3, ఏప్రిల్ 2026, శుక్రవారం

సమస్య - 5428

4-4-2026 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పతి మరణము మంగళమ్ము భార్యకుఁ జూడన్”
(లేదా...)
“మగఁడు గతింపఁ గాంచి కడు మంగళమంచుఁ దలంచె భార్యయే”

15 కామెంట్‌లు:

  1. పతనమగు వారి నారయ
    శతవిధముల మగడు జతన జరుపుచు నుండన్
    గతిని నిలుపు దళముల యధి
    పతి మరణము మంగళమ్ము భార్యకుఁ జూడన్

    రిప్లయితొలగించండి
  2. కందం
    వెతపడు కన్యలఁ గావఁగ
    సతితో నరకుని వధించు సమితిన్., సత్యా
    పతి చేత నయ్యసురగణ
    పతి మరణము మంగళమ్ము భార్యకుఁ జూడన్

    చంపకమాల
    వగపును బాప కన్యలకుఁ బంకజనేత్రుడు ''సత్యభామ' 'తో
    భగభగమండుచున్ నరకుఁ బాపిని గూల్చరణంబుకేగియున్
    నిగుడుచు నిక్కుచున్ బరమనీచుని 'దుష్టుని' సంహరింపగన్
    మగడు, 'గతింపఁ' ,గాంచి కడు మంగళమంచుఁ దలంచె ''భార్య' 'యే

    రిప్లయితొలగించండి

  3. మతి లేని మాట లేలర
    పతి వ్రతము నాచరించు పడుతుల కిలలో
    పతి మరణము గన శాపము
    పతి మరణము మంగళమ్ము భార్యకుఁ జూడన్?


    తెగులది సోకె దిట్టలుగ ధృత్వరి పేరును గన్న వారె య
    స్తగమన మింక తప్పదని సాధ్వికి చెప్పిన వేళ యామెయే
    వగచక ముక్తి మార్గమను భావన తో జన వారణాశి లో
    మగఁడు గతింపఁ గాంచి కడు మంగళమంచుఁ దలంచె భార్యయే.

    రిప్లయితొలగించండి
  4. కుతితో ద్రౌపదిని కొసరి
    పతనము నిశ్చయము గాగ పతితోననిలో
    కుతగుడు విరటుని సేనా
    పతి మరణము మంగళమ్ము భార్యకుఁ జూడన్

    మగటిమిఁ జూపు శూరుడను మచ్చికతో నను గౌగలించుమా
    ద్విగుణిత మౌను సంతసము వేచెద నేనని కీచకుండనన్
    బగగొని సత్యసంధ తన భర్తకు తెల్పగ యుద్ధమందునా
    మగఁడు గతింపఁ గాంచి కడు మంగళమంచుఁ దలంచె భార్యయే

    [మగఁడు = శూరుడు]

    రిప్లయితొలగించండి
  5. కం:అతి ధైర్యము సూత్రము పై
    సతి పార్వతి కుంటచే విషమ్మును గ్రోలన్
    పతికిన్ జెప్పె, జగతి నే
    పతి మరణము మంగళమ్ము భార్యకుఁ జూడన్?
    ("మంగళసూత్రమ్ము నెంత మది నమ్మినదో" అనే పోతన గారి భావాన్నే ఇలా చెప్పాను. )

    రిప్లయితొలగించండి
  6. చం:మగడును, తాను వృద్ధులె, యమాయకు డౌ పతి యుండి, చావు ముం
    దుగ తననే వరించ పతి దుఃఖము దారుణ మౌ నటంచు దో
    చగ నొక భిన్న తార్కికత,చావున కేడ్చెడు రీతి వీడి యా
    మగఁడు గతింపఁ గాంచి కడు మంగళమంచుఁ దలంచె భార్యయే
    (మిథునం సినిమా లో భార్య యొక్క తర్కం- తాను పోయి అమాయకుడైన భర్త ఉండటం కంటే అతను ముందుగా పోవటం మంచిది అని అనుకోవటం.)

