9, జూన్ 2026, మంగళవారం

సమస్య - 5493

10-6-2026 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ఎవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో”

(లేదా...)

“ఎవఁ డెవ్వాఁడొ యెవండొ యెవ్వఁడొ యతం డెవ్వాఁడొ యెవ్వండొకో”

3 కామెంట్‌లు:


  1. ఎవడని‌ గుర్తింతు మిపుడు‌
    ఎవడో చేసిన‌ గడబిడ‌ కేదో‌ జరిగెన్‌
    వివరము‌ తెలియాలిప్పుడు
    ఎవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో”




    రిప్లయితొలగించండి
  2. కందం
    అవగుణ వర్తనులసురుల్
    భువినమరత్వముగొను భ్రమఁ బొంద వరమ్ముల్
    స్తవముల నడంచె హరి గా
    కెవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో?

    మత్తేభవిక్రీడితము
    అవధుల్ మీరిన రాక్షసత్వమున సర్వానర్థముల్ సల్పుచున్
    భువిపై తామమరత్వపున్ భ్రమను నిర్మూలింపగాఁ జూచినన్
    స్తవనీయమ్మగు భంగి వారలనె తా దామోదరుండొంచె! వే
    రెవఁ డెవ్వాఁడొ యెవండొ యెవ్వఁడొ యతం డెవ్వాఁడొ యెవ్వండొకో?

    రిప్లయితొలగించండి
  3. ఎవరీ తప్పు సలిపిరో !
    సవరించుట యెవరికైన సాధ్యంబగునా !
    కవనపు దోషము దిద్ధున
    దెవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో”

    రిప్లయితొలగించండి