5, ఆగస్టు 2026, బుధవారం

సమస్య - 5550

6-8-2026 (గురువారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మగని మొగముఁ జూచి కనెను మగువ సుతుని”

(లేదా...)

“మగని మొగంబుఁ జూచి సుకుమారి సుతుం గనె లోకపూజ్యునిన్”

(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో మైలవరపు మురళీకృష్ణ గారి సమస్య)

19 కామెంట్‌లు:

  1. పురిటి నొప్పులు మొదలయ్యె , పురుషుడెరిగి
    వడివ డిగనేగి బిలువగ వచ్చి , మంత్ర
    సాని వలసిన చర్యలు సలుపు చుండ
    మగని మొగముఁ జూచి కనెను మగువ సుతుని

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    త్రిజగములఁ జుట్టి రమ్మన దివిని గుహుడు
    నెమలి వాహనమెక్కియు నియతి నేగ
    గౌరి కార్యోన్ముఖునిఁ జేయఁగఁ గరిముఖుని
    మగని మొగముఁ జూచి కనెను మగువ సుతుని!


    చంపకమాల
    నగముల రౌతు పుత్రులకు నాకము భూమియు నబ్ధులెల్లెడన్
    జగములు మూడిటిన్ వడిగ సంచరియించియు రమ్మనన్, గుహుం
    డెగసియు వెళ్ళె; నంత కదిలింప వినాయకునెంచి గౌరియే
    మగని మొగంబుఁ జూచి సుకుమారి సుతుం గనె లోకపూజ్యునిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమీక్షకుల సవరణమేరకు ధన్యవాదములతో..

      చంపకమాల
      నగజమగండు పుత్రులకు నాకము భూమియు నబ్ధులెల్లెడన్
      జగములు మూడిటిన్ వడిగ సంచరియించియు రమ్మనన్, గుహుం
      డెగసియు వెళ్ళె; నంత కదిలింప వినాయకునెంచి గౌరియే
      మగని మొగంబుఁ జూచి సుకుమారి సుతుం గనె లోకపూజ్యునిన్!

      తొలగించండి
  3. సుతుని ప్రసవించి నంత తా చూడ గోరె
    మగని మొగము చూచి కనె ను మగువ సుతుని
    పోల్చి చూచియు మిక్కిలి మోద మంది
    ముద్దు లాడెను శిశువును మురిప మలర

    రిప్లయితొలగించండి

  4. ముని యొసగిన మంత్రము చేత ముగిద రవిని
    వేడి నంతట గగనమ్ము వీడి యెదుట
    హాస మొలకించుచు నిలిచినట్టి చాయ
    మగని మొగముఁ జూచి కనెను మగువ సుతుని.


    జగముల నేలు పుత్రులిల శర్వరి కుంతికి కల్గిరెట్లనన్
    సుగతులు దక్కవయ్యె తగు చూలియె లేక యటంచు భర్త యే
    వగచుచు నుండ గాంచి పృథ వల్లభు బాధను తీర్చ దీనమౌ
    మగని మొగంబుఁ జూచి సుకుమారి సుతుం గనె లోకపూజ్యునిన్.

    రిప్లయితొలగించండి
  5. గగనవాణితో మిక్కిలి కలతచెంది
    కంసుడుంచెను సోదరిన్ ఖైదులోన
    చివర కచ్చోట వ్యాకుల చిత్తుడైన
    మగని మొగముఁ జూచి కనెను మగువ సుతుని

    గగన వచస్సులే మిగుల కంపిల జేయగ క్రూరచిత్తుడై
    తగదని తండ్రిపల్కినను తానిడె కంసుడు సోదరిన్ జెఱన్
    వగయుచు వాసుదేవుడట వ్యాకుల చిత్తము తోడనుండగా
    మగని మొగంబుఁ జూచి సుకుమారి సుతుం గనె లోకపూజ్యునిన్

    రిప్లయితొలగించండి
  6. గగనపు పల్కులన్ వినిన కంసుడు దేవకి నుంచ ఖైదులో
    జగమున కంతకున్ సతము శక్తిని గూర్చెడు వాని వేడుచున్
    వగవకకాన్పు వేళ బిగబట్టుచు బాధను నామె నాత్మలో
    మగని మొగంబుజూచి సుకుమారి సుతుంగనె లోకపూజ్యునిన్

    రిప్లయితొలగించండి
  7. -

    குட்டி ப்பய்யன் இப்பவே கன்னடிக்கிரானே:)

    అగణితమైన పిరియమున
    మగని మొగముఁ జూచి, కనెను మగువ సుతుని వా
    డగుపించెను పో తండ్రి వ
    లె గుంభనపు నగవులన్ బలీయపు కనులన్


