15-5-2026 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శృంగముతోఁ గ్రుమ్మెనంట సింహము గజమున్”
(లేదా...)
“శృంగముతోడఁ గ్రుమ్మెనఁట సింహము మత్తగజేంద్రమున్ వనిన్”
కందంఅంగాంగంబు వణుకదేబెంగపడఁ గలన్ కిశోర వీరమ్ముగనన్!జెంగట పంజానెత్తుచుశృంగముతోఁ గ్రుమ్మెనంట సింహము గజమున్ఉత్పలమాలఅంగములందునన్ వణకు యావరణంబగు స్వప్నమై కనన్సింగము నేనుగే సహజ సిద్ధమటంచను జాతివైరమైచెంగట నిల్చి వీరమును జిందుచు ముందటి పాదమెత్తుచున్శృంగముతోడఁ గ్రుమ్మెనఁట సింహము మత్తగజేంద్రమున్ వనిన్(శృంగము = దొరతనము)
పింగళు వైరిని భృంగియె శృంగముతోఁ గ్రుమ్మెనంట ; సింహము గజమున్ఛంగున పైకి దుముకగనె భంగపడుచు పారిపోయె భయము తోడన్
మీ పూరణ బాగున్నది. 'భయముతోడన్' అంటే గణభంగం. "భయవిహ్వలమై" అనండి.
రంగుల చిత్రము నందు తు రంగము నకు పక్షములు నెఱపరికి పదునౌ శృంగములను జూపుచు నా శృంగముతోఁ గ్రుమ్మెనంట సింహము గజమున్.బంగరు వర్ణ పక్షముల బ్రధ్నము కల్గిన చిత్ర మందునన్ శృంగము లున్న సింహమును స్నేహితు రాలిగ చూపి వారికిన్ గొంగ లతా లికమ్ము, ప్రతి కూలుని చంప దలంచి చివ్వలో శృంగముతోడఁ గ్రుమ్మెనఁట సింహము మత్తగజేంద్రమున్ వనిన్.
రంగులలో ముద్రించినశృంగారపు కావ్య మనుచు చెప్పగఁ గంటిన్వెంగలి విరచించినదదిశృంగముతోఁ గ్రుమ్మెనంట సింహము గజమున్రంగుల ముద్రణంబనుచు రమ్యముగా వచియించె నాతడేచెంగున చేరవచ్చి మరి చెప్పెను పుస్తక వైభవమ్మునేవెంగలి సంలిఖించెనట వింతగు కావ్యము వీక్ష సేయగాశృంగముతోడఁ గ్రుమ్మెనఁట సింహము మత్తగజేంద్రమున్ వనిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి.
ధన్యవాదాలు గురూజీ 🙏
-అంగట శిఖి యొకటి మునులశృంగముతోఁ గ్రుమ్మెనంట; సింహము గజమున్రంగమున దింపె నెవరావంగజపు కరటియొ కనుగొనంగ వడివడిన్
బాగుంది. చివరిపాదంలో యతి తప్పింది. "వంగజపు కరటియె కనగ వడివడిని దగన్" అందామా?
కం:సింగము పైబడ దుప్పియెశృంగముతోఁ గ్రుమ్మె నంట, సింహము గజమున్”భంగింప బూని తానే లొంగుట విప్లవ కవితల లో గనిపించున్. (కమ్యూనిస్ట్ కవితలలో ఇలాంటివి కనిపిస్తాయి. "ఏం పిల్లో ఎల్ద మొస్తవా? అనే పాట లో పామును జంపిన చీమలు లున్నయట మొదలైన వైరుథ్యాలు ఉంటాయి. )
ఉ॥ భంగును గ్రోలి మత్తుఁ గని పాలసుఁ డొక్కడు విస్మరించి సారంగమునే మనమ్మునను గ్రమ్మఁగ మూర్ఖత తల్చి గొప్పగాసింగమటంచు నీవిధిగఁ జెప్పెను సర్వులు నవ్వి పోవఁగన్శృంగము తోడఁ గ్రుమ్మెనట సింహము మత్తగజేంద్రమున్ వనిన్భంగు పాలు వగైరా వేసి తయారు చేయు మత్తు పదార్థము, విస్మరించు మఱచిపోవు
ఉ:సింగము పైబడన్ సరకు జేయక బర్రెయు ధైర్య మొందుచున్శృంగముతోడఁ గ్రుమ్మెనఁట, సింహము మత్తగజేంద్రమున్ వనిన్లొంగగ జేసి చంపి తిన లోలత జూప నిభమ్ము శక్తికిన్ భంగము కాని రీతి దల వంచక బోరును బ్రాణ మెక్కువై
శృంగము గలిగిన కేసరి ముంగిట కన్ఫడు మృగముల మునుకొని చంపెన్ చెంగట జూచియు నొకపరిశృంగము తో గృమ్మె నంట సింహము గజమున్
మీ పూరణ బాగున్నది.
