11, ఫిబ్రవరి 2026, బుధవారం

సమస్య - 5379

12-2-2026 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విధునిఁ గాంచిన పద్మముల్ విచ్చుకొనెను”
(లేదా...)
“శశి యుదయించినంత వనజంబులు విచ్చుకొనెన్ ముదంబునన్”

15 కామెంట్‌లు:

  1. తేటగీతి
    ఇందువదనాన కృష్ణుఁడు నింపుగూర్ప
    నలరు గోపికాంతల నయనాంబుజములు
    కవులకల్పనల్ వికటించె కనులఁ జూడ
    విధునిఁ గాంచిన పద్మముల్ విచ్చుకొనెను

    చంపకమాల
    వశపడి గోపకాంతలట వాంఛలురేగగ కృష్ణమూర్తికై
    ప్రశనమె మేలు మేలనిరి పంకజనేత్రలు లేక శౌరియే
    కుశలమునెంచి వేణువున గూర్చుచు రాగము శౌరిమోమునన్
    శశి యుదయించినంత వనజంబులు విచ్చుకొనెన్ ముదంబునన్

    రిప్లయితొలగించండి
  2. చ.
    యశమును పూర్వ దిక్కునకు నద్భుత రీతిని గూర్పగన్ వియ
    ద్వశమగు మార్గమందు తగు బంగరు కాంతుల వెగ్గలంబునౌ
    నిశిని పరాభవాన విడి నేత్రములార నుషామనః ప్రియా
    శశి యుదయించినంత వనజంబులు విచ్చుకొనెన్ ముదంబునన్ !

    రిప్లయితొలగించండి
  3. కలువమొగ్గలు పుష్పించె క్షణదయుదు
    విధునిఁ గాంచిన ; పద్మముల్ విచ్చుకొనెను
    పూర్వదిక్కున సూర్యుడు బొడిచీనఃంత ,
    వెన్నెలదొర , వెలుగురాల వీకయిదియ

    రిప్లయితొలగించండి

  4. దూరదేశమేగిన పతి చేరవచ్చె
    నంచు ముదముతో దరిచేరె డతివ కనుల
    కాంతి గని ధవుడు పలికె సంతసమున
    విధునిఁ గాంచిన పద్మముల్ విచ్చుకొనెను.


    నిశియది చేరవచ్చె పరిణేతయె రాకమనస్సు బాధతో
    వశ పరికేదమందుతరి వచ్చెను మల్లెల బంతితోడ నా
    రసికుడు వానిగాంచిన వరానన కన్నులు కాంతులీనెనే
    శశి యుదయించినంత వనజంబులు విచ్చుకొనెన్ ముదంబునన్.

    రెండవ పూరణ.

    వశ కనులన్ గనంగ కుటపమ్ములటంచును పోల్చినట్టి యా
    రసికుడు సుందరాంగుడని రాత్రికరుండని పోల్చె భర్తనే
    నిశి దరి జేరవచ్చు పరిణేతని గాంచిన యింతి మోములో
    శశి యుదయించినంత వనజంబులు విచ్చుకొనెన్ ముదంబునన్.

    రిప్లయితొలగించండి
  5. వింతలన్నియు గమనింప విదితమౌను
    కుసుమ రీతులఁ గాంచ ముకుళిత మయ్యె
    విధునిఁ గాంచిన పద్మముల్; విచ్చుకొనెను
    తూర్పు దిక్కున భానుడు తొంగి చూడ

    విశదముగా గ్రహించనగు విశ్వమునందలి వింతరీతులన్
    నిశి పరివేష్టితంబగును నీరజముల్ ముకుళించుఁ దప్పకన్
    శశి యుదయించినంత; వనజంబులు విచ్చుకొనెన్ ముదంబునన్
    దశదిశలన్ దివాకరుని ధామములే ప్రసరించినంతటన్

    రిప్లయితొలగించండి
  6. (1)తే.గీ:హృదయమున నుండి కవనమ్ము లెగసి వచ్చు
    కొలని యందమ్ములన్ జూడ, కొలది కొలది
    వెలుగు నిచ్చు భానుని గన, వెనుక కేగు
    విధునిఁ గాంచిన, పద్మముల్ విచ్చుకొనెను”
    (కొలని అందాలలో సూర్యుడు కొంచెం కొంచెం రావటం, చంద్రుడు వెనక్కి మరలటం చూస్తే కవిత్వం ఉప్పొంగుతోంది. పద్మాలు కూడా విచ్చుకొన్నాయి. అని వర్ణిస్తున్నాడు. )

