29-7-2026 (బుధవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దేవుఁడు లేఁడని పలికి మదిం బూజింతున్”
(లేదా...)
“దేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో”
(న.చ. సాహిత్ అర్ధశతావధానంలో వెల్దండ సత్యనారాయణ గారి సమస్య)
శ్రీవనితామనోహరుఁడు, శిష్టజనావనతత్పరుండు, నానావిధపాపభంజనుఁడు, నారదసన్నుతుఁ డచ్యుతుండు, సద్భావనతోడ గొల్చిన శుభంబిడి ప్రోచు మురారి కంటె యేదేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో.పావనకాశికాపురినివాసుఁడు, బాలశశాంకమౌళి, గౌరీవనితామనోహరుఁడు, ప్రీతిని గంగనుఁ దాల్చువాఁడు, దీనావనుఁడున్, ద్రినేత్రుఁ డురగాభరణుండగు శూలి కంటె నేదేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో.
🙏
గురు పూర్ణిమ సందర్భంగా శ్రీ కందిశంకరయ్య గారికి సంగీతము చేసిన పూరణ లింకు :)https://youtu.be/r-n1YU0NP5o?is=Ih40LlPPx6bxCasX
కందంపావన నాముడు దీన జనావలి నభయాన బ్రోచి యార్తినిఁ దీర్చన్బ్రోవన్ రాముని మించినదేవుఁడు లేఁడని పలికి మదిం బూజింతున్
ఉత్పలమాలరావణు పాలి మృత్యువయి రామను బ్రోచిన వీరుడై భువిన్దీవనలిచ్చుచున్ మిగుల దీనజనావళి గాచు వాడు సంజీవుని మానసాన సుధఁ జిల్కెడు నాముడు రాము మించెడున్దేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో
ఆ వసతి చేరువు నకొక శ్రావణుడరుదెంచి జనుల సముఖము నందున్ దైవమును జూపెదననగ ,దేవుఁడు లేఁడని పలికి మదిం బూజింతున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పావను డై వేడు కొనగదీవన లాసగియు శివుండు ది క్కై నిలుచున్ కావగ నతనిని మించిన దేవుడు లేడని పలికి మ ది o బూ జింతు న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు."దీవన లొసగియు" టైపాటు.
పావన చరితుండాతడు రావణ సంహారి ధర్మ రక్షకుడతడే గోవున రాముని మించిన దేవుఁడు లేఁడని పలికి మదిం బూజింతున్.కోవెల లోన నిల్చెనని కోరు వరమ్ముల నిచ్చు వాడె యా దైవమటంచు చెప్పెడి బుధానుల మాటలు విశ్వ సింపకన్ భావన లోనె యుండు భగ వంతుడటంచు కనంగ నెక్కడో దేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో.
దైవశ్రేష్టుండుఁ సకలజీవులఁ రక్షించువాడు శ్రీవల్లభుడేపావనుని కన్న ఘనుడౌదేవుఁడు లేఁడని పలికి మదిం బూజింతున్కేవలమీ జగత్తునకు కేంద్రకమై వెలుగొందు దైవమైజీవుల సూక్ష్మమై సకల జీవులనెన్నడుఁ బ్రోచువాడు రాజీవదళేక్షణుండయిన శ్రీహరి యాతని కన్న మిన్నయౌదేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ధన్యవాదాలు గురూజీ 🙏
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
పూవిలుతుండు మన్మథుని బుగ్గియొనర్చిన వాడు కాళికాదేవికి భర్తయై సగము దేహమొసంగిన వాడు భూషగన్శీవము వాసుకిన్ నిలుపు క్ష్వేళగళుండుని కన్న మిన్నయౌదేవుడు లేడు లేడని మదింగడు నమ్ముచు గొల్తు భక్తితో
దేవుళ్లెల్లరొకరని నమోవాకమిడదగు కాని మోకరిలి ప్రభుండా వేంకటేశుని వినాదేవుడు లేడని పలికి మదిన్ పూజింతున్
భావన చేయుచు భక్తిగరావణ సంహర్తయైన రాముని కంటెన్బ్రోవఁగ భువిలో వేరొకదేవుఁడు లేఁడని పలికి మదిం బూజింతున్
