20-3-2026 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ధవునిఁ జేరినంత దర్ప ముడుగు”(లేదా...)“ధవునిం జేరినయంత లుప్తమగు నీ దర్పంబు చంద్రాననా”
పట్టుమని పదేండ్లు పాఠశాలకు బోయివిద్య నభ్య సించి విర్ర వీగుపిల్ల దానికిపుడు విద్వాంసు డైనట్టిధవునిఁ జేరినంత దర్ప ముడుగు
విష్ణుమూర్తి గంగాదేవితో... ఆటవెలదిసగర పౌత్రుఁడడుగ గగనవీధి వదలిధరణివైపు సాగు ధాటి పెరుగజూటమందు నోప సుముఖుడైనట్టి యుధవునిఁ జేరినంత దర్ప ముడుగుమత్తేభవిక్రీడితముఅవనిన్ జార భగీరథుండడుగ సాయమ్మీయ నౌనంటివేభువనంబున్ విడి భూమికేగెడు పథమ్మున్ ధాటి జృంభింపగన్భవుడే యోపఁగ నొప్పె జూటమున నీ భారమ్మదే! పార్వతీధవునిం జేరినయంత లుప్తమగు నీ దర్పంబు చంద్రాననా!✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*
అల్ప బుద్ధి తోడ హరిని దూషింపకు మేటి నంచు నీవు మిడిసి పడకు మెంత వారలైన యీశ్వరేశ్వరుడు మా ధవునిఁ జేరినంత దర్ప ముడుగు.అవనిన్ జేరగ నా భగీరథుడు తానర్థింపగా నప్పుడా భవుడొక్కండె సమర్థుడంచు పలుకన్ ప్రార్థింపగా భక్తితో శివుడే సమ్మతి తెల్పెనయ్యె నిక హేసీమంతనీ యా యుమా ధవునిం జేరినయంత లుప్తమగు నీ దర్పంబు చంద్రాననా.
మువురు మూర్తులందు ముఖ్యుడు వారిలోనధికు డెవ్వరనుచు నరయనెంచిభృగువు నిర్గమించె గగనమార్గాన మాధవునిఁ జేరినంత దర్ప ముడుగునవరత్నాలకు లేదు నీదు కళుకే నాణ్యంబు నీవంచు సత్కవులే నీసొగసున్ నుతింతురుగదా! కానిమ్ము కళ్యాణమేనవచేతోభవుడన్న నొప్పునుకదా నాచారు నీ రుచ్యుడే!ధవునిం జేరినయంత లుప్తమగు నీ దర్పంబు చంద్రాననా!
అందగత్తెనన్న యతిశయమామెకుసాటి గోపికలను సరకుగొనదువేణుగానము విని వివశయై రాధ మాధవునిఁ జేరినంత దర్ప ముడుగు
భువిలో నందరు సుందరీమణులలో పొల్పారు సౌందర్యరాశివి నీవంచు దలంచి బెట్టిదమునన్ శీలింతువే గోపికా!వివశంబొందుచు వేణుగాన ఝరిలో విశ్వంబు దూఁగాడ మాధవునిం జేరినయంత లుప్తమగు నీ దర్పంబు చంద్రాననా!
తనను మించు వారు ధరణి లో లేరంచు మిడిసి పాటు పడుచు మిడుకు వానినన్ని రంగము లను మిన్న గా నున్నట్టి ధవుని జేరి నంత దర్ప ముడుగు
పతికి నెదురు వల్క భరత ఖండమ్మునఁ బడతి కెంచ గౌరవమ్ము కాదు రాచ బిడ్డ వైన రమణీమణీ నీదు ధవునిఁ జేరి నంత దర్ప ముడుగు ధవ దానమ్ము వ్రతమ్ము లోనఁ గడు చిత్రం బౌను వీక్షింప సుంత విచారింపుమ లేనిచో ధనము సంతాపమ్ము వాటిల్లు నీసవతుల్ చెంతను, దేవమౌనివర దాస్యం బౌర ఘోరమ్ము మాధవునిం జేరిన యంత, లుప్త మగు నీ దర్పంబు చంద్రాననా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
భక్తి శ్రధ్ధ గార వంబును గలిగిమాధవునిఁ జేరినంత దర్ప ముడుగు దైవ దర్శనంబుఁదప్పక చేయంగశాంతి గలుఁగు మదికి సర్వులకును
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.అధిక ధనము గలిగి నహమున వర్తించిముసలి తనము వచ్చి మూలపడగనాస్తి కరిగి పోయి యసువులుఁ బాయ మాధవుని జేరినంత దర్పముడుగు.
