1, ఆగస్టు 2026, శనివారం

సమస్య - 5546

2-8-2026 (ఆదివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“అక్షరకౌముది విరిసె నహస్కరు ప్రభలన్”

(లేదా...)

“అక్షరచంద్రికల్ విరిసె నంబుజనాథ మయూఖదీప్తులన్”

(న.చ. సాహిత్ అర్ధశతావధానంలో నేనిచ్చిన సమస్య)

26 కామెంట్‌లు:

  1. లక్షణముగ నిష్కుటమున
    శిక్షకుడు ప్రొద్దున జదువు జెప్పుట జేతన్
    శైక్షుని మానసమందున
    అక్షరకౌముది విరిసె నహస్కరు ప్రభలన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  2. అక్షయ ము గాని విధముగ
    రక్షణ కల్గించు రీతి రమ్య త నిo డ న్
    దక్షత తో రచి యించిన
    న క్షర కౌముది విరిసె న హ స్కరు ప్రభ లన్

    రిప్లయితొలగించండి
  3. శిక్షణ రక్షగా‌ గలిగి
    చిత్ప్రభనిండిన పాండితిన్ గవిన్
    దక్షతజూపు ప్రాజ్ఞుల ప
    థాన లసత్కృతమైన వేదికన్
    లక్షణ లక్ష్యముల్ మెఱయు
    రశ్మిని రంజిలు స్వర్ణకాంతులం
    దక్షర చంద్రికల్ విరిసె నంబుజనాథ మయూఖదీప్తులన్!

    రిప్లయితొలగించండి
  4. దక్షతతో వధానమున ద్రష్టలు గాంచుచునుండ నిచ్చతో
    శిక్షణగొన్న ప్రష్టలకు శీఘ్రగతిన్ బదులిచ్చు నేర్పుతో
    లక్షణమైన ధారణ పరంపరగా యవధాని సల్పగా
    నక్షరచంద్రికల్ విరిసె నంబుజనాథ మయూఖదీప్తులన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      "పరంపరగా నవధాని" అనండి.

      తొలగించండి


  5. కందం
    సాక్షిగ కవియై సంఘ వి
    వక్షత గబ్బిలము జాషువా రచియించెన్
    దక్షుడనన్ గృతియందున
    నక్షరకౌముది విరిసె నహస్కరు ప్రభలన్

    ఉత్పలమాల
    సాక్షిగ నిల్చి సంఘమున సాగు వివక్షకు వేదనాంబుధిన్
    బక్షిని గబ్బిలమ్ము గొని వాసిగ జాషువ కూర్చఁగన్ గృతిన్
    దక్షుడనంగ జాతికొక తామరవిందుని బోలఁ గూర్పునం
    దక్షరచంద్రికల్ విరిసె నంబుజనాథ మయూఖదీప్తులన్!

    రిప్లయితొలగించండి

  6. మోక్షం బనిన నెరుగని ని
    రక్షర కుక్షి రచియించె రామాయణమే
    దక్షతతో నాకృతి లో
    నక్షరకౌముది విరిసె నహస్కరు ప్రభలన్.


    దక్షత తోడ నచ్చట బుధానుడు ప్రాశ్నికు డౌచునా జగ
    చ్చక్షువు సాయమందు నిడు ఛాయను వర్ణన జేయమన్న నా
    శిక్షకుడౌ వధాని ప్రవచించెడి నత్తరి వాని గాత్రమం
    దక్షరచంద్రికల్ విరిసె నంబుజనాథ మయూఖదీప్తులన్.

    రిప్లయితొలగించండి
  7. దక్షుడు వ్రాసె కావ్యమును దక్షత తోడుత వీరుడైన యా
    అక్షకుమారు కూరిచి మహత్తర మైన తెనుంగు భాషలో
    లక్షణ యుక్తమై మిగుల రంజిలు చుండిన కావ్యమందహో
    నక్షరచంద్రికల్ విరిసె నంబుజ నాథ మయూఖదీప్తులన్

    రిప్లయితొలగించండి
  8. దక్షుడగు కవి కళారవి
    లక్షణ రచనలు సమాజ లక్ష్యముకాగా
    లక్షల పఠితుల మదిలో
    నక్షరకౌముది విరిసె నహస్కరు ప్రభలన్

    దక్షత కల్గినట్టి కవి తానిడు వెల్గులు జ్ఞానసూర్యుడై
    లక్షల మంది పాఠకుల లక్ష్యము మారుట సంభవింపగా
    దక్షతతో చెలంగు కవి తావెలయించిన సంపుటాలలో
    నక్షరచంద్రికల్ విరిసె నంబుజనాథ మయూఖదీప్తులన్

