కం:నీ దిక్కు వకీల్ చేయును వాదన న్యాయమ్ము కొఱకు, వైద్యుఁ డొనర్చున్ నీ దేహమునకు వైద్యము వేదన విడు మయ్య నాన్న విడువకు భజనల్. (ఒక ముసలాయనకి కోర్టు కేసు, అనారోగ్యం ఉన్నాయి. కేసు వకీల్ చూస్తాడు,వైద్యం డాక్టర్ చూస్తాడు .నువ్వు దిగులు పడక దైవభజన చేసుకో అని కొడుకు ధైర్యం చెపుతున్నాడు.)
ఉ:నీదియె న్యాయ మంచు నిక నిన్ విడిపించగ నేను చేతులే వాదన, నాదు కార్యము లబద్ధము లాడియు దిట్టమౌ గతిన్ వాదన సేసి న్యాయమును వర్తిలఁ జేయుటె, వైద్యవృత్తియౌ యేదియొ రోగ మున్నదని యిచ్చుట పత్రము జాలి గొల్పగన్. ("నీ కేసు ఎలాగో వాదించి నిన్ను విడిపించటం నా పని. కానీ నీ మీద జాలి కలిగే టట్లు నీ కేదో రోగం ఉన్నదని సర్టిఫికెట్ ఇవ్వాలి. అది డాక్టర్ పని" అని న్యాయవాది క్లైంట్ తో అన్నాడు. )
కందం
రిప్లయితొలగించండిరోదనమున బాధితులున్
వాదింప నెదురుగ నష్టపరిహారముకై,
సాధింపగ లాయరుతో
వాదన న్యాయమ్ము కొఱకు వైద్యుఁ డొనర్చున్
ఉత్పలమాల
రోదనమందు బాధితులు రొక్కము నష్టనివారణమ్ముగన్
మాదగు న్యాయమన్ బగిది మర్మము విప్పుచు వాదులాడినన్
నీదగు నైపుణిన్ జెలఁగి నిశ్చయమందున న్యాయవాదితో
వాదన సేసి న్యాయమును వర్తిలఁ జేయుటె వైద్య! వృత్తియౌ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివాదులాడు చుండిరనుచు వగచి , న్యాయ
రిప్లయితొలగించండివాది తగవరి యెదుటన బరిఘటించు
వాదన న్యాయమ్ము కొఱకు ; వైద్యుఁ డొనర్చున్
వేదన బాపుట ; నగదము విరివిగ నిడుచున్
బాగుంది. మూడవ పాదం చివర గురువు?
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ పూరణలు బాగున్నవి.
తొలగించండికందం మూడవ పాదం చివర జగణం రాకూడదు.
మేదిని వకీలు సలిపెడు
తొలగించండివాదన న్యాయమ్ము కొఱకు; వైద్యుఁ డొనర్చున్
బాధిత రోగుల దేహపు
వేదన తొలగించు రీతి విరుగుడు క్రియలన్
మేదిని న్యాయవాది పని మేధకు నేర్పుకు లంకెవేయుచున్
వేదనఁ బొందువారలకు వేగమె న్యాయము గల్గు రీతినిన్
వాదన సేసి న్యాయమును వర్తిలఁ జేయుటె; వైద్యవృత్తియౌ
భాధితులైన రోగులకు పట్టిన బాధలు దొల్గజేయుటే
[సవరించిన కందము కందము...]
రిప్లయితొలగించండిమోదం బనుచును హెచ్చుగ
కాదంబరి గ్రోలి నట్టి ఖలుడు వచించెన్
సోదర భువిలో కాంచగ
వాదన న్యాయమ్ము కొఱకు వైద్యుఁ డొనర్చున్.
మోదమె మద్యమంచునెడి మూర్ఖుడొకండట పాన శాలలో
స్వాదురసమ్ము గ్రోలి యను సారకు లెల్లరి తోడ మత్తు లో
వాదన సేయుచున్ బలికె పాటవ మొప్పెడి రీతిగా భువిన్
వాదన సేసి న్యాయమును వర్తిలఁ జేయుటె వైద్యవృత్తియౌ.
వాదించు న్యాయవాదియు
రిప్లయితొలగించండి*“వాదన న్యాయమ్ము కొఱకు వైద్యుఁ డొనర్చున్”*
పేదల కుచితముగా సే
వల్ దయ చూపుచును మదిని వదలక నెపుడున్.
వేదన తోడ బాధితుడు వేడుచు ప్రార్థన చేసి నంతనే
రోదనమాపుచేసెదను లోపము లేవియులేకయున్నచో
*“వాదన సేసి న్యాయమును, వర్తిలఁ జేయుటె వైద్యవృత్తియౌ”*
పేదలు నార్తితోడనట వేడగ వచ్చినబాగుచేయుటే
ఈ ధరలోన మాన్యవరు లిర్వురు వారలయందు గాంచగా
రిప్లయితొలగించండిఖేదముఁ బాప నేర్పరి వకీలు జనావళికేమి సేయునో?
వ్యాధుల జిక్కు జీవులకు వ్యాకులబాటును దీర్చునెద్దియో?
వాదన సేసి న్యాయమును వర్తిలఁ జేయుటె, వైద్యవృత్తియౌ
ప్రశస్తంగా ఉన్నది.
