4-5-2026 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దొరకును సిరులున్ యశమ్ము దుర్వ్యసనములన్”
(లేదా...)
“దొరకును కీర్తి సంపదలు దుర్వ్యసమ్ముల వీడకున్నచో”
చరితము చక్కగ నుండినదొరకును సిరులున్ యశమ్ము ;దుర్వ్యసనములన్పొరపాటున నైనను దన దరి రానీయక సతతము దారాడినచో
కరముగ శ్రమియించినచోదొరకును సిరులున్ యశంబు,దుర్వ్యసనములన్దరిరానివ్వకు మెప్పుడుమురిపముతో బ్రతుకగలవుబుధులు నుతింపన్.
విరివిగ నేతల నరయగమరిమరి కానంగ వచ్చు మానని పేర్మిన్గరకుగ పల్కుట సరియౌదొరకును సిరులున్ యశమ్ము దుర్వ్యసనములన్విరివిగ చూడనొప్పుగద వీడక నుందురు నేతలెందరోమరిమరి వారికున్నవగు మాయని దుర్వ్యసనంబు లెన్నియోకరకుగ పల్కగానగును గాంచినచో మరి వారి వైఖరిన్దొరకును కీర్తి సంపదలు దుర్వ్యసనమ్ముల వీడకున్నచో
పరుషపు మాటలెప్పుడును పల్కక నిత్యము తాల్మితోడుతన్పరులకు సేవజేయుచు విపన్నుల చక్కగ జూచుచుండినన్దొరకును కీర్తి సంపదలు దుర్వ్యసనమ్ములు వీడ కున్నచోపరువు ప్రతిష్టలన్నియు నిపాతము చెందును వేగిరమ్ముగన్
కందంపరులెవ్వరు మెచ్చని పనిసిరులందెడు యావ తోడ చేరెదరుకదా!తరుగుటకు ముందు భ్రమలన్దొరకును సిరులున్ యశమ్ము దుర్వ్యసనములన్చంపకమాలవరగుణ సంయుతుండనెడు పాండవ ముఖ్యుడు ధర్మజుండె తానొరుగుచు నాడి జూదమున నోడెను సంపద నైనవారినిన్దొరికిన ధార్తరాష్ట్రుడట తూలుచు నోడె! నశాశ్వతమ్ముగన్దొరకును కీర్తి సంపదలు దుర్వ్యసనమ్ముల వీడకున్నచో!
మరచితివట బాధ్యతలను విరివిగ వ్యసనముల మరిగి విను మంటిని నీ గురు బోధనలను విడిచిన దొరకును సిరులున్ యశమ్ము, దుర్వ్యసనములన్.అరయగ సద్గుణమ్ములవి యాచర ణీయము లన్న మాటలే వరమగు మానవాళి కది వాస్తవ మంటిని వాటివల్ల నే దొరకును కీర్తి సంపదలు, దుర్వ్యసమ్ముల వీడకున్నచోజరఠము తప్పదన్న నుడి సత్యము ధాత్రిని విశ్వ సింపుమా
అంచితయగు పాంచాలినివంచక దుశ్శాసనుండు వలువల నూడ్వన్వేంచేసి బ్రోవ కృష్ణుఁడుపాంచాలిని, భీష్ముఁడు గని పక్కున నవ్వెన్
దొరఁకొని సత్కృతుల్ సలుప దుఃఖము చెంతకు చేరదెన్నడున్దొరకును కీర్తి సంపదలు, దుర్వ్యసనమ్ముల వీడకున్నచోసిరులు యశమ్ములుం దొలఁగు చింతలపాలగు జీవితమ్ము నీవరయుము మేలు కీడులు సమంచితమై దనరార జన్మమే
కం:దొర యిచ్చు కల్లు త్రావినదొరకును సిరులున్ యశమ్ము, దుర్వ్యసనములన్మరణములు మనకు గల్గును, దొర యెన్నిక లోన గెలుచు , దురదయె మనకున్(రెండవ పాదం లో దొరకును అంటే దొర గారికి అని అర్థం.సిరులు,యశము దొరకు దక్కి మరణము మనకు దక్కుతుంది.)
చం:కరవుగ కల్లు తాగ మన గ్రామము నం దపకీర్తి దక్కు లేసిరియును నాయకత్వములు చేకొని త్రావ విదేశ మద్యమున్దొరకును కీర్తి సంపదలు, దుర్వ్యసమ్ముల వీడకున్నచో”పరువులు పోవు పేదలకు భాగ్యము కల్గినయంత బోవునే?(ఊళ్లో కల్లు తాగే పేదకి పరువు పోతుంది కానీ డబ్బు, పదవి ఉండి ఫారిన్ లిక్కర్ తాగితే ఏమీ పోదు. )
ఉగ్ర వాదులకు వారు చేసేది చేయించేది తప్పని తెలుసునండి. అమాయకులైన పేదవారిని ఉగ్రవాదులుగా మార్చే పద్ధతి)చం॥ సరగున నుగ్ర వాదులటు సాగుచు బేలల మాయ మాటలన్ గరపుచు దుష్ట చింతనలు గట్టిగ మానసమందు నాటఁగన్దరుణముఁ గాంచి విత్తమును దానముఁ జేయుచు నమ్మఁ బల్కరేదొరకును కీర్తి సంపదలు దుర్వ్యసనమ్ముల వీడ కున్నచో
తిరమగు ని యంత్రము ల తో దొరకును సిరులు న్ యశమ్ము దుర్వ్య స నము లన్ దరి రానీ యక మసలిన వరలును ద క్షుండు గాగ వసుధను సుకవీ!