క్రుంగ జవ సత్వములు గూలంగ బడలి తత్క్షణము ధరా తల మందున్ వంగని నఖములతో బల శృంగముతోఁ గ్రుమ్మె నంట సింహము గజమున్ [శృంగము = దొరతనము] భంగము కల్గుచోఁ దనదు భద్రత కించుక యెన్నఁ డేనియుం గ్రుంగక యల్ప జీవియును రోషము నూని చెలంగు నుగ్రతంజెంగున డాసి సత్వమున శ్రేష్ఠము ఖడ్గ మృగమ్ము రెంటినిన్ శృంగము తోడఁ గ్రుమ్మె నఁట సింహము మత్తగజేంద్రమున్ వనిన్ [సింహము (న్) మత్త గజేంద్రమున్]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి.
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.అంగడిని వృషభ మొకనినిశృంగముతోఁ గ్రుమ్మెనంట;సింహము గజమున్చెంగున పైపైకి దుముకభంగము కలిగినదని కరి భయపడి పాఱెన్.
కందం
రిప్లయితొలగించండిఅంగాంగంబు వణుకదే
బెంగపడఁ గలన్ కిశోర వీరమ్ముగనన్!
జెంగట పంజానెత్తుచు
శృంగముతోఁ గ్రుమ్మెనంట సింహము గజమున్
ఉత్పలమాల
అంగములందునన్ వణకు యావరణంబగు స్వప్నమై కనన్
సింగము నేనుగే సహజ సిద్ధమటంచను జాతివైరమై
చెంగట నిల్చి వీరమును జిందుచు ముందటి పాదమెత్తుచున్
శృంగముతోడఁ గ్రుమ్మెనఁట సింహము మత్తగజేంద్రమున్ వనిన్
(శృంగము = దొరతనము)
పింగళు వైరిని భృంగియె
రిప్లయితొలగించండిశృంగముతోఁ గ్రుమ్మెనంట ; సింహము గజమున్
ఛంగున పైకి దుముకగనె
భంగపడుచు పారిపోయె భయము తోడన్
మీ పూరణ బాగున్నది.
తొలగించండి'భయముతోడన్' అంటే గణభంగం. "భయవిహ్వలమై" అనండి.
రంగుల చిత్రము నందు తు
రిప్లయితొలగించండిరంగము నకు పక్షములు నెఱపరికి పదునౌ
శృంగములను జూపుచు నా
శృంగముతోఁ గ్రుమ్మెనంట సింహము గజమున్.
బంగరు వర్ణ పక్షముల బ్రధ్నము కల్గిన చిత్ర మందునన్
శృంగము లున్న సింహమును స్నేహితు రాలిగ చూపి వారికిన్
గొంగ లతా లికమ్ము, ప్రతి కూలుని చంప దలంచి చివ్వలో
శృంగముతోడఁ గ్రుమ్మెనఁట సింహము మత్తగజేంద్రమున్ వనిన్.
రంగులలో ముద్రించిన
రిప్లయితొలగించండిశృంగారపు కావ్య మనుచు చెప్పగఁ గంటిన్
వెంగలి విరచించినదది
శృంగముతోఁ గ్రుమ్మెనంట సింహము గజమున్
రంగుల ముద్రణంబనుచు రమ్యముగా వచియించె నాతడే
చెంగున చేరవచ్చి మరి చెప్పెను పుస్తక వైభవమ్మునే
వెంగలి సంలిఖించెనట వింతగు కావ్యము వీక్ష సేయగా
శృంగముతోడఁ గ్రుమ్మెనఁట సింహము మత్తగజేంద్రమున్ వనిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండి-
రిప్లయితొలగించండిఅంగట శిఖి యొకటి మునుల
శృంగముతోఁ గ్రుమ్మెనంట; సింహము గజమున్
రంగమున దింపె నెవరా
వంగజపు కరటియొ కనుగొనంగ వడివడిన్
బాగుంది. చివరిపాదంలో యతి తప్పింది. "వంగజపు కరటియె కనగ వడివడిని దగన్" అందామా?
తొలగించండికం:సింగము పైబడ దుప్పియె
రిప్లయితొలగించండిశృంగముతోఁ గ్రుమ్మె నంట, సింహము గజమున్”
భంగింప బూని తానే
లొంగుట విప్లవ కవితల లో గనిపించున్.
(కమ్యూనిస్ట్ కవితలలో ఇలాంటివి కనిపిస్తాయి. "ఏం పిల్లో ఎల్ద మొస్తవా? అనే పాట లో పామును జంపిన చీమలు లున్నయట మొదలైన వైరుథ్యాలు ఉంటాయి. )
ఉ॥ భంగును గ్రోలి మత్తుఁ గని పాలసుఁ డొక్కడు విస్మరించి సా
రిప్లయితొలగించండిరంగమునే మనమ్మునను గ్రమ్మఁగ మూర్ఖత తల్చి గొప్పగా
సింగమటంచు నీవిధిగఁ జెప్పెను సర్వులు నవ్వి పోవఁగన్
శృంగము తోడఁ గ్రుమ్మెనట సింహము మత్తగజేంద్రమున్ వనిన్
భంగు పాలు వగైరా వేసి తయారు చేయు మత్తు పదార్థము, విస్మరించు మఱచిపోవు
ఉ:సింగము పైబడన్ సరకు జేయక బర్రెయు ధైర్య మొందుచున్
రిప్లయితొలగించండిశృంగముతోడఁ గ్రుమ్మెనఁట, సింహము మత్తగజేంద్రమున్ వనిన్
లొంగగ జేసి చంపి తిన లోలత జూప నిభమ్ము శక్తికిన్
భంగము కాని రీతి దల వంచక బోరును బ్రాణ మెక్కువై
శృంగము గలిగిన కేసరి
రిప్లయితొలగించండిముంగిట కన్ఫడు మృగముల మునుకొని చంపెన్
చెంగట జూచియు నొకపరి
శృంగము తో గృమ్మె నంట సింహము గజమున్
మీ పూరణ బాగున్నది.
తొలగించండిక్రుంగ జవ సత్వములు గూ
రిప్లయితొలగించండిలంగ బడలి తత్క్షణము ధరా తల మందున్
వంగని నఖములతో బల
శృంగముతోఁ గ్రుమ్మె నంట సింహము గజమున్
[శృంగము = దొరతనము]
భంగము కల్గుచోఁ దనదు భద్రత కించుక యెన్నఁ డేనియుం
గ్రుంగక యల్ప జీవియును రోషము నూని చెలంగు నుగ్రతం
జెంగున డాసి సత్వమున శ్రేష్ఠము ఖడ్గ మృగమ్ము రెంటినిన్
శృంగము తోడఁ గ్రుమ్మె నఁట సింహము మత్తగజేంద్రమున్ వనిన్
[సింహము (న్) మత్త గజేంద్రమున్]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి.
తొలగించండి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
అంగడిని వృషభ మొకనిని
శృంగముతోఁ గ్రుమ్మెనంట;సింహము గజమున్
చెంగున పైపైకి దుముక
భంగము కలిగినదని కరి భయపడి పాఱెన్.