: డా బల్లూరి ఉమాదేవి ధనముగలదటంచుదర్పముచూపకసకలజనుల నెపుడు సమముగానుగనుచుభక్తితోడకరములుమోడ్చిమా*“ధవునిఁ జేరినంత దర్ప ముడుగు అవనీశుండగునాభగీరథుడు తానాశంభుమెప్పింపగారవమున్ జేయుచు గంగజృంభణముగాలాస్యంబుతోతీయగానవనీశుండట గాంచుచున్ పలికె నొయ్వారంబదేలన్ నుమా*“ధవునిం జేరినయంత లుప్తమగు నీ దర్పంబు చంద్రాననా”*
ఆ॥ అందగత్తె ననుచు నహము నిండి వరలధనము నొకటి యెంచి మనువుఁ జేయనంద హీనుఁ డైన నంత దిమ్మతిరుగుధవునిఁ జేరి నంత దర్ప ముడుగుమ॥ చవితో నెప్పుడు నందగత్తెనని విస్తారంపు గోమొందినన్భువిలో విత్తము తల్లిదండ్రులకు సమ్మోదమ్ముగాఁ దోచఁగన్భవ బంధమ్మున నంద హీనుఁడటు సంప్రాప్తించఁగా భర్తయై ధవునిం జేరిన యంత లుప్తమగు నీ దర్పంబు చంద్రాననాగోము గర్వము
పట్టుమని పదేండ్లు పాఠశాలకు బోయి
రిప్లయితొలగించండివిద్య నభ్య సించి విర్ర వీగు
పిల్ల దానికిపుడు విద్వాంసు డైనట్టి
ధవునిఁ జేరినంత దర్ప ముడుగు
విష్ణుమూర్తి గంగాదేవితో...
రిప్లయితొలగించండిఆటవెలది
సగర పౌత్రుఁడడుగ గగనవీధి వదలి
ధరణివైపు సాగు ధాటి పెరుగ
జూటమందు నోప సుముఖుడైనట్టి యు
ధవునిఁ జేరినంత దర్ప ముడుగు
మత్తేభవిక్రీడితము
అవనిన్ జార భగీరథుండడుగ సాయమ్మీయ నౌనంటివే
భువనంబున్ విడి భూమికేగెడు పథమ్మున్ ధాటి జృంభింపగన్
భవుడే యోపఁగ నొప్పె జూటమున నీ భారమ్మదే! పార్వతీ
ధవునిం జేరినయంత లుప్తమగు నీ దర్పంబు చంద్రాననా!
✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*
రిప్లయితొలగించండిఅల్ప బుద్ధి తోడ హరిని దూషింపకు
మేటి నంచు నీవు మిడిసి పడకు
మెంత వారలైన యీశ్వరేశ్వరుడు మా
ధవునిఁ జేరినంత దర్ప ముడుగు.
అవనిన్ జేరగ నా భగీరథుడు తానర్థింపగా నప్పుడా
భవుడొక్కండె సమర్థుడంచు పలుకన్ ప్రార్థింపగా భక్తితో
శివుడే సమ్మతి తెల్పెనయ్యె నిక హేసీమంతనీ యా యుమా
ధవునిం జేరినయంత లుప్తమగు నీ దర్పంబు చంద్రాననా.
మువురు మూర్తులందు ముఖ్యుడు వారిలో
రిప్లయితొలగించండినధికు డెవ్వరనుచు నరయనెంచి
భృగువు నిర్గమించె గగనమార్గాన మా
ధవునిఁ జేరినంత దర్ప ముడుగు
నవరత్నాలకు లేదు నీదు కళుకే నాణ్యంబు నీవంచు స
త్కవులే నీసొగసున్ నుతింతురుగదా! కానిమ్ము కళ్యాణమే
నవచేతోభవుడన్న నొప్పునుకదా నాచారు నీ రుచ్యుడే!
