31, మార్చి 2026, మంగళవారం

సమస్య - 5425

1-4-2026 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వాదన న్యాయమ్ము కొఱకు వైద్యుఁ డొనర్చున్”
(లేదా...)
“వాదన సేసి న్యాయమును వర్తిలఁ జేయుటె వైద్యవృత్తియౌ”

25 కామెంట్‌లు:

  1. కందం
    రోదనమున బాధితులున్
    వాదింప నెదురుగ నష్టపరిహారముకై,
    సాధింపగ లాయరుతో
    వాదన న్యాయమ్ము కొఱకు వైద్యుఁ డొనర్చున్

    ఉత్పలమాల
    రోదనమందు బాధితులు రొక్కము నష్టనివారణమ్ముగన్
    మాదగు న్యాయమన్ బగిది మర్మము విప్పుచు వాదులాడినన్
    నీదగు నైపుణిన్ జెలఁగి నిశ్చయమందున న్యాయవాదితో
    వాదన సేసి న్యాయమును వర్తిలఁ జేయుటె వైద్య! వృత్తియౌ

    రిప్లయితొలగించండి
  2. వాదులాడు చుండిరనుచు వగచి , న్యాయ
    వాది తగవరి యెదుటన బరిఘటించు
    వాదన న్యాయమ్ము కొఱకు ; వైద్యుఁ డొనర్చున్
    వేదన బాపుట ; నగదము విరివిగ నిడుచున్

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. మీ పూరణలు బాగున్నవి.
      కందం మూడవ పాదం చివర జగణం రాకూడదు.

      తొలగించండి
    2. మేదిని వకీలు సలిపెడు
      వాదన న్యాయమ్ము కొఱకు; వైద్యుఁ డొనర్చున్
      బాధిత రోగుల దేహపు
      వేదన తొలగించు రీతి విరుగుడు క్రియలన్

      మేదిని న్యాయవాది పని మేధకు నేర్పుకు లంకెవేయుచున్
      వేదనఁ బొందువారలకు వేగమె న్యాయము గల్గు రీతినిన్
      వాదన సేసి న్యాయమును వర్తిలఁ జేయుటె; వైద్యవృత్తియౌ
      భాధితులైన రోగులకు పట్టిన బాధలు దొల్గజేయుటే


      [సవరించిన కందము కందము...]

      తొలగించండి

  4. మోదం బనుచును హెచ్చుగ
    కాదంబరి గ్రోలి నట్టి ఖలుడు వచించెన్
    సోదర భువిలో కాంచగ
    వాదన న్యాయమ్ము కొఱకు వైద్యుఁ డొనర్చున్.


    మోదమె మద్యమంచునెడి మూర్ఖుడొకండట పాన శాలలో
    స్వాదురసమ్ము గ్రోలి యను సారకు లెల్లరి తోడ మత్తు లో
    వాదన సేయుచున్ బలికె పాటవ మొప్పెడి రీతిగా భువిన్
    వాదన సేసి న్యాయమును వర్తిలఁ జేయుటె వైద్యవృత్తియౌ.

    రిప్లయితొలగించండి
  5. వాదించు న్యాయవాదియు
    *“వాదన న్యాయమ్ము కొఱకు వైద్యుఁ డొనర్చున్”*
    పేదల కుచితముగా సే
    వల్ దయ చూపుచును మదిని వదలక నెపుడున్.


    వేదన తోడ బాధితుడు వేడుచు ప్రార్థన చేసి నంతనే
    రోదనమాపుచేసెదను లోపము లేవియులేకయున్నచో
    *“వాదన సేసి న్యాయమును, వర్తిలఁ జేయుటె వైద్యవృత్తియౌ”*
    పేదలు నార్తితోడనట వేడగ వచ్చినబాగుచేయుటే


    రిప్లయితొలగించండి
  6. ఈ ధరలోన మాన్యవరు లిర్వురు వారలయందు గాంచగా
    ఖేదముఁ బాప నేర్పరి వకీలు జనావళికేమి సేయునో?
    వ్యాధుల జిక్కు జీవులకు వ్యాకులబాటును దీర్చునెద్దియో?
    వాదన సేసి న్యాయమును వర్తిలఁ జేయుటె, వైద్యవృత్తియౌ

    రిప్లయితొలగించండి
  7. ఈ ధరను వకీలొనరుచు
    వాదన న్యాయమ్ము కొఱకు, వైద్యుఁ డొనర్చున్
    వ్యాధిని మాన్పగ వైద్యము
    కాదనగలమా యిరువురు కడు యోగ్యులెగా.

