9-2-2026 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పతి యడలఁగ నన్యోన్యదాంపత్య మగును”(లేదా...)“ఆలిం గాంచిన భర్త భీతిలుటయే యన్యోన్యదాంపత్యమౌ”
కాంత సంతసించు దనను గాంచినంతపతి యడలఁగ ; నన్యోన్యదాంపత్య మగునుభర్త యెల్లవేళల దన భార్యయనిన జంకు చుండినట్లు నటన సలుప జాలు
సతి పతికినర్థ భాగమై సతతముండసతి కుతిలపాటు గణుతింపఁ బతిది కాదెపతివతీ ప్రసవంబున బాధఁ గాంచిపతి యడలఁగ నన్యోన్యదాంపత్య మగునునాలోనీవగు నర్ధభాగమని తానర్ధాంగితోఁ బల్కి తానేలోకంబుఁ నపూర్వమై నిలిచి ప్రాణేశాగ్రభాగంబునన్గాలాతీతపు కాన్పులోన వధువాక్రందించు వైళంబునాయాలిం గాంచిన భర్త భీతిలుటయే యన్యోన్యదాంపత్యమౌ
🙏
భార్య యన తనలో సగ భాగ మంచు దలచి చరియించ నేమిరా తమ్మికంటి వలదను పని చేయ వలసి వచ్చిన తరి పతి యడల నన్యోన్యదాంపత్య మగును.స్త్రీలే మూలము ధాత్రి కంచు సతి వ్యక్తిత్వమ్ము మన్నించు చున్ పాలాకుండ్రులు వారు కాదనుచు సంభావించెడిన్ వారలే చాలింకన్ వలదన్న కార్యము నటన్ సంపూర్తిగా చేయ నా యాలిం గాంచిన భర్త భీతిలుటయే యన్యోన్యదాంపత్యమౌ.
తే.గీ:అంద మగు కాంత యింటికి నరుగు దెంచ"నామె బాగున్న" దను భావ మంద నీకతలను ద్రిప్పుక సిగ్గుల నొలక బోసిపతి యడలఁగ నన్యోన్యదాంపత్య మగును”(భార్య ప్రక్కన ఉండగా మరొక అందగత్తె కనిపిస్తే బాగున్న దనే ఫీలింగ్ కనపడకుండా సిగ్గు, భయము నటిస్తే భార్య మెచ్చుకుంటుంది.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
2)శా:ఆలిన్ మెచ్చుచు, నామె యెవ్వరెడ నీర్ష్యన్ బొందునో యట్టి యిల్లాలిన్ మెచ్చక, యన్య కాంత తనకే యడ్డమ్ముగా రాగ దాశీల మ్మెంతొ వహించి దారి నిడి, యా స్త్రీ వంకనే చూచు నిల్లాలిం గాంచిన భర్త భీతిలుటయే యన్యోన్యదాంపత్యమౌ”
సతికి నచ్చని పనులే వి సల్ప కుండదుష్ట సహవాస ముల కెల్ల దూర ముండి మాట జవదాట కుండ దా మసలి సతికి పతి యడ లగ నన్యోన్య దాంపత్య మగును
కాలంబందున మార్పువచ్చె, కనగా కాంతామణుల్ పృథ్వి నుద్వేలమ్మైన ధనంపు శక్తి గొని యుద్దీపించుచున్ నిల్చి హేరాళమ్మైన మదమ్ము జూప, నిశి స్వర్గమ్మున్ గొనన్ దల్చుచున్ ఆలింగాంచిన భర్త భీతిలుటయే యన్యోన్య దాంపత్యమౌ
ఎన్నఁ డేని వీక్షించిన నిర్వురు నిల నొక్క విషయమ్ము నారసి వెక్కసముగ సంతసించిన నవ్విధి సతియు నింకఁ బతి యడలఁగ నన్యోన్య దాంపత్య మగును ఆ లీలన్ సతి కూడ భీతిలిన నయ్యావేళలం దాత్మలో లీలా లోల విలాస వేళలను నుల్లేఖమ్ము లందైన హాస్యాలాపమ్ముల నైన నేమి నిజ భార్యా వక్త్ర సంతప్త భావాలిం గాంచిన భర్త భీతిలుటయే యన్యోన్య దాంపత్యమౌ
తేటగీతిమమత చూపించి జీవితమర్మమెఱిఁగినిత్య షట్కర్మల మనము నిల్పుసతియెపతిని దూషించు వారల నుతుకనెంచఁబతి యడలఁగ! నన్యోన్యదాంపత్య మగును! శార్దూలవిక్రీడితముపాలింపన్ బతిదేవునిన్ సతము సేవాభావనన్ జూచు సచ్ఛీలాంభోనిధిఁ బోలెడున్ వధువదే శ్రేయంబుగన్ బొందుచున్గేలిన్జేయఁగ జూడ నన్యులు పతిన్ గింకన్ సతాయించు నయ్యాలిం గాంచిన భర్త భీతిలుటయే యన్యోన్యదాంపత్యమౌ!
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.తప్పులను చేసి తన పతి దారి తప్పసక్రమమగు మార్గమునందు చక్కబెట్టపతిపయి నటించి సతియు దుర్భాషలాడపతి యడలగ నన్యోన్య దాంపత్య మగును.