ధవునిం జేరినయంత లుప్తమగు నీ దర్పంబు చంద్రాననా!
అందగత్తెనన్న యతిశయమామెకు
రిప్లయితొలగించండిసాటి గోపికలను సరకుగొనదు
వేణుగానము విని వివశయై రాధ మా
ధవునిఁ జేరినంత దర్ప ముడుగు
భువిలో నందరు సుందరీమణులలో పొల్పారు సౌందర్యరా
రిప్లయితొలగించండిశివి నీవంచు దలంచి బెట్టిదమునన్ శీలింతువే గోపికా!
వివశంబొందుచు వేణుగాన ఝరిలో విశ్వంబు దూఁగాడ మా
ధవునిం జేరినయంత లుప్తమగు నీ దర్పంబు చంద్రాననా!
తనను మించు వారు ధరణి లో లేరంచు
రిప్లయితొలగించండిమిడిసి పాటు పడుచు మిడుకు వాని
నన్ని రంగము లను మిన్న గా నున్నట్టి
ధవుని జేరి నంత దర్ప ముడుగు
పతికి నెదురు వల్క భరత ఖండమ్మునఁ
రిప్లయితొలగించండిబడతి కెంచ గౌరవమ్ము కాదు
రాచ బిడ్డ వైన రమణీమణీ నీదు
ధవునిఁ జేరి నంత దర్ప ముడుగు
ధవ దానమ్ము వ్రతమ్ము లోనఁ గడు చిత్రం బౌను వీక్షింప సుం
త విచారింపుమ లేనిచో ధనము సంతాపమ్ము వాటిల్లు నీ
సవతుల్ చెంతను, దేవమౌనివర దాస్యం బౌర ఘోరమ్ము మా
ధవునిం జేరిన యంత, లుప్త మగు నీ దర్పంబు చంద్రాననా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభక్తి శ్రధ్ధ గార వంబును గలిగిమా
రిప్లయితొలగించండిధవునిఁ జేరినంత దర్ప ముడుగు
దైవ దర్శనంబుఁదప్పక చేయంగ
శాంతి గలుఁగు మదికి సర్వులకును
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
అధిక ధనము గలిగి నహమున వర్తించి
ముసలి తనము వచ్చి మూలపడగ
నాస్తి కరిగి పోయి యసువులుఁ బాయ మా
ధవుని జేరినంత దర్పముడుగు.
: డా బల్లూరి ఉమాదేవి
రిప్లయితొలగించండిధనముగలదటంచుదర్పముచూపక
సకలజనుల నెపుడు సమముగాను
గనుచుభక్తితోడకరములుమోడ్చిమా
*“ధవునిఁ జేరినంత దర్ప ముడుగు
అవనీశుండగునాభగీరథుడు తానాశంభుమెప్పింపగా
రవమున్ జేయుచు గంగజృంభణముగాలాస్యంబుతోతీయగా
నవనీశుండట గాంచుచున్ పలికె నొయ్వారంబదేలన్ నుమా
*“ధవునిం జేరినయంత లుప్తమగు నీ దర్పంబు చంద్రాననా”*
ఆ॥ అందగత్తె ననుచు నహము నిండి వరల
రిప్లయితొలగించండిధనము నొకటి యెంచి మనువుఁ జేయ
నంద హీనుఁ డైన నంత దిమ్మతిరుగు
ధవునిఁ జేరి నంత దర్ప ముడుగు
మ॥ చవితో నెప్పుడు నందగత్తెనని విస్తారంపు గోమొందినన్
భువిలో విత్తము తల్లిదండ్రులకు సమ్మోదమ్ముగాఁ దోచఁగన్
భవ బంధమ్మున నంద హీనుఁడటు సంప్రాప్తించఁగా భర్తయై
ధవునిం జేరిన యంత లుప్తమగు నీ దర్పంబు చంద్రాననా
గోము గర్వము