11-2-2026 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పరమార్థజ్ఞాన మొసఁగు బర్బరుఁడు దగన్”(లేదా...)“పరమార్థంబునుఁ దెల్పు జ్ఞానమునుఁ జెప్పం జాలు మూఢుం డొగిన్”
కందంకరకైన బోయ రామునిచరితము రచియించె నాది సత్కవియగుచున్బరమాత్మ కృపన్ గల్గినఁబరమార్థజ్ఞాన మొసఁగు బర్బరుఁడు దగన్మత్తేభవిక్రీడితముకరకౌ వేటరి వ్రాసె నాది కవిగన్ కావ్యమ్ము రామాయణంబరయన్ దారక నామ మంత్ర మెకటే వల్లించి పల్మారులున్గరుణాసింధువు రామమూర్తి వరముల్ గల్గంగ చిత్రమ్ముగన్బరమార్థంబునుఁ దెల్పు జ్ఞానమునుఁ జెప్పం జాలు మూఢుం డొగిన్!
పరమమను నమ్మకుండినగరాసుడైనను బ్రతుకున కడమకు జేరన్ విరివిగ కష్టములబడయపరమార్థజ్ఞాన మొసఁగు బర్బరుఁడు దగన్”
హరభక్తుడు తిన్నడు సర్వరసుడతడు కాదు చూడ పామరుడైనన్ స్థిరమును పొందిన కథ విన పరమార్థజ్ఞాన మొసఁగు బర్బరుఁడు దగన్.పిరిమిన్ మాంసము ఫాలనేత్రునకు నైవేద్యమ్ముగా పెట్టె పామరుడాతిన్నడు శంకరున్ గొలువ నేమంత్రమ్ము వాచించెనో ధరణిన్ తిన్నని దివ్యగాధవిని విద్యావంతుడే చెప్పెనేపరమార్థంబునుఁ దెల్పు జ్ఞానమునుఁ జెప్పం జాలు మూఢుం డొగిన్.
సమస్య : “పరమార్థజ్ఞాన మొసఁగు బర్బరుఁడు దగన్”కం. నెరి సాంఘిక మాధ్యమునను పరిజనతతి పరిగ్రహణము పరమావధియైఅరకొర విజ్ఞానముననుపరమార్థజ్ఞాన మొసఁగు బర్బరుఁడు దగన్భావం : సోషల్ మీడియాలో కేవలం ఫాలోవర్లను సంపాదించుకోవడమే పరమావధిగా, అరకొర జ్ఞానంతో ఎదుటివారికి ఉపదేశాలు చేసే మూర్ఖుడు (బర్బరుడు) లోకంలో కనిపిస్తున్నాడు.
పరమేశా వరమొసగుముసరిపోదీ ముల్లె లేదు సంతర్పణమేపరమార్థమనగ ధనమేపరమార్థజ్ఞాన మొసఁగు బర్బరుఁడు దగన్పరమేశా వరమిమ్ము విత్తమును సంపాదించి పొంగారగాసరిపోదెంత గడించినన్ మనసులో స్వార్థంబు కాలూనగాపరమార్థమ్మన నొప్పు కేవలము ద్రవ్యంబే విచారించినన్బరమార్థంబునుఁ దెల్పు జ్ఞానమునుఁ జెప్పం జాలు మూఢుం డొగిన్
-పెరుగన్ మూర్ఖ శిఖామణులరగొర చదువుల్ , బొళబొళల తయారు వితంబరయంగా మిగులు సుమీపరమార్థజ్ఞానమొసగు బర్బరుడు దగన్!
అరయఁగ కలికాలమునన్బరమార్థమ్మగు జనులకు వర్థిలు సిరులేవెరవక నార్జించు మనుచుపరమార్థజ్ఞాన మొసఁగు బర్బరుఁడు దగన్
అరయన్ జీవులు లోకమందున సదా యార్జించుటే సంపదల్పరమోత్కృష్టఁపు కార్యమైదనరు సంప్రాప్తించినన్ బాపముల్వెరపుం జెందగనేల నయ్యదియె సంవేద్యంబటంచీ విధిన్పరమార్థంబునుఁ దెల్పు జ్ఞానమునుఁ జెప్పం జాలు మూఢుం డొగిన్
కం:వరముగ ముఖమాటము గల,సిరి గల వారలు దొరకిన జేయక యే యేగురు సేవ,సాధనమ్మునుపరమార్థజ్ఞాన మొసఁగు బర్బరుఁడు దగన్”(ఏ సాధన, గురువు లేకున్నా కాస్త డబ్బు,పలుకుబడి ఉన్న వాళ్లు పక్కన ఉంటే ఎలాంటి వాడైనా ఆథ్యాత్మిక ప్రసంగాలు చెయ్య వచ్చు. )
మ:పరమ జ్ఞాన మెరుంగు వారు తమకున్ బ్రాప్తించు సచ్ఛిష్యుకే గురుబోధన్ బ్రసరింప జేతు, రిక జేకూరంగ మూఢాత్ములున్,సిరి బ్రాప్తించిన జాలు నెల్లరను దా శిష్యాళిగా నెంచుచున్పరమార్థంబునుఁ దెల్పు జ్ఞానమునుఁ జెప్పం జాలు మూఢుం డొగిన్”(నిజమైన పరమార్థ మెరిగిన మహాత్ముడు సరైన శిష్యునికే గురుబోధ అనుగ్రహిస్తారు.ఇక మూర్ఖు లైన వాళ్లు దొరికిన వా డెవడైనా శిష్యుడే అనుకొని కాస్త సొమ్ము ఇస్తే చాలు. పారమార్థిక బోధ లిస్తూ ఉంటారు.)