భావన జేసి దీనజన బాంధవునిన్ సుగుణాభిరామునిన్దేవగణార్చితున్ సమరధీరుని రాముని నెమ్మనమ్మునన్బ్రోవుమటంచు పంక్తిరథు బుత్రునికన్నను మిన్నయైన నేదేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఉ:జీవతతిన్ సహస్రకర చేతన నిద్దుర నుండి లేపియున్,లేవగనే కనంబడుచు,లెక్కకు మించిన కర్మ లందు దానే వెలొగొందు సాక్షి యయి యీ రవి, యీతని మించి దగ్గరౌదేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో”
కం:నా విధి సంధ్యావందన మీ విధినే మరువ విప్రు నే? జ్ఞానార్తిన్గావింతు, రవిని మించినదేవుఁడు లేఁడని పలికి మదిం బూజింతున్”
కం॥ భావించి తల్లిదండ్రులసేవనము ప్రియముగ చనఁగ శ్రేయముఁ గూర్చున్గావున వారల మించెడుదేవుఁడు లేఁడని పలికి మదిం బూజింతున్పూజించు సేవించు భావములో నండి. వారు పరమపదించిన తరువాత లేచిన వెంటనే వారికి నమస్కరించుట మంచిది అని రెండవ భావమండి. ఉ॥ భావన మీరు తత్పరత భవ్య ముదావహమున్ నివాసమై తావుల నీనఁ జిత్తమునఁ దాల్మినిఁ నేమము నిష్ఠలొప్పఁగన్దీవెనలంది జీవితము దీపిలఁ గేశవు మించు చుండు నేదేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్కితో
భావమునందు భాగ్యమునభాసిలు దివ్య మహాస్వరూపమైజీవమునందునిల్చి హృదిచేతననిచ్చు నికామ తేజ విభ్రాజితమూర్తియై యలరుపావన వేంకటనాధుబోలు నేదేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో!
రే వగలు కాచు చుండును సేవ లొసంగు నిరతమ్ము క్షేమం బరయుం గావునఁ దల్లికి మించిన దేవుఁడు లేఁడని పలికి మదిం బూజింతున్ తావు నొసంగఁ డెన్నఁడును ద్రాతయె తా నని నేర నేరికిన్ దైవమ మాన వాకృతినిఁ దప్పక కాచును భక్త కోటినిం గావు మటంచు వేఁడ నర కాయము భక్తిని రాని యట్టి యే దేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
భావన జేయ భక్తిమయి, బాధలు బాపును నెమ్మితోడుతన్ కావగ వచ్చు కోరుకొన, క్రన్నన భక్తుల నాదరింపగా నీవసుధా స్థలిన్ గనగ నీశుని మించి జనాళిఁ గాంచు నే దేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో
కావగ రావా సామీ! నీవేనాప్రాణమంచు నిరతముఁదలతున్ బ్రోవగ శంభుని మించినదేవుఁడు లేఁడని పలికి మదిం బూజింతున్”
కావగ రావ రామ!,మము కారణ జన్ముడ! నీవ కాక యేదేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో” రావణ సంహరా! వరద! రమ్యకులోధ్భవ!లక్ష్శణాగ్రజా! సేవను జేయగాబలము శీఘ్రమ యీయుము నాకునెప్పుడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు."శీఘ్రమొసంగుము" అనండి.
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.దైవము కేశవుడే యనిపావన మూర్తిని గొలుచుచు ప్రతిదినమందున్బ్రోవగ నాతని మించినదేవుడు లేడని పలికి మదిం బూజింతున్.
శ్రీవనితామనోహరుఁడు, శిష్టజనావనతత్పరుండు, నా
రిప్లయితొలగించండినావిధపాపభంజనుఁడు, నారదసన్నుతుఁ డచ్యుతుండు, స
ద్భావనతోడ గొల్చిన శుభంబిడి ప్రోచు మురారి కంటె యే
దేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో.
