కం:ఎల్లరు నస్పృశ్యతనే యొల్లక,స్వాతంత్ర్య కాంక్ష నొంది బ్రతిన తో కల్లు విడిన యా నూతన కల్లనఁ గడు నిష్టపడిరి గాంధీ శిష్యుల్" (నూతన కల్లు అనే గ్రామం ఉంది. వాళ్లు గాంధీ గారి ఉద్యమాలకు సహకరించటం తో గాంధీ శిష్యులు ఇష్ట పడ్డారు. )
ఉ:ఎల్లరు మిత్రు లేకమయి యెంచ విదేశపు మద్యపానమున్, చెల్లియొ చెల్లకో చిలిపి చేష్టగ జూపుచు దేశభక్తినే, కల్లు స్వదేశమద్యమని, గౌడుల కయ్యది భుక్తి యన్ మిషన్ కల్లన నిచ్చగించిరఁట గాంధిని నమ్మినవార లెల్లరున్. (వీళ్లు మద్యపానం చేసారు కానీ విదేశీ మద్యం వద్దని, స్వదేశీ మద్య మైన కల్లు తీసుకుంటా మని అన్నారు. గాంధీ గారి విదేశీ వస్తుబహిష్కరణ ని పాటించి స్వదేశీ మద్యాన్ని ఇష్టపడ్డారు. పైగా ఇది కొందరికి కులవృత్తి అని సమర్థించుకున్నారు.)
కందం
రిప్లయితొలగించండిచెల్లును సత్యమహింసలు
నెల్లరు నాయుధములనఁగ నెత్తినయంతన్
దెల్లలుఁ బారక నిలుచుట
కల్లనఁ గడు నిష్టపడిరి గాంధీ శిష్యుల్
ఉత్పలమాల
చల్లని మానసమ్ములను సత్యమహింసలు నాయుధాలుగన్
మెల్లగఁ బూనినన్ నియతి మీరకయెప్పుడు బాపు బోధలన్
దెల్లలు భీతితో మనల దేశమువీడక నిల్చుటన్నదే
కల్లన నిచ్చగించిరఁట గాంధిని నమ్మినవార లెల్లరున్
తల్లడిలకుండు మికపై
రిప్లయితొలగించండిఎల్లప్పుడు మన విలాతి నేలుటకొరకై
తెల్లదొరలు వీడరనుట
కల్లనఁ , గడు నిష్టపడిరి గాంధీ శిష్యుల్
ఎల్లరు సంకల్పముతో
రిప్లయితొలగించండితెల్లదొరలతోడ మిగుల తెగువతొ బోరన్
చల్లబడిరి ,యిట నుండుట
కల్లనఁ గడు నిష్టపడిరి గాంధీ శిష్యుల్
రిప్లయితొలగించండిఎల్లెడ దొరుకు స్వదేశపు
కల్లది యారోగ్య మిచ్చు కావున జనులీ
చల్ల దనమిచ్చు మందగు
కల్లనఁ గడు నిష్టపడిరి గాంధీ శిష్యుల్.
తల్లి విదేశ మద్యమును త్రాగుట మాను మటంచు చెప్పగా
పిల్లలు చెప్పి రీవిధిని స్వేచ్ఛను గోరుచు చేసెడుద్య మ
మ్మెల్లెడ సాగుచుండ జను లెల్లరు మద్దతు తెల్పి రందుకే
కల్లన నిచ్చగించిరఁట గాంధిని నమ్మినవార లెల్లరున్.
