18-7-2026 (శనివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తల్లిదండ్రులు మరణింపఁ దనయుఁ డలరె”
(లేదా...)
“తలిదండ్రుల్ గతియించినన్ సుతుఁడు మోదంబందె సంతుష్టుఁడై”
రాజకీయపు రంగాన రాటుదేలియెన్నికల పోరులోన తా నున్న వేళతల్లిదండ్రులు మరణింపఁ దనయుఁ డలరెసానుభూతితో గెలుపు సుసాధ్యమనుచు
కలికాలమ్మిది కాంచవచ్చునిచటన్ గాఠిన్యులౌ మూర్ఖులన్విలువేమున్నది తల్లిదండ్రుల పయిన్ వీలౌను గెల్పందురేకలితంబైనది గాదె యెన్నికలలో కాలూను వారింగనన్ దలిదండ్రుల్ గతియించినన్ సుతుఁడు మోదంబందె సంతుష్టుఁడై
ఏండ్లతరబడి మిక్కిలి యెరివు నిడినరోగములను తట్టుకొనక రోలు చుండుతల్లిదండ్రులు మరణింపఁ , దనయుఁ డలరెనోప లేని కుతిల యిక నుడిగె ననుచు
కలుగు నుండి యటకు జేర గనువినికలి గాంచి భీతిల్లి గావు కేకలను పెట్ట నాలకించి వచ్చి రటకునగము జంప తల్లిదండ్రులు, మరణింపఁ దనయుఁ డలరె.తల మందున్ జరియించుచున్ మృగములన్ దా చెండి భక్షించెడిన్ బులియే చేరె పురమ్మటంచు తెలియన్ బుత్రుండు భీతిల్లగా నెలిమిన్ బీలువ చేతబట్టి చనిరా హింసీరమున్ గూల్చ గా తలిదండ్రుల్, గతియించినన్ సుతుఁడు మోదంబందె సంతుష్టుఁడై.
అనలమున జిక్కి తమ మేను లంటుకొనఁగబ్రతుకుపైనాశ లేదని వైద్యులనగనరక యాతన నొందుచు నలుగుచున్నతల్లిదండ్రులు మరణింపఁ దనయుఁ డలరె
కలలోనైన దలంచలేదెపుఁడు నౌగ్ర్యమ్మౌ ప్రమాదమ్మునన్బలమౌ ఘాతములైన దేహములతో ప్రాణావశిష్టంబుగాతలిదండ్రుల్ తమ శేషజీవితమునం దల్లాడుచుండంగ నాతలిదండ్రుల్ గతియించినన్ సుతుఁడు మోదంబందె సంతుష్టుఁడై
మ॥ తలఁచన్ వృద్ధులు తల్లిదండ్రులటు వృద్ధాప్యంపు బాధార్తులైమెలఁగన్ గష్టముఁ గాఁగ జబ్బులను నెమ్మిన్ గాంచ దౌర్లభ్యమైకలఁతల్ పొందుచు సాగు చుండెడి తఱిన్ గాలమ్ముచేయంగ నాతలిదండ్రుల్ గతియించినన్ సుతుఁడు మోదంబందె సంతుష్టుఁడై(ఇది నేటి స్థితి అండి మంచి తిండి వైద్యము వలన జీవనావధి పెరిగి ఈ సమస్య వస్తున్నది. మనము చూస్తున్న విషయమేనండి)
మున్ను బాధింప మువ్వురు మూరి తనను దిక్కు తోచక యుండఁగ నక్కజముగ బాధితుఁ డొకఁడు నశియించు వంత లనుచుఁ, దల్లిదండ్రులు మరణింపఁ దనయుఁ, డలరె కలవే యిట్టివి సంభవింప భువిలోఁ గా నేర వెన్నండహో కలి కాలమ్మునఁ బూర్వ కాలముననే కానోపు నెందేనియుం దలఁపన్ వింతయె కాఁగ నిర్వురును బ్రత్యక్షమ్ము సప్రాణులై తలిదండ్రుల్ గతియించినన్ సుతుఁడు మోదం బందె సంతుష్టుఁడై
తల్లిదండ్రులు సంతుకు దైవ సములు పూజ నీయులు జగతికి సాజ ముగను తల్లిదండ్రులు మరణింప దనయు డల రె ననుట నంగీక రింప రీ యవని జనులు
తేటగీతిగురువు ధ్యానయోగము నేర్ప గరిమతోడజ్ఞానపథమున ప్రగతితో ఖ్యాతినొందెవదలి లోని ప్రాల్మాలిక భయములనెడుతల్లిదండ్రులు మరణింపఁ ,దనయుఁ డలరెమత్తేభవిక్రీడితముసలలిత్వమ్మున ధ్యానయోగమున నిచ్చల్ నిల్వ సంస్కారముల్బలిమిన్ జ్ఞానపథమ్మునన్ ప్రగతితో భాసిల్లి నత్యున్నతిన్.గలిగెన్, భీతియుఁ బ్రాలుమాలికలవే కాయంబునందుండెడిన్దలిదండ్రుల్., గతియించినన్ సుతుఁడు మోదంబందె సంతుష్టుఁడై
రాజకీయపు రంగాన రాటుదేలి
రిప్లయితొలగించండియెన్నికల పోరులోన తా నున్న వేళ
తల్లిదండ్రులు మరణింపఁ దనయుఁ డలరె
సానుభూతితో గెలుపు సుసాధ్యమనుచు
కలికాలమ్మిది కాంచవచ్చునిచటన్ గాఠిన్యులౌ మూర్ఖులన్
తొలగించండివిలువేమున్నది తల్లిదండ్రుల పయిన్ వీలౌను గెల్పందురే
కలితంబైనది గాదె యెన్నికలలో కాలూను వారింగనన్
దలిదండ్రుల్ గతియించినన్ సుతుఁడు మోదంబందె సంతుష్టుఁడై
ఏండ్లతరబడి మిక్కిలి యెరివు నిడిన
రిప్లయితొలగించండిరోగములను తట్టుకొనక రోలు చుండు
తల్లిదండ్రులు మరణింపఁ , దనయుఁ డలరె
నోప లేని కుతిల యిక నుడిగె ననుచు
రిప్లయితొలగించండికలుగు నుండి యటకు జేర గనువినికలి
గాంచి భీతిల్లి గావు కేకలను పెట్ట
నాలకించి వచ్చి రటకునగము జంప
తల్లిదండ్రులు, మరణింపఁ దనయుఁ డలరె.
