17-2-2026 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“దైవమును గొల్వరాదంద్రు ధర్మవిదులు”(లేదా...)“దైవముఁ గొల్వరాదనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్”
తేటగీతిధరణి మానవ సేవ మాధవుని సేవసతము త్రికరణ శుద్ధితో సాగుమనిరిలోకమున హానినెంచెడు పోకడఁగొనిదైవమును గొల్వరాదంద్రు ధర్మవిదులుఉత్పలమాలసేవ పరోపకారములు సేయుటె మాధవసేవయంచనన్భావము భాష్య కర్మలను వర్తిల నొక్కటె రీతినిత్యమున్దైవమె కాచెడున్సతము ధన్యతనొంద, జగంపు హానికైదైవముఁ గొల్వరాదనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్
తనకు సంపద కలిగించ, దాని యందు కొంత భాగము నీకిడు కొనెద ననుచు ముందుగనె బేరమాడిన మొక్కు తోడ దైవమును గొల్వరాదంద్రు ధర్మవిదులు”
స్వంత లాభమ్ము నాశించి ప్రత్యగాత్మగొలిచిన గొలువగను వచ్చు నిలను గానిపరుల నాశనమును గోరి నరుడు తాను దైవమును గొల్వరాదంద్రు ధర్మవిదులు.దేవుడు శక్తివంతుడని దీనుల బ్రోచునటంచు నమ్ముచున్ గోవెల కేగ మానవుడు కోర్కెల గోరుట కోసమంచు తానీ వసుధాతలమ్మున సహేతుకమే, పర నాశనమ్ము కైదైవముఁ గొల్వరాదనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్.
దైవము పయిఁ భారమునుంచి దాసులుండ క్షుద్ర పూజలు సల్పగ రుద్ర భూమిఁజేరి మొదలుపెట్టిన కార్య సిద్ధికోరిదైవమును గొల్వరాదంద్రు ధర్మవిదులుదైవముపైన భారమిడి దాసులు పూజలనెన్ని జేసినన్జీవుల చావు కోరుకొని చీకటి మాటున రుద్రభూమికిన్బోవుచు క్షుద్ర శక్తులకు పూజలు సల్పుచు కార్యసిద్ధికైదైవముఁ గొల్వరాదనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్
గీ. వస్తువాహనస్వైరిణీ వాంఛ విడక మతము పేరున జనులను మతకరించస్వామి రూపమునెత్తెడు స్వప్రకటితదైవమును గొల్వరాదంద్రు ధర్మవిదులుభావం : భోగ లాలస (వస్తు, వాహన, కామ వాంఛలు) వదలక మతం పేరుతో ప్రజలను మోసం చేయుటకు దేవుడి వేషం వేసిన దొంగ (గురు/బాబా)స్వాములను కొలువరాదని ధర్మవిదులంటారు.
తే॥ భావన విడిచి లాలస స్వార్థచింత విరియ నిచ్ఛలఁ దెలుపుచు విశదపఱచిసంపదలొకటి యడుగుచు సతతమటులదైవమును గొల్వ రాదంద్రు ధర్మవిదులుఉ॥ భావన వీడి స్వార్థమున బద్ధుఁడుగాఁ జను లాలసత్వమేపావన మంచుఁ గోరికల వార్ధినిఁ దీర్చఁగ విన్నవించుచున్దీవెన లొందు మార్గమని దిట్టగ నార్ద్రతఁ గాంచకుండఁగన్దైవముఁ గొల్వ రాదనుచు ధర్మవిదుల్ వచి యింతు రెల్లెడన్
చేయ రానట్టి పనులను చేయు చుండి దుష్ట సహవాస మును గల్గి దు రితు లగుచు మద్య పానము జేసియు మత్తు నందు దైవమును గొల్వ రాదంద్రు ధర్మ విదులు
తే.గీ:"మనుజునకు నిహ జీవనమ్నున నశాంతితల్లి దండ్రుల బూజింప, ధర్మ మార్గముననె వర్తింప, దన మనమునకు నచ్చుదైవమును గొల్వ- రా దంద్రు ధర్మవిదులు.(పై పనులు చేస్తే అశాంతి రాదు అని ధర్మాత్ము లంటారు. )
ఉ:దైవము లందు వైదికపు దైవము లైన,పురాణమూర్తులౌ దైవము లైన శ్రేష్ఠములు,ధర్మ విరుద్ధపు కోర్కె రక్తముల్ ద్రావగ గోరు దైవముల దల్చకు డెన్నడు,ముక్తి క్షుద్రమౌదైవముఁ గొల్వ- రాదనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్”(శాస్త్రోక్త దైవము మిన్న కానీ క్షుద్రదేవతారాథనలు ముక్తిని ఇవ్వవు అని.)
