5, ఏప్రిల్ 2026, ఆదివారం

సమస్య - 5430

6-4-2026 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అరవమునన్ దిక్కనయె మహాకవి సుమ్మీ”
(లేదా...)
“అరవమునందు తిక్కన మహాకవి వ్రాసెను ద్వ్యర్థికావ్యమున్”

16 కామెంట్‌లు:

  1. -
    విరచించె మహాభారత
    మరయగ నన్నయ్య పిదప నద్భుతముగనౌ,
    బరబర వ్రాసె జిలేబీ
    యరవమునన్, దిక్కనయె మహాకవి సుమ్మీ


    రిప్లయితొలగించండి
  2. [క్రమాలంకారములో.....]

    విరచించినదే లిపిలో
    గరిమను కంబకవి? యుభయ కవి మిత్రునిగా
    బిరుదొందిన కవి యెవ్వడు?
    అరవమునన్; దిక్కనయె మహాకవి సుమ్మీ!

    గరిమను రామకావ్యమును కంబనుడేలిపిలో సృజించెనో?
    స్థిరమగు భారతమ్మునిట తెన్గున వ్రాసిన ముఖ్యుడెవ్వడో?
    బిరబిర సాటిలేని విధి పింగళి సూరన వ్రాసె నేమిటో?
    అరవమునందు; తిక్కన మహాకవి; వ్రాసెను ద్వ్యర్థికావ్యమున్

    రిప్లయితొలగించండి
  3. తిరువళ్ళువరు , ప్రథ బడసె
    అరవమునన్ ; దిక్కనయె మహాకవి సుమ్మీ
    సరళమగు భాష తోడుత
    తెరగుగ నా భా రతమును దెనుగుసేయన్

    రిప్లయితొలగించండి

  4. ధరణి గవీంద్రులలో గన
    పరిణతి గలిగిన కవియని భావించెద నే
    నరయగ వ్రాయక పోయిన
    నరవమునన్, దిక్కనయె మహాకవి సుమ్మీ.


    ధరణిని వాసి గాంచిన సుధారసతుల్య మటంచు మేటి స
    ర్వరసులు పోహణించు మన భాష తెనుంగున కావ్య రాజముల్
    విరివిగ వ్రాసి సత్కవిగ పేరుగడించిన వాడు, కాదురా
    యరవమునందు, తిక్కన మహాకవి, వ్రాసెను ద్వ్యర్థికావ్యమున్
    పిరిమిని యాంధ్ర మందునను పింగళి సూరన యెంచి చూడగా.

    రిప్లయితొలగించండి
  5. కందం
    గురుతెరిగి భారతమున చి
    వరి పర్వములు పదిహేను వ్రాసిన ఘనతన్
    పొరుగున తమిళకవి యనెనె
    యరవమునన్, "దిక్కనయె మహాకవి సుమ్మీ!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవిబ్రహ్మ తిక్కన గారితో నాటి కవిమిత్రుడు:

      చంపకమాల
      మెరుపులు చిందినారు మన మేటి కవీంద్రులు భారతమ్మునన్
      విరిసెను సాహితీ వనము వేడుక సేయగ కావ్యసూనముల్
      మురియగ 'నొట్టకూత్తర' ను పూజ్యమహాశయులట్టివారలే
      యరవమునందు, తిక్కన! 'మహాకవి' వ్రాసెను ద్వ్యర్థికావ్యమున్

      తొలగించండి
  6. ఎరుఁగవ తిక్కన యాంధ్రుఁడు
    విరచించెను కావ్యములను విఖ్యాతముగా
    సరళఁపు దెలుఁగున, కాదుర
    అరవమునన్, దిక్కనయె మహాకవి సుమ్మీ

    రిప్లయితొలగించండి
  7. (క్రమాలంకారంలో)
    గరిమను పాశురమ్ములను గానముఁజేసిన భాషయెద్దియో?
    వరముగ నాంధ్రభారతము వ్రాసిన ముగ్గురిలో నొకండెగా!
    నరయఁగ భట్టుమూర్తియను నాంధ్ర కవీంద్రుడు వ్రాసెనిద్దియే
    అరవమునందు, తిక్కన మహాకవి వ్రాసెను, ద్వ్యర్థికావ్యమున్