పరమ గురువు బోధించియు పరమార్థ జ్ఞాన మొసగు : బర్బరుడు దగన్ పరహిత మును గోర కయే చరి యించు చు జగతి యందు సంబర మందున్
పురు షోత్తముండు వర బర్బర దేశస్థుండు వేద పారాయణుఁ డిద్ధర నర్థుల కెల్లరకును బరమార్థజ్ఞాన మొసఁగు బర్బరుఁడు దగన్ ధరలో లేరె మహాత్ము లెంద ఱకటా ధర్మజ్ఞు లుద్ధండులున్ సరి లే రెవ్వరు వాని కంచుఁ బరమాశ్చర్యంబ యిబ్భంగి నానరునిం గూర్చి వచింప నీ వతని యౌన్నత్యమ్ము దా నేరఁ డే పరమార్థంబునుఁ దెల్పు జ్ఞానమునుఁ జెప్పం జాలు మూఢుం డొగిన్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.నిరతము గీతా బోధనపరమార్థ జ్ఞానమొసగు; బర్బరుడు దగన్పరులను మన్నన చేయకమరియాదలు తెలియకుండ మసలుచు నుండున్.
కందం
రిప్లయితొలగించండికరకైన బోయ రాముని
చరితము రచియించె నాది సత్కవియగుచున్
బరమాత్మ కృపన్ గల్గినఁ
బరమార్థజ్ఞాన మొసఁగు బర్బరుఁడు దగన్
మత్తేభవిక్రీడితము
కరకౌ వేటరి వ్రాసె నాది కవిగన్ కావ్యమ్ము రామాయణం
బరయన్ దారక నామ మంత్ర మెకటే వల్లించి పల్మారులున్
గరుణాసింధువు రామమూర్తి వరముల్ గల్గంగ చిత్రమ్ముగన్
బరమార్థంబునుఁ దెల్పు జ్ఞానమునుఁ జెప్పం జాలు మూఢుం డొగిన్!
పరమమను నమ్మకుండిన
రిప్లయితొలగించండిగరాసుడైనను బ్రతుకున కడమకు జేరన్
విరివిగ కష్టములబడయ
పరమార్థజ్ఞాన మొసఁగు బర్బరుఁడు దగన్”
రిప్లయితొలగించండిహరభక్తుడు తిన్నడు స
ర్వరసుడతడు కాదు చూడ పామరుడైనన్
స్థిరమును పొందిన కథ విన
పరమార్థజ్ఞాన మొసఁగు బర్బరుఁడు దగన్.
పిరిమిన్ మాంసము ఫాలనేత్రునకు నైవేద్యమ్ముగా పెట్టె పా
మరుడాతిన్నడు శంకరున్ గొలువ నేమంత్రమ్ము వాచించెనో
ధరణిన్ తిన్నని దివ్యగాధవిని విద్యావంతుడే చెప్పెనే
పరమార్థంబునుఁ దెల్పు జ్ఞానమునుఁ జెప్పం జాలు మూఢుం డొగిన్.
సమస్య : “పరమార్థజ్ఞాన మొసఁగు బర్బరుఁడు దగన్”
రిప్లయితొలగించండికం. నెరి సాంఘిక మాధ్యమునను
పరిజనతతి పరిగ్రహణము పరమావధియై
అరకొర విజ్ఞానమునను
పరమార్థజ్ఞాన మొసఁగు బర్బరుఁడు దగన్
భావం : సోషల్ మీడియాలో కేవలం ఫాలోవర్లను సంపాదించుకోవడమే పరమావధిగా, అరకొర జ్ఞానంతో ఎదుటివారికి ఉపదేశాలు చేసే మూర్ఖుడు (బర్బరుడు) లోకంలో కనిపిస్తున్నాడు.
