28, ఏప్రిల్ 2026, మంగళవారం

సమస్య - 5453

29-4-2026 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కప్పనుఁ గనినంత గజము గజ్జున వడఁకెన్”

(లేదా...)

“కప్పనుఁ గాంచి కుంజరము గజ్జుమనెన్ శశకంబు నవ్వఁగన్”

15 కామెంట్‌లు:

  1. చెప్పినటుల వినకుండగ
    తిప్పలు పెట్టుచు నశనము దినకుండుటచే
    రొప్పుచు వచ్చిన యా వెం
    కప్పనుఁ గనినంత గజము గజ్జున వడఁకెన్”

    రిప్లయితొలగించండి
  2. చెప్పిన యట్లు చక్కగను జేయక హెచ్చు మదంబు తోడుతన్
    తిప్పలు పెట్టుచున్నదని దీనికి దండన తప్పదంచునున్
    చెప్పులు కాళ్శకున్ తొడగి చేతను తోత్రము బట్టి వచ్చు వెం
    కప్పను గాంచి కుంజరము గజ్జుమనెన్ శశకంబు నవ్వగన్

    రిప్లయితొలగించండి

  3. గొప్పగ బాంబులు కురియగ
    చప్పున హర్మూజు మూసి జగడము కొరకై
    చొప్పడి కాల్దువ్విన యొక
    కప్పనుఁ గనినంత గజము గజ్జున వడఁకెన్

    రిప్లయితొలగించండి
  4. -

    చప్పున వేయును సంకె
    ళ్లొప్పంగా మావటీడు ముప్పతడదిగో
    నప్పా ! దూరంగా వెం
    కప్పనుఁ గనినంత గజము గజ్జున వడఁకెన్

    రిప్లయితొలగించండి

  5. అప్పురమున గల గజపతి
    కెప్పుడు కాదనక నప్పు నిచ్చిన వాడే
    యప్పునడగ వచ్చిన వెం
    కప్పనుఁ గనినంత గజము గజ్జున వడఁకెన్.


    చెప్పిన నాలకింపక విచిత్రపు చేష్టలు చేయుచున్ సదా
    తప్పుడు దారులన్ దిరుగు దంతిని దారికి తెచ్చు వృత్తిలో
    తప్పదు కాదె యాంకుశము తా ధరి యింపక నంచు చెప్పు వెం
    కప్పనుఁ గాంచి కుంజరము గజ్జుమనెన్ శశకంబు నవ్వఁగన్.

    రిప్లయితొలగించండి
  6. అప్పటి విషయము గాదిది
    తిప్పలు పడెనా నదమున దిగి మాతంగమే
    ఎప్పుడు గాంచనిదౌ బొం
    కప్పనుఁ గనినంత గజము గజ్జున వడఁకెన్

    అప్పటి దంతికాదు మరి యప్పటి గ్రాహము గాక పోయినన్
    దిప్పలు తప్పలేదు కరి తిన్నగ వాహిని లోన కాలిడన్
    దప్పికతోడ నీట దిగి తానట మిక్కిలి వింత చేప బొం
    కప్పనుఁ గాంచి కుంజరము గజ్జుమనెన్ శశకంబు నవ్వఁగన్

    [బొంకప్ప = గోళాకారంగా ఉండి ముళ్లతో కప్పబడ్డ చేప]

    ఎప్పుడూ చూడని వింత చేపను చూసి ఏనుగు భయపడింది.

    రిప్లయితొలగించండి
  7. కం:గొప్ప దగు శక్తి యున్నను
    నెప్పటికిన్ దానె యధికమే? అంకుశమున్
    ద్రిప్పుచు రా,మావటి వెం
    కప్పనుఁ గనినంత గజము గజ్జున వడఁకెన్”

    రిప్లయితొలగించండి
  8. ఉ;గొప్పగ వెంక డెంతయును కూరిమి తో శశకమ్ము బెంచె దా
    మెప్పును బొందు మావటియె, మేలగు నంకుశమున్ ధరించి తా
    నెప్పటి వోలె రాగ, తన కెంతటి కష్టమొ యంచు, నట్టి వెం
    కప్పనుఁ గాంచి కుంజరము గజ్జుమనెన్, శశకంబు నవ్వఁగన్”
    (మావటి వెంకప్పను చూసి ఏనుగు భయ పడింది కానీ పెంపుడు జంతు వైన కుందేలు నవ్వింది. )

    రిప్లయితొలగించండి
  9. ఉ॥ కప్పనుఁ గాంచి కుంజరము గుజ్జుమనెన్ శశకంబు నవ్వఁగన్
    జెప్పఁగఁ దల్లక్రిందులిటు చిత్ర విచిత్ర విధమ్ము లెంచుచన్
    గొప్పగఁ గొంత మాత్రమటు కూర్చును హాస్యము నింతియేఁ గదా
    తప్పుగఁ బల్క నెందులకొ తథ్యము పూరణ కష్టమై చనన్

    రిప్లయితొలగించండి
  10. తిప్పలు కల్గ కారడవి తేకువ తోడుత హస్తియూధముల్
    చొప్పడు మార్గ మెంచి తగు చోటుకు పోవుచు నుండ నొక్కటన్
    చప్పున చేర నచ్చటకు సాయకముల్ గొని, వేటగాడు వెం
    కప్పనుఁ, గాంచి కుంజరము గజ్జుమనెన్ శశకంబు నవ్వఁగన్

    రిప్లయితొలగించండి
  11. నిప్పు వలె మనస్తాపం
    బప్పుడు మితిమీఱ నకట మకరభ్రమతో
    నప్పులఁ గదలాడఁగఁ బెను
    కప్పనుఁ గని నంత గజము గజ్జున వడఁకెన్


    తిప్పలు తప్ప వాతనికిఁ దెల్లమె యియ్యది యెల్లవారికి
    న్మెప్పులఁ బొంద నేరఁ డట నిందల నందును మిక్కుటమ్ముగా
    నెప్పటి వోలె నిప్పు డెద నీసున మావటి వాని వెఱ్ఱి వెం
    కప్పనుఁ గాంచి కుంజరము గజ్జు మనెన్ శశకంబు నవ్వఁగన్

    రిప్లయితొలగించండి
  12. గొప్పగ మావటి వాడై
    చెప్పిన రీతిగ మెలిగె డి చేష్టలు గలదై
    యొ ప్ప గ న య్యె డ నా వె o
    కప్ప ను గనినంత గజము గజ్జు న వడ కెన్

    రిప్లయితొలగించండి
  13. కందం
    నిప్పునఁ గాల్చినఁ గాలక
    యప్పని హరిపాలుఁ జేయ నర్భకుఁ బొడ న
    య్యప్పని సేనాని బెదిరె!
    కప్పనుఁ గనినంత గజము గజ్జున వడఁకెన్

    ఉత్పలమాల
    నిప్పున గాల్చమన్న పిత నీరమునందున ముంచఁ దేలెడున్
    గొప్పగు బాలభక్తునికి కూడె శశాంకము వోలు మిత్రుడే,
    యప్పని శౌరి పాలనిడ నర్భకుఁ డా దళవాయి భీతిలెన్
    గప్పనుఁ గాంచి కుంజరము గజ్జుమనెన్ శశకంబు నవ్వఁగన్

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    విప్పుకొనగ కాలి గొలుసు
    తప్పించుకొన వలెననెడు తలపున మదిలో
    నప్పుడు తన మావటి వెం
    కప్పను గనినంత గజము గజ్జున వడకెన్.

    రిప్లయితొలగించండి