    (2)చం:నిశకు విరామ మిచ్చి, తమ నిద్రల దామసవృత్తి నున్న యీ
    పశువుల మానవాళిని బ్రభల్ బ్రసరించుచు లేపి, సృష్టినిన్
    వశమున నుంచి వెల్గు లిడ, భానుడు వెన్ కకు నేగ శాంతి తో
    శశి, యుదయించినంత వనజంబులు విచ్చుకొనెన్ ముదంబునన్”
    (నిశకి తాను విరామ మిస్తూ, చంద్రుడు కూడా వెనుకకి తప్పుకోగా సూర్యుడు ఉదయించినంతనే పద్మాలు వికసించాయి. )

    రిప్లయితొలగించండి
  7. చం॥ దశవిధ రూపులన్ గలువ ధాత్రినిఁ బూయఁగఁ గొన్ని చూడఁగన్
    నిశిత పరీక్షనున్ గనక నీరజమంచును భ్రాంతి చెందరే!
    నిశినొకఁడట్లు మైమఱచి నెమ్మినిఁ జోద్యమటంచుఁ బల్కెనే!
    శశి యుదయించినంత వనజంబులు విచ్చుకొనెన్ ముదంబుగన్

    రిప్లయితొలగించండి
  8. సమస్య : “విధునిఁ గాంచిన పద్మముల్ విచ్చుకొనెను”

    వేచె ప్రోషితభర్తృక వియమహృదిని
    కంజ సదృశములాయింతి కనులుజూడ
    సఖుని రాకచే గల్గిన సంబ్రమున స
    విధునిఁ గాంచిన పద్మముల్ విచ్చుకొనెను

    రిప్లయితొలగించండి
  9. కలువ లన్నియు వికసించె చెలువ ముగను
    విధుని గాంచిన :: పద్మముల్ విచ్చు కొనెను
    వెలుగు సూర్యుని గాంచియు విలసితముగ
    కాంతు లీనుచు కొలనున కమ్ర ముగను

    రిప్లయితొలగించండి
  10. అబ్జ ముఖు లెల్ల రంత విహార రతలు
    సంచరింప నిశీధి నుత్సాహ మడర
    వదనములు కావు చక్కని పద్మము లవి
    విధునిఁ గాంచిన పద్మముల్ విచ్చుకొనెను


    నిశ వికసించు నుత్పలము నింగినిఁ జంద్రుఁడు వెల్గు చుండఁగా
    శశి వదనా కనుంగొనుమ చక్కఁగ నిప్పుడు తెల్ల వాఱ న
    ల్దిశల వెలుంగు లీన సిత తీవ్రతరాంశువు, తా వొసంగఁగా
    శశి, యుదయించి నంత వనజంబులు విచ్చుకొనెన్ ముదంబునన్

    రిప్లయితొలగించండి

  11. గురుదేవుల సూచిత సవరణతో..

    తేటగీతి
    ఇందువదనాన శ్రీకృష్ణుఁడింపుగూర్ప
    నలరు గోపికాంతల నయనాంబుజములు
    కవులకల్పనల్ వికటించె కనులఁ జూడ
    విధునిఁ గాంచిన పద్మముల్ విచ్చుకొనెను

    రిప్లయితొలగించండి
  12. తే.గీ.
    విరిసె నల్లదె కలువలు సరసునందు
    విధునిఁ గాంచిన, పద్మముల్ విచ్చుకొనెను
    బాలభానుని లేఁగిరణాలు సోకి
    మనసు పరవశించెను మధుమాస వేళ

    చం.
    విశదమొనర్తు ఖాత్రమున విచ్చెను గల్వలు రిక్కదారిలో
    శశి యుదయించినంత, వనజంబులు విచ్చుకొనెన్ ముదంబునన్
    దశదిశలందు నల్లుకొని తర్షుని వెల్గులు విస్తరించగా
    రసికుల హృత్సరోజములు రంజిలె నందము సందడించగా

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    కొలనులోన విచ్చుకొనును కలువలన్ని
    విధుని గాంచిన; పద్మముల్ విచ్చుకొనెను
    భాను డుదయాన తన వంతు బాధ్యతగను
    కాంతి కిరణాలు ప్రసరింప గగనమందు.

    రిప్లయితొలగించండి