పలువురు సామాన్యు లనట ఖలురగు దుండగులు చంప ఖష్పము తోడన్ సలిపిన భారత చర్యలు చలిమలలోఁ జిచ్చు రేగెఁ జల్లార్చుటకే.
పలువురు భారతీయులను పాశవి కమ్ముగ తీవ్ర వాదులౌ ఖలురట గావు పెట్టిరని ఖష్పము భారత ప్రాభ వత్వ మే సలిపిన యట్టిచర్య మనజాతి మనస్సుకు శాంతి గూర్చేనే చలిమలలోన రేగినవి జ్వాలలు చల్లదనంబుఁ గూర్చఁగన్.
(మొదట మన్మథుని మూడవ కంటితో భస్మము చేయుటకు జ్వాలలు తరువాత శివుడు తపము మానుట వలన చల్లదనము కలిగిందని అండి. హిమాలయాలలో భూకంపము రాగలదు మడత పర్వతములుగా రమారమి 20-25 మిలియన్ సంవత్సరాల క్రితము ఏర్పడినందున. మంటలు రాకపోవచ్చు నండి)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
తొలగించండికలతలు రేపెడు మంటలు
చలిమల క్రిందఁ జెలరేగ జలమదె పారన్
దులుచన శంకరు భ్రుకుటిన్
చలిమలలో చిచ్చురేగెఁ జల్లార్చుటకే!
చంపకమాల
కలతలు రేపెడున్ సరళి క్రమ్మగ జ్వాలలు కొండ క్రిందుగన్
దులుచన నీరు పారుటకు త్రుళ్లిన శంకరు త్ర్యంబకంబునన్
జ్వలితము మంచునే కరుగ సాయము జేసి హితమ్ము గూర్చఁగన్
జలిమలలోన రేగినవి జ్వాలలు చల్లదనంబుఁ గూర్చఁగన్
కులములపై యుత్తరమున
రిప్లయితొలగించండిచలిమలలోఁ జిచ్చు రేగెఁ ; జల్లార్చుటకే
పొలయు యెనికల సమయమున
యిలపయి నింక నిటువంటి వేర్పాడ కుండన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"కులములపై నుత్తరమున... పొలసెడి యెన్నికలప్పుడె యిలపయి" అనండి.
🙏
తొలగించండి
రిప్లయితొలగించండిపలువురు సామాన్యు లనట
ఖలురగు దుండగులు చంప ఖష్పము తోడన్
సలిపిన భారత చర్యలు
చలిమలలోఁ జిచ్చు రేగెఁ జల్లార్చుటకే.
పలువురు భారతీయులను పాశవి కమ్ముగ తీవ్ర వాదులౌ
ఖలురట గావు పెట్టిరని ఖష్పము భారత ప్రాభ వత్వ మే
సలిపిన యట్టిచర్య మనజాతి మనస్సుకు శాంతి గూర్చేనే
చలిమలలోన రేగినవి జ్వాలలు చల్లదనంబుఁ గూర్చఁగన్.
మలహరుని కంటిమంటల
రిప్లయితొలగించండిచలిమలలోఁ జిచ్చు రేగెఁ జల్లార్చుటకే
సలిపిన యత్నపు ఫలితము
చలిమల చూలికి వివహము సామి జననమే
చలిమలచూలిపై శివుని చల్లని చూపుల లక్ష్యమెంచి పు
వ్విలుతుడు మాడిపోయె గద వేడిమికన్దొర కంటిమంటలో
ఫలితము చల్లనైనదగు పార్వతి పెండిలి సామి జన్మమే
చలిమలలోన రేగినవి జ్వాలలు చల్లదనంబుఁ గూర్చఁగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండికం:కలహము తేగా చైనా
రిప్లయితొలగించండిచలిమలలోఁ జిచ్చు రేగెఁ, జల్లార్చుట కే
బలవ ద్దేశము రా వలె ?
తలపడ మన సేన పొగరు తగ్గి మరలెగా!
చం:పలికెను భర్తృ హీన యయి పత్ని రతీసతి యిట్లు "శంకరా!
రిప్లయితొలగించండితలపగ నీ వివాహ మది తప్పగునే? తవ నేత్రదృష్టి చే
జలిమలలోన రేగినవి జ్వాలలు చల్లదనంబుఁ గూర్చఁగన్
దలచవె నాదు చిత్తమున! దక్కగ జేయవె నాకు నాథునిన్ !"
చం॥ తలఁచి తపమ్ము సాగక త్రిధాముఁడు వీడ్కొను రీతి మారుఁడే
రిప్లయితొలగించండికలఁచ శరమ్ము వేయచు వికారముఁ గాంచఁగ నీశుఁ డుగ్రుఁడై
యలుగుచుఁ గాల్చ మన్మథుని నంతము జేయుచు శాంతిఁ బొందఁగన్
జలిమలలోన రేగినవి జ్వాలలు చల్లదనంబుఁ గూర్చగన్
(మొదట మన్మథుని మూడవ కంటితో భస్మము చేయుటకు జ్వాలలు తరువాత శివుడు తపము మానుట వలన చల్లదనము కలిగిందని అండి. హిమాలయాలలో భూకంపము రాగలదు మడత పర్వతములుగా రమారమి 20-25 మిలియన్ సంవత్సరాల క్రితము ఏర్పడినందున. మంటలు రాకపోవచ్చు నండి)
నలుదెసలు రేఁగక మునుపె
రిప్లయితొలగించండిపిలువుమ జన సంచయమ్ము వెదచల్లుమ వే
సలిలము, మన నిమ్మా బ
చ్చలి, మలలోఁ జిచ్చు రేఁగెఁ జల్లార్చుటకే
తెలిపెదఁ ద్రోవ పిమ్మట యతిప్రవరా యిట విశ్రమింపుమా
వలచిన నీరజాక్షులను భావజు పా లొనరింప న్యాయమే
చెలువుఁడ యిమ్ము కౌఁగిలినిఁ, జెన్నుగ రేఁగఁగఁ గామ తాపమే
చలిమల లోన రేఁగినవి జ్వాలలు, చల్లఁదనంబుఁ గూర్పఁగన్
కలవర బెట్టిన మదనుని
రిప్లయితొలగించండివిలవిల లాడంగ జేయ వెక్క స మగుచున్
చెల రేగ శివుని కంటిని
చలి మల లో చిచ్చు రేగె జల్లా ర్చుట కే
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
కలహించగ నా చైనా
చలిమలలోఁ జిచ్చు రేగెఁ; జల్లార్చుటకే
బలగమ్ముల పంపించగ
విలవిలమని శత్రు సేన వెనుకకు మరలెన్.