    రిప్లయితొలగించండి
  8. చం॥ వరలఁగ సంస్కృతమ్మె బహు ప్రాభవ మొందుచు తెల్గు నందునన్
    విరివిగ నల్ప ప్రాణములు విచ్చఁగఁ గావ్యము లందు హెచ్చుగా
    నరుగుచు సంస్కృతాక్షరము లన్నియు వీడుచుఁ వ్రాసి చూపెనే
    అ రవమునందు తిక్కన మహాకవి వ్రాసెను ద్వ్యర్థి కావ్యమున్

    మన్నించాలి చిన్న వివరణ:
    అ రవము శబ్దము లేనివి. తమిళులో మహా ప్రాణాక్షరాలు (సంస్కృతాక్షరాలు) ఉండవండి. ఈమధ్యనే హ శ్రీ చేర్చుకున్నారు (అన్నారు). కాకపోతే 2 న లు 2 ల లు ఉన్నాయి. అవి వేరు వేరు విధంగా పలుకుతారండి. తిక్కన బద్దెన వీరితోనే తెలుగు పదాల వాడకము పెరిగినందున ఇలా పూరించానండి. సంస్కృత పదాలు వాడనందున అ రవమైనదని.

    రిప్లయితొలగించండి
  9. కం:గురుతర భారత గాధను
    సరి యగు రీతులనె వ్రాయ సాగిరి కవు లెం
    దరొ,వ్రాయ మువురు కవులే
    అరవమునన్, దిక్కనయె మహాకవి సుమ్మీ!
    (భారతాన్ని ఇతర భాషలలో కూడా వ్రాసారు.అరవం లో కూడా ముగ్గురు కవులు వ్రాసారు. ఎంత మంది ఎంత గొప్పగా వ్రాసినా మహాకవి మాత్రం తిక్కన గారే. అన్ని భారతాల కంటే తెలుగు భారతమే గొప్పది అనేది విమర్శకుల అభిప్రాయమే.)

    రిప్లయితొలగించండి
  10. చం:పరులను మెచ్చు బుద్ధిగల వాడగు నా తమిళుండు పల్కెడిన్
    సరసత కొంత తెల్గు,కొన సాగెడు నాతని మాతృభాష యౌ
    నరవమునందు "తిక్కన మహాకవి, వ్రాసెను ద్వ్యర్థికావ్యమున్
    సురుచిర రీతి సూరనయు, సుందర భాషయె ఆంధ్రభాషయున్.
    (ఒక ఆరవ పండితుడు సగం తెలుగు,సగం అరవం కలిపి మాట్లాడుతూ తిక్కన మహాకవి అని,పింగళి సూరన ద్వ్యర్థి కావ్యాన్ని అందం గా రాసాడని తెలుగు కూడా మంచి భాషే అని అన్నాడు.)

    రిప్లయితొలగించండి
  11. నరవరులు నిశ్చయమ్ముగ
    నరచిన దిప్పగిది యలరి యత్తఱి మీ రె
    ల్లరును వినఁగ నేనే కా
    ద రవమునం, దిక్కనయె మహాకవి సుమ్మీ


    పుర జను లంద నచ్చెరువు భూతల నాథున కర్పణమ్ముగా
    సురుచిర శబ్ద సంయుతము శుద్ధ కవీంద్రుఁడు బట్టు మూర్తియే
    గురువుగ నెంచి తిక్కనను గోవిదు, నింపగు తెన్గు నంద, కా
    దరవము నందుఁ దిక్కన మహాకవి, వ్రాసెను ద్వ్యర్థి కావ్యమున్

    రిప్లయితొలగించండి
  12. కర మగు దీ క్ష గ తిక్కన
    వి రచించె న్ భారతము ను విజ్ణు లు మెచ్చన్
    ప ర భాష లో పలుక వశ మె
    " అర వ ము నన్ దిక్క న యె మహా కవి సుమ్మీ

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    వరముగ లభించె "భారతి"
    అరవమునన్; దిక్కనయె మహాకవి సుమ్మీ
    విరివిగ కావ్యము లల్లెను
    విరచించెను భారతమును విబుధులు
    మెచ్చన్.

    రిప్లయితొలగించండి