2, ఫిబ్రవరి 2026, సోమవారం

సమస్య - 5370

3-2-2026 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వైరి పాదాంబుజములకు వందనములు”
(లేదా...)
“వైరి పదాంబుజంబులకు వందనముల్ గడు భక్తిఁ జేసెదన్”

16 కామెంట్‌లు:

  1. కోర్కె లన్నియు దీ ర్చె డి కొంగు పసిడి
    సర్వ జనులను రక్షించుసదయు డ గుచు
    విశ్వ మంత యు వ్యాపించు వేలుపు ముర
    వైరి పాదాంబు జ ముల కు వందన ములు

    రిప్లయితొలగించండి

  2. శూలము కరమందున శశి జూటమందు
    గళమున భుజగమును దాల్చు గరళ గళుడు
    పుంగవమునెక్కి తిరిగెడి భూరి మదన
    వైరి పాదాంబుజములకు వందనములు.


    వారిజ వైరి జూటమున పయ్యర మేపరి భూషణమ్ములై
    గౌరిని యర్థదేహమున గల్గి కకుద్మతి నెక్కి తిర్గు కే
    దారుడు లింగరూపుడు శతఘ్నుడు సర్వకరుండు మన్మథున్
    వైరి పదాంబుజంబులకు వందనముల్ గడు భక్తిఁ జేసెదన్.

    రిప్లయితొలగించండి
  3. ప్రఘనులడిగిన వెంటనె వరములొసగి
    దెప్పరములబడ యెరచిదిండి నుండి
    అమరులను కాపుకాసిన యసురగణపు
    వైరి పాదాంబుజములకు వందనములు

    రిప్లయితొలగించండి
  4. శౌరి బకవైరి శకటారి శైలధరుడు
    పీతవాసుడు కంసారి వెన్నముచ్చు
    జనులఁ గాపాడు వాడు వ్రజవరుడు ముర
    వైరి పాదాంబుజములకు వందనములు

    శూరుని పౌత్రుడైన మధుసూదనుడే పరమేశ్వరుండు కం
    సారి సదా మనుష్యులను సాకుచునుండును బేర్మితోడ మ
    ల్లారిని వేడుకొన్న పరిరక్షణమేర్పడు గాన ముష్టికా
    వైరి పదాంబుజంబులకు వందనముల్ గడు భక్తిఁ జేసెదన్

    రిప్లయితొలగించండి
  5. -
    హరిని కొలిచెద ప్రణతుల; హారతి బక
    వైరి పాదాంబుజములకు; వందనములు
    వేంకటరమణ; ముక్కోటి వేల్పులార
    శరణు; గిరిధర గోపాల శైలధరుడ!
    బేడిసలివి నమస్సుల వెన్నదొంగ !



    రిప్లయితొలగించండి
  6. సమస్య : "వైరి పాదాంబుజములకు వందనములు"

    తే. దావమునకేగి తలదాల్చ తండ్రియాన
    దానవాధముల దునిమి మునులఁ గాచి
    అమల చరితాత్ముడైనట్టి యా దశాస్యు
    వైరి పాదాంబుజములకు వందనములు

    భావం:
    తండ్రి ఆజ్ఞను శిరసావహించి అడవులకు వెళ్ళి, అక్కడ మునులను బాధిస్తున్న నీచులైన రాక్షసులను సంహరించి, ముని పుంగవులను కాపాడి, నిర్మలమైన చరిత్ర కలిగినవాడు మరియు ఆ దశకంఠుడైన రావణుడికి శత్రువైన ఆ శ్రీరామచంద్రుని పాదపద్మములకు నా వందనములు.

    రిప్లయితొలగించండి
  7. శ్రీరమణీమనోహరుని సేవిత భక్తుల ప్రాణరక్షకున్
    ఘోరభవాబ్ధితారకుని కోరిభజించుచు నాత్మలోన నే
    తీరుగ వాని పాదములు దిక్కని నమ్మి ముకుందు కంసదు
    ర్వైరి పదాంబుజంబులకు వందనముల్ గడుభక్తి జేసెదన్

    రిప్లయితొలగించండి
  8. తే॥ దీన జనుల బాధ నడఁచి తేజరిలుచు
    భక్తుల కరము విడువక భవముఁ బాపి
    శిష్ట రక్షణఁ జేయుచుఁ జెలఁగు దైత్య
    వైరి పాదాంబుజములకు వందనములు

    ఉ॥ తీరుగఁ బ్రోచుఁ వాఁడతఁడు దీనుల నార్తులఁ ద్రుంచి బాధలన్
    భారము మోయువాఁడతఁడు భవ్య మనోజ్ఞ దయాంతరంగుఁడై
    క్రూరులఁ గూల్చువాఁడతఁడు కుందఁగ భక్తులు నట్టి దుష్టతా
    వైరి పదాంబుజంబులకు వందనముల్ గడు భక్తిఁ జేసెదన్

