5-3-2026 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కరినిఁ గని మకరము గడు వడంకె”(లేదా...)“కరినిఁ గనంగనే మిగులఁ గాతరభావమునందె నక్రమే”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఆటవెలదిఆయుధమ్ములేని హరిని లెక్కింపకపట్టు బిగిచియుఁ గరి పదము పైన,తరలి రాన్ వెనుక సుదర్శన చక్రంపుకరినిఁ గని మకరము గడు వడంకె!(కరి = గురి,లక్ష్యము)చంపకమాలకరమున శంఖుచక్రముల కంపన లేదన శౌరిఁ జూచియున్వెరువక కుంజరమ్ము కడు వేదనఁజెంద బిగించి పట్టునేతరలుచు వెంట వచ్చెడు సదర్శన చక్ర ప్రచండ వేగపున్గరినిఁ గనంగనే మిగులఁ గాతరభావమునందె నక్రమే!
నీరు లేని నదిని నిలువగ లేనంచుపారమందు తిరుగు పాళమందు పరుగు తోడ వచ్చు పర్వతమంటి పుష్కరినిఁ గని మకరము గడు వడంకె.ధరణము లేని ద్వీపవతి దాళగ లేకను తీరమందునన్ తిరుగుచు నున్న పాళమున దీప్తమటన్ దరుమంగ వేగమున్ బరుగిడి వచ్చు పర్వతము వంటి భయంకర మైన నొక్క పుష్కరినిఁ గనంగనే మిగులఁ గాతరభావమునందె నక్రమే.*(నీటిలోన మొసలి...... అను పద్య ఆధారము తో)*
సరసులోకి దిగిన సామజమును బట్టిలాగుచుండె కుంభి లాఘవమునశరణు వేడగ కరి తరలిన హరిని నుక్కరినిఁ గని మకరము గడు వడంకెసరసిని డిగ్గు పుష్కరిని సత్వర మేగని లాగుచుండె మీనరము జలాంతరంబునకు నాగము లాగుచునుండె నొడ్డుకున్గరి మొర వెట్టినంతట పొకాలు పరేశుని కైటభారి నుక్కరినిఁ గనంగనే మిగులఁ గాతరభావమునందె నక్రమే
[ఉక్కరి = ధీరుడు]
తరుణము కడచిన కతన నోపజాలనివిరివగు గొద నొందు వేళ వచ్చెనెరనొసగెడు వాని కీడుజోడగు మరొ కరినిఁ గని మకరము గడు వడంకె
ఆ॥ నీటియందు మొసలి నిజ బలము విరియునిలను జతికిలపడు నిక్కముగద గజము నడచు చుండ గరిమగ క్షమ పైనఁగరినిఁ గని మకరము గడు వడంకెచం॥ సరగున నీటియందుఁ గరి శక్తిని మించు బలమ్ము నొందఁగన్వరలుచు వార్భటమ్మిలను బ్రాకుచుఁ బోరుట దుర్లభమ్మగున్దరుగఁగ లావు భీతిఁగను, స్థానము మారఁగ ధాత్రి యందునన్గరినిఁ గనంగనే మిగుల గాతర భావమునందె నక్రమేవార్భటము మొసలి
ఆ.వె:కరిని గావ రాగ హరి యొక్క క్షణములోనతడు పట్టినట్టి యాయుధమగునా సుదర్శనమ్ము,నఘ యూధ విధ్వంసకరినిఁ గని మకరము గడు వడంకె”
