11-7-2026 (శనివారం)ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“శివునిఁ బూజింపనొప్పు మసీదునందు”(లేదా...)“శివునకుఁ బూజ సేయఁగ మసీదొకటే తగినట్టి స్థానమౌ”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తేటగీతిశివములన్ శుభముల గూర్చ శివుడనెదరుమంగళకరుడల్లా యన మలకలెల్లనిత్యమున్ ప్రార్థనలవేళ నీమమెంచిశివునిఁ బూజింపనొప్పు మసీదునందుచంపకమాలశివములనన్ శుభమ్ములనఁ జిందఁగవాటి శివుండటందురేస్తవముల నా రహీముఁగని సాంత్వనఁ బొందఁగ వేడుచుండగన్శివము మహమ్మదీయులకుఁ జిందును! వాడె శివుండు! వార లాశివునకుఁ బూజ సేయఁగ మసీదొకటే తగినట్టి స్థానమౌ!
హిందువులు దేవళము నందు హితము కోరి శివునిఁ బూజింపనొప్పు ; మసీదునందుతురకలు నమాజు సలుపును తొరలు రీతి వారి విధములు వేరయ్యు పరమమొకడె
అది మహమ్మదీయుల ప్రార్థనాలయమని యెఱుగకనె వచించితి వేమొ హిందు వటకు నేగు నెట్లు చెప్పె నెవడు నీకు? నెచట శివునిఁ బూజింపనొప్పు మసీదునందు?వివరిణు డెవ్వడో పలుక వింటివి కాని మసీదటం చనన్ యవనుల ప్రార్థనాలయమటంచు నెఱంగియు వెఱ్ఱి వాడవై ధవలపు ద్రావకమ్ము కలు ద్రావి వచించితి వియ్యదెచ్చ టన్ శివునకుఁ బూజ సేయఁగ మసీదొకటే తగినట్టి స్థానమౌ.?
ఇందునందను సంశయమేల నీకుదేవుని యునికి లేని ప్రదేశమేదిజగతి నెచ్చటైనను పూజ సలుపవచ్చు శివునిఁ బూజింపనొప్పు మసీదునందుశివుని పవిత్రతన్ దలచి చిన్మయ రూపుని దివ్యలింగమున్శవములఁ గాల్చుచోటగు శ్మశానము నందునఁ జూచి వెంటనేశివునకుఁ బూజ సేయఁగ మసీదొకటే తగినట్టి స్థానమౌనవనిని యంచు పల్కెనట నాయవనుండు విశేషరీతినిన్
భువనము నందు కీర్తియును పూర్ణ సుఖంబులు పొంది పిమ్మటన్భవములు పాయజేయుటకు భక్తుల కొప్పును భక్తి తోడుతన్శివునకు బూజసేయగ మసీదొకటే తగినట్టి స్థానమౌయవనుల కెప్పుడేనియును నాదట కొల్వగ వారి దేవునిన్
భక్తితో హిందువులు గూడి పరవశమునశివునిఁ బూజింపనొప్పు, మసీదునందుజేరి ముస్లిము సోదరుల్ చిత్తమలరవల్లెవేయుదురు ఖురాను భక్తి గదుర
ఎవరి మతమ్ము వారలకు నేర్పరచున్ దగు భక్తిమార్గమున్శివమును గూర్చు హిందువులు చిత్తమునందున భక్తితోడనాశివునకుఁ బూజ సేయఁగ, మసీదొకటే తగినట్టి స్థానమౌశ్రవణమొనర్ప ముస్లిములు శ్రద్ధగ బల్కు ఖురాను సూక్తులన్
చం॥ సవినయ సంపదల్ గనుచు సర్వులు నొక్కటి యన్న చింతనేభువిని జనాళి కాంచి నిజబుద్ధినిఁ దాల్చఁగ భేదముండునేభవిత వెలుంగుఁ గోవెలలు వారివి వీరివనంగఁ జెల్లునేశివునకుఁ బూజ సేయఁగ మసీదొకటే తగినట్టి స్థానమౌ(ఎలాగు అల్లా అంటే సంస్కృతార్థము పరమేశ్వరుడు తల్లి కదండి)
తేటగీతి పూరణ అండిఇందు గలడందు లేడని యెవరనిరొకొఈశుఁడుండని చోటేది యిది యెఱుఁగమెయెచట నుండిన నచటనె రుచిగ కొలుచు శివునిఁ బూజింప నొప్పు మసీదునందు