తొలగించండిఈ ధరను వకీలొనరుచు
రిప్లయితొలగించండివాదన న్యాయమ్ము కొఱకు, వైద్యుఁ డొనర్చున్
వ్యాధిని మాన్పగ వైద్యము
కాదనగలమా యిరువురు కడు యోగ్యులెగా.
బాగున్నది.
తొలగించండికాదని సలుపు వ కీ లుగ
రిప్లయితొలగించండివాదన న్యాయమ్ము కొఱకు :: వైద్యు డొ నర్చున్
వేదన బాపుచు రోగికి
వ్యాధికి సరియగు చికిత్స వర్తిల చేయున్
బాగుంది.
తొలగించండికం:నీ దిక్కు వకీల్ చేయును
రిప్లయితొలగించండివాదన న్యాయమ్ము కొఱకు, వైద్యుఁ డొనర్చున్
నీ దేహమునకు వైద్యము
వేదన విడు మయ్య నాన్న విడువకు భజనల్.
(ఒక ముసలాయనకి కోర్టు కేసు, అనారోగ్యం ఉన్నాయి. కేసు వకీల్ చూస్తాడు,వైద్యం డాక్టర్ చూస్తాడు .నువ్వు దిగులు పడక దైవభజన చేసుకో అని కొడుకు ధైర్యం చెపుతున్నాడు.)
ఉ:నీదియె న్యాయ మంచు నిక నిన్ విడిపించగ నేను చేతులే
రిప్లయితొలగించండివాదన, నాదు కార్యము లబద్ధము లాడియు దిట్టమౌ గతిన్
వాదన సేసి న్యాయమును వర్తిలఁ జేయుటె, వైద్యవృత్తియౌ
యేదియొ రోగ మున్నదని యిచ్చుట పత్రము జాలి గొల్పగన్.
("నీ కేసు ఎలాగో వాదించి నిన్ను విడిపించటం నా పని. కానీ నీ మీద జాలి కలిగే టట్లు నీ కేదో రోగం ఉన్నదని సర్టిఫికెట్ ఇవ్వాలి. అది డాక్టర్ పని" అని న్యాయవాది క్లైంట్ తో అన్నాడు. )
వాట్సప్ లో సమీక్ష చేసిన పూరణలను ఇక్కడ సమీక్షించలేదని గమనించ ప్రార్థన.
రిప్లయితొలగించండిఉ॥ వేదన హెచ్చి మిక్కటము వేడగ సూక్తపు వైద్య మెంచఁగన్
రిప్లయితొలగించండిరోదన తోడఁ దెల్పుచును రోగియె, పొందుగ వైద్య శాస్త్రముల్
సోదనఁ జేయుచున్ జదివి చూచుచు మక్కువగా మనమ్మునన్
వాదన సేసి న్యాయమును వర్తిలఁ జేయుటె వైద్యవృత్తియౌ
(వేరు వైద్యులతో కూడ సంప్రదించవచ్చండి, అదీ వాదనే. శాస్త్ర విద్యా శోధనలో mentor n student మధ్య వాదన మరీ యెక్కువండి)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరోదనచేయుచున్ బ్రతుకు రోగుల సేవకు నిశ్చయించి సం
రిప్లయితొలగించండిపాదన గూర్చితల్చక సుభమ్మును గూర్చుచు నెల్ల వేళలన్
కాదని దుష్ఠ నాయకులు కాసుల నీయ, వకీలు సంగడిన్
వాదన సేసి న్యాయమును వర్తిలఁ జేయుటె, వైద్యవృత్తియౌ
తా దయతో లేకుండఁగ
రిప్లయితొలగించండినే దెస నన్యాయ మింత యేని సతమ్మున్
వేదన మాన్పఁగ రోగికి
వాదన న్యాయమ్ము కొఱకు వైద్యుఁ డొనర్చున్
పాదుకొనంగ ధర్మ మిలఁ బన్నుగ నిత్యముఁ గష్ట మైననున్
మేదినిఁ జేయు కార్యములు మిన్నగ శాస్త్ర విరుద్ధ మైనచోఁ
గాదని దేవతా పరమ కర్మము లందు సహేతుకమ్ముగా
వాదన సేసి న్యాయమును వర్తిలఁ జేయుటె వైద్య వృత్తియౌ
[వైద్య వృత్తి = వేదములకు సంబంధించిన వృత్తి, పౌరోహిత్యము]
"వేదనలందునరోగియు
రిప్లయితొలగించండివాదన న్యాయమ్ముకొరకు" వైద్యుడొనర్చున్
నాదాయమునాశించగ
ఏదారికిసంతసంబుయెంచియుజూడన్?
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
పేదలె యైనను లాయరు
వాదన న్యాయమ్ము కొఱకు;వైద్యుడొనర్చున్
వేదన తీర్చెడు విధముగ
ఖేదము తొలగగ తగిన చికిత్సను తానున్.
ఆ ధన మే మూలము ప్రతి
రిప్లయితొలగించండివాదన న్యాయమ్ము కొఱకు, వైద్యుఁ డొనర్చున్
శోధన పరికరముల ప్రతి
పాదింపన్ రోగమెల్ల భారము మనదే