24, మార్చి 2026, మంగళవారం

సమస్య - 5418

25-3-2026 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హనుమంతునిఁ బెండ్లియాడి రార్గురు కాంతల్”
(లేదా...)
“హనుమనుఁ గాంచి మర్లుగొని యార్గురు కాంతలు పెండ్లియాడిరే”

14 కామెంట్‌లు:

  1. కందం
    మనసున్న సఖులు, క్రమశి
    క్షణ మారుతిఁ బోలు పతుల కాంక్షించిరహో!
    యొనఁగూర నటులె, మ్రొక్కియు
    హనుమంతునిఁ, బెండ్లియాడి రార్గురు కాంతల్

    చంపకమాల
    ఘనమగు లక్షణంబులనగా క్రమశిక్షణ కార్యదక్షతల్
    మనమున రామనామమును మానక చేసెడు స్వామిఁ బోలినన్
    మనువునఁ గోరిరా సఖులు., 'మానితులందగనొంది', మ్రొక్కియున్
    హనుమనుఁ గాంచి, 'మర్లుగొని యార్గురు కాంతలు పెండ్లియాడిరే'!

    రిప్లయితొలగించండి

  2. వినయము ధైర్య పరాక్రమ
    మను వారలు భక్తి తోడ నా పావనినిన్
    ఘనమగు విజయమనునవి
    హనుమంతునిఁ బెండ్లియాడి రార్గురు కాంతల్


    ఇనకుల శ్రేష్టు గార్యమని యించుక భీతీయు లేక శీఘ్రమే
    దనుజుని రాజ్యమేగగను ధైర్య పరాక్రమ వీరకాంతలున్
    వినయము భక్తి కాంతలును విజ్నుడటంచును కీర్తి కాంత యున్
    హనుమనుఁ గాంచి మర్లుగొని యార్గురు కాంతలు పెండ్లియాడిరే.

    రిప్లయితొలగించండి
  3. పెనుపగు ధైర్యము , తెగువయు
    జననిపయి లలియు , సమముగ జానకి పయినన్
    వినయ , విధేయతలును వెరసి
    హనుమంతునిఁ బెండ్లియాడి రార్గురు కాంతల్

    రిప్లయితొలగించండి
  4. కనుగొనిరా నాటకమున
    ఘనముగ శ్రీరామ బంటుగా నటనముతో
    వనితల మనమును దోచిన
    హనుమంతునిఁ బెండ్లియాడి రార్గురు కాంతల్

    కనుగొని రా సులోచనలు కాముని బోలిన యట్టి రూపుతో
    జనక తనూజ భర్తయగు సత్యుని బంటుగ నాటకంబునన్
    ఘనమని బ్రస్తుతించు విధి కన్నుల ముందునటించు వానినిన్
    హనుమనుఁ గాంచి మర్లుగొని యార్గురు కాంతలు పెండ్లియాడిరే

    రిప్లయితొలగించండి
  5. వినయము,భక్తియు,మమతయు
    ననురాగము,సేవనమ్ము ,నర్చన ములు తా
    మనయము దరిచేరుచునా
    హనుమంతుని పెండ్లి యాడి రార్గురు కాంతల్

    రిప్లయితొలగించండి
  6. వినయముభక్తిదాస్యమునువిక్రమమున్ మది మెచ్చునంజనీ
    తనయునిసంద్రలంఘనముదర్పము,ధీమతి,వేగమాదిగా
    గొనములు గూడుకొంచునట కూరిమితోడను చేరి దాపునన్
    *“హనుమనుఁ గాంచి మర్లుగొని యార్గురు కాంతలు పెండ్లియాడిరే”*

    రిప్లయితొలగించండి
  7. కం: మనవైవాహిక వేదిక
    గన గృష్ణుని వోలె నుండు ఘనుని వదలి చ
    క్కన తల కొక వాలరహిత
    హనుమంతునిఁ బెండ్లియాడి రార్గురు కాంతల్”
    (మ్యాట్రిమనీ లో కృష్ణుడి లాంటి చక్కని అబ్బాయి ఉండగా ఆరుగురు అమ్మాయిలు తోక లేని హనంతుడి లాంటి వాళ్లని పెళ్లి చేసుకున్నా రట. వాళ్లకే మొచ్చిందో !)

