22-5-2026 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భార్యాపుత్రధనకాంక్ష బైరాగులకౌ”
(లేదా...)
“భార్యాపుత్రధనేషణత్రయముతో బైరాగి భాసిల్లెడిన్”
కార్యమరయు వారలకే భార్యాపుత్రధనకాంక్ష ; బైరాగులకౌనిర్యాణముపై కోరిక పర్యాకులమగు చరితము వారిరువురిదౌ
ఆర్యా సంసారంబది పర్యాహారమని దలచి భార్యను విడె, యా శ్చర్యం బెందుకు కాంచగ భార్యాపుత్రధనకాంక్ష బైరాగులకౌ?భార్యన్ దెచ్చితి యేలు కొమ్మనుచు సాధ్వంతుండ నే గోర నా శ్చర్యంబయ్యెనె, యార్యుడా తెలుపు సంసారంబు సాగించుటే పర్యాహార మటంచు నెంచి గద తా వైరాగి గా మారె నే భార్యాపుత్రధనేషణత్రయముతో బైరాగి భాసిల్లెడిన్?
ఆర్యావర్తము నందున భార్యా బిడ్డలఁ విడిచిన వారు పలువురౌకార్య విముఖులైన పిదపభార్యాపుత్రధనకాంక్ష బైరాగులకౌఆర్యావర్తమునందుఁ దారసిలు నిర్వ్యాపారులే పెక్కురైభార్యాబిడ్డలఁ వీడిపోయిరిగదా పాపాత్ములే ముక్తికై చౌర్యంబే తనవృత్తి యైన యతికిన్ సంకల్పమే గట్టిదైభార్యాపుత్ర ధనేషణత్రయముతో బైరాగి భాసిల్లెడిన్
అంతా విష్ణుమాయ :) బ్రామితుల కూడలి :)వీర్యము గలిగిన వారికిభార్యాపుత్రధనకాంక్ష; బైరాగుల కౌతుర్యాతీతపు కాంక్షల్పర్యావరణమ్మె బ్రాతి పరివేష్టితమౌ!జిలేబి
https://youtube.com/shorts/iUNbWGXQ7yQ?si=tdANPTEZrGTE6Vmd
ధైర్యపు గృహస్తు కుండును భార్యా పుత్ర ధన కాంక్ష :: బైరాగు ల కౌ భార్యా రహితుండౌచు న్ నిర్యా ణ ము పొంద గోరు నిర్మలు డ గుచున్
శా॥ ధైర్యంబంతయు సన్నగిల్ల ధన మోదంబొంది పత్నీసుతుల్పర్యాప్తంబగు కష్టముల్ విరియఁగన్ వర్జించ స్నేహమ్మునున్శౌర్యంబంత విరక్తిఁ గాంచి చనఁగన్ సన్యాసమే సౌఖ్యమౌ భార్యాపుత్ర ధనేషణత్రయముతో బైరాగి భాసిల్లెడిన్(భార్య పుత్రుల ధన వాంచ సన్యాసి చేసిందని. అప్పుడు త్రయేషణ పనిచేసినట్టే కదండి)
సమస్య : భార్యాపుత్రధనకాంక్ష బైరాగులకౌభూర్యాశ్రమములకై భూచౌర్యమునకు పాల్పడుదురు స్వాములు నేడా శ్చర్యమె కలికాలమునన్భార్యాపుత్రధనకాంక్ష బైరాగులకౌ
కందంఆర్యవిరాగికి గోచీయార్యావర్తమున నెలుక నరకొర కొరుకన్జర్యఁగొనఁ బిల్లి తదుపరిభార్యాపుత్రధనకాంక్ష బైరాగులకౌ!ర్దూలవిక్రీడితముఆర్యుండైన విరాగి గోచి నెలుకే యట్లిట్లు త్రుంచంగనయ్యార్యావర్తము నందునన్ దిగులుతో నాలోచనన్ జేయుచున్జర్యన్ గైకొన సాకఁ బిల్లిఁ బిదపన్ సౌరిన్ దదానుక్రమన్భార్యాపుత్రధనేషణత్రయముతో బైరాగి భాసిల్లెడిన్!
కార్యమ్ము లీ గుణమ్ములు క్రౌర్య నివారణము శాంత గమనము, నిత్యాకార్యం బవార్య వార్యముభార్యా పుత్ర ధన కాంక్ష బైరాగులకౌ ఆర్యోపాసక సంఘ పుంగవుఁడు సత్యాన్వేషి భిక్షాన్న సంపర్యాప్తోదర భాసమాన వదనప్రద్యోత విఖ్యాతుఁడుం గార్యాకార్య విలగ్న మానస లసత్కాయుండు శశ్వద్వినాభార్యా పుత్ర ధనేషణ త్రయముతో బైరాగి భాసిల్లెడిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.ఆర్యులనిరి సంసారికిభార్యా పుత్ర ధన కాంక్ష; బైరాగులకౌసూర్యుని యారాధనతోకార్యమ్ములు జరుపుచుంద్రు క్రమపద్ధతిగా.
