మ:ఘనమౌ నాశ్రమ మొండు గట్టితివి మోక్షమ్మున్ మదిన్ దల్చి, నీ ఘనతత్త్వ మ్మెటు బోయె? కీర్తి గొన సంఘద్రోహులే శిష్యు లై ధనమున్ గుంజెడు దారిలో నడుప నిందల్ దక్కె నింకేమి సా ధన!సంపాదన లేనివానికె కదా దక్కున్ సుఖంబుల్ భువిన్” (అనేక మంది స్వాములు మొదట ఆథ్యాత్మిక దృష్టి తో ఆశ్రమాలు పెడతారు.అక్కణ్నుంచి సంఘం లో పేరు కోసం అవినీతిపరులు శిష్యులు గా తయారై స్వాములను సంపాదన లోకి దింపుతారు. ఇక వాళ్ల సాధన నాశనమై సొమ్ము మనుషులు గా తయా రౌతారు. )
మ॥ తన పూర్వీకులు సంపదల్ చతురులై తాల్మిన్ గడించంగఁ జా ల నిధానమ్మును వారసుండుగనటుల్ ప్రాప్తించఁగన్ భూరిగా మనఁగన్ సౌఖ్యము మీరు రీతిఁ గని సంపాదించఁగా నేలకో ధన సంపాదన లేని వానికె కదా దక్కున్ సుఖంబుల్ భువిన్
(గొప్ప ఆస్తికి వారసుడైతే వాడు చక్కగా ధనము బ్యాంకులో వేసుకొని హాయిగా బ్రదకగలడు కదండి).
కందం
రిప్లయితొలగించండినింపాదిగ కర్తవ్యము
నింపుగ నెఱవేర్చి ఫలము నీశ్వరునికిడన్
సొంపగు బ్రతుకది, యక్రమ
సంపాదన లేనివాఁడె సౌఖ్యంబందున్
మత్తేభవిక్రీడితము
అనయంబున్ పరమాత్మచింతనముతో నానందమున్ బొందుచున్
దనదౌ జీవిత దృక్పథమ్మునను కర్తవ్యంబె ముఖ్యమ్ముగన్
వినయంబన్నది శోభిలన్, విడి ఫలాపేక్షన్, దురాలోచనన్
ధనసంపాదన లేనివానికె కదా దక్కున్ సుఖంబుల్ భువిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసొంపుగ సోదరుల నడుమ
రిప్లయితొలగించండిపంపకము సలుపెడు వేళ పదముగ మనసు
చంపుకొని లంచముగ గొను
సంపాదన లేనివాఁడె సౌఖ్యంబందున్
రిప్లయితొలగించండిచంపా! వినుమిది చెప్పెద
కొంపలు కూల్చంగ నేల కుటిలత్వము తో
సంపద పెంచగ, నక్రమ
సంపాదన లేనివాఁడె సౌఖ్యంబందున్.
అనయమ్మా యపునర్భవమ్ము కొరకై యారాటమున్ జూపుచున్
మనమున్ శంకర రూపమున్ నిలిపి సమ్మానించుటే కృత్యమై
మనుటే ముఖ్యముసోదరా వసుధలో మంజూష లో దాచెడిన్
ధనసంపాదన లేనివానికె కదా దక్కున్ సుఖంబుల్ భువిన్.
