కం:చప్పున పోదము రా వెం కప్పా! లే! కప్ప లయ్యె గళ్యాణమునన్ గొప్పగ కూరగ, మనకున్ పప్పును లేదయ్యె నేమి పాప మ్మిదిరా! (పెల్లి భోజనానికి పిలిచి కప్పల కూర పెట్టారు. వెంకప్పా! అన్నప్పుడు వెంక+అప్ప అనే సంధి ఉంది. కానీ పేరు కాబట్టి విడగొట్టకుండా తీసుకో వచ్చు. కనుక అఖండయతి దోషం రాదు. )
కందం
రిప్లయితొలగించండిఅప్పరమేశుఁడు కృపతో
గుప్పగ భీమకవికినొన గూరె మహత్తుల్
చప్పున శపించ విస్తరి
నప్పాలే కప్పలయ్యె నా మనువందున్
(కందమున యతిసవరించి కదలితి గురువా!)
శార్దూలవిక్రీడితము
విప్పారన్ కవనంబు భీమకవికిన్ విశ్వేశు కారుణ్యమై
చెప్పన్ శంకరు సాక్షిగన్ హితములున్ చెల్లెన్ గదా! సత్యమై!
తిప్పల్ వెట్టగ స్వాభిమానమున నిందింపంగ విస్తర్లలో
నప్పాలెల్లను గప్పలై యెగిరె కళ్యాణాంగనంబందునన్
రిప్లయితొలగించండిబొప్పడటంచు దలంచుచు
తప్పున్ జేసితిరటంచు తా శాపమిడన్
చెప్పవశమె విస్తరి లో
నప్పాలే కప్పలయ్యెఁ గళ్యాణమునన్.
చెప్పన్ జాలడు తండ్రి యెవ్వడనినన్ ఛీత్కారమున్ బెద్దలే
బొప్పండంచు దలంచి భీమకవినే బోనమ్ముకై పిల్వకన్
దప్పున్ జేయగ వారినాగ్రహమునన్ దా తూలగా వెంటనే
యప్పాలెల్లను గప్పలై యెగిరె కళ్యాణాంగనంబందునన్.
కందపు సమస్యా పాదములో యతి భంగము. చూడండి.
తొలగించండితప్పక రమ్మని పిలువగ
రిప్లయితొలగించండిచప్పున నచ్చటకు జేరి చక్కగ గొప్పల్
చెప్పుకొనుచుండగా నా
గప్పాలే కప్పలయ్యెఁ గళ్యాణమునన్
తప్పుత్రోవను బట్టి నీచులకటా తామా కవిన్ బిల్వకే
రిప్లయితొలగించండిబప్పన్నంబుల పట్టుఁ ద్రుళ్ళి తలుపుల్ బంధింప బాధార్తుడై
నిప్పుల్ గ్రక్కి శపించినంత జనులే నిశ్చేష్టులై యుండగా
నప్పాలెల్లను గప్పలై యెగిరె కళ్యాణాంగనంబందునన్
తప్పుత్రోవను లో "ప్పు" లఘువే యగునండి. ఇది యాచ్ఛిక సమాసము కాబట్టి.
తొలగించండిగుడి మ్రాని పొంతను గుహలోన నుండుచు డంపకములకు వంటకములకును - భార. శాంతి. 5. 393.
మీ సూచనకు ధన్యవాదాలు. సవరించిన పూరణ....
తొలగించండితప్పుంజేసిరి గాదె నీచులకటా తామా కవిన్ బిల్వకే
బప్పన్నంబుల పట్టుఁ ద్రుళ్ళి తలుపుల్ బంధింప బాధార్తుడై
నిప్పుల్ గ్రక్కి శపించినంత జనులే నిశ్చేష్టులై యుండగా
నప్పాలెల్లను గప్పలై యెగిరె కళ్యాణాంగనంబందునన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం॥ తప్పవు వంటలు చెడినను
రిప్లయితొలగించండిదిప్పలు మనువున నొకఁడిటు దెప్పఁ బలికినో
చప్పున భీమకవి పగిది
నప్పాలే కప్పలయ్యెఁ గళ్యామునన్
శా॥ తిప్పల్ దప్పవు వంట పాడయినఁ బ్రీతిన్ బొందరే పెండ్లిలో
నిప్పుల్ దొక్కిన కోతి వోలె మనుజుల్ నిందించి కుప్పించుచున్
దప్పుల్ దెల్పఁగ నెంచి భీమకవినే ధ్యానించిరో పల్కిరే!
అప్పాలెల్లను గప్పలై యెగిరె కళ్యాణాంగనంబందునన్
పెనుకొండ రామబ్రహ్మం బెంగుళూరు
కం:చప్పున పోదము రా వెం
రిప్లయితొలగించండికప్పా! లే! కప్ప లయ్యె గళ్యాణమునన్
గొప్పగ కూరగ, మనకున్
పప్పును లేదయ్యె నేమి పాప మ్మిదిరా!
(పెల్లి భోజనానికి పిలిచి కప్పల కూర పెట్టారు. వెంకప్పా! అన్నప్పుడు వెంక+అప్ప అనే సంధి ఉంది. కానీ పేరు కాబట్టి విడగొట్టకుండా తీసుకో వచ్చు. కనుక అఖండయతి దోషం రాదు. )
అప్పటి కవి వత o శుడు
రిప్లయితొలగించండిగొప్ప గ మహిమలు గలిగియు కోవిదు డ గు చు న్
చెప్ప గ ను మారి పోవ గ
నప్పా లే కప్ప ల య్యె గళ్యా ణ ము నన్
ఇప్పట్టున మన పురమునఁ
రిప్లయితొలగించండిదప్పక పడు వర్ష మింకఁ దత్తర మేలా
గొప్పగ నాలు మగలు, పో
కప్పా లే, కప్ప లయ్యెఁ గల్యాణమునన్
అప్పా యేమన వచ్చు నొక్క నగరం బం దౌర గర్వాంధులై
యప్పాఱుల్ తనుఁ దిట్ట భీమ కవి కోపార్తుండు నేత్రమ్ములన్
నిప్పల్ రాలఁగ ఘోర శాప మొసఁగన్ నిర్ఘాత తుల్యమ్మునే
యప్పా లెల్లను గప్పలై యెగిరెఁ గల్యాణాంగనం బందునన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
గొప్ప యగు భీమ కవికిన్
అప్పనముల నివ్వక తన నవమానించన్
చప్పున శాపంబిడగా
అప్పాలే కప్పలయ్యెఁ గళ్యాణమునన్.
(అప్పనము= కానుక)