కరిని గని మకరి గడు వడంకెడిరీతి మకరని గని కరియు మలయుచుండ మకరి నోట చిక్కిన కరి మ్రాన్పడి మొరలిడకరుణ జూప వచ్చె కౌస్తుభ ధారి ( కైట భారి)కరినిఁ గని మకరము గడు వడంకెడి రీతి మకరిని గని కరియు గడు వడంకె;నొకరి గెలువ నొకరు నుగ్రులై పోరున బెనగి రొకరినొకరు బెట్టుగానుఅన్నపరెడ్డి వీర కుమారి
చం;హరియె హుటాహుటిన్ గదలి యాత్రత తోడ సుదర్శనమ్ము నేకరమున దాల్చి, దాని దన కంఠము పై గురి వెట్టి నంత న చ్చెరు విడు దివ్య తేజమున, చెండగ వచ్చెడు నట్టి యా భయంకరినిఁ గనంగనే మిగులఁ గాతరభావమునందె నక్రమే”
క్రమాలంకారం లో ---జలము గ్రోల వచ్చు సామాజ మును బట్టి రెవరు? వెరచె మిగుల నెవరు విష్ణు చక్రము గని తాను చకిత మై మడుగున?కరిని గని మకరము :: గడు వడo కె
దరినిఁ జేరి నంత దర్పం బడరఁగ మకరము కనఁబడె వెస ఘన మృగమ్ము హరి మృగేంద్రు సకల కరి రాణ్నిచయ భయంకరినిఁ గని మకరము గడు వడంకె కరివర ఘోర నక్రముల కయ్యము నందు జయింప లేక యా కరి హరి నంతఁ దన్ను దగఁ గావఁగ రమ్మని వేఁడ వచ్చినన్ హరి శిత చక్ర హస్తు సుజ నావను రక్షిత తప్త దేహ వత్కరినిఁ గనంగనే మిగులఁ గాతరభావము నందె నక్రమే
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.నీటి నుంచి వచ్చి నేల పైకి మొసలిగజము వచ్చుచుండ గాంచినంతజ్ఞప్తి వచ్చి మునుపు జరిగిన గాథయుకరినిఁ గని మకరము గడు వడంకె.
డా బల్లూరి ఉమాదేవి సరసునందుచేరిజలముగ్రోలెడునేళదంతిసంతుతోడ తరలిరాగననుసరించి చక్రి యడుగులిడుచునుండ*"కరినిఁ గని మకరము గడు వడంకె”*
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండిఆయుధమ్ములేని హరిని లెక్కింపక
పట్టు బిగిచియుఁ గరి పదము పైన,
తరలి రాన్ వెనుక సుదర్శన చక్రంపు
కరినిఁ గని మకరము గడు వడంకె!
(కరి = గురి,లక్ష్యము)
చంపకమాల
కరమున శంఖుచక్రముల కంపన లేదన శౌరిఁ జూచియున్
వెరువక కుంజరమ్ము కడు వేదనఁజెంద బిగించి పట్టునే
తరలుచు వెంట వచ్చెడు సదర్శన చక్ర ప్రచండ వేగపున్
గరినిఁ గనంగనే మిగులఁ గాతరభావమునందె నక్రమే!
రిప్లయితొలగించండినీరు లేని నదిని నిలువగ లేనంచు
పారమందు తిరుగు పాళమందు
పరుగు తోడ వచ్చు పర్వతమంటి పు
ష్కరినిఁ గని మకరము గడు వడంకె.
ధరణము లేని ద్వీపవతి దాళగ లేకను తీరమందునన్
తిరుగుచు నున్న పాళమున దీప్తమటన్ దరుమంగ వేగమున్
బరుగిడి వచ్చు పర్వతము వంటి భయంకర మైన నొక్క పు
ష్కరినిఁ గనంగనే మిగులఁ గాతరభావమునందె నక్రమే.
