మ:"సుథ వోలెన్ బని చేయు" నంచు బిషజుల్ సూచించగా మందులన్, బుధులే చెప్పగ పాలు పండ్లను మనంబున్ బెట్టరే!యేమి దు ర్విధి యో "మం"దని చెప్పి మద్యమున కార్తిన్ బొందు వారైరి గా మధురమ్మౌను విషమ్ము మానవులకున్ మైకమ్ము గల్గించుచున్” (వైద్యుల మందు నచ్చదు. పాలు,పంద్లు నచ్చవు. పైగా ఎలా పేరు వచ్చిందో కానీ ఈ తాగుడుకే "మందు" అని పేరు పెట్టుకొని తాగుతున్నారు. )
ఆటవెలది
రిప్లయితొలగించండివిజ్ఞులెల్లఁ దెలుప విషతుల్యమదియంచు
గుంపులుగ ప్రజ సురఁ గ్రోలనేల?
మైకమందు సుఖముమరుగ వ్యసనమౌట
మధురమగును విషము మానవులకు!
మత్తేభవిక్రీడితము
అధరమ్మానుచఁ జేదుగన్ రుచి విషాహారమ్ముగన్ దోచినన్
బుధులైనన్ విడలేక బానిసలుగన్మోదాన మద్యమ్మునే
సుధగానెంచుచుఁ ద్రాగ దుర్వ్యసనమై చోద్యమ్మనన్ మానరే!
మధురమ్మౌను విషమ్ము మానవులకున్ మైకమ్ము గల్గించుచున్!
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిజటిల జీవ నంబు సంభవి o చిన వేళ
రిప్లయితొలగించండిమధుర మగును విషము మానవులకు
సౌఖ్య జీవ నంబు సమకూరి నప్పుడు
విషము చేదు గాదె విశ్వ మందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమంచిమాట జెప్ప మనసుకు నచ్చదు
రిప్లయితొలగించండియిచ్చకముల బలుక మెచ్చు జనులు
లోకరీతి గనఁగ రోత పుట్టించును
మధురమగును విషము మానవులకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నచ్చదు + ఇచ్చకముల' అన్నపుడు యడాగమం రాదు.
మందుగ బిలువబడి , మైకము కలిగించి ,
రిప్లయితొలగించండిమాన్యత నెడలించు మదిర జూడ ,
నురవు ఘాటు గలిగి యుండియు గూడను
మధురమగును విషము మానవులకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండికుకభమదియె కాదె గుల్లజేయుచు నొళ్ళు
కొంపగూల్చు నిజము కువలయమున
నెఱగి గ్రోలునట్టి పరవశులకిదియె
మధురమగును విషము మానవులకు.
బుధులే మానుమటంచు చెప్పిననిలన్ మూర్ఖాళి యాలింపరే
వ్యధలన్ దీర్చునటంచు నమ్ముచు సదాప్రాశించ గన్ దానినే
విధిగా జేరును పానశాలల పరిప్రేష్యుండులౌ వారికిన్
మధురమ్మౌను విషమ్ము మానవులకున్ మైకమ్ము గల్గించుచున్.
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండివిధిబలీయమనుచు వేదాంత వచనాలు
రిప్లయితొలగించండిపలికి మత్తులోన కులుకు చుంద్రు
మద్య పాన మందు మత్తిల్లు మార్గమై
మధురమగును విషము మానవులకు
విధివంచింపగ బాధ తొల్గు ననుచున్ వేదాంతులై బల్కుచున్
మధుపానమ్మున మున్గితేలుదురిటన్ మత్తిల్లి తూగాడుచున్
మధురోహల్ హృదయాన నింప మధువే మర్యాదగా నమ్మగా
మధురమ్మౌను విషమ్ము మానవులకున్ మైకమ్ము గల్గించుచున్
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిఆ.వె:మద్యపాన మనిన మరణమ్మునకు దారి
రిప్లయితొలగించండిహాని చేయు ధూమ పాన మయిన
నివి విషమ్ము లయిన నీ వ్యసనము లున్న
మధురమగును విషము మానవులకు
(ఆత్మహత్య చేసుకొనే వారి మనోగతమండి)
రిప్లయితొలగించండిఆ॥ బాధల పరి బ్రదుకు భారమై చనుచుండఁ
దెరువుఁ గనని కతనఁ దెగువ యెగియ
విసిగి పోయి భువిని విడువ తలంచఁగ
మధురమగును విషము మానవులకు
మ॥ విధి వక్రించఁగ వేదనా ధృతిని నిర్వీర్యుండుగన్ బాధలే
సుధలై త్రావఁగఁ సైఁచఁ జాలకనహో క్షోభార్తితో మాంద్యమై
వ్యధలన్ దీర్చదె చావు యంచుఁ గన బాహాటమ్ముగన్ బల్కడే
మధురమ్మౌను విషమ్ము మానవులకున్ మైకమ్ము గల్గించుచున్
శ్రీ కంది శంకరయ్య గారు సూచించిన తప్పులు సవరించిన పిదప
మ:"సుథ వోలెన్ బని చేయు" నంచు బిషజుల్ సూచించగా మందులన్,
రిప్లయితొలగించండిబుధులే చెప్పగ పాలు పండ్లను మనంబున్ బెట్టరే!యేమి దు
ర్విధి యో "మం"దని చెప్పి మద్యమున కార్తిన్ బొందు వారైరి గా
మధురమ్మౌను విషమ్ము మానవులకున్ మైకమ్ము గల్గించుచున్”
(వైద్యుల మందు నచ్చదు. పాలు,పంద్లు నచ్చవు. పైగా ఎలా పేరు వచ్చిందో కానీ ఈ తాగుడుకే "మందు" అని పేరు పెట్టుకొని తాగుతున్నారు. )
స్నాన మాచరింత్రు జనులు నిత్య మయిన
రిప్లయితొలగించండిభక్తి సంతరించి వఱల నంత
రంగ మందు భృశము గంగా నది యొసఁగ
మధుర మగును విషము మానవులకు
[విషము = జలము]
వ్యధఁ గావించును మద్య మం చెఱిఁగి త్రావం జూతు రెట్లన్నచోఁ
గుధ రాభమ్ముగ నిల్వఁడే ముదమునన్ ఘోరాప రాధమ్ము నే
విధిఁ గావించినఁ బుత్ర రత్నము విజృంభింపంగ వాత్సల్యమే
మధురమ్మౌను విషమ్ము మానవులకున్ మైకమ్ము గల్గించుచున్