పావనకాశికాపురినివాసుఁడు, బాలశశాంకమౌళి, గౌ
రీవనితామనోహరుఁడు, ప్రీతిని గంగనుఁ దాల్చువాఁడు, దీ
నావనుఁడున్, ద్రినేత్రుఁ డురగాభరణుండగు శూలి కంటె నే
దేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో.
🙏
తొలగించండిగురు పూర్ణిమ సందర్భంగా
తొలగించండిశ్రీ కందిశంకరయ్య గారికి
సంగీతము చేసిన పూరణ లింకు :)
https://youtu.be/r-n1YU0NP5o?is=Ih40LlPPx6bxCasX
కందం
రిప్లయితొలగించండిపావన నాముడు దీన జ
నావలి నభయాన బ్రోచి యార్తినిఁ దీర్చన్
బ్రోవన్ రాముని మించిన
దేవుఁడు లేఁడని పలికి మదిం బూజింతున్
ఉత్పలమాల
తొలగించండిరావణు పాలి మృత్యువయి రామను బ్రోచిన వీరుడై భువిన్
దీవనలిచ్చుచున్ మిగుల దీనజనావళి గాచు వాడు సం
జీవుని మానసాన సుధఁ జిల్కెడు నాముడు రాము మించెడున్
దేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో
ఆ వసతి చేరువు నకొక
రిప్లయితొలగించండిశ్రావణుడరుదెంచి జనుల సముఖము నందున్
దైవమును జూపెదననగ ,
దేవుఁడు లేఁడని పలికి మదిం బూజింతున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపావను డై వేడు కొనగ
రిప్లయితొలగించండిదీవన లాసగియు శివుండు ది క్కై నిలుచున్
కావగ నతనిని మించిన
దేవుడు లేడని పలికి మ ది o బూ జింతు న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"దీవన లొసగియు" టైపాటు.
రిప్లయితొలగించండిపావన చరితుండాతడు
రావణ సంహారి ధర్మ రక్షకుడతడే
గోవున రాముని మించిన
దేవుఁడు లేఁడని పలికి మదిం బూజింతున్.
కోవెల లోన నిల్చెనని కోరు వరమ్ముల నిచ్చు వాడె యా
దైవమటంచు చెప్పెడి బుధానుల మాటలు విశ్వ సింపకన్
భావన లోనె యుండు భగ వంతుడటంచు కనంగ నెక్కడో
దేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో.
దైవశ్రేష్టుండుఁ సకల
రిప్లయితొలగించండిజీవులఁ రక్షించువాడు శ్రీవల్లభుడే
పావనుని కన్న ఘనుడౌ
దేవుఁడు లేఁడని పలికి మదిం బూజింతున్
కేవలమీ జగత్తునకు కేంద్రకమై వెలుగొందు దైవమై
జీవుల సూక్ష్మమై సకల జీవులనెన్నడుఁ బ్రోచువాడు రా
జీవదళేక్షణుండయిన శ్రీహరి యాతని కన్న మిన్నయౌ
దేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపూవిలుతుండు మన్మథుని బుగ్గియొనర్చిన వాడు కాళికా
రిప్లయితొలగించండిదేవికి భర్తయై సగము దేహమొసంగిన వాడు భూషగన్
శీవము వాసుకిన్ నిలుపు క్ష్వేళగళుండుని కన్న మిన్నయౌ
దేవుడు లేడు లేడని మదింగడు నమ్ముచు గొల్తు భక్తితో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదేవుళ్లెల్లరొకరని న
రిప్లయితొలగించండిమోవాకమిడదగు కాని మోకరిలి ప్రభుం
డా వేంకటేశుని వినా
దేవుడు లేడని పలికి మదిన్ పూజింతున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభావన చేయుచు భక్తిగ
రిప్లయితొలగించండిరావణ సంహర్తయైన రాముని కంటెన్
బ్రోవఁగ భువిలో వేరొక
దేవుఁడు లేఁడని పలికి మదిం బూజింతున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభావన జేసి దీనజన బాంధవునిన్ సుగుణాభిరామునిన్
