18-1-2026 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కారము పాయసమునందుఁ గడు హెచ్చయ్యెన్”(లేదా...)“కారం బెక్కువ యయ్యెఁ బాయసమునం గంజాతపత్రేక్షణా”(భరతశర్మ గారి శతావధానంలో ముద్దు రాజయ్య గారి సమస్య)
కోరి తినగ తీపి యడరె కారణమేమనుచు యెంచి కతన నెరిగితిన్ఈరూపిడు వారల మమకారము పాయసమునందుఁ గడు హెచ్చయ్యెన్”
సురముని నారదుఁడు సత్యభామ తో.. కందంవారిజ నయనా! కృష్ణుడుపారిజమున్ రుక్మిణి కిడె వారించి మిమున్దారగ నిడ ననయము, మమకారము, పాయసమునందుఁ గడు హెచ్చయ్యెన్శార్దూలవిక్రీడితముచేరెన్ బారిజమొంది రుక్మిణి దరిన్ శ్రీకృష్ణుఁడుత్సాహియైవారించెన్ మిముఁ బక్షపాతమెదియో పారాడ ప్రేమాంబుధిన్దారా రత్నమనంగఁ 'బంచ' ,ననుబంధంబెల్ల మాధుర్య సంస్కారం బెక్కువ యయ్యెఁ, బాయసమునం గంజాతపత్రేక్షణా!
ఔరసుని జన్మ దినమని కోరిన వంటకముల నిట కోకొల్లలుగా కూరిమి జేయగ, నీ మమ కారము పాయసమునందుఁ గడు హెచ్చయ్యెన్.ఔరా యేమని చెప్పమందువిట నీవాత్మీయతన్ జూపుచున్ భూరిన్ వంటలు సేసి బంధువులకున్ బోనమ్ము నందింపగా వారల్ మోదము నందనేమి కనగా భావమ్మనే తీపి సం స్కారం బెక్కువ యయ్యెఁ బాయసమునం గంజాతపత్రేక్షణా.
శార్దూలమ్మును చూడ వేగిరముగా చక్కంగ రాకుందునా :)శుభోదయం నూతన వత్సర శుభాకాంక్షలతో ధారాళమ్ముగ నిన్ను కోరి మధువున్ ద్రావంగ వచ్చాను నోరారంగా ప్రియమైన వడ్డనలనన్ రాకేందు బింబాననా హేరాళమ్ముగ చేయమంటి సుజనా హెచ్చేమిరా కొంతయేగారంబెక్కువ యయ్యె పాయసమునన్ కంజాత ప్రత్యేక్షణా!జిలేబీయము
~కంజాతపత్రేక్షణా
కం:నీరము గలుపని పాలన్,దీరగు బెల్లమున నొప్పె దీపి యు సమమైతీరగ జలుబు మిరియములకారము పాయసమునందుఁ గడు హెచ్చయ్యెన్”
కూరను సరిపడ లేదిటకారము; పాయసము నందు కడు హెచ్చయ్యెన్జోరుగ వేయగ చక్కెర,తీరుగ భుజియించనేగ తికమక పడితిన్!
నోరూరింపగ వండుటదారకు పరిపాటియగుట దాగని నిజమే!ఆరోజున మరి ఖండవికారము పాయసమునందుఁ గడు హెచ్చయ్యెన్నోరూరించెడు వంట కంబగును తానొండంగ క్షీరాన్నమేగోరంతైనఁ భుజింపకున్న మనిషే కోల్పోవునా రుచ్యమేధారాళంబగు పంచదారనిడుచున్ దానొండ మాధుర్య సంస్కారం బెక్కువ యయ్యెఁ బాయసమునం గంజాతపత్రేక్షణా
శా:కోరన్ షడ్రుచు లాదివారమున, నే కోపమ్ము తో జేసినావౌరా పప్పున నుప్పు లేదు,విరస మ్మై పోగ నీ చారులోకారం బెక్కువ యయ్యెఁ, బాయసమునం గంజాతపత్రేక్షణా”నోరూరించెడు తీపి లేదు భళి యంచున్ మెచ్చ లేకుంటి గా!