    రిప్లయితొలగించండి
  8. కాదని సలుపు వ కీ లుగ
    వాదన న్యాయమ్ము కొఱకు :: వైద్యు డొ నర్చున్
    వేదన బాపుచు రోగికి
    వ్యాధికి సరియగు చికిత్స వర్తిల చేయున్

    రిప్లయితొలగించండి
  9. కం:నీ దిక్కు వకీల్ చేయును
    వాదన న్యాయమ్ము కొఱకు, వైద్యుఁ డొనర్చున్
    నీ దేహమునకు వైద్యము
    వేదన విడు మయ్య నాన్న విడువకు భజనల్.
    (ఒక ముసలాయనకి కోర్టు కేసు, అనారోగ్యం ఉన్నాయి. కేసు వకీల్ చూస్తాడు,వైద్యం డాక్టర్ చూస్తాడు .నువ్వు దిగులు పడక దైవభజన చేసుకో అని కొడుకు ధైర్యం చెపుతున్నాడు.)

    రిప్లయితొలగించండి
  10. ఉ:నీదియె న్యాయ మంచు నిక నిన్ విడిపించగ నేను చేతులే
    వాదన, నాదు కార్యము లబద్ధము లాడియు దిట్టమౌ గతిన్
    వాదన సేసి న్యాయమును వర్తిలఁ జేయుటె, వైద్యవృత్తియౌ
    యేదియొ రోగ మున్నదని యిచ్చుట పత్రము జాలి గొల్పగన్.
    ("నీ కేసు ఎలాగో వాదించి నిన్ను విడిపించటం నా పని. కానీ నీ మీద జాలి కలిగే టట్లు నీ కేదో రోగం ఉన్నదని సర్టిఫికెట్ ఇవ్వాలి. అది డాక్టర్ పని" అని న్యాయవాది క్లైంట్ తో అన్నాడు. )

    రిప్లయితొలగించండి
  11. వాట్సప్ లో సమీక్ష చేసిన పూరణలను ఇక్కడ సమీక్షించలేదని గమనించ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  12. ఉ॥ వేదన హెచ్చి మిక్కటము వేడగ సూక్తపు వైద్య మెంచఁగన్
    రోదన తోడఁ దెల్పుచును రోగియె, పొందుగ వైద్య శాస్త్రముల్
    సోదనఁ జేయుచున్ జదివి చూచుచు మక్కువగా మనమ్మునన్
    వాదన సేసి న్యాయమును వర్తిలఁ జేయుటె వైద్యవృత్తియౌ

    (వేరు వైద్యులతో కూడ సంప్రదించవచ్చండి, అదీ వాదనే. శాస్త్ర విద్యా శోధనలో mentor n student మధ్య వాదన మరీ యెక్కువండి)

    రిప్లయితొలగించండి
  13. రోదనచేయుచున్ బ్రతుకు రోగుల సేవకు నిశ్చయించి సం
    పాదన గూర్చితల్చక సుభమ్మును గూర్చుచు నెల్ల వేళలన్
    కాదని దుష్ఠ నాయకులు కాసుల నీయ, వకీలు సంగడిన్
    వాదన సేసి న్యాయమును వర్తిలఁ జేయుటె, వైద్యవృత్తియౌ

    రిప్లయితొలగించండి
  14. తా దయతో లేకుండఁగ
    నే దెస నన్యాయ మింత యేని సతమ్మున్
    వేదన మాన్పఁగ రోగికి
    వాదన న్యాయమ్ము కొఱకు వైద్యుఁ డొనర్చున్


    పాదుకొనంగ ధర్మ మిలఁ బన్నుగ నిత్యముఁ గష్ట మైననున్
    మేదినిఁ జేయు కార్యములు మిన్నగ శాస్త్ర విరుద్ధ మైనచోఁ
    గాదని దేవతా పరమ కర్మము లందు సహేతుకమ్ముగా
    వాదన సేసి న్యాయమును వర్తిలఁ జేయుటె వైద్య వృత్తియౌ

    [వైద్య వృత్తి = వేదములకు సంబంధించిన వృత్తి, పౌరోహిత్యము]

    రిప్లయితొలగించండి
  15. "వేదనలందునరోగియు
    వాదన న్యాయమ్ముకొరకు" వైద్యుడొనర్చున్
    నాదాయమునాశించగ
    ఏదారికిసంతసంబుయెంచియుజూడన్?

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    పేదలె యైనను లాయరు
    వాదన న్యాయమ్ము కొఱకు;వైద్యుడొనర్చున్
    వేదన తీర్చెడు విధముగ
    ఖేదము తొలగగ తగిన చికిత్సను తానున్.

    రిప్లయితొలగించండి
  17. ఆ ధన మే మూలము ప్రతి
    వాదన న్యాయమ్ము కొఱకు, వైద్యుఁ డొనర్చున్
    శోధన పరికరముల ప్రతి
    పాదింపన్ రోగమెల్ల భారము మనదే


    రిప్లయితొలగించండి