ఆ.వె: నాకు శిష్యు డయ్యు నను లెక్క జేయక దూరు చుండు నిమ్మకూరి వాడు శిష్యు ననెడు భక్తి చేరుపుకో లేని చం దూరువాఁడె యఘవిదూరుఁ డగును” (ఈయన శిష్యుల్లో ఒకడి ఇంటి పేరు నిమ్మకూరు.ఒకడి ఇంటి పేరు చందూరు.నిమ్మకూరి వాడు మంచి వాడు కాదు.చందూరు వాడు మంచి వాడు.)
ఉ:"దూరిన ధర్మ కార్యముల దోషము లెన్నెడు వార లెందరో !, చేరునె యొక్కడేనియును శ్రీ యొక యింత నొసంగ!, జేసినన్ పేరు గడింతునే!" యనుచు భీతుల నొందక కర్మ యోగి యై దూరెడివాఁడె దుష్కృతవిదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్ (ధర్మకార్యాలలో పై భయము లేకుండా కర్మయోగి గా ఉండే వాడే ఉత్తముడు.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఇంత వయసు వ చ్చినగూడ , నెన్నటికిని
రిప్లయితొలగించండిపెద్దవారి నసలు గౌరవించకుండి
పరుష వచనము పలికెడు పాలసుడిని
దూరువాఁడె యఘవిదూరుఁ డగును
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిచిరుత ప్రాయ మందు చిలిపి దనముతోడ
స్వకుల తోడ తాను సరజము నట
కొల్ల గొట్ట నెంచి గొల్లకొంపల యందు
దూరువాఁడె యఘవిదూరుఁ డగును.
భీరువు జంపె స్తన్యమిడు వేళను, పాటల గంధు లెల్ల కా
సారము లోన నుండు తరి స్రజ్వల దోచె పరేతుండ్ర తో
జేరుచు హౌమ్యమున్ గిలుబు జేయగ గొల్లల కొంపలందు నన్
దూరెడివాఁడె దుష్కృతవిదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్.
తీరనట్టికోర్కెఁ దీర్పగ వలయును
రిప్లయితొలగించండిరాజకీయమనుచు మోజుపడుచు
చట్టసభను దూరు సంకల్పమేర్పడ
దూరువాఁడె యఘవిదూరుఁ డగును
తీరని కాంక్షలే కడకుఁ దీర్చెడు మార్గము రాజకీయమే
వేరుగ లేదులేదనుచు వేగమె యెన్నిక లందు నిల్చి తాఁ
జోరుగ నెన్నికై పిదప సొంపుగ చట్టసదస్సు నందునన్
దూరెడివాఁడె దుష్కృతవిదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్
ఆ. సాధు వర్తనమ్ము సత్యశీలతగల్గి
రిప్లయితొలగించండిమానితమగు తెరగు మసలు వాడు
అహము దర్పమాది యవగుణముల నెల్ల
దూరువాఁడె యఘవిదూరుఁ డగును
సాధుపుంగవులను సజ్జనకోటిని
రిప్లయితొలగించండివీడకెపుఁడు తోడు నీడయగుచు
దురితములొనరించు దుష్టవర్తనులను
దూరువాఁడె యఘవిదూరుఁ డగును
వారక సత్యమార్గమున వర్తిలుచున్ సతతంబు సజ్జనో
ద్ధారణమందు ప్రీతిఁగొని ధర్మముఁ దప్పక సంచరించుచున్
నేరమొనర్చు దుర్మతుల నీతివిదూరుల నిల్వరించుచున్
దూరెడివాఁడె దుష్కృతవిదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్
ఆ.వె: నాకు శిష్యు డయ్యు నను లెక్క జేయక
రిప్లయితొలగించండిదూరు చుండు నిమ్మకూరి వాడు
శిష్యు ననెడు భక్తి చేరుపుకో లేని చం
దూరువాఁడె యఘవిదూరుఁ డగును”
(ఈయన శిష్యుల్లో ఒకడి ఇంటి పేరు నిమ్మకూరు.ఒకడి ఇంటి పేరు చందూరు.నిమ్మకూరి వాడు మంచి వాడు కాదు.చందూరు వాడు మంచి వాడు.)
ఉ:"దూరిన ధర్మ కార్యముల దోషము లెన్నెడు వార లెందరో !,
రిప్లయితొలగించండిచేరునె యొక్కడేనియును శ్రీ యొక యింత నొసంగ!, జేసినన్
పేరు గడింతునే!" యనుచు భీతుల నొందక కర్మ యోగి యై
దూరెడివాఁడె దుష్కృతవిదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్
(ధర్మకార్యాలలో పై భయము లేకుండా కర్మయోగి గా ఉండే వాడే ఉత్తముడు.)
కపట సూత్ర ధారి కనికరమును వీడి
రిప్లయితొలగించండిజనుల మో స గించు జటి లు డ గుచు
మసలు నట్టి వాని మర్యాద హీనుని
దూరు వాడె యఘ విదూ రు డ గును
వీఁకఁ జేయు చుండి లోకోపకారము
రిప్లయితొలగించండిస్వార్థ చింత వీడి సంతతమ్ము
శిష్ట జనులఁ గాచి దుష్ట జనులఁ గాంచి
దూఱు వాఁడె యఘ విదూరుఁ డగును
పాఱక భీతి నెన్నఁడును వారక దుష్టుల ఘోర కృత్యముల్
దూఱుచు మంచి బుద్ధులను దోరము వారికి నేర్పి మార్చుచున్
మీఱి జగజ్జనావన నిమిత్తము మ్రొక్కఁగ మందిరమ్ములం
దూఱెడి వాఁడె దుష్కృత విదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్
[దూఱు= నిందించు; తూఱు= చొచ్చు]
తోరపు నిచ్చతోడుతను దుర్వ్యసనమ్ముల లోన మున్గుచున్
రిప్లయితొలగించండినేరమనస్కుడై సతము నీతిని వీడి చరించు చుండి సం
సారపు నాశనమ్మునకు సారథియౌ సుతు జిత్తశుద్ధితో
దూరెడివాఁడు దుష్కృతవిదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్
శిశుపాలుని నిందాస్తుతి:
రిప్లయితొలగించండిఆటవెలది
ధర్మరాజ! తమరి ధర్మమిట్లుండెనే!
పరుల వధువు నొంది పరుగు దీసి,
కోరి వెన్న కొరకు గొల్లెతలిండ్లను
దూరువాఁడె యఘవిదూరుఁ డగును!
ఉత్పలమాల
నేరము ధర్మజా! తమరు నీలకళేబరు నగ్రపూజకున్
జేరుచ! వింటివే! పరులు చేకొన బూనిన భామనందియున్!
చీరల దోచి గోపికల చింతిల, వెన్నకు వారలిండ్లలో
దూరెడివాఁడె దుష్కృతవిదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ప్రతి దినంబు పూజ భక్తితో చేయుచు
ధర్మ పథమునందు తాను నడచి
తీర్థయాత్ర లనుచు దేవళమ్ముల యందు
దూరు వాడె యఘ విదూరుఁ డగును.