అన్ని చోటుల వ్యాపించు హరుని గూర్చియెచ్ఛ టైనను పూజింప వచ్చు నంద్రు స్వీకరించును పూజల ప్రీతి గాను శివుని పూజింప నొప్పు మసీదు నందు
*శంకరాభరణం సమస్యాపూరణం* చంపకమాల.స్తవముల షిర్డి చేరుకొని సాధన చేసిన భక్త మేఘుడానవవిధ భక్తి మార్గముల, నమ్మిన యీశునిఁ గాంచి సాయిలో,శివశివ యంచు నెంచెఁ గడు శ్రేష్టముగాఁ దనకండ్లు చూచు నా*శివునకుఁ బూజ సేయఁగ మసీదొకటే తగినట్టి స్థానమౌ.*(మేఘశ్యాముడనే శివభక్తుడు షిర్డీ సాయిబాబాలో శివుని చూసి అభిషేకం చేసిన వృత్తాంతం)
అవనిఁ దురకల దైవము శివము లొసఁగు నా తురుష్కులకుఁ గనుక నతని శివుఁ డనంగ నొప్పు భక్తిని నంతరంగ మందు శివునిఁ బూజింప నొప్పు మసీదు నందు అవని శివార్చ నార్హము లనంతము లయ్య గణించి చూడఁ గానివి పరికింప శూన్యములె నిక్కముగా వల దిందు శంకలే చెవులకుఁ గంటకమ్ము లివి చెప్పిన మానవుఁ డే తురుష్కుఁడో శివునకుఁ బూజ సేయఁగ మసీ దొకటే తగినట్టి స్థానమౌ
అవిరలమైన వర్షము రయమ్మున గూల్చ మసీదు గాలిచే భవుని పురాతనంపు గుడి వ్యక్తము గాన్ శివలింగ మచ్చటన్ప్రవిమల బుద్ది ముస్లిములు స్వాగతమంచు వచించ మైత్రితోశివునకుఁ బూజసేయగ మసీదొకటే తగినట్టి స్థానమౌ
సమస్య:శివునకుఁ బూజ సేయఁగ మసీదొకటే తగినట్టి స్థానమౌ!చ.మాల :అవిసిన ప్రాణ మున్నిలుప డాతఁడెయంచు త్రిపాత్తు గొల్వగన్ ! అవిరళ భక్తితోడుతను నా హర సర్వ చరాచరుండనే సవినయ నిర్మలాత్ముడయి స్థానము లెంచక పూర్ణచిత్తమున్ శివునకుఁ బూజ సేయఁగ మసీదొకటే తగినట్టి స్థానమౌ!భవుడును నిల్చె హజ్ మదిని భక్తిని బూజలు సేయ వింటిలే
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.ప్రతి దినంబు వెడలుచు దేవాలయమునశివునిఁ బూజింప నొప్పు; మసీదునందుమంచిగాను ముస్లిములు నమాజు చేసిప్రార్ధనల్ చేతు రల్లాను పరవశించి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
తొలగించండిశివములన్ శుభముల గూర్చ శివుడనెదరు
మంగళకరుడల్లా యన మలకలెల్ల
నిత్యమున్ ప్రార్థనలవేళ నీమమెంచి
శివునిఁ బూజింపనొప్పు మసీదునందు
చంపకమాల
శివములనన్ శుభమ్ములనఁ జిందఁగవాటి శివుండటందురే
స్తవముల నా రహీముఁగని సాంత్వనఁ బొందఁగ వేడుచుండగన్
శివము మహమ్మదీయులకుఁ జిందును! వాడె శివుండు! వార లా
శివునకుఁ బూజ సేయఁగ మసీదొకటే తగినట్టి స్థానమౌ!
హిందువులు దేవళము నందు హితము కోరి
రిప్లయితొలగించండిశివునిఁ బూజింపనొప్పు ; మసీదునందు
తురకలు నమాజు సలుపును తొరలు రీతి
వారి విధములు వేరయ్యు పరమమొకడె
రిప్లయితొలగించండిఅది మహమ్మదీయుల ప్రార్థనాలయమని
యెఱుగకనె వచించితి వేమొ హిందు వటకు
నేగు నెట్లు చెప్పె నెవడు నీకు? నెచట
శివునిఁ బూజింపనొప్పు మసీదునందు?
వివరిణు డెవ్వడో పలుక వింటివి కాని మసీదటం చనన్
యవనుల ప్రార్థనాలయమటంచు నెఱంగియు వెఱ్ఱి వాడవై
ధవలపు ద్రావకమ్ము కలు ద్రావి వచించితి వియ్యదెచ్చ టన్
శివునకుఁ బూజ సేయఁగ మసీదొకటే తగినట్టి స్థానమౌ.?