కాంత సంతసించు దనను గాంచినంత
రిప్లయితొలగించండిపతి యడలఁగ ; నన్యోన్యదాంపత్య మగును
భర్త యెల్లవేళల దన భార్యయనిన
జంకు చుండినట్లు నటన సలుప జాలు
సతి పతికినర్థ భాగమై సతతముండ
రిప్లయితొలగించండిసతి కుతిలపాటు గణుతింపఁ బతిది కాదె
పతివతీ ప్రసవంబున బాధఁ గాంచి
పతి యడలఁగ నన్యోన్యదాంపత్య మగును
నాలోనీవగు నర్ధభాగమని తానర్ధాంగితోఁ బల్కి తా
నేలోకంబుఁ నపూర్వమై నిలిచి ప్రాణేశాగ్రభాగంబునన్
గాలాతీతపు కాన్పులోన వధువాక్రందించు వైళంబునా
యాలిం గాంచిన భర్త భీతిలుటయే యన్యోన్యదాంపత్యమౌ
🙏
తొలగించండి
రిప్లయితొలగించండిభార్య యన తనలో సగ భాగ మంచు
దలచి చరియించ నేమిరా తమ్మికంటి
వలదను పని చేయ వలసి వచ్చిన తరి
పతి యడల నన్యోన్యదాంపత్య మగును.
స్త్రీలే మూలము ధాత్రి కంచు సతి వ్యక్తిత్వమ్ము మన్నించు చున్
పాలాకుండ్రులు వారు కాదనుచు సంభావించెడిన్ వారలే
చాలింకన్ వలదన్న కార్యము నటన్ సంపూర్తిగా చేయ నా
యాలిం గాంచిన భర్త భీతిలుటయే యన్యోన్యదాంపత్యమౌ.
తే.గీ:అంద మగు కాంత యింటికి నరుగు దెంచ
రిప్లయితొలగించండి"నామె బాగున్న" దను భావ మంద నీక
తలను ద్రిప్పుక సిగ్గుల నొలక బోసి
పతి యడలఁగ నన్యోన్యదాంపత్య మగును”
(భార్య ప్రక్కన ఉండగా మరొక అందగత్తె కనిపిస్తే బాగున్న దనే ఫీలింగ్ కనపడకుండా సిగ్గు, భయము నటిస్తే భార్య మెచ్చుకుంటుంది.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి2)శా:ఆలిన్ మెచ్చుచు, నామె యెవ్వరెడ నీర్ష్యన్ బొందునో యట్టి యి
రిప్లయితొలగించండిల్లాలిన్ మెచ్చక, యన్య కాంత తనకే యడ్డమ్ముగా రాగ దా
శీల మ్మెంతొ వహించి దారి నిడి, యా స్త్రీ వంకనే చూచు ని
ల్లాలిం గాంచిన భర్త భీతిలుటయే యన్యోన్యదాంపత్యమౌ”
సతికి నచ్చని పనులే వి సల్ప కుండ
రిప్లయితొలగించండిదుష్ట సహవాస ముల కెల్ల దూర ముండి
మాట జవదాట కుండ దా మసలి సతికి
పతి యడ లగ నన్యోన్య దాంపత్య మగును
కాలంబందున మార్పువచ్చె, కనగా కాంతామణుల్ పృథ్వి ను
రిప్లయితొలగించండిద్వేలమ్మైన ధనంపు శక్తి గొని యుద్దీపించుచున్ నిల్చి హే
రాళమ్మైన మదమ్ము జూప, నిశి స్వర్గమ్మున్ గొనన్ దల్చుచున్
ఆలింగాంచిన భర్త భీతిలుటయే యన్యోన్య దాంపత్యమౌ
ఎన్నఁ డేని వీక్షించిన నిర్వురు నిల
రిప్లయితొలగించండినొక్క విషయమ్ము నారసి వెక్కసముగ
సంతసించిన నవ్విధి సతియు నింకఁ
బతి యడలఁగ నన్యోన్య దాంపత్య మగును
ఆ లీలన్ సతి కూడ భీతిలిన నయ్యావేళలం దాత్మలో
లీలా లోల విలాస వేళలను నుల్లేఖమ్ము లందైన హా
స్యాలాపమ్ముల నైన నేమి నిజ భార్యా వక్త్ర సంతప్త భా
వాలిం గాంచిన భర్త భీతిలుటయే యన్యోన్య దాంపత్యమౌ
తేటగీతి
రిప్లయితొలగించండిమమత చూపించి జీవితమర్మమెఱిఁగి
నిత్య షట్కర్మల మనము నిల్పుసతియె
పతిని దూషించు వారల నుతుకనెంచఁ
బతి యడలఁగ! నన్యోన్యదాంపత్య మగును!
శార్దూలవిక్రీడితము
పాలింపన్ బతిదేవునిన్ సతము సేవాభావనన్ జూచు స
చ్ఛీలాంభోనిధిఁ బోలెడున్ వధువదే శ్రేయంబుగన్ బొందుచున్
గేలిన్జేయఁగ జూడ నన్యులు పతిన్ గింకన్ సతాయించు న
య్యాలిం గాంచిన భర్త భీతిలుటయే యన్యోన్యదాంపత్యమౌ!
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
తప్పులను చేసి తన పతి దారి తప్ప
సక్రమమగు మార్గమునందు చక్కబెట్ట
పతిపయి నటించి సతియు దుర్భాషలాడ
పతి యడలగ నన్యోన్య దాంపత్య మగును.