    రిప్లయితొలగించండి
  9. తే.గీ:అన్న రావణు పై నేనె యలుక బూన
    మృతుని పై కక్ష వల దని హితము జెప్పు
    నట్టి రామునకున్,బ్రభువౌ నజాత
    వైరి పాదాంబుజములకు వందనములు”
    (మా అన్న దుర్మార్గుడు.అతనికి నేను కర్మలు చెయ్యను అని తమ్ముడి నైన నేనే అంటే"మరణాంతాని వైరాని " అని ప్రేమను బోధించిన రాముని కి నమస్కారం అన్నాడు విభీషణుడు. )


    రిప్లయితొలగించండి
  10. ఉ:వైరము బూని నాడ బ్రతిపక్షము పై, ప్రతి పక్ష నాయకున్
    దూరితి, నిన్ను మెచ్చితిని, దూరము బెట్టుచు నన్ను దొంగలౌ
    వారిని జేర దీసితివి, పాపమె యంటును నిన్ను గొల్వ నా
    వైరి పదాంబుజంబులకు వందనముల్ గడు భక్తిఁ జేసెదన్”
    (అధికార పక్షం లో ఉండి ప్రతిపక్షాన్ని ఎంత తిట్టినా నువ్వు నన్ను గుర్తించక దొంగలను నమ్ముతావా! చూడు నేను ప్రతిపక్షం లోకి పోయి వాడి కాళ్లే పట్టుకుంటా అన్నాడు ఒక నాయకుడు.)

    రిప్లయితొలగించండి
  11. లోక విఖ్యాత వీర వర్యునకు నిత్య
    యుద్ధ సన్నద్ధునకు సద్గు ణోత్తమునకు
    దుర్జయ పరాక్ర మోపేత నిర్జిత నిజ
    వైరి పాదాంబుజములకు వందనములు


    నీరద సన్ని భాంగు ముఖ నిర్జిత శీత మయూఖు సంత తా
    పార దయా రసార్ణవు సుపర్ణ విమాను సహస్ర బాహు నీ
    రేరుహ పత్ర లోచను సలీలు భుజంగ విరాజి విశ్వ జి
    ద్వైరి పదాంబుజంబులకు వందనముల్ గడు భక్తిఁ జేసెదన్

    రిప్లయితొలగించండి
  12. కరిని గాచిన వరదుని గమలనయను
    సిరికి వల్లభుఁడైనట్టి చిత్స్వరూపు
    కరము మోడిచి సద్భక్తి గదుర కంస
    వైరి పాదాంబుజములకు వందనములు

    కోరి భజింతు మాధవుని గోపకులైక విభూషణున్ హరిన్
    చీరలొసంగి ద్రోవదికి శీలము గాచిన కృష్ణమూర్తినిన్
    ఘోర గభీర సంసరణ కూపమునున్ వెడలింప కంసుకున్
    వైరి పదాంబుజంబులకు వందనముల్ గడు భక్తిఁ జేసెదన్

    రిప్లయితొలగించండి
  13. తీరగు మాటలన్ బలికి తీర్చెద పేదల బాధలంచు నే
    చేరితి శాసనాలయము, చెప్పిన యట్లు పదమ్ము నీక నే
    నేరపు వృత్తి నుంటినని నేత వచించె త్యజించి వీనినిన్
    వైరి పదాంబుజంబులకు వందనముల్ కడు భక్తి జేసెదన్

    రిప్లయితొలగించండి
  14. తేటగీతి
    బ్రహ్మ కడిగిన పావన పాదమనగ
    పుణ్యవాహిని గంగమ్మ పుట్టెననఁగ
    తిరుమలేశుని సేవింతు నిరతము నఘ
    వైరి పాదాంబుజములకు వందనములు

    ఉత్పలమాల
    మీరిన శ్రద్ధతోఁ గడుగ మిన్నగ నిత్యము పద్మసంభవుం
    డారయ పుణ్యవాహిని సరాపగ పుట్టిన యుగ్మమేయనన్
    సారెకు సారెకున్ దలఁచి సాయమునెంచియు పాపచింతనా
    వైరి పదాంబుజంబులకు వందనముల్ గడు భక్తిఁ జేసెదన్

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    దుష్టుల శిక్షించి,రక్షించి శిష్టుల నిల
    భక్తితో పూజ చేయ కాపాడుచుండి
    దిక్కు నీవని నమ్మ నేతెంచు నసుర
    వైరి పాదాంబుజములకు వందనములు.

    రిప్లయితొలగించండి