నిరతము నీతి మార్గమున నిర్మలచిత్తముతో జరించినన్పరులకు మేలు సేయుచును పల్వురుమెచ్చగ నడ్చుకున్నచోదొరకును కీర్తి సంపదలు; దుర్వసనంబులుమానకున్నచో! పెరుగును రోగ బాధలును బెర్గునుపేదరికంబు తప్పకన్.
ధరలో దుర్వ్యసనమ్ములుపరఁగును నశియింపఁ జేయఁ బ్రాభవ మెల్లన్ స్థిర మనమున వెస వీడిన, దొరకును సిరులున్ యశమ్ము, దుర్వ్యసనములన్ సురుచిర దుగ్ధ మందు నొక చుక్క విషంబు విదుల్ప నక్కటా కరఁగ విఱుంగ క్షీరమును గాంచమె యొక్క క్షణమ్ము నందిలన్ నరులకు మూరి సేసిన ఘనమ్ముగ యత్నము నెవ్విధమ్మునన్ దొరకును గీర్తి సంపదలు దుర్వ్యసనమ్ముల వీడకున్నచో
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.నిరతము లక్ష్మిని గొల్వగదొరకును సిరులున్ యశమ్ము ; దుర్వ్యస నములన్పరువును గౌరవ ముండదుసిరులన్నియు కరిగి జనులు 'ఛీ'కొట్టుదురే!
-మరిమరి రాముని కోరగదొరకును సిరులున్ యశమ్ము; దుర్వ్యసనములందరయగ నాసక్తి తరుగుపరిపాలయమామని రఘుపతి శరణుగొనన్పాహి రామ ప్రభో జిలేబి
చరితము చక్కగ నుండిన
రిప్లయితొలగించండిదొరకును సిరులున్ యశమ్ము ;దుర్వ్యసనములన్
పొరపాటున నైనను దన
దరి రానీయక సతతము దారాడినచో
కరముగ శ్రమియించినచో
రిప్లయితొలగించండిదొరకును సిరులున్ యశంబు,
దుర్వ్యసనములన్
దరిరానివ్వకు మెప్పుడు
మురిపముతో బ్రతుకగలవు
బుధులు నుతింపన్.
విరివిగ నేతల నరయగ
రిప్లయితొలగించండిమరిమరి కానంగ వచ్చు మానని పేర్మిన్
గరకుగ పల్కుట సరియౌ
దొరకును సిరులున్ యశమ్ము దుర్వ్యసనములన్
విరివిగ చూడనొప్పుగద వీడక నుందురు నేతలెందరో
మరిమరి వారికున్నవగు మాయని దుర్వ్యసనంబు లెన్నియో
కరకుగ పల్కగానగును గాంచినచో మరి వారి వైఖరిన్
దొరకును కీర్తి సంపదలు దుర్వ్యసనమ్ముల వీడకున్నచో
పరుషపు మాటలెప్పుడును పల్కక నిత్యము తాల్మితోడుతన్
రిప్లయితొలగించండిపరులకు సేవజేయుచు విపన్నుల చక్కగ జూచుచుండినన్
దొరకును కీర్తి సంపదలు దుర్వ్యసనమ్ములు వీడ కున్నచో
పరువు ప్రతిష్టలన్నియు నిపాతము చెందును వేగిరమ్ముగన్
రిప్లయితొలగించండికందం
పరులెవ్వరు మెచ్చని పని
సిరులందెడు యావ తోడ చేరెదరుకదా!
తరుగుటకు ముందు భ్రమలన్
దొరకును సిరులున్ యశమ్ము దుర్వ్యసనములన్
చంపకమాల
వరగుణ సంయుతుండనెడు పాండవ ముఖ్యుడు ధర్మజుండె తా
నొరుగుచు నాడి జూదమున నోడెను సంపద నైనవారినిన్
దొరికిన ధార్తరాష్ట్రుడట తూలుచు నోడె! నశాశ్వతమ్ముగన్
దొరకును కీర్తి సంపదలు దుర్వ్యసనమ్ముల వీడకున్నచో!
రిప్లయితొలగించండిమరచితివట బాధ్యతలను
విరివిగ వ్యసనముల మరిగి విను మంటిని నీ
గురు బోధనలను విడిచిన
దొరకును సిరులున్ యశమ్ము, దుర్వ్యసనములన్.