ఇందునందను సంశయమేల నీకు
రిప్లయితొలగించండిదేవుని యునికి లేని ప్రదేశమేది
జగతి నెచ్చటైనను పూజ సలుపవచ్చు
శివునిఁ బూజింపనొప్పు మసీదునందు
శివుని పవిత్రతన్ దలచి చిన్మయ రూపుని దివ్యలింగమున్
శవములఁ గాల్చుచోటగు శ్మశానము నందునఁ జూచి వెంటనే
శివునకుఁ బూజ సేయఁగ మసీదొకటే తగినట్టి స్థానమౌ
నవనిని యంచు పల్కెనట నాయవనుండు విశేషరీతినిన్
భువనము నందు కీర్తియును పూర్ణ సుఖంబులు పొంది పిమ్మటన్
రిప్లయితొలగించండిభవములు పాయజేయుటకు భక్తుల కొప్పును భక్తి తోడుతన్
శివునకు బూజసేయగ మసీదొకటే తగినట్టి స్థానమౌ
యవనుల కెప్పుడేనియును నాదట కొల్వగ వారి దేవునిన్
భక్తితో హిందువులు గూడి పరవశమున
రిప్లయితొలగించండిశివునిఁ బూజింపనొప్పు, మసీదునందు
జేరి ముస్లిము సోదరుల్ చిత్తమలర
వల్లెవేయుదురు ఖురాను భక్తి గదుర
ఎవరి మతమ్ము వారలకు నేర్పరచున్ దగు భక్తిమార్గమున్
రిప్లయితొలగించండిశివమును గూర్చు హిందువులు చిత్తమునందున భక్తితోడనా
శివునకుఁ బూజ సేయఁగ, మసీదొకటే తగినట్టి స్థానమౌ
శ్రవణమొనర్ప ముస్లిములు శ్రద్ధగ బల్కు ఖురాను సూక్తులన్
చం॥ సవినయ సంపదల్ గనుచు సర్వులు నొక్కటి యన్న చింతనే
రిప్లయితొలగించండిభువిని జనాళి కాంచి నిజబుద్ధినిఁ దాల్చఁగ భేదముండునే
భవిత వెలుంగుఁ గోవెలలు వారివి వీరివనంగఁ జెల్లునే
శివునకుఁ బూజ సేయఁగ మసీదొకటే తగినట్టి స్థానమౌ
(ఎలాగు అల్లా అంటే సంస్కృతార్థము పరమేశ్వరుడు తల్లి కదండి)
తేటగీతి పూరణ అండి
తొలగించండిఇందు గలడందు లేడని యెవరనిరొకొ
ఈశుఁడుండని చోటేది యిది యెఱుఁగమె
యెచట నుండిన నచటనె రుచిగ కొలుచు
శివునిఁ బూజింప నొప్పు మసీదునందు
అన్ని చోటుల వ్యాపించు హరుని గూర్చి
రిప్లయితొలగించండియెచ్ఛ టైనను పూజింప వచ్చు నంద్రు
స్వీకరించును పూజల ప్రీతి గాను
శివుని పూజింప నొప్పు మసీదు నందు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి*శంకరాభరణం సమస్యాపూరణం*
రిప్లయితొలగించండిచంపకమాల.
స్తవముల షిర్డి చేరుకొని సాధన చేసిన భక్త మేఘుడా
నవవిధ భక్తి మార్గముల, నమ్మిన యీశునిఁ గాంచి సాయిలో,
శివశివ యంచు నెంచెఁ గడు శ్రేష్టముగాఁ దనకండ్లు చూచు నా
*శివునకుఁ బూజ సేయఁగ మసీదొకటే తగినట్టి స్థానమౌ.*
(మేఘశ్యాముడనే శివభక్తుడు షిర్డీ సాయిబాబాలో శివుని చూసి అభిషేకం చేసిన వృత్తాంతం)
అవనిఁ దురకల దైవము శివము లొసఁగు
రిప్లయితొలగించండినా తురుష్కులకుఁ గనుక నతని శివుఁ డ
నంగ నొప్పు భక్తిని నంతరంగ మందు
శివునిఁ బూజింప నొప్పు మసీదు నందు
అవని శివార్చ నార్హము లనంతము లయ్య గణించి చూడఁ గా
నివి పరికింప శూన్యములె నిక్కముగా వల దిందు శంకలే
చెవులకుఁ గంటకమ్ము లివి చెప్పిన మానవుఁ డే తురుష్కుఁడో
శివునకుఁ బూజ సేయఁగ మసీ దొకటే తగినట్టి స్థానమౌ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅవిరలమైన వర్షము రయమ్మున గూల్చ మసీదు గాలిచే
రిప్లయితొలగించండిభవుని పురాతనంపు గుడి వ్యక్తము గాన్ శివలింగ మచ్చటన్
ప్రవిమల బుద్ది ముస్లిములు స్వాగతమంచు వచించ మైత్రితో
శివునకుఁ బూజసేయగ మసీదొకటే తగినట్టి స్థానమౌ
సమస్య:
రిప్లయితొలగించండిశివునకుఁ బూజ సేయఁగ మసీదొకటే తగినట్టి స్థానమౌ!
చ.మాల :
అవిసిన ప్రాణ మున్నిలుప డాతఁడెయంచు త్రిపాత్తు గొల్వగన్ !
అవిరళ భక్తితోడుతను నా హర సర్వ చరాచరుండనే
సవినయ నిర్మలాత్ముడయి స్థానము లెంచక పూర్ణచిత్తమున్
శివునకుఁ బూజ సేయఁగ మసీదొకటే తగినట్టి స్థానమౌ!
భవుడును నిల్చె హజ్ మదిని భక్తిని బూజలు సేయ వింటిలే
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ప్రతి దినంబు వెడలుచు దేవాలయమున
శివునిఁ బూజింప నొప్పు; మసీదునందు
మంచిగాను ముస్లిములు నమాజు చేసి
ప్రార్ధనల్ చేతు రల్లాను పరవశించి.