అల్లరి మూకలగుచు జను
రిప్లయితొలగించండిలెల్లరు శాంతిని విడిచిన హింసా పథమే
చెల్లదు స్వరాజ్య సాధన
కల్లనఁ గడు నిష్టపడిరి గాంధీ శిష్యుల్
చెల్లదు శాంతిమార్గమని జెప్పుచు కొందరు హింసనెంచగా
నెల్లరు శాంతినే విడిచి హింసకు పాల్పడ లక్ష్య సాధనే
కల్లన నిచ్చగించిరఁట గాంధిని నమ్మినవార లెల్లరున్
మెల్లఁగ సంభవించె గద మెచ్చిన మార్గమునన్ స్వరాజ్యమే
-
రిప్లయితొలగించండిఅల్లాటప్పా నేతలు
కల్లనఁ గడు నిష్టపడిరి; గాంధీ శిష్యుల్
తెల్లని వస్త్రమ్ముల వలె
కల్లయె లేనట్టి నేలగాపరులయిరౌ
కం:ఎల్లరు నస్పృశ్యతనే
రిప్లయితొలగించండియొల్లక,స్వాతంత్ర్య కాంక్ష నొంది బ్రతిన తో
కల్లు విడిన యా నూతన
కల్లనఁ గడు నిష్టపడిరి గాంధీ శిష్యుల్"
(నూతన కల్లు అనే గ్రామం ఉంది. వాళ్లు గాంధీ గారి ఉద్యమాలకు సహకరించటం తో గాంధీ శిష్యులు ఇష్ట పడ్డారు. )
ఉ:తెల్ల దొరల్ నియంత లని తెల్లము జేయుచు, వారి పాలన
రిప్లయితొలగించండిమ్మొల్లకు డంచు, దా హరిజనోద్ధరణమ్మును బూని, "ఖద్దరే
చల్లని" దంచు గాంధి కడు శాంతిగ జెప్పుచు,"వీడు డింక నా
క"ల్లన నిచ్చగించిరఁట గాంధిని నమ్మినవార లెల్లరున్”
(3)ఒక హాస్యపూరణ యథాతథంగా
రిప్లయితొలగించండిఉ:ఎల్లరు మిత్రు లేకమయి యెంచ విదేశపు మద్యపానమున్,
చెల్లియొ చెల్లకో చిలిపి చేష్టగ జూపుచు దేశభక్తినే,
కల్లు స్వదేశమద్యమని, గౌడుల కయ్యది భుక్తి యన్ మిషన్
కల్లన నిచ్చగించిరఁట గాంధిని నమ్మినవార లెల్లరున్.
(వీళ్లు మద్యపానం చేసారు కానీ విదేశీ మద్యం వద్దని, స్వదేశీ మద్య మైన కల్లు తీసుకుంటా మని అన్నారు. గాంధీ గారి విదేశీ వస్తుబహిష్కరణ ని పాటించి స్వదేశీ మద్యాన్ని ఇష్టపడ్డారు. పైగా ఇది కొందరికి కులవృత్తి అని సమర్థించుకున్నారు.)
ఉ॥ పల్లెల పట్న వాసులును భావన మీర స్వరాజ్య కాంక్షతో
రిప్లయితొలగించండినెల్లరు నొక్క త్రాడునిడి యిమ్ముగ సాగఁగ గాంధి నీడనున్
జల్లగఁ, దెల్లవారు చెఱసాలకు పంపుట విశ్వసింపకన్
గల్లన నిచ్చగించిరఁట గాంధిని నమ్మిన వారలెల్లురున్
కల్ల+అన కల్లన (గాంధి గారిని జైలుకు పంపుట కల్ల అనగా విశ్వసించినారు అని అండి)
మరొక పూరణ అండి
ఉ॥ ఇల్లగు వల్లకాడనుచు నింటిలి పాదికి హానియంచునే
కల్లును ద్రావఁ దెల్పెఁ గద గాంధియె సర్వుల క్షేమకాంక్షతోఁ
జల్లగఁ దారుమారుగను జంబుకుఁడెవ్వఁడు పల్కె నీవిధిన్
గల్లన నిచ్చగించిరఁట గాంధిని నమ్మిన వారలెల్లరున్
జంబుకుడు నీచుడు
అప్పట్లో గాంధీగారి మరెందరో స్ఫూర్తితో “కల్లుమానండోయ్ కళ్ళు తెరవండోయ్” నినాదము కదండి.
తల్లడ పడుదురు పలుకగ
రిప్లయితొలగించండికల్లన : గడు నిష్ఠ పడిరి గాంధీ శిష్యుల్
పెల్లుగ నుద్యమ మందున
వెల్లువ లా చేరి పోవ ప్రీతిగ నెపుడున్
పెల్లుగ నుంచి ఫలములను
రిప్లయితొలగించండిబిల్లలతోఁ బలికి నంతఁ బ్రియమునఁ దినుఁడీ
యుల్లము లలర భయంపడ
కల్లనఁ గడు నిష్టపడిరి గాంధీ శిష్యుల్
గుల్లలు కాక మున్న బ్రతుకుల్ సిరు లెల్లయుఁ బోక మున్న మీ
పిల్లలు ఘోర దుఃఖముల వేఁగక మున్న నిరంతరమ్మునుం
జల్లఁగ నుండ నెంచినను సత్వర మెల్లరు నింక వీడుఁ డీ
కల్లన నిచ్చగించి రఁట గాంధిని నమ్మిన వార లెల్లరున్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ఎల్లెడ నెండాకాలము
కల్లది దొరకును మనుజుల కానందమిడున్
చల్లని మందుగ నుండెడు
కల్లనఁ గడు నిష్ట పడిరి గాంధీ శిష్యుల్.
(కల్లు+అన)