23, మే 2026, శనివారం

సమస్య - 5476

24-5-2026 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“అవధానికి శిక్షణమ్ము లవసర మగునా”

(లేదా...)

“అవధానాభ్యసనార్థశిక్షణము లయ్యా మేలుఁ జేకూర్చునే”

9 కామెంట్‌లు:

  1. అవిరతము జేయు చుండెడి
    అవధానికి , శిక్షణమ్ము లవసర మగునా !
    అవసరమా యాతరగాలి !
    ప్రవీణతను పెంచు కొనగ పరిమితి కలదే!

    రిప్లయితొలగించండి
  2. కవనము నందు న ప్రతిభ యు
    జవమున పద్యముల నల్లు చాతుర్య ము తో ప్రవిమ ల ధారయు కలిగిన
    నవ ధాని కి శిక్షణ మ్ము లవసర మగునా?

    రిప్లయితొలగించండి

  3. కవి సహజమ్ముగ పద్యము
    నవలీలగ చెప్పువాడె యవధానిగ నీ
    భువిలో రాణించును మరి
    యవధానికి శిక్షణమ్ము లవసర మగునా


    వ్యవహారమ్మది కాదు కాదె యదియే పాండిత్య సయ్యాట తా
    జవమున్ బద్యము జెప్పి పృచ్ఛకులకున్ సంపత్తి నే జూపెడిన్
    గవికిన్ గావలె ప్రాకృతంబగు చమత్కా రమ్మదే కావునన్
    యవధానాభ్యసనార్థశిక్షణము లయ్యా మేలుఁ జేకూర్చునే?

    రిప్లయితొలగించండి
  4. వ్యవధికి వశమై పలికెడి
    యవధానికి శిక్షణమ్ము లవసర మగునా
    వివరింపుమనుట తగునా
    జవనాశ్వముకైన వలయు సద్బోధనమే

    వ్యవధానమ్మున దీటుగా బలుకుచున్ వాగ్బాణముల్ వీడుచున్
    నవచైతన్యము తోడ నిండు సభలో నైపుణ్యముంజూపగా
    లవలేశంబగు సంశయమ్ము గలదా లక్ష్యంబు సాధింపగా
    నవధానాభ్యసనార్థశిక్షణము లయ్యా మేలుఁ జేకూర్చునే

    రిప్లయితొలగించండి
  5. -

    అవధులు లేని ప్రతిభకై
    యవధానికి శిక్షణమ్ములవసరమగు; నా
    రవమును పాదుగ జేసి స
    సి వర్ధిలన్ జేయు రైతు చేయు విధముగా


    https://youtube.com/shorts/FLDB2uJH1Dw?si=7hlYRBBWEbi374Ib


    రిప్లయితొలగించండి
  6. మ॥ భువిలోఁ బుట్టిన బిడ్డ పాఱునొకొ? యద్భుతమ్మసాధ్యమ్మిటన్
    జవితో నేర్వగ విద్య శక్యమగుఁ బ్రస్థానమ్ము నిశ్చింతగా
    నవధానమ్మగు శాస్త్ర శోధనయు నయ్యా సంశయమ్మేలనో
    అవధానాభ్యసనార్థ శిక్షణములయ్యా మేలుఁ గూర్చునే?

    రిప్లయితొలగించండి
  7. కవి పుంగవు లౌరా యన
    నవలోకింప నవలీల నవనిన్ వేవే
    లవధానమ్ములు సేసిన
    యవధానికి శిక్షణమ్ము లవసర మగునా


    అవలీలన్ భువి లోన సాధనమునన్ వ్యాపించుఁ బ్రావీణ్యముల్
    లవ మంతైనను సంతతమ్ము ననివార్యం బౌను జింతింపఁగా
    నవనీ వాసుల కెల్ల కార్యముల కభ్యాసమ్ము శంకింప కి
    ట్లవధానాభ్యస నార్థ శిక్షణము లయ్యా మేలుఁ జేకూర్చునే

    రిప్లయితొలగించండి
  8. స్తవనీయమ్మగు సేద్యమున్ సలిపినన్ సాధ్యమ్ము కావించగా
    నవదానమ్ములు శిష్యపాళి కల విద్యావంతు డూతమ్మిడన్
    పవివేగమ్మువదానముల్ సలుప, విధ్వాంసుండు కాకున్నచో
    నవధా నాభ్యసనార్థ శిక్షణము లయ్యా మేలుఁ జేకూర్చునే?

    రిప్లయితొలగించండి

  9. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    వ్యవధాన మివ్వకుండగ
    నవలీలగ చెప్పు పద్య మద్భుత రీతిన్
    స్తవనీయపు ధారణ గల
    యవధానికి శిక్షణమ్ము లవసర మగునా?

    రిప్లయితొలగించండి