12-4-2026 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ప్రవచనకర్తలన మృషలు వల్కెడివారల్”(లేదా...)“ప్రవచనకర్త లెల్లరును బల్కెడి వన్నియు సత్యదూరముల్”
అవమతిగ పలికితివిటుల"ప్రవచనకర్తలన మృషలు వల్కెడివారల్"సవరించు మాతలంపును అవిరళమగు కృషిసలుపుచు నవి నేర్చిరిగా
ప్రవచన కర్తలు తెలిపినవివరములకు మూలమగును వేదములెల్లన్గవనము చెప్పునపుడు క్షిప్ర వచనకర్తలన మృషలు వల్కెడివారల్ప్రవచనకర్త లెల్లరును బల్కెడివన్నియు నమ్మగావలెన్వివరములన్ వచింత్రుగద వేదములన్నియు సంగ్రహించుచున్గవనము వేగవంతమయి కైతల నల్లెడి వేళలందు క్షిప్ర వచనకర్త లెల్లరును బల్కెడి వన్నియు సత్యదూరముల్
స్తవ మగు రీ తి గ సభలో నవతకు నాందీ పలుకుచు నైపుణ్య ము తో ప్రవ చించంగా యె ట్టు ల ప్రవచన కర్త ల న మృష లు వల్కె డు వారల్
-అవమానింపవలదు వారి వైభవముపై నసూయ రీఢయు వలదోయ్కవిరాట్ ! పల్కవలదటుల ప్రవచనకర్తలన మృషలు వల్కెడివారల్?
భువిని సనాతన ధర్మము నవమానించు టొకటె పని యని తలచెడి యా వివరుణులు కపట విబుధులు ప్రవచనకర్తలన మృషలు వల్కెడివారల్.అవనిని పూర్వ కాలమున నామతి గల్గిన యగ్ర వర్ణులే యవమితి జేసి రంచు నభియాతులు వారలు వారి ధర్మమున్ భువి నుడపుచ్చ నెంచుచును పొచ్చెపు మాటలు నేర్చి నట్టి యా ప్రవచనకర్త లెల్లరును బల్కెడి వన్నియు సత్యదూరముల్.
ప్రవచనకర్త లెల్లపుఁడు పౌరుల క్షేమము గోరి వారికిన్వివరముగా వచించెదరు వేదములందలి ధర్మసూక్ష్మముల్భవితను తీర్చిదిద్దగల వారలు మాన్యులుగాదె యెవ్విధిన్ప్రవచనకర్త లెల్లరును బల్కెడి వన్నియు సత్యదూరముల్?
ప్రవచనముల సల్పుచు కడువివరముగా దెలుపుచుంద్రు విషయములెన్నోయవమతి నిట్లన దగునాప్రవచనకర్తలన మృషలు వల్కెడివారల్?
చం॥ ఎవరు జనాళి మెప్పుఁ గను నిచ్ఛ వరించి పఠించ కుండఁగన్నవకము మీర లౌక్యవిధి నవ్యత హాస్యము నింపి మూల గాథ వదిలి వింత పద్ధతులఁ దాల్చుచు నుందురొ వారి నెంచఁగన్బ్రవచన కర్తలెల్లరును బల్కెడి వన్నియు సత్యదూరముల్
భవములు పాయజేయ భగవంతుని వేడుడు భక్తితోడుతన్శివుడిని నమ్ముచున్ నడుపు చేరును నావయు తీరమంచునున్చెవులకు నింపు గూర్చునటు చెప్పుచు నుండగ నెట్టులౌను యా*ప్రవచనకర్తలెల్లరును బల్కెడు వన్నియు సత్యదూరముల్*
అవనిఁ బరికింప నిత్యోగ్ర వాక్య సంచయ చతురులు కైతవ భాషాప్రవరులు నిరంతర క్షిప్ర వచన కర్త లన మృషలు వల్కెడి వారల్ దివిజులు వీరి బంధు లను తీరునఁ బల్కెద రెల్ల చోటులన్ వివరము లెన్నొ పల్కెదరు వింత లహో విను వార లున్నచో నవిరళ వక్ర భాష్యముల నక్కట భాషణ నైపుణమ్మునంబ్రవచన కర్త లెల్లరును బల్కెడి వన్నియు సత్య దూరముల్
కందంవ్యవహారము శ్రుతి మించఁగవివరమ్ముగ నేది గనరు వినరనఁగ మనోజవమున బ్రతికెడు వారికిప్రవచనకర్తలన మృషలు వల్కెడివారల్!చంపకమాలవ్యవధియె లేదు దేనికన వారల పోకడ వాయువేగమైవివరముగన్ వినన్ గనను వేళయె లేదను వాదమై మనోజవమున జీవితాననిల సాగెడు వారల దృష్టి దోషమైప్రవచనకర్త లెల్లరును బల్కెడి వన్నియు సత్యదూరముల్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్. శివ గాథలు వినిపింతురుప్రవచన కర్తలన; మృషలు వల్కెడి వారల్నవ విధముల మోసములనుకువలయమున చేయువారు కుత్సిత రీతిన్.