రిప్లయితొలగించండిదేవగణార్చితున్ సమరధీరుని రాముని నెమ్మనమ్మునన్
బ్రోవుమటంచు పంక్తిరథు బుత్రునికన్నను మిన్నయైన నే
దేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఉ:జీవతతిన్ సహస్రకర చేతన నిద్దుర నుండి లేపియున్,
రిప్లయితొలగించండిలేవగనే కనంబడుచు,లెక్కకు మించిన కర్మ లందు దా
నే వెలొగొందు సాక్షి యయి యీ రవి, యీతని మించి దగ్గరౌ
దేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో”
కం:నా విధి సంధ్యావందన
రిప్లయితొలగించండిమీ విధినే మరువ విప్రు నే? జ్ఞానార్తిన్
గావింతు, రవిని మించిన
దేవుఁడు లేఁడని పలికి మదిం బూజింతున్”
కం॥ భావించి తల్లిదండ్రుల
రిప్లయితొలగించండిసేవనము ప్రియముగ చనఁగ శ్రేయముఁ గూర్చున్
గావున వారల మించెడు
దేవుఁడు లేఁడని పలికి మదిం బూజింతున్
పూజించు సేవించు భావములో నండి. వారు పరమపదించిన తరువాత లేచిన వెంటనే వారికి నమస్కరించుట మంచిది అని రెండవ భావమండి.
ఉ॥ భావన మీరు తత్పరత భవ్య ముదావహమున్ నివాసమై
తావుల నీనఁ జిత్తమునఁ దాల్మినిఁ నేమము నిష్ఠలొప్పఁగన్
దీవెనలంది జీవితము దీపిలఁ గేశవు మించు చుండు నే
దేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్కితో
భావమునందు భాగ్యమున
రిప్లయితొలగించండిభాసిలు దివ్య మహాస్వరూపమై
జీవమునందునిల్చి హృది
చేతననిచ్చు నికామ తేజ వి
భ్రాజితమూర్తియై యలరు
పావన వేంకటనాధుబోలు నే
దేవుఁడు లేఁడు లేఁడని మ
దిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిరే వగలు కాచు చుండును
రిప్లయితొలగించండిసేవ లొసంగు నిరతమ్ము క్షేమం బరయుం
గావునఁ దల్లికి మించిన
దేవుఁడు లేఁడని పలికి మదిం బూజింతున్
తావు నొసంగఁ డెన్నఁడును ద్రాతయె తా నని నేర నేరికిన్
దైవమ మాన వాకృతినిఁ దప్పక కాచును భక్త కోటినిం
గావు మటంచు వేఁడ నర కాయము భక్తిని రాని యట్టి యే
దేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిభావన జేయ భక్తిమయి, బాధలు బాపును నెమ్మితోడుతన్
రిప్లయితొలగించండికావగ వచ్చు కోరుకొన, క్రన్నన భక్తుల నాదరింపగా
నీవసుధా స్థలిన్ గనగ నీశుని మించి జనాళిఁ గాంచు నే
దేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికావగ రావా సామీ!
రిప్లయితొలగించండినీవేనాప్రాణమంచు నిరతముఁదలతున్
బ్రోవగ శంభుని మించిన
దేవుఁడు లేఁడని పలికి మదిం బూజింతున్”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికావగ రావ రామ!,మము కారణ జన్ముడ! నీవ కాక యే
రిప్లయితొలగించండిదేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో”
రావణ సంహరా! వరద! రమ్యకులోధ్భవ!లక్ష్శణాగ్రజా!
సేవను జేయగాబలము శీఘ్రమ యీయుము నాకునెప్పుడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"శీఘ్రమొసంగుము" అనండి.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
దైవము కేశవుడే యని
పావన మూర్తిని గొలుచుచు ప్రతిదినమందున్
బ్రోవగ నాతని మించిన
దేవుడు లేడని పలికి మదిం బూజింతున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి