19-5-2026 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాములు పాడంగ మురిసెఁ బాములవాఁడే”
(లేదా...)
“పాములు పాట పాడినవి పాములవాఁడు శిరమ్ము నూఁచఁగన్”
పాములు పడగల నెత్తగ కోమలముగ దలలపైన కొట్టుచు నుండన్గోముగ బుసబుసమని యాపాములు పాడంగ మురిసెఁ బాములవాఁడే”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందంకామిత వరదుండని హరినామము ప్రహ్లాదుఁడెంచ నచ్చిన సఖులున్దాముఁ బలుక గురులూగిరె! "పాములు పాడంగ మురిసెఁ బాములవాఁడే!"ఉత్పలమాలకామితమెల్ల దీర్చునని కంజదళాక్షుని బాలభక్తుడున్నామముఁ బాడఁగన్ మిగుల నచ్చిన మిత్రులు గొంతుఁ గల్పుచున్దాము భజింపగన్ దనరి దన్మయమొందరె యొజ్జలేమరన్,"బాములు పాట పాడినవి పాములవాఁడు శిరమ్ము నూఁచఁగన్!"
పాముల వాడనఁ నేతయెనీమములే లేని దుర్వినీతుడు భృత్యుల్పాములు పాటలు వాంఛల్పాములు పాడంగ మురిసెఁ బాములవాఁడేపాములవాడు దుష్టుడును పాపమొనర్చెడి ధూర్త నేతయౌపాములు దుష్టబుద్దికడ వంగి సలాములు సేయు సేవకుల్పాములు పాడు పాటలనఁ బాముల వానికి వాంఛితంబులౌపాములు పాట పాడినవి పాములవాఁడు శిరమ్ము నూఁచఁగన్[ నేడు దుష్టుడౌ నేత వాని భృత్యుల కార్యకలాపాలు నేత మనోభీష్టానికి అనుగుణంగా నుండగా నేత శిరసు నూపాడని ]
*(ప్రహ్లాదుడు రాక్షస బాలురు పాడుతుంటే గురువులు చండామార్కులు పరవశించారని)* నామజపము ప్రహ్లాదుడు మై మరచుచు చేయు వేళ మాయ గురువులా నామము స్మరియించుట గన పాములు పాడంగ మురిసెఁ బాములవాఁడే.నేమము తప్పి బాలకుడు నిత్యము శ్రీహరి గొల్చు చుండెనే ప్రేమగ మార్చు వాడినని విట్పతి చెప్పిన నేమి బాలకున్ కోమల గాత్రమున్ వినుచు కోవిదులే వివశత్వ మందుటే పాములు పాట పాడినవి పాములవాఁడు శిరమ్ము నూఁచఁగన్.
-ఆమని కోయిల తోడైపాములు పాడంగ మురిసె పాముల వాడేవేమారులు నాగసరముతో మూర్ధము నూపి నూపి తువుకొని భళిరా
-https://youtube.com/shorts/omZZj9E-fuU?si=S1uzTygOVPuYZ-uZ
ఉ॥ ఏమని తెల్పఁగన్ వలయు నెల్లరు చూడఁగఁ బొట్ట కూటికైయా మనుజుండు సర్పముల నావిధి నాడఁగఁ జేసి శ్రద్ధతోధీమసమొప్ప నిల్లుచని తీరుగఁ దూఁగఁగ స్వప్నమందునన్బాములు పాట పాడినవి పాములవాఁడు శిరమ్ము నూఁచఁగన్
ఏమని పలికెద రి య్యె డ? పాములు పాడుట నెరుగరు పామరు లైనన్ దామసులు నవ్వి రెచ్ఛ ట పాములు పాడంగ మురిసె పాముల వాడే
గ్రామం బం దొక్క తడవ సీమ లెఱుంగని విచిత్ర చిత్ర వినోదంబే మందు బుస్సు బుస్సని పాములు పాడంగ మురిసెఁ బాములవాఁడే కోమలి కప్ప పెండ్లికిఁ ద్రికూట గిరీంద్ర సభాంగణమ్మునన్ శ్యామ మయూర పత్ర రథ సంచయ నాట్య వినోద కేళిలో భౌమ పికౌఘ సంజనిత భవ్యమనోహర గాన వేదికం బాములు పాట పాడినవి పాముల వాఁడు శిరమ్ము నూఁచఁగన్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.పాములను నామధేయుడుపాముల నాడించుచుండ పాములవాడున్నీమముతో ననుగుణముగపాములు పాడంగ మురిసెఁ బాములవాడే!
పాములు పడగల నెత్తగ
రిప్లయితొలగించండికోమలముగ దలలపైన కొట్టుచు నుండన్
గోముగ బుసబుసమని యా
పాములు పాడంగ మురిసెఁ బాములవాఁడే”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
రిప్లయితొలగించండికామిత వరదుండని హరి
నామము ప్రహ్లాదుఁడెంచ నచ్చిన సఖులున్
దాముఁ బలుక గురులూగిరె!
"పాములు పాడంగ మురిసెఁ బాములవాఁడే!"
ఉత్పలమాల
కామితమెల్ల దీర్చునని కంజదళాక్షుని బాలభక్తుడున్
నామముఁ బాడఁగన్ మిగుల నచ్చిన మిత్రులు గొంతుఁ గల్పుచున్
దాము భజింపగన్ దనరి దన్మయమొందరె యొజ్జలేమరన్,
"బాములు పాట పాడినవి పాములవాఁడు శిరమ్ము నూఁచఁగన్!"
పాముల వాడనఁ నేతయె
రిప్లయితొలగించండినీమములే లేని దుర్వినీతుడు భృత్యుల్
పాములు పాటలు వాంఛల్
పాములు పాడంగ మురిసెఁ బాములవాఁడే
పాములవాడు దుష్టుడును పాపమొనర్చెడి ధూర్త నేతయౌ
పాములు దుష్టబుద్దికడ వంగి సలాములు సేయు సేవకుల్
పాములు పాడు పాటలనఁ బాముల వానికి వాంఛితంబులౌ
పాములు పాట పాడినవి పాములవాఁడు శిరమ్ము నూఁచఁగన్
[ నేడు దుష్టుడౌ నేత వాని భృత్యుల కార్యకలాపాలు నేత మనోభీష్టానికి అనుగుణంగా నుండగా నేత శిరసు నూపాడని ]
రిప్లయితొలగించండి*(ప్రహ్లాదుడు రాక్షస బాలురు పాడుతుంటే గురువులు చండామార్కులు పరవశించారని)*
నామజపము ప్రహ్లాదుడు
మై మరచుచు చేయు వేళ మాయ గురువులా
నామము స్మరియించుట గన
పాములు పాడంగ మురిసెఁ బాములవాఁడే.
నేమము తప్పి బాలకుడు నిత్యము శ్రీహరి గొల్చు చుండెనే
ప్రేమగ మార్చు వాడినని విట్పతి చెప్పిన నేమి బాలకున్
కోమల గాత్రమున్ వినుచు కోవిదులే వివశత్వ మందుటే
పాములు పాట పాడినవి పాములవాఁడు శిరమ్ము నూఁచఁగన్.
-
రిప్లయితొలగించండిఆమని కోయిల తోడై
పాములు పాడంగ మురిసె పాముల వాడే
వేమారులు నాగసరము
తో మూర్ధము నూపి నూపి తువుకొని భళిరా
-
రిప్లయితొలగించండిhttps://youtube.com/shorts/omZZj9E-fuU?si=S1uzTygOVPuYZ-uZ
ఉ॥ ఏమని తెల్పఁగన్ వలయు నెల్లరు చూడఁగఁ బొట్ట కూటికై
రిప్లయితొలగించండియా మనుజుండు సర్పముల నావిధి నాడఁగఁ జేసి శ్రద్ధతో
ధీమసమొప్ప నిల్లుచని తీరుగఁ దూఁగఁగ స్వప్నమందునన్
బాములు పాట పాడినవి పాములవాఁడు శిరమ్ము నూఁచఁగన్
ఏమని పలికెద రి య్యె డ?
రిప్లయితొలగించండిపాములు పాడుట నెరుగరు పామరు లైనన్
దామసులు నవ్వి రెచ్ఛ ట
పాములు పాడంగ మురిసె పాముల వాడే
గ్రామం బం దొక్క తడవ
రిప్లయితొలగించండిసీమ లెఱుంగని విచిత్ర చిత్ర వినోదం
బే మందు బుస్సు బుస్సని
పాములు పాడంగ మురిసెఁ బాములవాఁడే
కోమలి కప్ప పెండ్లికిఁ ద్రికూట గిరీంద్ర సభాంగణమ్మునన్
శ్యామ మయూర పత్ర రథ సంచయ నాట్య వినోద కేళిలో
భౌమ పికౌఘ సంజనిత భవ్యమనోహర గాన వేదికం
బాములు పాట పాడినవి పాముల వాఁడు శిరమ్ము నూఁచఁగన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
పాములను నామధేయుడు
పాముల నాడించుచుండ పాములవాడున్
నీమముతో ననుగుణముగ
పాములు పాడంగ మురిసెఁ బాములవాడే!