అరయగ సద్గుణమ్ములవి యాచర ణీయము లన్న మాటలే
వరమగు మానవాళి కది వాస్తవ మంటిని వాటివల్ల నే
దొరకును కీర్తి సంపదలు, దుర్వ్యసమ్ముల వీడకున్నచో
జరఠము తప్పదన్న నుడి సత్యము ధాత్రిని విశ్వ సింపుమా
అంచితయగు పాంచాలిని
రిప్లయితొలగించండివంచక దుశ్శాసనుండు వలువల నూడ్వన్
వేంచేసి బ్రోవ కృష్ణుఁడు
పాంచాలిని, భీష్ముఁడు గని పక్కున నవ్వెన్
దొరఁకొని సత్కృతుల్ సలుప దుఃఖము చెంతకు చేరదెన్నడున్
రిప్లయితొలగించండిదొరకును కీర్తి సంపదలు, దుర్వ్యసనమ్ముల వీడకున్నచో
సిరులు యశమ్ములుం దొలఁగు చింతలపాలగు జీవితమ్ము నీ
వరయుము మేలు కీడులు సమంచితమై దనరార జన్మమే
కం:దొర యిచ్చు కల్లు త్రావిన
రిప్లయితొలగించండిదొరకును సిరులున్ యశమ్ము, దుర్వ్యసనములన్
మరణములు మనకు గల్గును,
దొర యెన్నిక లోన గెలుచు , దురదయె మనకున్
(రెండవ పాదం లో దొరకును అంటే దొర గారికి అని అర్థం.సిరులు,యశము దొరకు దక్కి మరణము మనకు దక్కుతుంది.)
చం:కరవుగ కల్లు తాగ మన గ్రామము నం దపకీర్తి దక్కు లే
రిప్లయితొలగించండిసిరియును నాయకత్వములు చేకొని త్రావ విదేశ మద్యమున్
దొరకును కీర్తి సంపదలు, దుర్వ్యసమ్ముల వీడకున్నచో”
పరువులు పోవు పేదలకు భాగ్యము కల్గినయంత బోవునే?
(ఊళ్లో కల్లు తాగే పేదకి పరువు పోతుంది కానీ డబ్బు, పదవి ఉండి ఫారిన్ లిక్కర్ తాగితే ఏమీ పోదు. )
ఉగ్ర వాదులకు వారు చేసేది చేయించేది తప్పని తెలుసునండి. అమాయకులైన పేదవారిని ఉగ్రవాదులుగా మార్చే పద్ధతి)
రిప్లయితొలగించండిచం॥ సరగున నుగ్ర వాదులటు సాగుచు బేలల మాయ మాటలన్
గరపుచు దుష్ట చింతనలు గట్టిగ మానసమందు నాటఁగన్
దరుణముఁ గాంచి విత్తమును దానముఁ జేయుచు నమ్మఁ బల్కరే
దొరకును కీర్తి సంపదలు దుర్వ్యసనమ్ముల వీడ కున్నచో
తిరమగు ని యంత్రము ల తో
రిప్లయితొలగించండిదొరకును సిరులు న్ యశమ్ము దుర్వ్య స నము లన్
దరి రానీ యక మసలిన
వరలును ద క్షుండు గాగ వసుధను సుకవీ!
నిరతము నీతి మార్గమున నిర్మల
రిప్లయితొలగించండిచిత్తముతో జరించినన్
పరులకు మేలు సేయుచును పల్వురు
మెచ్చగ నడ్చుకున్నచో
దొరకును కీర్తి సంపదలు; దుర్వసనంబులు
మానకున్నచో!
పెరుగును రోగ బాధలును బెర్గును
పేదరికంబు తప్పకన్.
ధరలో దుర్వ్యసనమ్ములు
రిప్లయితొలగించండిపరఁగును నశియింపఁ జేయఁ బ్రాభవ మెల్లన్
స్థిర మనమున వెస వీడిన,
దొరకును సిరులున్ యశమ్ము, దుర్వ్యసనములన్
సురుచిర దుగ్ధ మందు నొక చుక్క విషంబు విదుల్ప నక్కటా
కరఁగ విఱుంగ క్షీరమును గాంచమె యొక్క క్షణమ్ము నందిలన్
నరులకు మూరి సేసిన ఘనమ్ముగ యత్నము నెవ్విధమ్మునన్
దొరకును గీర్తి సంపదలు దుర్వ్యసనమ్ముల వీడకున్నచో
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
నిరతము లక్ష్మిని గొల్వగ
దొరకును సిరులున్ యశమ్ము ; దుర్వ్యస
నములన్
పరువును గౌరవ ముండదు
సిరులన్నియు కరిగి జనులు 'ఛీ'కొట్టుదురే!
-
రిప్లయితొలగించండిమరిమరి రాముని కోరగ
దొరకును సిరులున్ యశమ్ము; దుర్వ్యసనములం
దరయగ నాసక్తి తరుగు
పరిపాలయమామని రఘుపతి శరణుగొనన్
పాహి రామ ప్రభో
జిలేబి