24, మే 2026, ఆదివారం

సమస్య - 5477

25-5-2026 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“శివునిఁ జూడదంట శీతనగజ”

(లేదా...)

“శివుని ముఖమ్ముఁ జూడదఁట శీతనగాత్మజ మంచిదే కదా”

12 కామెంట్‌లు:

  1. తలపయి సురనదిని ధరించ దప్పుగ
    శివునిఁ జూడదంట శీతనగజ ;
    విపులపయి దిగుటకు వీలు కలుగు నట్లు
    తలను ప్రాపు జేయ దలచెనుగద

    రిప్లయితొలగించండి
  2. ఆటవెలది
    ఎన్నిజన్మలైన నీశ్వరునెంచుచున్
    బతిగ పొందజూచు పరవశమున
    జగములేలు జనని,నగుమోములేకుండ
    శివునిఁ జూడదంట శీతనగజ!

    చంపకమాల
    అవగుణుఁడంచునెందరును నాదిశివున్ దెగనాడుచుండినవ్
    భవునినె జన్మజన్మలకు భర్తగనెంచెడు భక్తిభావనన్
    శివము నొసంగు వాడనెడు చింతనతో నగుమోములేకయే
    శివుని ముఖమ్ముఁ జూడదఁట శీతనగాత్మజ మంచిదే కదా!

    రిప్లయితొలగించండి

  3. తాను కోరు కొనిన దక్షాధ్వరధ్వంసి
    తనను పెండ్లి యాడు తరుణ మందు
    సహజ సిద్ధ మైన శాలీనతయె క్రమ్మ
    శివునిఁ జూడదంట శీతనగజ.


    కవికుల శ్రేష్టుడైన కవి కావ్యము నందు రచించె నివ్విధిన్
    సవుని ధరించి నట్టి నగ చాపుని భర్తగ బొంద గోరి భై
    రవి తప మాచరించిన, కరగ్రహణమ్ము తరిన్ హ్రిణీయ తోన్
    శివుని ముఖమ్ముఁ జూడదఁట శీతనగాత్మజ, మంచిదే కదా.

    రిప్లయితొలగించండి
  4. పరమశివునిజూచి పరవశించి కడకు
    శూలిపత్నియయ్యె శైలపుత్రి
    స్వామి దేహమందు సగమయ్యెఁ గావునన్
    శివునిఁ జూడదంట శీతనగజ

    భవహరుడే మనోహరుడు భార్గవి చేతన మందు నెన్నడున్
    శివునికి భార్యయై పరవ శించెడు భామిని కండ్లు మూసినన్
    శివుని విలాసమే తనదు చిత్తమునందున నిల్చి యుండగా
    శివుని ముఖమ్ముఁ జూడదఁట శీతనగాత్మజ మంచిదే కదా

    రిప్లయితొలగించండి
  5. -

    చూచు నర్ధనారి సుందర మూర్తియా
    శివుని; చూడదంట శీతనగజ
    నతని తలని నిలచి నట్టి గంగను చిత్ర
    మైన దేవరలు ప్రమథుల విభులు


    https://youtube.com/shorts/JR4zWuWyn_I?si=6hpF_ietb22Rhjam


    రిప్లయితొలగించండి
  6. ఆ॥వె
    తనదు పిరిమితోడ తనరినట్టిసుతుడు
    మగని కినుక మొనల మరిమినొంద
    కొడుకు బ్రదికి మరల యొడిని జేరు వరకు
    శివునిఁజూడదంట శీతనగజ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 👆తనను అడ్డగించిన వినాయకుని తల త్రిశూలముతో శివుడు త్రెంచిన సందర్భం: పార్వతి చెలికత్తె ప్రమథులతో .......)

      తొలగించండి
  7. శివుని గూర్చి తపము చేసెడి గిరిజకు
    రూపు మార్చి నిలిచె రుద్రు డెదుట
    పరి చ యంబు లేని పరుని చూడ క పుడు
    శివుని చూడ దంట శీత నగజ

    రిప్లయితొలగించండి
  8. తన సముఖము నందుఁ దగులఁబడ మరుఁడు
    చేష్ట లుడిగి నిలువఁ గష్టము గని
    మాయ మయిన నంత మారహరుఁ డకట
    శివునిఁ జూడదంట శీత నగజ


    ఎవని వరించి ఘోర తప మిద్ధ మనమ్మునఁ జేయుచున్నదో
    యవిరళ నిష్ఠ శీత నగ మందు నతండె వరింప వచ్చినన్
    భవుఁ డని నేరకే కపట పావన సంయమి వేష ధారి యా
    శివుని ముఖమ్ముఁ జూడ దఁట శీత నగాత్మజ మంచిదే కదా

    రిప్లయితొలగించండి
  9. ఆ.వె.
    కోరుకున్న శివుడు గూడి వచ్చిన వేళ
    సిగ్గు మొగ్గ తొడిగె సింహధరకు
    మనసు తొందరించె మగనిఁ జూడఁగ నైన
    శివునిఁ జూడదంట శీతనగజ

    చంపకమాల:
    భవుని మనంబునందు తన భర్తగ పార్వతి నిల్పి భక్తితో
    శివశివ శంకరా యనుచు జేయుచు పూజలనంగు ప్రాపుతో
    శివుని ప్రసన్నతన్ బడసి చెంతకు జేరిన వేళ పత్నియై
    శివుని ముఖమ్ముఁ జూడదఁట శీతనగాత్మజ మంచిదే కదా

    రిప్లయితొలగించండి
  10. చ.

    శివుని‌ సగంబు‌ పార్వతి‌ వసించి జగంబుననాది‌ జంటగా
    భవము‌ జవంబు‌ పద్ధతి‌ శుభంబు‌ సృజించు‌ ప్రధాన‌ కర్తలై‌
    భువిగగనంబులిర్వురు‌ విభూష‌ ములౌచు‌ నిమగ్న‌ మవ్వగా
    శివుని ముఖమ్ము జూడదట శీతనగాత్మజ మంచిదేకదా!
    ---------------------------------------

    రిప్లయితొలగించండి

  11. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    తపమొనర్చ గౌరి తాను విపినమందు
    పతిగ కోరినంత భవుడు మెచ్చె
    పెండ్లి జరిగెడు శుభ వేళ సిగ్గులొలక
    శివుని జూడదంట శీతనగజ!

    రిప్లయితొలగించండి