*అంచపైన గ్రుడ్లగూబ కంత కోపమేలనో* ఎంచి పాలు నీళ్లనెడపు నెఱుక తనకు లేదనా మంౘుతెరలు మల్లెపూల మవ్వమంౘదేయనా ఇంౘుపాలకడలియింతి ఇంటనున్న ౙాలదా
ఎడపు : వేరుచేయి మవ్వము : సొగసు
భావం : హంస పైన గుడ్లగూబకు అంత కోపం ఎందుకు? పాలను, నీళ్లను వేరుచేసే వివేకం (హంసకు ఉన్నట్లు) తనకు లేదనా? లేక మంచు తెరల వలె, మల్లెపూల వలె తెల్లగా మెరిసిపోయే హంస అందం తనకి లేదనా? కారణం ఏదైనా, క్షీరసాగర పుత్రిక అయిన లక్ష్మీదేవి ఇంట్లో (గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం కాబట్టి) ఉన్నప్పుడు ఈ అసూయ ఎందుకు?
అంచపై గ్రుడ్లగూబకు నలుక యేల ?
రిప్లయితొలగించండివాటి రౌతుల విలువల వామయేను ,
విద్య యుండిన చాలును విత్తమంటు ,
విత్తముండిన మాత్రాన విద్య రాదు
బాగుంది
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఅగ్ర తాంబూల మదియేల యాదవునకు
చూడగను వాడు నవనీత చోరు డంచు
పలికెడి శిశుపాలుని గని పలికె నొక్క
డంచపై గ్రుడ్లగూబకు నలుక యేల
మంచి వాడు కానె కాదు మాయగాడె గాంచ వా
డంచు నిట్లు చక్రి కేల యడ్డు చెప్ప గొంతు నే
చించు కొంచు నుండె గాదె చేది రాజు, కెందుకో
యంచపైన గ్రుడ్లగూబ కంత కోపమేలనో.
తేటగీతి
రిప్లయితొలగించండివిద్యనేర్చిన మనుజుల వెంట స్థిరము
నుండు వాణి వాహనమౌచు నొందశాంతి,
సిరుల తల్లి 'చల'ను మ్రోయు చింతకాక
యంచపై గ్రుడ్లగూబకు నలుక యేల?
ఉత్సాహము
చంచలన్ భరింప కష్టసాధ్యమై శ్రమించుటన్
బంచనుండ సుస్థిరమ్ము వాణినంద పండితుల్
గొంచమే శ్రమించునంచు కుందికాక, యెక్కుడౌ
యంచపైన గ్రుడ్లగూబ కంత కోపమేలనో?
అంచపై గ్రుడ్ల గూబకు నలుక యేల
రిప్లయితొలగించండినెంచి చూడగ విదితమౌ నెన్నికలని
మంచి పౌరులు రాయంచనెంచినపుడు
కొంచెపడినదా లంచాల గ్రుడ్లగూబ
అంచపైన గ్రుడ్లగూబ కంత కోపమేలనో
కొంచెమైనఁ దేల్చవచ్చు కోరుకొన్న వెంటనే
లంచగొండి గ్రుడ్లగూబ రాజ్యమేలనెంచినన్
మంచి హంసనే వరించి మాన్యులెన్నినారనే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసమస్య : "అంచపైన గ్రుడ్లగూబ కంత కోపమేలనో"
రిప్లయితొలగించండిఉత్సాహము :
*అంచపైన గ్రుడ్లగూబ కంత కోపమేలనో*
ఎంచి పాలు నీళ్లనెడపు నెఱుక తనకు లేదనా
మంౘుతెరలు మల్లెపూల మవ్వమంౘదేయనా
ఇంౘుపాలకడలియింతి ఇంటనున్న ౙాలదా
ఎడపు : వేరుచేయి
మవ్వము : సొగసు
భావం : హంస పైన గుడ్లగూబకు అంత కోపం ఎందుకు? పాలను, నీళ్లను వేరుచేసే వివేకం (హంసకు ఉన్నట్లు) తనకు లేదనా? లేక మంచు తెరల వలె, మల్లెపూల వలె తెల్లగా మెరిసిపోయే హంస అందం తనకి లేదనా? కారణం ఏదైనా, క్షీరసాగర పుత్రిక అయిన లక్ష్మీదేవి ఇంట్లో (గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం కాబట్టి) ఉన్నప్పుడు ఈ అసూయ ఎందుకు?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅంచపై గ్రుడ్లగూబకు నలుక యేల?
రిప్లయితొలగించండిహంస నడకల దనరారునట్టి హొయలు
గ్రుడ్లగూబకలవడక క్రోధమొంది
యలుక బూనెను ఘూకమే యంచపైన
అంచపైన గ్రుడ్లగూబ కంత కోపమేలనో?
యెంచి చూడ తనదు కన్ను లెంత యందమైనవో
యంచకన్న మిన్నకాదె యంచు దలచి యాత్మలో
యంచపైన నీసుతోడ నలుక బూనె ఘూకమే
తే॥ అంచపై గ్రుడ్లగూబకు నలుక యేల
రిప్లయితొలగించండినచ్చెరువు నొందఁ దగునొకో హంస యన్న
నాదరించి గూబఁ గనఁగ నపశకునమ
ని జనులు తొలఁగి పోవఁగ నిండెనలుక
సుగంధి
అంచపైన గ్రుడ్లగూబకంత కోపమేలనో
మించినంత యందమొంది మెప్పుఁ గాంచెనంచునో
పెంచు కోరు తన్ను చూచి పేర్మిఁ జూపరంచునో
యెంచ తాను కూతఁ గూయ నేవగింతు రంచునో
(గ్రుడ్ల గూబ కూత అదీ రాత్రిపూట వినబడుతుంది కనుక అపశకునమని తలుస్తారు కదండి)
మంచి చెడ్డల గమనించు మహిత మైన గుణము గల్గిన హంస యే గొప్ప యట్టి
రిప్లయితొలగించండియంచ పై గుడ్ల గూబ కు నలుక యేల
యుచిత మై యొ ప్ప దెప్పుడు నుర్వి యందు
సుగంధి
రిప్లయితొలగించండిఅంచ దెచ్చె బల్కు లమ్మ నందమౌ గతిన్ గదా!
ఎంచ దేమి లచ్చి జేర్చ నింత యైన ఘూకమే
అంచపైన గ్రుడ్లగూబ కంత కోపమేలనో”
యెంచ యత్త రౌతు కాన యీర్ష్య బొందుచుండునో!
అచ్చమైన తెల్లని దని మచ్చరమ్మ
రిప్లయితొలగించండియీఁద నేర్చు నింపుగ నని యీర్ష్య మెండ
కవులు దాని వర్ణించుట కారణమ్మ
యంచపై గ్రుడ్లగూబకు నలుక యేల
మంచుఁ బోలు తెల్ల నైన మనసు దనరు పూరుషుం
గొంచె మైన జాలి లేక కొట్టు చుండు నిత్యమున్
మించి యింగిలంపుఁ గెంపు మేటి గ్రుడ్డు లున్న వాఁ
డంచ పైన గ్రుడ్లగూబ కంత కోప మేలనూ
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
అంచపై గ్రుడ్ల గూబకు నలుక యేల?
యనగ హంసను చూడగ నందమొలుకు
గ్రుడ్ల గూబఁ గని యపశకునమటంచు
జనులు తొలగుట కారణ మనగ వచ్చు.