అవనిని జీవితమ్మున ప్రయాసము లన్నియు వమ్ముగాగ నూత్నవిధమునందు నాశలవి తప్పక తీరునటంచు నెంచుచున్ ప్రవిమలమైన రూపమున భక్తుల సొమ్ములు కొల్లగొట్టగా ప్రవచనకర్త లెల్లరును బల్కెడి వన్నియు సత్యదూరముల్
అవమతిగ పలికితివిటుల
రిప్లయితొలగించండి"ప్రవచనకర్తలన మృషలు వల్కెడివారల్"
సవరించు మాతలంపును
అవిరళమగు కృషిసలుపుచు నవి నేర్చిరిగా
ప్రవచన కర్తలు తెలిపిన
రిప్లయితొలగించండివివరములకు మూలమగును వేదములెల్లన్
గవనము చెప్పునపుడు క్షి
ప్ర వచనకర్తలన మృషలు వల్కెడివారల్
ప్రవచనకర్త లెల్లరును బల్కెడివన్నియు నమ్మగావలెన్
వివరములన్ వచింత్రుగద వేదములన్నియు సంగ్రహించుచున్
గవనము వేగవంతమయి కైతల నల్లెడి వేళలందు క్షి
ప్ర వచనకర్త లెల్లరును బల్కెడి వన్నియు సత్యదూరముల్
స్తవ మగు రీ తి గ సభలో
రిప్లయితొలగించండినవతకు నాందీ పలుకుచు నైపుణ్య ము తో
ప్రవ చించంగా యె ట్టు ల
ప్రవచన కర్త ల న మృష లు వల్కె డు వారల్
-
రిప్లయితొలగించండిఅవమానింపవలదు వా
రి వైభవముపై నసూయ రీఢయు వలదోయ్
కవిరాట్ ! పల్కవలదటుల
ప్రవచనకర్తలన మృషలు వల్కెడివారల్?
రిప్లయితొలగించండిభువిని సనాతన ధర్మము
నవమానించు టొకటె పని యని తలచెడి యా
వివరుణులు కపట విబుధులు
ప్రవచనకర్తలన మృషలు వల్కెడివారల్.
అవనిని పూర్వ కాలమున నామతి గల్గిన యగ్ర వర్ణులే
యవమితి జేసి రంచు నభియాతులు వారలు వారి ధర్మమున్
భువి నుడపుచ్చ నెంచుచును పొచ్చెపు మాటలు నేర్చి నట్టి యా
ప్రవచనకర్త లెల్లరును బల్కెడి వన్నియు సత్యదూరముల్.
ప్రవచనకర్త లెల్లపుఁడు పౌరుల క్షేమము గోరి వారికిన్
రిప్లయితొలగించండివివరముగా వచించెదరు వేదములందలి ధర్మసూక్ష్మముల్
భవితను తీర్చిదిద్దగల వారలు మాన్యులుగాదె యెవ్విధిన్
ప్రవచనకర్త లెల్లరును బల్కెడి వన్నియు సత్యదూరముల్?
ప్రవచనముల సల్పుచు కడు
రిప్లయితొలగించండివివరముగా దెలుపుచుంద్రు విషయములెన్నో
యవమతి నిట్లన దగునా
ప్రవచనకర్తలన మృషలు వల్కెడివారల్?
చం॥ ఎవరు జనాళి మెప్పుఁ గను నిచ్ఛ వరించి పఠించ కుండఁగన్
రిప్లయితొలగించండినవకము మీర లౌక్యవిధి నవ్యత హాస్యము నింపి మూల గా
థ వదిలి వింత పద్ధతులఁ దాల్చుచు నుందురొ వారి నెంచఁగన్
బ్రవచన కర్తలెల్లరును బల్కెడి వన్నియు సత్యదూరముల్
భవములు పాయజేయ భగవంతుని వేడుడు భక్తితోడుతన్
రిప్లయితొలగించండిశివుడిని నమ్ముచున్ నడుపు చేరును నావయు తీరమంచునున్
చెవులకు నింపు గూర్చునటు చెప్పుచు నుండగ నెట్టులౌను యా
*ప్రవచనకర్తలెల్లరును బల్కెడు వన్నియు సత్యదూరముల్*
అవనిఁ బరికింప నిత్యో
రిప్లయితొలగించండిగ్ర వాక్య సంచయ చతురులు కైతవ భాషా
ప్రవరులు నిరంతర క్షి
ప్ర వచన కర్త లన మృషలు వల్కెడి వారల్
దివిజులు వీరి బంధు లను తీరునఁ బల్కెద రెల్ల చోటులన్
వివరము లెన్నొ పల్కెదరు వింత లహో విను వార లున్నచో
నవిరళ వక్ర భాష్యముల నక్కట భాషణ నైపుణమ్మునం
బ్రవచన కర్త లెల్లరును బల్కెడి వన్నియు సత్య దూరముల్
కందం
రిప్లయితొలగించండివ్యవహారము శ్రుతి మించఁగ
వివరమ్ముగ నేది గనరు వినరనఁగ మనో
జవమున బ్రతికెడు వారికి
ప్రవచనకర్తలన మృషలు వల్కెడివారల్!
చంపకమాల
వ్యవధియె లేదు దేనికన వారల పోకడ వాయువేగమై
వివరముగన్ వినన్ గనను వేళయె లేదను వాదమై మనో
జవమున జీవితాననిల సాగెడు వారల దృష్టి దోషమై
ప్రవచనకర్త లెల్లరును బల్కెడి వన్నియు సత్యదూరముల్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
శివ గాథలు వినిపింతురు
ప్రవచన కర్తలన; మృషలు వల్కెడి వారల్
నవ విధముల మోసములను
కువలయమున చేయువారు కుత్సిత రీతిన్.
అవనిని జీవితమ్మున ప్రయాసము లన్నియు వమ్ముగాగ నూ
రిప్లయితొలగించండిత్నవిధమునందు నాశలవి తప్పక తీరునటంచు నెంచుచున్
ప్రవిమలమైన రూపమున భక్తుల సొమ్ములు కొల్లగొట్టగా
ప్రవచనకర్త లెల్లరును బల్కెడి వన్నియు సత్యదూరముల్