సంపాదన సక్రమమై
రిప్లయితొలగించండినింపాది గ జీవ నంపు నిర్మల ప్రద మై
సొంపు గ బ్రతుకుచు నక్రమ
సంపాదన లేనివాడె సౌఖ్యం బందున్
సంపాదింపవలెను ధన
రిప్లయితొలగించండిమింపుగ నియమాలతోడ మెచ్చిన రీతిన్
దెంపుంబడు దుర్మార్గపు
సంపాదన లేనివాఁడె సౌఖ్యంబందున్
ధన సంపాదనకై తపించుచు సదా దౌర్జన్య కృత్యాలతో
నెనలేనంతగ కూడఁబెట్టినను తానేరీతి సంతృప్తుడౌ
వినియోగింపగ లేడు తృప్తి కలదా పేరాసలో నిర్నిబం
ధన సంపాదన లేనివానికె కదా దక్కున్ సుఖంబుల్ భువిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపనినే దైవముగా దలంచుచు సదా పన్జేయుచున్ రాయుడున్
రిప్లయితొలగించండిధనమున్ కూడగ బెట్టి నిర్ధనులకున్ దానంబులన్ జేసి తా
ననవద్యుండగుచున్ సుఖించె హముగా నావంతయున్ పాపపుం
ధనసంపాదన లేనివానికె కదా దక్కున్ సుఖంబుల్ భువిన్
కం:ఇంపౌ నడవడి గల్గియు,
రిప్లయితొలగించండిసొంపగు భాషణము గల్గి, సుఖబడు కోర్కెల్
పెంపై యక్రమ రీతుల
సంపాదన లేనివాఁడె సౌఖ్యంబందున్
మ:ఘనమౌ నాశ్రమ మొండు గట్టితివి మోక్షమ్మున్ మదిన్ దల్చి, నీ
రిప్లయితొలగించండిఘనతత్త్వ మ్మెటు బోయె? కీర్తి గొన సంఘద్రోహులే శిష్యు లై
ధనమున్ గుంజెడు దారిలో నడుప నిందల్ దక్కె నింకేమి సా
ధన!సంపాదన లేనివానికె కదా దక్కున్ సుఖంబుల్ భువిన్”
(అనేక మంది స్వాములు మొదట ఆథ్యాత్మిక దృష్టి తో ఆశ్రమాలు పెడతారు.అక్కణ్నుంచి సంఘం లో పేరు కోసం అవినీతిపరులు శిష్యులు గా తయారై స్వాములను సంపాదన లోకి దింపుతారు. ఇక వాళ్ల సాధన నాశనమై సొమ్ము మనుషులు గా తయా రౌతారు. )
మ॥ తన పూర్వీకులు సంపదల్ చతురులై తాల్మిన్ గడించంగఁ జా
రిప్లయితొలగించండిల నిధానమ్మును వారసుండుగనటుల్ ప్రాప్తించఁగన్ భూరిగా
మనఁగన్ సౌఖ్యము మీరు రీతిఁ గని సంపాదించఁగా నేలకో
ధన సంపాదన లేని వానికె కదా దక్కున్ సుఖంబుల్ భువిన్
(గొప్ప ఆస్తికి వారసుడైతే వాడు చక్కగా ధనము బ్యాంకులో వేసుకొని హాయిగా బ్రదకగలడు కదండి).
కం॥ ఇంపుగ వారసుఁడుగఁ గన
తొలగించండినింపుగ నాస్తులు విరియుచు నెమ్మది తనరన్
గంపన మేలొకొ బ్రదుకున
సంపాదన లేని వాఁడె సౌఖ్యం బందున్
(నిజానికి చిన్న పద్యము వ్రాయడమే కఠిన తరమండి)
ఇంపార వారసత్వపు
రిప్లయితొలగించండిటంపకముల నెట్టి యక్ర మార్జిత మింకం
గొంపల నెల్లను గూల్చిన
సంపాదన లేని వాఁడె సౌఖ్యం బందున్
వినుఁడీ యెల్లరు నగ్న సత్యమును సంవేద్యమ్ముఁ దా మంత్రి యై
యనునిత్యమ్మును గార్యభారమున నత్యంతమ్ము శుష్కింపఁగా
జనకుం డర్థము రాజకీయముననే సాధింపఁగా బిడ్డకున్
ధన సంపాదన లేని వానికె కదా దక్కున్ సుఖంబుల్ భువిన్
వినయమ్మున్ బలు కర్మలన్ సలుపుచున్ విజ్ఞాన సంపన్నుడై
రిప్లయితొలగించండిఅనయమ్మున్ ధృతితోడ వర్తిలుచు, సత్యమ్మైన దృక్కోణమున్
పనులన్ జేయుచు, సంసృతిన్ నడుపుచున్, పాపమ్ము మార్గమ్ములో
ధన సంపాదన లేని వానికె కదా దక్కున్ సుఖంబుల్ భువిన్
సంపద లన్నిఁటి కన్నను
రిప్లయితొలగించండినింపగు మదిలో ప్రశాంతి యెక్కటి సిరియౌ
పెంపగు నన్యాయార్జిత
సంపాదన లేనివాఁడె సౌఖ్యంబందున్
ధనమే మూలము మానవాళికి నితాంతానందముం గూర్చు నిం
రిప్లయితొలగించండిధనమై యొప్పును సౌఖ్యమిచ్చు భువి సంధానించు బంధమ్ములన్
కనగా నంతములేని కోరికల సంఘాతమ్ములో వ్రేఁగునా
ధనసంపాదన లేనివానికె కదా దక్కున్ సుఖంబుల్ భువిన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ఇంపగు వర్తనతో పై
సంపాదనకాశ పడక సన్మార్గమునన్
తంపులు తెచ్చెడు నక్రమ
సంపాదన లేనివాడె సౌఖ్యంబందున్.