కం॥ నీరము క్షీరముఁ, గలుపుచుసారమొసఁగు తిండి దినుసు సమపాళమునన్దార మురిసి చేయఁగ మమకారము పాయసమునందుఁ గడు హెచ్చయ్యెన్శా॥ నీరంబందున క్షీరమున్ గలుపుచున్ నిష్ఠా ధృతిన్ సాగుచున్సారంబొందఁగ భోజ్య వస్తువుల విస్తారమ్ముగా వాడుచున్ ధారాళమ్మగు ప్రేమ భార్య కని సంధానించఁగన్ స్నేహ సంస్కారం బెక్కువ యయ్యెఁ బాయసమునం గంజాతపత్రేక్షణాసంధానించు కూర్చు
నారీమణి పాయసమునధారాళము ప్రీతి నాకుఁ దనియక కట్టా నోరూరఁ దినఁగఁ దినఁగ వికారము పాయసము నందుఁ గడు హెచ్చయ్యెన్ కారుణ్యమ్మున విందు నీ వొసఁగినం గాంతా విచిత్రమ్ముగం బారావార నిభమ్ముగా నడరుచున్ భాసిల్ల భాండమ్ములందోరంబై కనిపించు నా యతిథి సందోహమ్మునం బ్రీతి స్వీకారం బెక్కువ యయ్యెఁ బాయసమునం గంజాతపత్రేక్షణా
కోరిన విధము గ వండుచు మేరయ లేనట్టి ప్రేమ మించిన మమత న్ నోరూరు నట్లు గ తన మమ కారము పాయసము నందు గడు హెచ్చయ్యె న్
సమస్య:“కారం బెక్కువ యయ్యెఁ బాయసమునం గంజాతపత్రేక్షణా”శార్దూలము:ఆరంభింపక నెట్లు సాగు మన యీ యాప్యాయతా గారముల్ ! సారంబున్ దెలిసేనులే పుటుక నీ సాంగత్యమే దక్కగా !మారామే మరిగేనుగా మనసు నీ మాయా విలాసమ్ములన్ “కారం బెక్కువ యయ్యెఁ బాయసమునం గంజాతపత్రేక్షణా”
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.కూరల యందున తగ్గెనుకారము;పాయసమునందు కడు హెచ్చయ్యెన్భారీగ వేయ చక్కెర;తీరుగ రుచులెట్లువేయ తెలియదు గనుకన్.
కోరి తినగ తీపి యడరె
రిప్లయితొలగించండికారణమేమనుచు యెంచి కతన నెరిగితిన్
ఈరూపిడు వారల మమ
కారము పాయసమునందుఁ గడు హెచ్చయ్యెన్”
సురముని నారదుఁడు సత్యభామ తో..
రిప్లయితొలగించండికందం
వారిజ నయనా! కృష్ణుడు
పారిజమున్ రుక్మిణి కిడె వారించి మిమున్
దారగ నిడ ననయము, మమ
కారము, పాయసమునందుఁ గడు హెచ్చయ్యెన్
శార్దూలవిక్రీడితము
చేరెన్ బారిజమొంది రుక్మిణి దరిన్ శ్రీకృష్ణుఁడుత్సాహియై
వారించెన్ మిముఁ బక్షపాతమెదియో పారాడ ప్రేమాంబుధిన్
దారా రత్నమనంగఁ 'బంచ' ,ననుబంధంబెల్ల మాధుర్య సం
స్కారం బెక్కువ యయ్యెఁ, బాయసమునం గంజాతపత్రేక్షణా!
రిప్లయితొలగించండిఔరసుని జన్మ దినమని
కోరిన వంటకముల నిట కోకొల్లలుగా
కూరిమి జేయగ, నీ మమ
కారము పాయసమునందుఁ గడు హెచ్చయ్యెన్.
ఔరా యేమని చెప్పమందువిట నీవాత్మీయతన్ జూపుచున్
భూరిన్ వంటలు సేసి బంధువులకున్ బోనమ్ము నందింపగా
వారల్ మోదము నందనేమి కనగా భావమ్మనే తీపి సం
స్కారం బెక్కువ యయ్యెఁ బాయసమునం గంజాతపత్రేక్షణా.
శార్దూలమ్మును చూడ వేగిరముగా చక్కంగ రాకుందునా :)
రిప్లయితొలగించండిశుభోదయం
నూతన వత్సర శుభాకాంక్షలతో
ధారాళమ్ముగ నిన్ను కోరి మధువున్ ద్రావంగ వచ్చాను నో
రారంగా ప్రియమైన వడ్డనలనన్ రాకేందు బింబాననా
హేరాళమ్ముగ చేయమంటి సుజనా హెచ్చేమిరా కొంతయే
గారంబెక్కువ యయ్యె పాయసమునన్ కంజాత ప్రత్యేక్షణా!
