశ్నికులే దొరికారు.ఇంకో యాభై మందిని చూదండి అని మరుమాముల సోదరులు ఎవరో కార్యకర్తల తో అన్నట్లు. )
శతసంఖ్యులు దుర్లభమౌ
రిప్లయితొలగించండిశతావధానముఁ గుదించి సవరించినచో
కృతనిశ్చయమున సగమౌ
శతావధానమున నర్ధశత పృచ్ఛకులే
ఆర్ధిక లోపముందనుచు నాసభ నప్పుడు నిర్వహించినన్
వ్యర్థమొనర్పకుండిరట పైకము నచ్చటి కార్యశీలురే
వర్ధితమౌ వధానమున బ్రాశ్నికు లెందరి యక్కఱుండెనో?
అర్ధ శతావధానమునఁ బ్రాశ్నికు లేఁబదిమంది చాలరా!
మతి లేని వారు కొందఱు
రిప్లయితొలగించండినతుల నొసఁగి యేఁగుదెంచిన నృవరు లన్యుల్
వితతజ్ఞానులు జరిగిన
శతావధానమున నర్ధశత పృచ్ఛకులే
మూరి శతావధానమును ముచ్చట గొల్ప నొకండు సేయఁగా
నేరఁడె వేయఁ బ్రశ్నలను నెమ్మి నొకండును వంద ప్రేక్షకుల్
తోరము మెచ్చ నన్న యది తోఁపక యిట్లని పల్కు వార లె
వ్వారు శతావధానమునఁ బ్రాశ్నికు లేఁబది మంది చాలరా
అరయగ మంచి పండితులె యందరు చిక్కుట కష్టసాధ్యమౌ
రిప్లయితొలగించండిసురుచిరమౌ సమస్యలిడి శోభల జేయ వధానమందునన్
కరమగు యుక్తితో చెలగి కమ్మని పూరణలన్ వధాని చేయగా
పరగు శతావధానమునఁ బ్రాశ్నికు లేఁబదిమంది చాలరా?
తరచుగ సాహితీ సభల దప్పక
రిప్లయితొలగించండిపాల్గొను సత్కవీశ్వరుల్
కరముగ తెల్గుభాషపయి గౌరవ
భావము జూపు ప్రాజ్ఞులున్
సురుచిరమౌ వధానముకు సొంపులు
గూర్చెడి తెలగు భాషికుల్
అరయ శతావధానమున బ్రాశ్నికు
లేబది మంది చాలరా?
వారలమేయ కోవిదులు ప్రాశ్నికు లేబదిమంది వారితో
రిప్లయితొలగించండిజేరి శతావధానమును సేయఁగ బూనెను బాలభానుఁడా
సౌరు కనుంగొనంగ మరి చాలవు కన్నులు వేయిగూడ సొం
పారుశతావధానమునఁ బ్రాశ్నికు లేఁబదిమంది చాలరా
రిప్లయితొలగించండిఉత్పలమాల
పావని వర్ణమాతృకకు భక్తిని జేసెడి గొప్ప సేవగా
భావన జేయ, లోపములు పైబడ లెక్కలు పెట్టి చూడకన్
దైవిక మైన వాటికయి దైన్యము జెందక సాగుచుండ, నా
భావి శతావధానమునఁ బ్రాశ్నికు లేబది మంది చాలరా.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు