21, మే 2026, గురువారం

సమస్య - 5474

22-5-2026 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“భార్యాపుత్రధనకాంక్ష బైరాగులకౌ”

(లేదా...)

“భార్యాపుత్రధనేషణత్రయముతో బైరాగి భాసిల్లెడిన్”

12 కామెంట్‌లు:

  1. కార్యమరయు వారలకే
    భార్యాపుత్రధనకాంక్ష ; బైరాగులకౌ
    నిర్యాణముపై కోరిక
    పర్యాకులమగు చరితము వారిరువురిదౌ

    రిప్లయితొలగించండి

  2. ఆర్యా సంసారంబది
    పర్యాహారమని దలచి భార్యను విడె, యా
    శ్చర్యం బెందుకు కాంచగ
    భార్యాపుత్రధనకాంక్ష బైరాగులకౌ?


    భార్యన్ దెచ్చితి యేలు కొమ్మనుచు సాధ్వంతుండ నే గోర నా
    శ్చర్యంబయ్యెనె, యార్యుడా తెలుపు సంసారంబు సాగించుటే
    పర్యాహార మటంచు నెంచి గద తా వైరాగి గా మారె నే
    భార్యాపుత్రధనేషణత్రయముతో బైరాగి భాసిల్లెడిన్?

    రిప్లయితొలగించండి
  3. ఆర్యావర్తము నందున
    భార్యా బిడ్డలఁ విడిచిన వారు పలువురౌ
    కార్య విముఖులైన పిదప
    భార్యాపుత్రధనకాంక్ష బైరాగులకౌ

    ఆర్యావర్తమునందుఁ దారసిలు నిర్వ్యాపారులే పెక్కురై
    భార్యాబిడ్డలఁ వీడిపోయిరిగదా పాపాత్ములే ముక్తికై
    చౌర్యంబే తనవృత్తి యైన యతికిన్ సంకల్పమే గట్టిదై
    భార్యాపుత్ర ధనేషణత్రయముతో బైరాగి భాసిల్లెడిన్

    రిప్లయితొలగించండి
  4. అంతా విష్ణుమాయ :) బ్రామితుల కూడలి :)


    వీర్యము గలిగిన వారికి
    భార్యాపుత్రధనకాంక్ష; బైరాగుల కౌ
    తుర్యాతీతపు కాంక్షల్
    పర్యావరణమ్మె బ్రాతి పరివేష్టితమౌ!


    జిలేబి


    రిప్లయితొలగించండి
  5. ధైర్యపు గృహస్తు కుండును
    భార్యా పుత్ర ధన కాంక్ష :: బైరాగు ల కౌ
    భార్యా రహితుండౌచు న్
    నిర్యా ణ ము పొంద గోరు నిర్మలు డ గుచున్

    రిప్లయితొలగించండి
  6. శా॥ ధైర్యంబంతయు సన్నగిల్ల ధన మోదంబొంది పత్నీసుతుల్
    పర్యాప్తంబగు కష్టముల్ విరియఁగన్ వర్జించ స్నేహమ్మునున్
    శౌర్యంబంత విరక్తిఁ గాంచి చనఁగన్ సన్యాసమే సౌఖ్యమౌ
    భార్యాపుత్ర ధనేషణత్రయముతో బైరాగి భాసిల్లెడిన్

    (భార్య పుత్రుల ధన వాంచ సన్యాసి చేసిందని. అప్పుడు త్రయేషణ పనిచేసినట్టే కదండి)

    రిప్లయితొలగించండి
  7. సమస్య : భార్యాపుత్రధనకాంక్ష బైరాగులకౌ

    భూర్యాశ్రమములకై భూ
    చౌర్యమునకు పాల్పడుదురు స్వాములు నేడా
    శ్చర్యమె కలికాలమునన్
    భార్యాపుత్రధనకాంక్ష బైరాగులకౌ

    రిప్లయితొలగించండి
  8. కందం
    ఆర్యవిరాగికి గోచీ
    యార్యావర్తమున నెలుక నరకొర కొరుకన్
    జర్యఁగొనఁ బిల్లి తదుపరి
    భార్యాపుత్రధనకాంక్ష బైరాగులకౌ!

    ర్దూలవిక్రీడితము
    ఆర్యుండైన విరాగి గోచి నెలుకే యట్లిట్లు త్రుంచంగన
    య్యార్యావర్తము నందునన్ దిగులుతో నాలోచనన్ జేయుచున్
    జర్యన్ గైకొన సాకఁ బిల్లిఁ బిదపన్ సౌరిన్ దదానుక్రమన్
    భార్యాపుత్రధనేషణత్రయముతో బైరాగి భాసిల్లెడిన్!

    రిప్లయితొలగించండి
  9. కార్యమ్ము లీ గుణమ్ములు
    క్రౌర్య నివారణము శాంత గమనము, నిత్యా
    కార్యం బవార్య వార్యము
    భార్యా పుత్ర ధన కాంక్ష బైరాగులకౌ


    ఆర్యోపాసక సంఘ పుంగవుఁడు సత్యాన్వేషి భిక్షాన్న సం
    పర్యాప్తోదర భాసమాన వదనప్రద్యోత విఖ్యాతుఁడుం
    గార్యాకార్య విలగ్న మానస లసత్కాయుండు శశ్వద్వినా
    భార్యా పుత్ర ధనేషణ త్రయముతో బైరాగి భాసిల్లెడిన్

    రిప్లయితొలగించండి

  10. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఆర్యులనిరి సంసారికి
    భార్యా పుత్ర ధన కాంక్ష; బైరాగులకౌ
    సూర్యుని యారాధనతో
    కార్యమ్ములు జరుపుచుంద్రు క్రమపద్ధతిగా.

    రిప్లయితొలగించండి