పరమేశా వరమొసగుము
రిప్లయితొలగించండిసరిపోదీ ముల్లె లేదు సంతర్పణమే
పరమార్థమనగ ధనమే
పరమార్థజ్ఞాన మొసఁగు బర్బరుఁడు దగన్
పరమేశా వరమిమ్ము విత్తమును సంపాదించి పొంగారగా
సరిపోదెంత గడించినన్ మనసులో స్వార్థంబు కాలూనగా
పరమార్థమ్మన నొప్పు కేవలము ద్రవ్యంబే విచారించినన్
బరమార్థంబునుఁ దెల్పు జ్ఞానమునుఁ జెప్పం జాలు మూఢుం డొగిన్
-
రిప్లయితొలగించండిపెరుగన్ మూర్ఖ శిఖామణు
లరగొర చదువుల్ , బొళబొళల తయారు వితం
బరయంగా మిగులు సుమీ
పరమార్థజ్ఞానమొసగు బర్బరుడు దగన్!
అరయఁగ కలికాలమునన్
రిప్లయితొలగించండిబరమార్థమ్మగు జనులకు వర్థిలు సిరులే
వెరవక నార్జించు మనుచు
పరమార్థజ్ఞాన మొసఁగు బర్బరుఁడు దగన్
అరయన్ జీవులు లోకమందున సదా యార్జించుటే సంపదల్
రిప్లయితొలగించండిపరమోత్కృష్టఁపు కార్యమైదనరు సంప్రాప్తించినన్ బాపముల్
వెరపుం జెందగనేల నయ్యదియె సంవేద్యంబటంచీ విధిన్
పరమార్థంబునుఁ దెల్పు జ్ఞానమునుఁ జెప్పం జాలు మూఢుం డొగిన్
కం:వరముగ ముఖమాటము గల,
రిప్లయితొలగించండిసిరి గల వారలు దొరకిన జేయక యే యే
గురు సేవ,సాధనమ్మును
పరమార్థజ్ఞాన మొసఁగు బర్బరుఁడు దగన్”
(ఏ సాధన, గురువు లేకున్నా కాస్త డబ్బు,పలుకుబడి ఉన్న వాళ్లు పక్కన ఉంటే ఎలాంటి వాడైనా ఆథ్యాత్మిక ప్రసంగాలు చెయ్య వచ్చు. )
మ:పరమ జ్ఞాన మెరుంగు వారు తమకున్ బ్రాప్తించు సచ్ఛిష్యుకే
రిప్లయితొలగించండిగురుబోధన్ బ్రసరింప జేతు, రిక జేకూరంగ మూఢాత్ములున్,
సిరి బ్రాప్తించిన జాలు నెల్లరను దా శిష్యాళిగా నెంచుచున్
పరమార్థంబునుఁ దెల్పు జ్ఞానమునుఁ జెప్పం జాలు మూఢుం డొగిన్”
(నిజమైన పరమార్థ మెరిగిన మహాత్ముడు సరైన శిష్యునికే గురుబోధ అనుగ్రహిస్తారు.ఇక మూర్ఖు లైన వాళ్లు దొరికిన వా డెవడైనా శిష్యుడే అనుకొని కాస్త సొమ్ము ఇస్తే చాలు. పారమార్థిక బోధ లిస్తూ ఉంటారు.)
పరమ గురువు బోధించియు
రిప్లయితొలగించండిపరమార్థ జ్ఞాన మొసగు : బర్బరుడు దగన్
పరహిత మును గోర కయే
చరి యించు చు జగతి యందు సంబర మందున్
పురు షోత్తముండు వర బ
రిప్లయితొలగించండిర్బర దేశస్థుండు వేద పారాయణుఁ డి
ద్ధర నర్థుల కెల్లరకును
బరమార్థజ్ఞాన మొసఁగు బర్బరుఁడు దగన్
ధరలో లేరె మహాత్ము లెంద ఱకటా ధర్మజ్ఞు లుద్ధండులున్
సరి లే రెవ్వరు వాని కంచుఁ బరమాశ్చర్యంబ యిబ్భంగి నా
నరునిం గూర్చి వచింప నీ వతని యౌన్నత్యమ్ము దా నేరఁ డే
పరమార్థంబునుఁ దెల్పు జ్ఞానమునుఁ జెప్పం జాలు మూఢుం డొగిన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
నిరతము గీతా బోధన
పరమార్థ జ్ఞానమొసగు; బర్బరుడు దగన్
పరులను మన్నన చేయక
మరియాదలు తెలియకుండ మసలుచు
నుండున్.