13, మే 2026, బుధవారం

సమస్య - 5468

14-5-2026 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“లయకారుఁడు సౌఖ్యమొసఁగు లచ్చిమగండే”

(లేదా...)

“లయమున కాదిదైవతము లచ్చిమగం డతఁ డిచ్చు సౌఖ్యముల్”

9 కామెంట్‌లు:

  1. కందం
    ప్రియసతి లక్ష్మియె హృదయా
    లయమున పోషణకిరువుగ రంజిలనుండన్
    దయగురిసెడు హరి, కాడన
    లయకారుఁడు, సౌఖ్యమొసఁగు లచ్చిమగండే!

    చంపకమాల
    ప్రియసతి లక్ష్మినిన్ హృదయవేదిని నిల్పియు సృష్టి పోషణన్
    దయగల మూర్తియై నిలిచె దైవమనంగ జనార్దనుండహో!
    శ్రియమున సంచరించు హరి చిన్మయరూపుడు సింధుజా హృదా
    లయమున కాదిదైవతము! లచ్చిమగం డతఁ డిచ్చు సౌఖ్యముల్!

    రిప్లయితొలగించండి
  2. వియమముల నుండి శివనిడు
    లయకారుఁడు ; సౌఖ్యమొసఁగు లచ్చిమగండే
    నియమమగు రీతి నిత్యము
    భయభక్తులతోడ నతని భజనలు జేయన్

    రిప్లయితొలగించండి

  3. దయగల వారు త్రి మూర్తులు
    భయ హారు లనుచు తెలిపిరి ప్రాజ్ఞులట హిర
    ణ్మయుడు సృజించు పురరిపువు
    లయకారుఁడు, సౌఖ్యమొసఁగు లచ్చిమగండే.


    భయమును దీర్చి భక్తులకు భద్రత నిచ్చెడి వారలే కదా
    దయగల యా త్రి మూర్తులని ధాత్రిని విజ్ఞులు చెప్పిరే హిర
    ణ్మయుడు సృజించు వాడని సమన్యుడు జాబిలి తాల్పు రుద్రుడే
    లయమున కాదిదైవతము, లచ్చిమగం డతఁ డిచ్చు సౌఖ్యముల్.

    రిప్లయితొలగించండి
  4. నయమున భుజంగమముపై
    శయనించెడు వాడతండు స్మరగురువతడే
    భయహారి ప్రాణుల హృదయ
    లయకారుఁడు సౌఖ్యమొసఁగు లచ్చిమగండే

    నయమగు శోభతో తిరువనంతమునందున వెల్గు దైవమే
    దయగల ఖేచరుండతడు దర్శనమిచ్చుచునుండనంతుడౌ
    శయనుడు పద్మనాభునిగ చక్కని మంగళ రూపు తోడ నా
    లయమున కాదిదైవతము లచ్చిమగం డతఁ డిచ్చు సౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
  5. -
    నయనములు మూడగు శివుడు
    లయకారుఁడు; సౌఖ్యమొసఁగు లచ్చిమగండే
    నియతి, స్థితుల నెలకొలుపు న
    భయహస్తముతో జగతియె భాగ్యము గానన్



    రిప్లయితొలగించండి
  6. చం॥ భయమును బాఱదోలు నిజ భక్తుల త్రాత మురారి సర్వదా
    నయముగఁ బ్రార్థనా ధృతిని నాథుఁడ వీవని వేడినంతనే
    రయముగఁ బ్రోచి రక్షఁ గను రమ్య కృపానిధి ప్రాణి చేతనా
    లయమున కాదిదైవతము లచ్చిమగం డతఁడిచ్చు సౌఖ్యముల్

    ఆలయము ఇల్లు ప్రాణి లోని చేతన ఆయనే కదండి

    రిప్లయితొలగించండి
  7. రయమున గాచును భక్తుల
    లయకారుడు :: సౌఖ్య మొ సగు లచ్చి మగండే
    నియమమున గొలుచు వారల
    దయతో కరుణించి బ్రోచు ధార్మి క పరులన్

    రిప్లయితొలగించండి
  8. దయతోఁ గాచును సతము వి
    నయమ్ము తోడఁ దను గొలిచిన మనుజులన్ సం
    దియ మేలా దీన జ నా
    లయ కారుఁడు సౌఖ్య మొసఁగు లచ్చి మగండే

    [దీన జన + ఆలయకారుఁడు]


    దయ కురిపించు శిష్టులకుఁ దద్ద యొసంగును రక్ష నిత్యమున్
    క్షయ మొనరించు దుష్ట తతిఁ గంజ దళాక్షుఁడు మారకున్ననున్
    నయముగ గీతలో నుడివె నంద కుమారుఁడు నిక్క మివ్విధిన్
    లయమున కాది దైవతము లచ్చి మగం డతఁ డిచ్చు సౌఖ్యముల్

    రిప్లయితొలగించండి

  9. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    జయమును కలిగించు శివుడె
    లయకారుడు; సౌఖ్యమొసగు లచ్చి మగండే
    నయముగ పూజలొనర్చగ
    భయమును బాపుచు నతండు భద్రత
    గూర్చున్.

    రిప్లయితొలగించండి