    రిప్లయితొలగించండి
  8. చం: వనితల మోసగించు నొక వంచకునిన్ గని రక్షకాళియే
    మనమున గుందిరిట్లు "మతి మాలిన కాంతలు వీని నెట్టులన్
    ఘనుడని నమ్మిరో! వరుస గట్టుచు నక్కట తోక లేని యీ
    హనుమనుఁ గాంచి మర్లుగొని యార్గురు కాంతలు పెండ్లియాడిరే?
    (అమ్మాయిలని మోసగించే ఒకణ్ని ఒకళ్ల తరవాత ఒకళ్లు పెళ్లి చేసుకున్నారు.వాడు నిత్య పెళ్లి కొడుకు.వాడి ఆకారం తోక లేని హనుమంతుడే. అది చూసి పొలీసులే బాధ పడ్డారు. )

    రిప్లయితొలగించండి
  9. కం॥ మనమున రాముని నిల్పిన
    హనుమ యనఁగఁ దెలుసు నయ్య యందరికి యిలన్
    జనులకు తెలుపుమ మరి యే
    హనుమంతునిఁ బెండ్లి యాడిరార్గురు కాంతల్

    చం॥ హనుమనుఁ గాంచి మర్లుగొని యార్గురు కాంతలు పెండ్లియాడిరే
    యననపరాధమే హనుమ యన్నుల రూపునుఁ జూడ నొప్పఁడే
    మనమున రామనామమను మంత్రము నొక్కటి నమ్మి స్ఫూర్తితో
    ననిశము రామ భక్తుఁడుగ నందరి మన్నన లొంది వర్ధిలెన్

    రిప్లయితొలగించండి
  10. తనుతర మధ్యలు వికసిత
    వనజాక్షులు సంతసమున వలచిన వారిన్
    ఘనముగ స్మరించి మనముల
    హనుమంతునిఁ బెండ్లియాడి రార్గురు కాంతల్


    అనుమఁడు బ్రహ్మచారి యని యక్కట శంక వహింప నొప్పునే
    జనకజ నింక రాఘవునిఁ జక్కఁగఁ గూర్ప నతండు గాంచమే
    మనువుల నొల్లకుండినఁ గుమార్తెలు తండ్రి తపించి మ్రొక్కఁగా
    హనుమనుఁ గాంచి మర్లుగొని యార్గురు కాంతలు పెండ్లియాడిరే

    రిప్లయితొలగించండి
  11. ధనపతి సర్వసంపదల ధైర్యము నందున బాలచంద్రుడే
    వినయమునందు విద్యల, వివేకమునందున చాల రెవ్వరున్
    ఋణములు పొంది విద్యకయి, ప్రేమ ఘటిల్లగ, రూపమందునన్
    హనుమనుఁ, గాంచి మర్లుగొని యార్గురు కాంతలు పెండ్లియాడిరే

    రిప్లయితొలగించండి
  12. మనువులు గుదిరిన వేళను
    మనమున హనుమను దలచుచు మందిర మునకున్
    జనియును దర్శించి రపుడు
    హనుమంతుని :: పెండ్లి యాడి రార్గురు కాంతల్

    రిప్లయితొలగించండి
  13. -
    అనుమానమె! కైపదమిది
    మన ట్రంప్ దొర గారి ట్వీటు మల్లె గలదు వా
    రిని తలచి యిచ్చిరా యిది?
    "హనుమంతునిఁ బెండ్లియాడి రార్గురు కాంతల్”



    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    వినయము,సమయస్ఫూర్తియు,
    ననురాగము,భక్తి,శక్తి,ధైర్యములున్ దా
    మనయము దరిచేరుచు నా
    హనుమంతుని పెండ్లియాడి రార్గురు కాంతల్.

    రిప్లయితొలగించండి