కార్యమరయు వారలకే
రిప్లయితొలగించండిభార్యాపుత్రధనకాంక్ష ; బైరాగులకౌ
నిర్యాణముపై కోరిక
పర్యాకులమగు చరితము వారిరువురిదౌ
రిప్లయితొలగించండిఆర్యా సంసారంబది
పర్యాహారమని దలచి భార్యను విడె, యా
శ్చర్యం బెందుకు కాంచగ
భార్యాపుత్రధనకాంక్ష బైరాగులకౌ?
భార్యన్ దెచ్చితి యేలు కొమ్మనుచు సాధ్వంతుండ నే గోర నా
శ్చర్యంబయ్యెనె, యార్యుడా తెలుపు సంసారంబు సాగించుటే
పర్యాహార మటంచు నెంచి గద తా వైరాగి గా మారె నే
భార్యాపుత్రధనేషణత్రయముతో బైరాగి భాసిల్లెడిన్?
ఆర్యావర్తము నందున
రిప్లయితొలగించండిభార్యా బిడ్డలఁ విడిచిన వారు పలువురౌ
కార్య విముఖులైన పిదప
భార్యాపుత్రధనకాంక్ష బైరాగులకౌ
ఆర్యావర్తమునందుఁ దారసిలు నిర్వ్యాపారులే పెక్కురై
భార్యాబిడ్డలఁ వీడిపోయిరిగదా పాపాత్ములే ముక్తికై
చౌర్యంబే తనవృత్తి యైన యతికిన్ సంకల్పమే గట్టిదై
భార్యాపుత్ర ధనేషణత్రయముతో బైరాగి భాసిల్లెడిన్
అంతా విష్ణుమాయ :) బ్రామితుల కూడలి :)
రిప్లయితొలగించండివీర్యము గలిగిన వారికి
భార్యాపుత్రధనకాంక్ష; బైరాగుల కౌ
తుర్యాతీతపు కాంక్షల్
పర్యావరణమ్మె బ్రాతి పరివేష్టితమౌ!
జిలేబి
రిప్లయితొలగించండిhttps://youtube.com/shorts/iUNbWGXQ7yQ?si=tdANPTEZrGTE6Vmd
ధైర్యపు గృహస్తు కుండును
రిప్లయితొలగించండిభార్యా పుత్ర ధన కాంక్ష :: బైరాగు ల కౌ
భార్యా రహితుండౌచు న్
నిర్యా ణ ము పొంద గోరు నిర్మలు డ గుచున్
శా॥ ధైర్యంబంతయు సన్నగిల్ల ధన మోదంబొంది పత్నీసుతుల్
రిప్లయితొలగించండిపర్యాప్తంబగు కష్టముల్ విరియఁగన్ వర్జించ స్నేహమ్మునున్
శౌర్యంబంత విరక్తిఁ గాంచి చనఁగన్ సన్యాసమే సౌఖ్యమౌ
భార్యాపుత్ర ధనేషణత్రయముతో బైరాగి భాసిల్లెడిన్
(భార్య పుత్రుల ధన వాంచ సన్యాసి చేసిందని. అప్పుడు త్రయేషణ పనిచేసినట్టే కదండి)
సమస్య : భార్యాపుత్రధనకాంక్ష బైరాగులకౌ
రిప్లయితొలగించండిభూర్యాశ్రమములకై భూ
చౌర్యమునకు పాల్పడుదురు స్వాములు నేడా
శ్చర్యమె కలికాలమునన్
భార్యాపుత్రధనకాంక్ష బైరాగులకౌ
కందం
రిప్లయితొలగించండిఆర్యవిరాగికి గోచీ
యార్యావర్తమున నెలుక నరకొర కొరుకన్
జర్యఁగొనఁ బిల్లి తదుపరి
భార్యాపుత్రధనకాంక్ష బైరాగులకౌ!
ర్దూలవిక్రీడితము
ఆర్యుండైన విరాగి గోచి నెలుకే యట్లిట్లు త్రుంచంగన
య్యార్యావర్తము నందునన్ దిగులుతో నాలోచనన్ జేయుచున్
జర్యన్ గైకొన సాకఁ బిల్లిఁ బిదపన్ సౌరిన్ దదానుక్రమన్
భార్యాపుత్రధనేషణత్రయముతో బైరాగి భాసిల్లెడిన్!
కార్యమ్ము లీ గుణమ్ములు
రిప్లయితొలగించండిక్రౌర్య నివారణము శాంత గమనము, నిత్యా
కార్యం బవార్య వార్యము
భార్యా పుత్ర ధన కాంక్ష బైరాగులకౌ
ఆర్యోపాసక సంఘ పుంగవుఁడు సత్యాన్వేషి భిక్షాన్న సం
పర్యాప్తోదర భాసమాన వదనప్రద్యోత విఖ్యాతుఁడుం
గార్యాకార్య విలగ్న మానస లసత్కాయుండు శశ్వద్వినా
భార్యా పుత్ర ధనేషణ త్రయముతో బైరాగి భాసిల్లెడిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ఆర్యులనిరి సంసారికి
భార్యా పుత్ర ధన కాంక్ష; బైరాగులకౌ
సూర్యుని యారాధనతో
కార్యమ్ములు జరుపుచుంద్రు క్రమపద్ధతిగా.