సృక్ సృష్టించునది, సృష్టికర్తా తక్ పరిహసించుట (సృష్టి కర్త ఎన్నో మానవుల ఆనందానికి సృజించాడు. వాటిని చూసి ఆనందించాలి కాని పరిహసించే పలుకులు కూడదు అనే భావమండి) వాక్ ను సంధి చేసినట్టుగా దృక్, సృక్, తక్ సంధిచేసానండి.
శా:దృగ్వ్యాప్తమ్మగు దాని నెల్ల కవితన్ దీపింప గా జేయ, స మ్యగ్వ్యాసావళిలో విమర్శకుల ప్రేమన్ బొంద, దైవేచ్ఛ చే వాగ్వ్యాపారము కృష్ణ శాస్త్రిని విడెన్,వ్రాయించ వాగ్దేవి యే వాగ్వ్యాపారము లేనివాఁడె బుధుఁడై ప్రఖ్యాతినందెన్ గదా! (కృష్ణశాస్త్రి గారికి స్వర పేటిక పోయింది.ఆయనకి వాగ్దేవి రూప మైన వాక్కు పోయింది కానీ వాగ్దెవి కవిత్వం వ్రాయించింది.)
కం:దృగ్వ్యాపారము తో స మ్యగ్వ్యక్తీకరణ జేయు నధికారి సదా వాగ్వ్యర్థము జేయ, డతిగ వాగ్వ్యాపారమ్ము లేనివాఁడె బుధుండౌ” ( సమర్థు డైన అధికారి ఎప్పుడూ అతిగా వాగడు.కంటి చూపుల తోనే భావాలు వ్యక్తం చేస్తాడు.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండివాగ్వ్యాపారమధిక మవ
వాగ్వ్యాపారులను గాంచి బర్బరు లనరే
వాగ్వ్యాపారులు మొకరులు
వాగ్వ్యాపారమ్ము లేనివాఁడె బుధుండౌ.
ఈ గ్వ్యా ప్రాసను గూర్చి పద్యముల నేనేరీతిగా వ్రాయుదున్
వాగ్వ్యాపారపు పాటవమ్మదియె లుప్తంబైన వాడన్ గదా
వాగ్వ్యాపారము సేయనట్టి మునులే ప్రఖ్యాతు లై వెల్గిరే
వాగ్వ్యాపారము లేనివాఁడె బుధుఁడై ప్రఖ్యాతినందెన్ గదా.
వాగ్వ్యసనము విడకుండిన
రిప్లయితొలగించండివాగ్వ్యాధిని నొందుట యలవాటగుచుండున్ ,
వాగ్వ్యవధానమె మంచిది
వాగ్వ్యాపారమ్ము లేనివాఁడె బుధుండౌ”
శా॥ సృగ్వ్యాపారముఁ జేసి మానవులకై సృష్టించె నాదైవమే
రిప్లయితొలగించండిదృగ్వ్యాపారము తోడఁ దుష్టిఁ బడయన్ దేదీప్య మానంబుగన్
దగ్వ్వాపారము వీడి భక్తిఁ గనుచున్ ధ్యానించకన్ మూర్ఖమౌ
వాగ్వ్యాపారము లేని వాఁడె బుధుఁడై ప్రఖ్యాతినందెన్ గదా
సృక్ సృష్టించునది, సృష్టికర్తా
తక్ పరిహసించుట
(సృష్టి కర్త ఎన్నో మానవుల ఆనందానికి సృజించాడు. వాటిని చూసి ఆనందించాలి కాని పరిహసించే పలుకులు కూడదు అనే భావమండి)
వాక్ ను సంధి చేసినట్టుగా దృక్, సృక్, తక్ సంధిచేసానండి.
తప్పైతే విజ్ఞులు తెలిపితే, నేర్చుకుంటానండి.
శా:దృగ్వ్యాప్తమ్మగు దాని నెల్ల కవితన్ దీపింప గా జేయ, స
రిప్లయితొలగించండిమ్యగ్వ్యాసావళిలో విమర్శకుల ప్రేమన్ బొంద, దైవేచ్ఛ చే
వాగ్వ్యాపారము కృష్ణ శాస్త్రిని విడెన్,వ్రాయించ వాగ్దేవి యే
వాగ్వ్యాపారము లేనివాఁడె బుధుఁడై ప్రఖ్యాతినందెన్ గదా!
(కృష్ణశాస్త్రి గారికి స్వర పేటిక పోయింది.ఆయనకి వాగ్దేవి రూప మైన వాక్కు పోయింది కానీ వాగ్దెవి కవిత్వం వ్రాయించింది.)
కం:దృగ్వ్యాపారము తో స
రిప్లయితొలగించండిమ్యగ్వ్యక్తీకరణ జేయు నధికారి సదా
వాగ్వ్యర్థము జేయ, డతిగ
వాగ్వ్యాపారమ్ము లేనివాఁడె బుధుండౌ”
( సమర్థు డైన అధికారి ఎప్పుడూ అతిగా వాగడు.కంటి చూపుల తోనే భావాలు వ్యక్తం చేస్తాడు.)