*(నీటిలోన మొసలి...... అను పద్య ఆధారము తో)*
సరసులోకి దిగిన సామజమును బట్టి
రిప్లయితొలగించండిలాగుచుండె కుంభి లాఘవమున
శరణు వేడగ కరి తరలిన హరిని ను
క్కరినిఁ గని మకరము గడు వడంకె
సరసిని డిగ్గు పుష్కరిని సత్వర మేగని లాగుచుండె మీ
నరము జలాంతరంబునకు నాగము లాగుచునుండె నొడ్డుకున్
గరి మొర వెట్టినంతట పొకాలు పరేశుని కైటభారి ను
క్కరినిఁ గనంగనే మిగులఁ గాతరభావమునందె నక్రమే
[ఉక్కరి = ధీరుడు]
తొలగించండితరుణము కడచిన కతన నోపజాలని
రిప్లయితొలగించండివిరివగు గొద నొందు వేళ వచ్చె
నెరనొసగెడు వాని కీడుజోడగు మరొ
కరినిఁ గని మకరము గడు వడంకె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆ॥ నీటియందు మొసలి నిజ బలము విరియు
రిప్లయితొలగించండినిలను జతికిలపడు నిక్కముగద
గజము నడచు చుండ గరిమగ క్షమ పైనఁ
గరినిఁ గని మకరము గడు వడంకె
చం॥ సరగున నీటియందుఁ గరి శక్తిని మించు బలమ్ము నొందఁగన్
వరలుచు వార్భటమ్మిలను బ్రాకుచుఁ బోరుట దుర్లభమ్మగున్
దరుగఁగ లావు భీతిఁగను, స్థానము మారఁగ ధాత్రి యందునన్
గరినిఁ గనంగనే మిగుల గాతర భావమునందె నక్రమే
వార్భటము మొసలి
ఆ.వె:కరిని గావ రాగ హరి యొక్క క్షణములో
రిప్లయితొలగించండినతడు పట్టినట్టి యాయుధమగు
నా సుదర్శనమ్ము,నఘ యూధ విధ్వంస
కరినిఁ గని మకరము గడు వడంకె”
కరిని గని మకరి గడు వడంకెడిరీతి
రిప్లయితొలగించండిమకరని గని కరియు మలయుచుండ
మకరి నోట చిక్కిన కరి మ్రాన్పడి మొరలిడ
కరుణ జూప వచ్చె కౌస్తుభ ధారి ( కైట భారి)
కరినిఁ గని మకరము గడు వడంకెడి రీతి
మకరిని గని కరియు గడు వడంకె;
నొకరి గెలువ నొకరు నుగ్రులై పోరున
బెనగి రొకరినొకరు బెట్టుగాను
అన్నపరెడ్డి వీర కుమారి
చం;హరియె హుటాహుటిన్ గదలి యాత్రత తోడ సుదర్శనమ్ము నే
రిప్లయితొలగించండికరమున దాల్చి, దాని దన కంఠము పై గురి వెట్టి నంత న
చ్చెరు విడు దివ్య తేజమున, చెండగ వచ్చెడు నట్టి యా భయం
కరినిఁ గనంగనే మిగులఁ గాతరభావమునందె నక్రమే”
క్రమాలంకారం లో ---
రిప్లయితొలగించండిజలము గ్రోల వచ్చు సామాజ మును బట్టి
రెవరు? వెరచె మిగుల నెవరు విష్ణు
చక్రము గని తాను చకిత మై మడుగున?
కరిని గని మకరము :: గడు వడo కె
దరినిఁ జేరి నంత దర్పం బడరఁగ మ
రిప్లయితొలగించండికరము కనఁబడె వెస ఘన మృగమ్ము
హరి మృగేంద్రు సకల కరి రాణ్నిచయ భయం
కరినిఁ గని మకరము గడు వడంకె
కరివర ఘోర నక్రముల కయ్యము నందు జయింప లేక యా
కరి హరి నంతఁ దన్ను దగఁ గావఁగ రమ్మని వేఁడ వచ్చినన్
హరి శిత చక్ర హస్తు సుజ నావను రక్షిత తప్త దేహ వ
త్కరినిఁ గనంగనే మిగులఁ గాతరభావము నందె నక్రమే
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
నీటి నుంచి వచ్చి నేల పైకి మొసలి
గజము వచ్చుచుండ గాంచినంత
జ్ఞప్తి వచ్చి మునుపు జరిగిన గాథయు
కరినిఁ గని మకరము గడు వడంకె.
డా బల్లూరి ఉమాదేవి
రిప్లయితొలగించండిసరసునందుచేరిజలముగ్రోలెడునేళ
దంతిసంతుతోడ తరలిరాగ
ననుసరించి చక్రి యడుగులిడుచునుండ
*"కరినిఁ గని మకరము గడు వడంకె”*