    రిప్లయితొలగించండి
  9. -
    భక్షణములివిగొ గొనుడీ
    అక్షరకౌముది విరిసె, నహస్కరు ప్రభలన్
    వీక్షింప వేళ నిదియే
    తక్షణమే శంకరార్యు తలమున రండూ


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కొనుడీ.. వేళ యిదియే" అనండి. 'తత్క్షణమే' అనడం సాధువు. కాని దానివల్ల ప్రాస తప్పుతుంది. 'రండూ' అనడం సాధువు కాదు.

      తొలగించండి
  10. దక్షుఁడు వధాని, ప్రష్టలు
    శిక్షణ గొన్నట్టి విబుధ శ్రేష్ఠులు, ద్రష్టల్
    వీక్షింపఁగ నర్మిలితో
    నక్షరకౌముది విరిసె నహస్కరు ప్రభలన్

    రిప్లయితొలగించండి
  11. కం:అక్షరములు కిరణము లై
    వృక్ష్షమ్మౌచు నవధాన విద్యకు దత్ సం
    రక్షక కవి భానుల చే
    నక్షరకౌముది విరిసె నహస్కరు ప్రభలన్”
    (అవధానం నిర్వహించిన సంస్థ పేరు అక్షరకౌముది. కవులు సూర్యు లైతే, అక్షరాలు కిరణా లైతే ఆ వృక్షం సూర్యప్రభల తో వెలిగింది.)




    రిప్లయితొలగించండి
  12. ఉ:అక్షరశిల్పి యైన కవి యద్భుత మౌ ఋతుశోభ లెల్ల దా
    నక్షరబంధమందు మథురాకృతి నుంచె, శరత్తు జూపగా
    నక్షరచంద్రికల్ విరిసె, నంబుజనాథ మయూఖదీప్తులం
    దక్షరరాశి గ్రీష్మమును నద్భుత రీతిని నిల్పె కన్నులన్.
    (ఒక కవి ఋతుశోభలని వర్ణించగా శరత్తు వర్ణనలో అతని అక్షరాలు వెన్నెలలు చూపాయి.గ్రీష్మం లో సూర్యకాంతులు చూపాయి.)

    రిప్లయితొలగించండి
  13. (3)(3)కం:"అక్షర కౌముది" యని మీ
    రక్షరముల ననిరి శంకరార్యా! యెటులన్
    రక్షించి రౌచితి? నెటుల
    నక్షరకౌముది విరిసె నహస్కరు ప్రభలన్?
    (అయ్యా శంకరార్యా! అక్షరకౌముది అని మీరే అక్షరాలా అన్నారు కదా! అది సూర్యకాంతి నిచ్చింది అనటం లో ఔచిత్య మేమిటి? నిజానికి అదే సమస్య. )

    రిప్లయితొలగించండి
  14. అక్షయముగ దశ దిశలును,
    నక్షత్రాధిపుని తోడ నభమున నెల్లన్
    సుక్షయము గాఁగ దినమున
    నక్షర కౌముది, విరిసె నహస్కరు ప్రభలన్


    భక్షణ మెంచి హన్మ పసి బాలుఁడు పండుగ నెంచి సూర్యు వే
    యక్షర వీథి పర్విడిన నాగ్రహ మందక సద్దయా మతిన్
    శిక్ష నొసంగ మారుతికి శీఘ్ర తరమ్ముగ శబ్ద శాస్త్ర ది
    వ్యాక్షర చంద్రికల్ విరిసె నంబుజ నాథ మయూఖ దీప్తులన్

    రిప్లయితొలగించండి
  15. శ్రీమైలవరపు మురళీకృష్ణ గారికి

    (మీ) వివాహ దిన శుభసందర్భమున మీరు పూరించిన కైపదము సంగీత రూపములో
    క్రింది లింకులో వినవచ్చు :)

    మీకు మీ శ్రీమతి సీత గారికి శుభాకాంక్షలు సహిత

    https://youtu.be/aHzeBtbxsLQ?is=QW5Uq0T0yFBZ_n1r


    జిలేబి


    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    శిక్షణ పొంది గురువు కడ
    దక్షతతో కావ్యమొకటి దండిగ వ్రాయన్
    లక్షణముగ కావ్యములో
    నక్షర కౌముది విరిసె నహస్కరు ప్రభలన్.

    రిప్లయితొలగించండి