    రామ రామ
    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. మగనిగ నీశునిన్ బడయ మంగళ జేసె తపంబు భక్తితో
    పగతునివోలె భావజుఁడు బాణము నేయగ నస్థిమాలిపై
    తగులము గల్గె నీశునకు తా వరియించెను మేనకాత్మజన్
    మగని మొగంబుఁ జూచి సుకుమారి సుతుం గనె లోకపూజ్యునిన్

    రిప్లయితొలగించండి
  9. తే.గీ: ప్రసవవేదన బొందియు బతికి బైట
    బడియు ప్రక్కన నిలువగ పతియె, మురిసి
    మగని మొగముఁ జూచి, కనెను మగువ సుతుని
    "నచ్చముగ మిమ్ము బోలులెం" డంచు దనిసె


    రిప్లయితొలగించండి
  10. చం:"మగయును నాడుదిన్ సమమె,మారెను కాలము,కూతులిద్దరీ
    యుగమున జాలు" నన్న సతి నొప్పక బుత్రుని గోర భర్త ,ప్రీ
    తిగ సతి యొక్క పుత్రు గనె ,దేశపు నేతగ నయ్యె పుత్రుడున్
    మగని మొగంబుఁ జూచి సుకుమారి సుతుం గనె లోకపూజ్యునిన్.

    (ఇద్దరు కూతుళ్లు చాలు అని భార్య అంటే కొడుకు ఉండాలని భర్త కోరాడు.భర్త ముఖ్యం చూచి అంటే ముఖమాటానికి ఆమె పుత్రుణ్ని కూడా కన్నది.ఆ పుత్రుడు దేశాధినేత,లోకపూజ్యు డయ్యాడు.)

    రిప్లయితొలగించండి
  11. చం॥ అగణిత ప్రేమమున్నఁ గడు వ్యాకులమొందరె సంతు లేనిచో
    మగఁడటు వైద్యుఁడై తనర మానిని లోపలి లోటుపాట్లనున్
    దగు విధి మాన్పి గర్భమునుఁ దాల్చఁగ శ్రద్ధగ కాన్పు చేయఁగన్
    మగని మొగంబుఁ జూచి సుకుమారి సుతుం గనె లోకపూజ్యునిన్

    (పుట్టినపుడే తెలియదు కదండి. తరువాత పెరిగి లోకపూజ్యుడైనాడని అండి, సమకాలీన స్థితి తీసుకున్నానండి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మురళీకృష్ణ గారు తేటగీతి పాదము ఆటవెలది చేయగా నేను కందమౌతుందా అని చూసానండి

      కం॥ మగనికిఁ దెలుపఁగ విముఖత
      వగచుచు పిల్లలు వలదని పట్టుగఁ గోరన్
      మగని మొగముఁ జూచి కనెను
      మగువ సుతుని భయపడఁగను మనుఁగడ కొఱకై

      (ఈకాలంలో కొందరికిలాంటి పెడబుద్ధులు పుడుతున్నాయండి. అప్పుడు భర్త పట్టుపట్టితే, విడాకులిచ్చేస్తాననేది అంతర్లీనం, అప్పుడు అంగీకరించింది అనే అర్థంలో)

      తొలగించండి
  12. పురిటి నొప్పుల సైచుచుఁ బువ్వుఁబోఁడి
    కన్నులను మూసి బిగపట్టి కాయ మెల్ల
    నర్మిలిఁ బ్రసవ వేళలో నాత్మ లోన
    మగని మొగముఁ జూచి కనెను మగువ సుతుని


    మగని మొగంబుఁ జూచి కనె మానిని యంధుని మూసి కన్నులన్
    మగని మొగంబుఁ జూచి కనె మానిని రోయుచుఁ బాండు రోగినిన్
    మగఁ డనఁ బూరుషుండె యిట మక్కువ మీఱఁగ శాంత చిత్తయై
    మగని మొగంబుఁ జూచి సుకుమారి సుతుం గనె లోక పూజ్యునిన్

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    అతివకు పురిటి నొప్పులే యధికమవగ
    మగని చూడవలెననుచు మగువ కోర
    భర్త మోముఁ జూపగ చరవాణి యందు
    మగని మొగముఁ జూచి కనెను మగువ
    సుతుని.

    రిప్లయితొలగించండి
  14. వరము నిచ్చె శివుఁడు భక్తి వశము గాఁగ
    తరుణి కోరె సుతుని దేవు దయను బొంది
    హరుని కృపను బడసె నొక్క యందగాని
    మగని మొగముఁ జూచి కనెను మగువ సుతుని

    #యంత్రుడు #ఛందం

    రిప్లయితొలగించండి