15, ఫిబ్రవరి 2026, ఆదివారం

దత్తపది - 213

16-2-2026 (సోమవారం)
కవిమిత్రులారా,
"మామిడి - నారింజ - జామ - నేరేడు"
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
రామాయణార్థంలో
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి. 

14 కామెంట్‌లు:

  1. తేటగీతి
    మృత్యువని కుజన్ దలఁచుమా మిడిసిపడక
    భవుని వింటి నారింజవమె విసరె నన
    రామమూర్తిని రాజా! మఱచితివేమొ!
    కుజన గణమునేరే డుండుకుండు నిజము

    రిప్లయితొలగించండి
  2. *(విభీషణుడు రావణునితో పలికిన మాటలుగా)*

    పంత మేలనో నారిం జవమున రాము
    జేర్చు మగ్రజా మగువ యా సీత శుక్కు
    హితము కాదందునే రేడు విటుల సేయ
    మృత్యు హేతువగును సుమా మిడిసి పడకు.

    రిప్లయితొలగించండి
  3. ఒంట రియయి యుండగ "జామ" నొడిసిపట్టె
    నని దెలియగ "నే,రేడు" ని యణచనెంచి
    కడలి దాటి యా"నారిం,జ"క్కగ కయిగొన
    మేలుగ దెలిపెద విను"మా! మిడి" సిపడుచు

    రిప్లయితొలగించండి
  4. [విభీషణుడు రావణునితో.....]

    వీడు[మా మిడి]కెడు పువుబోడి కుజను
    పరుల [నారింజ]డిగొలుపన్ బాడికాదు
    మనవి వినుమగ్ర[జా మ]నకొనరుమేలు
    మఱపు తప్పు[నే రేడు] నా మాటవినక

    రిప్లయితొలగించండి
  5. త్రిజట సీతాదేవితో:

    భామా మిడికిపడకు నీ
    రాముండేతెంచుఁ జామ రావణుఁ గూల్చున్
    భూమమ్మున నే రేడును
    లేమా నారిం జమరిన రెచ్చిల్లడుగా

    రిప్లయితొలగించండి
  6. విభీషణుడు రావణుని హెచ్చరించుట సీతను చెరబట్టి తన శక్తిని రావణుడు గొప్పగా చెప్పుకుంటున్నపుడు

    మ॥ టముకున్ వేయుట మానుమా మిడిసిపడ్డన్ జచ్చుటే యగ్రజా
    క్రిమినిన్ జంపెడు రీతిఁగూల్చు విడు నారిం జల్లగా మోదమౌ
    సమ బుద్ధిన్ గను జామదగ్ని వలె విస్తారమ్ముగా ద్రుంచడో
    తమి నేరేడు మురారియో యతనినే ధ్యానించ క్షేమమ్మగున్

    (ఇదే భావము సరళముగా తేటగీతిలో నండి)

    తే॥ పడకు వినుమా మిడిసిపాటు పతనముఁ గను
    విడువ నారిం జతురుఁడవు విహిత మదియె
    కూల్చు జామదగ్ని వలెనె క్రుద్ధుఁడైనఁ
    గనఁగ నేరేడు హితుఁడని క్షయము తొలఁగు

    జామదగ్ని పరశురాముడు తమి అపేక్ష

    రిప్లయితొలగించండి
  7. మామిడి - నారింజ - జామ - నేరేడు"
    శా:నారిన్ జంపుట పాప మంచు మది చింతన్ వీడుమా! ధర్మ మౌ
    నే!రేడున్ గృప బూన స్త్రీ యనుచు, దా హింసన్ సహించన్! ఘన
    మ్మౌ రీతిన్ వధియింపుమా మిడిసి పా ట్లన్నింటినిన్ దీర్చి యో
    శ్రీరామా! వర సుప్రజా! మనుజ సుశ్రేయమ్మునే కోరుమా!

    రిప్లయితొలగించండి
  8. రావణు o డనే రేడు దా రమణి సీత
    నప హరించె నా రిం జని కపటు డ గుచు
    మానుమా మిడి జ్ఞానము మంచి దగునె
    విడు వు మనుజా మరల నామె వెరు వ కుండ
    విభీ ష ణుడు రావణు ని తో )

    రిప్లయితొలగించండి
  9. కనుమా మిడి శిఖి నారిం
    జని కదియం జామ! యసురు ఛాతిని రక్తం
    బను నే రేడు నొకటి యో
    జనమ్ము పాఱినది యక్కజముగ వనమునన్

    [నారిన్ + చని = నారిం జని = నారనిఁ బొంది; మిడి శిఖి = తీక్ష్ణ బాణము; రక్తంబు+అను +ఏరు +ఏడు =రక్తం బను నే రేడు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఏఱు అంటే నది, ఏఱుకొనుట . మీరు ఏరు అనేది ఏఅర్థంతో వాడారో తెలియజేయ ప్రార్థన.

      తొలగించండి
  10. ఒక్క విశేషము:
    నేరేడు పదమును నే, రేడు గా విఱిచి రేడు ను రాజుగా గ్రహించి పూరించుట తగదు. ఏల యనిన రాజునకు పర్యాయ పదము ఱేఁడు. కాని నేరేడు లోని రేడు లో శకట రేఫము లేదు నడుమ నరసున్నయు లేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ రామా! మిడిమేలమైన మదితో క్రీడించు దుర్బుద్ధి, నీ
      నారింజంపుట నేరమా! యసుర కాంతన్ యక్ష జామన్ వడిన్
      నారాశమ్మున దున్ము కావగ ప్రజన్ నా జన్నమున్ భూవరా!
      నేరాత్ముల్ దరి చేర నెంచ తరమౌనే రేడు తోడుండగా

      తొలగించండి