పావనమైన తీరువిడి పాపపు కార్యములందు తేలుచున్ జీవన యానమందునను చేరుచు వేశ్యల సంగడమ్ములో త్రోవల గాంచుచున్ బ్రజల దోచు దురాత్ముడు ముక్తి గోరుచున్ దైవముఁ గొల్వ రాదనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్
లోక కల్యాణ మెంచక రోష మూని విశ్వ విలయమ్ము సృష్టింప వీఁకఁ జెలఁగి దుష్ట వాంఛలపై నిడి దృష్టి నిష్ట దైవమును గొల్వ రా దంద్రు ధర్మ విదులు కావఁగ నేర్చునే నృవర కాయము దైవ మొసంగ నెంచినన్ వావిరి యీతిబాధ లనివార్యము లోకము నందు నౌర సం భావన సేసి యెన్నఁడును మానవ నాథుల, విస్మరించి యా దైవముఁ గొల్వ రా దనుచు ధర్మ విదుల్ వచియింతు రెల్లెడన్
ముక్తి నిమ్మని దేవుని భక్తి గదురగొల్వఁగా నెమ్మి విడనాడి కోరికలనుతుచ్ఛమైన నైహికములనిచ్ఛఁ బూనిదైవమును గొల్వరాదంద్రు ధర్మవిదులు
భావనజేయుచున్ మదిని భక్తిగ మ్రొక్కుచు దేవదేవునిన్బ్రోవుమటంచు వేడుకొని పూజలు చేసిన ముక్తిధామముంబోవఁగ జేయు నీశ్వరుఁడు భోగములం బడయంగ నిచ్ఛతోదైవముఁ గొల్వరాదనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్
జీవన యానమందునను జేరెడుబాధలనుండి మానవుల్ప్రోవుమటంచు జేయుదురు పూజలువేడుదురెల్ల వేళలన్,పోవుచు నీచమార్గమున బూనుచుహింసలు జేయ నిత్యమున్దైవము గొల్వరాదనుచు ధర్మవిదుల్వచియింతు రెల్లడన్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.మానవత్వము లేకుండ మద్యము గొనిపరులను పలువిధాలుగ బాధ పెట్టిస్వార్ధ బుద్ధితో నాశించి సంపదలనుదైవమును గొల్వరాదంద్రు ధర్మవిధులు.
తేటగీతి
రిప్లయితొలగించండిధరణి మానవ సేవ మాధవుని సేవ
సతము త్రికరణ శుద్ధితో సాగుమనిరి
లోకమున హానినెంచెడు పోకడఁగొని
దైవమును గొల్వరాదంద్రు ధర్మవిదులు
ఉత్పలమాల
సేవ పరోపకారములు సేయుటె మాధవసేవయంచనన్
భావము భాష్య కర్మలను వర్తిల నొక్కటె రీతినిత్యమున్
దైవమె కాచెడున్సతము ధన్యతనొంద, జగంపు హానికై
దైవముఁ గొల్వరాదనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్
తనకు సంపద కలిగించ, దాని యందు
రిప్లయితొలగించండికొంత భాగము నీకిడు కొనెద ననుచు
ముందుగనె బేరమాడిన మొక్కు తోడ
దైవమును గొల్వరాదంద్రు ధర్మవిదులు”
రిప్లయితొలగించండిస్వంత లాభమ్ము నాశించి ప్రత్యగాత్మ
గొలిచిన గొలువగను వచ్చు నిలను గాని
పరుల నాశనమును గోరి నరుడు తాను
దైవమును గొల్వరాదంద్రు ధర్మవిదులు.
దేవుడు శక్తివంతుడని దీనుల బ్రోచునటంచు నమ్ముచున్
గోవెల కేగ మానవుడు కోర్కెల గోరుట కోసమంచు తా
నీ వసుధాతలమ్మున సహేతుకమే, పర నాశనమ్ము కై
దైవముఁ గొల్వరాదనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్.
దైవము పయిఁ భారమునుంచి దాసులుండ
రిప్లయితొలగించండిక్షుద్ర పూజలు సల్పగ రుద్ర భూమిఁ
జేరి మొదలుపెట్టిన కార్య సిద్ధికోరి
దైవమును గొల్వరాదంద్రు ధర్మవిదులు
దైవముపైన భారమిడి దాసులు పూజలనెన్ని జేసినన్
జీవుల చావు కోరుకొని చీకటి మాటున రుద్రభూమికిన్
బోవుచు క్షుద్ర శక్తులకు పూజలు సల్పుచు కార్యసిద్ధికై
దైవముఁ గొల్వరాదనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్
రిప్లయితొలగించండిగీ. వస్తువాహనస్వైరిణీ వాంఛ విడక
మతము పేరున జనులను మతకరించ
స్వామి రూపమునెత్తెడు స్వప్రకటిత
దైవమును గొల్వరాదంద్రు ధర్మవిదులు
భావం : భోగ లాలస (వస్తు, వాహన, కామ వాంఛలు) వదలక మతం పేరుతో ప్రజలను మోసం చేయుటకు దేవుడి వేషం వేసిన దొంగ (గురు/బాబా)స్వాములను కొలువరాదని ధర్మవిదులంటారు.