    రిప్లయితొలగించండి
  7. క్షితిజ ను బంధించి సలిపె
    మతిసె డి రావ ణుడు జేసె మరిమరి దొ సగుల్
    హతుని సేయగ లంకా
    పతి మరణము మంగళ మ్మె భార్యకు జూడన్

    రిప్లయితొలగించండి
  8. చం॥ వగపుల జీవితమ్ముఁ గని బాధల నొందఁగఁ ద్రావు మూర్ఖుఁడై
    మగపొడి లేక బాధ్యతల మన్నన సేయక జూదమందునన్
    దగని విధమ్ము సంపదల దత్తముచేయుచు సాగు చుండెడిన్
    మగఁడు గతింపఁ గాంచి కడు మంగళమంచుఁ దలంచె భార్యయే

    మగపొడి శౌర్యము

    మొదట ఇచ్చిన సమస్య కండి

    చం॥ సతతముఁ ద్రావి జూదమున సంపదలంతముఁ జేయు మూర్ఖుఁడై
    పతనము చెంది వర్తిలుచు బాధ్యత లెంచని మంద బుద్ధియౌ
    కతనను దైత్య రూపు నిడి కష్టముఁ బెట్టుచు సాగు క్రూరుడుం
    బతి మరణింపఁ గాంచి కడు మంగళమంచుఁ దలంచె భార్యయే

    రిప్లయితొలగించండి
  9. సమస్య:
    *మగడు గతింపగాంచి కడు మంగళమంచు దలంచెభార్యయే *
    *చంపకమాల*

    నిగనిగలాడు నీదు మెయి నిత్యము కైపును గూర్చు చుండు నా
    మగటిమి జూపెదన్ కలికి మన్మథ క్రీడకు రమ్ముయంచు యా
    పగతుడు కీచకాధముడు పల్కిన మాటలెరింగి భీముడున్
    భగభగ మండిపోవుచును భ్రష్టుని తోడను పోరుసల్ప యా
    *మగడు గతింప గాంచి కడు మంగలమంచు దలంచె భార్యయే*
    ఆర్కే శర్మ

    రిప్లయితొలగించండి
  10. మగనికి వ్యాధిసోకి పలుమారులు జేరెను వైద్యశాలలో
    విగళితమాయె చేతన వివేచన గూడ నశించె ప్రాణముల్
    విగతమునొందగా దొడఁగె వేదననొందగ నెల్లవారలున్
    మగఁడు గతింపఁ గాంచి కడు మంగళమంచుఁ దలంచె భార్యయే

    రిప్లయితొలగించండి
  11. సతమతమాయెను జీవిక
    యతివేలముగా గృశించె నారోగ్యమ్మే
    బ్రతుకుట యసాధ్యమగుటన్
    పతి మరణము మంగళమ్ము భార్యకుఁ జూడన్

    రిప్లయితొలగించండి
  12. అతి భారము వైధవ్యము
    వెతలకు నంతమ్ము గనము విధవల కకటా
    యతివా బ్రతుకున నుండఁగఁ
    బతి, మరణము మంగళమ్ము భార్యకుఁ జూడన్


    మగఁ డన మిన్న మక్కువయె మానిని కింపుగ నాత్మ లోపలన్
    మగువల నెన్న మిన్న సుమి మంచి తనమ్మున భూతలమ్మునం
    దగవుల కేల పోయెదము తన్వి తలంపుల బాస లీయఁగా
    మగఁడు, గతింపఁ గాంచి కడు మంగళ మంచుఁ దలంచె భార్యయే

    [గతించినవి మగఁ డిచ్చిన బాసలు]

    రిప్లయితొలగించండి
  13. తగిలెను రాచపుండనుచు తగ్గుట కష్టమనన్ భిషక్కుతాన్
    తెగువను చూపి భర్తకు విదేశపు వైద్యుల నెంచి చూపగన్
    జగముల నేలు శ్రీపతియు సమ్మతి జూడగ కష్టకాలమున్
    మగడు గతించ, గాంచి కడు మంగళ మంచు దలంచెభార్యయే

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    సతి కొఱకు లంక రాజును
    పతి రాముడు సంహరించ భండనమందున్
    సతి సీతకు నా లంకా
    పతి మరణము మంగళమ్ము భార్యకుఁ
    జూడన్.

    రిప్లయితొలగించండి