తల మందున్ జరియించుచున్ మృగములన్ దా చెండి భక్షించెడిన్
బులియే చేరె పురమ్మటంచు తెలియన్ బుత్రుండు భీతిల్లగా
నెలిమిన్ బీలువ చేతబట్టి చనిరా హింసీరమున్ గూల్చ గా
తలిదండ్రుల్, గతియించినన్ సుతుఁడు మోదంబందె సంతుష్టుఁడై.
అనలమున జిక్కి తమ మేను లంటుకొనఁగ
రిప్లయితొలగించండిబ్రతుకుపైనాశ లేదని వైద్యులనగ
నరక యాతన నొందుచు నలుగుచున్న
తల్లిదండ్రులు మరణింపఁ దనయుఁ డలరె
కలలోనైన దలంచలేదెపుఁడు నౌగ్ర్యమ్మౌ ప్రమాదమ్మునన్
రిప్లయితొలగించండిబలమౌ ఘాతములైన దేహములతో ప్రాణావశిష్టంబుగా
తలిదండ్రుల్ తమ శేషజీవితమునం దల్లాడుచుండంగ నా
తలిదండ్రుల్ గతియించినన్ సుతుఁడు మోదంబందె సంతుష్టుఁడై
మ॥ తలఁచన్ వృద్ధులు తల్లిదండ్రులటు వృద్ధాప్యంపు బాధార్తులై
రిప్లయితొలగించండిమెలఁగన్ గష్టముఁ గాఁగ జబ్బులను నెమ్మిన్ గాంచ దౌర్లభ్యమై
కలఁతల్ పొందుచు సాగు చుండెడి తఱిన్ గాలమ్ముచేయంగ నా
తలిదండ్రుల్ గతియించినన్ సుతుఁడు మోదంబందె సంతుష్టుఁడై
(ఇది నేటి స్థితి అండి మంచి తిండి వైద్యము వలన జీవనావధి పెరిగి ఈ సమస్య వస్తున్నది. మనము చూస్తున్న విషయమేనండి)
మున్ను బాధింప మువ్వురు మూరి తనను
రిప్లయితొలగించండిదిక్కు తోచక యుండఁగ నక్కజముగ
బాధితుఁ డొకఁడు నశియించు వంత లనుచుఁ,
దల్లిదండ్రులు మరణింపఁ దనయుఁ, డలరె
కలవే యిట్టివి సంభవింప భువిలోఁ గా నేర వెన్నండహో
కలి కాలమ్మునఁ బూర్వ కాలముననే కానోపు నెందేనియుం
దలఁపన్ వింతయె కాఁగ నిర్వురును బ్రత్యక్షమ్ము సప్రాణులై
తలిదండ్రుల్ గతియించినన్ సుతుఁడు మోదం బందె సంతుష్టుఁడై
తల్లిదండ్రులు సంతుకు దైవ సములు
రిప్లయితొలగించండిపూజ నీయులు జగతికి సాజ ముగను
తల్లిదండ్రులు మరణింప దనయు డల రె
ననుట నంగీక రింప రీ యవని జనులు
తేటగీతి
రిప్లయితొలగించండిగురువు ధ్యానయోగము నేర్ప గరిమతోడ
జ్ఞానపథమున ప్రగతితో ఖ్యాతినొందె
వదలి లోని ప్రాల్మాలిక భయములనెడు
తల్లిదండ్రులు మరణింపఁ ,దనయుఁ డలరె
మత్తేభవిక్రీడితము
సలలిత్వమ్మున ధ్యానయోగమున నిచ్చల్ నిల్వ సంస్కారముల్
బలిమిన్ జ్ఞానపథమ్మునన్ ప్రగతితో భాసిల్లి నత్యున్నతిన్.
గలిగెన్, భీతియుఁ బ్రాలుమాలికలవే కాయంబునందుండెడిన్
దలిదండ్రుల్., గతియించినన్ సుతుఁడు మోదంబందె సంతుష్టుఁడై