తే॥ భావన విడిచి లాలస స్వార్థచింత
రిప్లయితొలగించండివిరియ నిచ్ఛలఁ దెలుపుచు విశదపఱచి
సంపదలొకటి యడుగుచు సతతమటుల
దైవమును గొల్వ రాదంద్రు ధర్మవిదులు
ఉ॥ భావన వీడి స్వార్థమున బద్ధుఁడుగాఁ జను లాలసత్వమే
పావన మంచుఁ గోరికల వార్ధినిఁ దీర్చఁగ విన్నవించుచున్
దీవెన లొందు మార్గమని దిట్టగ నార్ద్రతఁ గాంచకుండఁగన్
దైవముఁ గొల్వ రాదనుచు ధర్మవిదుల్ వచి యింతు రెల్లెడన్
చేయ రానట్టి పనులను చేయు చుండి
రిప్లయితొలగించండిదుష్ట సహవాస మును గల్గి దు రితు లగుచు
మద్య పానము జేసియు మత్తు నందు
దైవమును గొల్వ రాదంద్రు ధర్మ విదులు
తే.గీ:"మనుజునకు నిహ జీవనమ్నున నశాంతి
రిప్లయితొలగించండితల్లి దండ్రుల బూజింప, ధర్మ మార్గ
ముననె వర్తింప, దన మనమునకు నచ్చు
దైవమును గొల్వ- రా దంద్రు ధర్మవిదులు.
(పై పనులు చేస్తే అశాంతి రాదు అని ధర్మాత్ము లంటారు. )
ఉ:దైవము లందు వైదికపు దైవము లైన,పురాణమూర్తులౌ
రిప్లయితొలగించండిదైవము లైన శ్రేష్ఠములు,ధర్మ విరుద్ధపు కోర్కె రక్తముల్
ద్రావగ గోరు దైవముల దల్చకు డెన్నడు,ముక్తి క్షుద్రమౌ
దైవముఁ గొల్వ- రాదనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్”
(శాస్త్రోక్త దైవము మిన్న కానీ క్షుద్రదేవతారాథనలు ముక్తిని ఇవ్వవు అని.)
పావనమైన తీరువిడి పాపపు కార్యములందు తేలుచున్
రిప్లయితొలగించండిజీవన యానమందునను చేరుచు వేశ్యల సంగడమ్ములో
త్రోవల గాంచుచున్ బ్రజల దోచు దురాత్ముడు ముక్తి గోరుచున్
దైవముఁ గొల్వ రాదనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్
లోక కల్యాణ మెంచక రోష మూని
రిప్లయితొలగించండివిశ్వ విలయమ్ము సృష్టింప వీఁకఁ జెలఁగి
దుష్ట వాంఛలపై నిడి దృష్టి నిష్ట
దైవమును గొల్వ రా దంద్రు ధర్మ విదులు
కావఁగ నేర్చునే నృవర కాయము దైవ మొసంగ నెంచినన్
వావిరి యీతిబాధ లనివార్యము లోకము నందు నౌర సం
భావన సేసి యెన్నఁడును మానవ నాథుల, విస్మరించి యా
దైవముఁ గొల్వ రా దనుచు ధర్మ విదుల్ వచియింతు రెల్లెడన్
ముక్తి నిమ్మని దేవుని భక్తి గదుర
రిప్లయితొలగించండిగొల్వఁగా నెమ్మి విడనాడి కోరికలను
తుచ్ఛమైన నైహికములనిచ్ఛఁ బూని
దైవమును గొల్వరాదంద్రు ధర్మవిదులు
భావనజేయుచున్ మదిని భక్తిగ మ్రొక్కుచు దేవదేవునిన్
రిప్లయితొలగించండిబ్రోవుమటంచు వేడుకొని పూజలు చేసిన ముక్తిధామముం
బోవఁగ జేయు నీశ్వరుఁడు భోగములం బడయంగ నిచ్ఛతో
దైవముఁ గొల్వరాదనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్
జీవన యానమందునను జేరెడు
రిప్లయితొలగించండిబాధలనుండి మానవుల్
ప్రోవుమటంచు జేయుదురు పూజలు
వేడుదురెల్ల వేళలన్,
పోవుచు నీచమార్గమున బూనుచు
హింసలు జేయ నిత్యమున్
దైవము గొల్వరాదనుచు ధర్మవిదుల్
వచియింతు రెల్లడన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
మానవత్వము లేకుండ మద్యము గొని
పరులను పలువిధాలుగ బాధ పెట్టి
స్వార్ధ బుద్ధితో నాశించి సంపదలను
దైవమును గొల్వరాదంద్రు ధర్మవిధులు.