22, మే 2026, శుక్రవారం

సమస్య - 5475

23-5-2026 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“అల్లా కాపాడు ననుచు హరి వాక్రుచ్చెన్”

(లేదా...)

“అల్లా ప్రోచెడివాఁడటంచు హరి వ్యాఖ్యానించెఁ గంఠోక్తిగన్”

11 కామెంట్‌లు:

  1. కల్ల యనుకొనకు, భీష్ముడు
    ఎల్లప్పుడు నీవు పడెడి యిడుముల లోనన్
    మెల్లగనె దాను గాంచిన
    వల్లా కాపాడు ననుచు హరి వాక్రుచ్చెన్

    రిప్లయితొలగించండి
  2. కల్లలు పలుకక పరులకు
    నుల్లము రంజిల్లు రీతి నోరిమి పరుడై
    చెల్లెడి సాయ మొన ర్ప గ
    నల్లా కాపాడు ననుచు హరి వా క్రు చ్చె న్

    రిప్లయితొలగించండి
  3. కందం
    తల్లడము దీర్చు రూపము
    నల్లానా దైవమనెడు నక్బరు తోడన్
    మెల్లగ చెవిలో 'సఖునిగ' ,
    నల్లా కాపాడు ననుచు 'హరి' వాక్రుచ్చెన్

    శార్దూలవిక్రీడితము
    ఉల్లంబందున వేల్పుగానెవరినే యూహన్ భజింపంగ నీ
    కల్లోలంబులు తీరునో యటులనే కన్పించు దైవమ్మటం
    చుల్లేఖించి 'సఖుండుగన్' దెలుపుచున్ నూర్భాషతో నిష్టుడై
    యల్లా ప్రోచెడివాఁడటంచు 'హరి' వ్యాఖ్యానించెఁ గంఠోక్తిగన్!

    రిప్లయితొలగించండి

  4. చిల్లర వేషాలు వదిలి
    చెల్లెల పాటింపు నేను చెప్పినటుల మీ
    రెల్లరు నావగు పలుకుల
    నల్లా కాపాడు ననుచు హరి, వాక్రుచ్చెన్.


    తల్లీ బాధలు చుట్టు ముట్టెనని నే తాళంగ లేనంచు నీ
    వల్లల్లాడగ నేలనో వినుము నా యారాధ్య దైవం బదే
    కల్లోలం బుల తీర్చు శంకరుని నిష్కామంబునన్ గోల్వ మీ
    రల్లా ప్రోచెడివాఁడటంచు హరి వ్యాఖ్యానించెఁ గంఠోక్తిగన్.

    రిప్లయితొలగించండి
  5. కల్లోలంబొనరించుచు
    నల్లద్రావరులు సెలగ నరభోజనులన్
    మల్లారి పాల్గుడుచు పె
    య్యల్లా కాపాడు ననుచు హరి వాక్రుచ్చెన్

    నల్లద్రావరులే చెలంగి దివమున్ నానాడు పీడింపగా
    నల్లల్లాడుచు నున్న ఖేచరులు తామాదిత్యునే జేరగా
    చెల్లంబో! నిటలాక్షుడే దనుజులన్ క్షీరంబునుంగ్రోలు పె
    య్యల్లా ప్రోచెడివాఁడటంచు హరి వ్యాఖ్యానించెఁ గంఠోక్తిగన్

    రిప్లయితొలగించండి
  6. -

    ఉల్లము పొంగెడు భక్తిని
    కల్లోలపు యెదయు సేద గాన పరవశం
    బెల్లెడల గాంచెడు జనుల
    నల్లా కాపాడు ననుచు హరి వాక్రుచ్చెన్


    https://youtube.com/shorts/DWM3Rp_c18g?si=pTRO2TLLLXGXepND


    రిప్లయితొలగించండి
  7. కల్లోలమాయె బ్రతుకని
    యల్లా భక్తుఁడు రహీము యార్తిగ వగచెన్
    తల్లడపడవలదు సఖా
    అల్లా కాపాడు ననుచు హరి వాక్రుచ్చెన్

    రిప్లయితొలగించండి
  8. అల్లా భక్తుఁడు షేరుఖాను హరియున్నస్తోకమౌ స్నేహితుల్
    కల్లోలంబున ఖాను జీవితమునన్ కాకోలమే యేర్పడన్
    ఉల్లంబందున చింతవీడుము సఖా యోర్మిన్ వహించంగనా
    యల్లా ప్రోచెడివాఁడటంచు హరి వ్యాఖ్యానించెఁ గంఠోక్తిగన్

    రిప్లయితొలగించండి
  9. కం:తెల్లము జేసెను "సాధకు
    లెల్లెడ నే రూపు గొలువ నెల్లయు దనకే
    చెల్లు"నని,తనదు రూపగు
    నల్లా కాపాడు ననుచు హరి వాక్రుచ్చెన్.
    (యే యథా మాం ప్రపద్యంతే తాను స్తథైవ భజామ్యహం. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్ఛతి. )

    రిప్లయితొలగించండి
  10. తల్లడపడంగ నేలా
    తల్లీ యార్తిం బిలువుమ దైవ గణమ్ముం
    జెల్లీ పిలువఁగ వచ్చిన
    దల్లా కాపాడు ననుచు హరి వాక్రుచ్చెన్


    అల్లెట్లౌను ధరిత్రి రక్షకుఁడు సత్యం బెన్న నేనాఁటికిం
    గల్లోలమ్ములఁ గాచు వాఁ డిల రమా కాంతుండు కా కన్యుఁడే
    కల్లల్ వల్కఁగ నెట్టు లొప్పె మది నక్కా దైవ గీతాల యా
    యల్లా ప్రోచెడి వాఁ డటంచు హరి వ్యాఖ్యానించెఁ గంఠోక్తిగన్

    [గీతాల+ఆ+అల్లు + ఆ= గీతాల యా యల్లా; అల్లు=అల్లిక/అల్లుడు]

    రిప్లయితొలగించండి

  11. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఇల్లాలు జబ్బు పడగ న
    బ్దుల్లా దుఃఖించుచుండ దోస్తుడు హరియున్
    చల్లని మది గల దైవం
    బల్లా కాపాడుననుచు హరి వాక్రుచ్చెన్.

    రిప్లయితొలగించండి