జిలేబీయము
~కంజాతపత్రేక్షణా
తొలగించండికం:నీరము గలుపని పాలన్,
రిప్లయితొలగించండిదీరగు బెల్లమున నొప్పె దీపి యు సమమై
తీరగ జలుబు మిరియముల
కారము పాయసమునందుఁ గడు హెచ్చయ్యెన్”
కూరను సరిపడ లేదిట
రిప్లయితొలగించండికారము; పాయసము నందు కడు హెచ్చయ్యెన్
జోరుగ వేయగ చక్కెర,
తీరుగ భుజియించనేగ తికమక పడితిన్!
నోరూరింపగ వండుట
రిప్లయితొలగించండిదారకు పరిపాటియగుట దాగని నిజమే!
ఆరోజున మరి ఖండవి
కారము పాయసమునందుఁ గడు హెచ్చయ్యెన్
నోరూరించెడు వంట కంబగును తానొండంగ క్షీరాన్నమే
గోరంతైనఁ భుజింపకున్న మనిషే కోల్పోవునా రుచ్యమే
ధారాళంబగు పంచదారనిడుచున్ దానొండ మాధుర్య సం
స్కారం బెక్కువ యయ్యెఁ బాయసమునం గంజాతపత్రేక్షణా
శా:కోరన్ షడ్రుచు లాదివారమున, నే కోపమ్ము తో జేసినా
రిప్లయితొలగించండివౌరా పప్పున నుప్పు లేదు,విరస మ్మై పోగ నీ చారులో
కారం బెక్కువ యయ్యెఁ, బాయసమునం గంజాతపత్రేక్షణా”
నోరూరించెడు తీపి లేదు భళి యంచున్ మెచ్చ లేకుంటి గా!
కం॥ నీరము క్షీరముఁ, గలుపుచు
రిప్లయితొలగించండిసారమొసఁగు తిండి దినుసు సమపాళమునన్
దార మురిసి చేయఁగ మమ
కారము పాయసమునందుఁ గడు హెచ్చయ్యెన్
శా॥ నీరంబందున క్షీరమున్ గలుపుచున్ నిష్ఠా ధృతిన్ సాగుచున్
సారంబొందఁగ భోజ్య వస్తువుల విస్తారమ్ముగా వాడుచున్
ధారాళమ్మగు ప్రేమ భార్య కని సంధానించఁగన్ స్నేహ సం
స్కారం బెక్కువ యయ్యెఁ బాయసమునం గంజాతపత్రేక్షణా
సంధానించు కూర్చు
నారీమణి పాయసమున
రిప్లయితొలగించండిధారాళము ప్రీతి నాకుఁ దనియక కట్టా
నోరూరఁ దినఁగఁ దినఁగ వి
కారము పాయసము నందుఁ గడు హెచ్చయ్యెన్
కారుణ్యమ్మున విందు నీ వొసఁగినం గాంతా విచిత్రమ్ముగం
బారావార నిభమ్ముగా నడరుచున్ భాసిల్ల భాండమ్ములం
దోరంబై కనిపించు నా యతిథి సందోహమ్మునం బ్రీతి స్వీ
కారం బెక్కువ యయ్యెఁ బాయసమునం గంజాతపత్రేక్షణా
కోరిన విధము గ వండుచు
రిప్లయితొలగించండిమేరయ లేనట్టి ప్రేమ మించిన మమత న్
నోరూరు నట్లు గ తన మమ
కారము పాయసము నందు గడు హెచ్చయ్యె న్
సమస్య:
రిప్లయితొలగించండి“కారం బెక్కువ యయ్యెఁ బాయసమునం గంజాతపత్రేక్షణా”
శార్దూలము:
ఆరంభింపక నెట్లు సాగు మన యీ యాప్యాయతా గారముల్ !
సారంబున్ దెలిసేనులే పుటుక నీ సాంగత్యమే దక్కగా !
మారామే మరిగేనుగా మనసు నీ మాయా విలాసమ్ములన్
“కారం బెక్కువ యయ్యెఁ బాయసమునం గంజాతపత్రేక్షణా”
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
కూరల యందున తగ్గెను
కారము;పాయసమునందు కడు హెచ్చయ్యెన్
భారీగ వేయ చక్కెర;
తీరుగ రుచులెట్లువేయ తెలియదు గనుకన్.