కమ్లి గృహంబు నందు కడు కమ్మని వంటలు పెక్కు భర్తయౌ సోమ్లకు చేసి పెట్టి తన సోదరి తోడుగ నెక్కువైన యా ఆమ్లపు చారునున్ మరియు నన్నము రెంటిని బైట నుంచ నా ఆమ్లము గ్రోలి గోవు మధురామృత దుగ్ధము నిచ్చె దూడకున్
ఉ:ఓం! లలితాంబ! నాకు నిడు మొక్క సుధేనువు నంచు వేడ మా శ్యాం లలితాంబ నే, త్వరగ జక్కని ధేనువు లభ్య మయ్యెగా భీంలిని, పేదయౌ నతడు భేషనె,చొప్పను,నిల్వ యున్న యా యాంలము గ్రోలి గోవు మథురామృతదుగ్ధము నిచ్చె దూడకున్. (శ్యాం అనే వాడు మా స్నేహితుడు.ఆ బీద వాడు ఆవుని అనుగ్రహించమని లలితాంబని వేడుకొన్నాడు. భీంలీ అనే ఊరు ఉంది.అక్కడ అతనికి ఆవు దొరికింది.)
ఉ॥ ఆమ్ల గుణమ్ము కొంతగద యావులు మేసెడి గడ్డి నెంచఁగా నామ్లము చేయు జీర్ణమును హాస్యము గాదయ సత్యమిద్ది యా ఆమ్ల గుణమ్ము తగ్గి యపుడందగఁ జేయును శక్తి నిక్కమే ఆమ్లముఁ గ్రోలి గోవు మధురామృత దుగ్ధము నిచ్చె దూడకున్
(మ్ల తో మరే పదము కనిపించలేదండి. నిజానికి గడ్డి కాని మరే తిండి కాని చాలా చాలా తక్కువగా ఆమ్లగుణాన్ని కలిగి యుంటాయండి. కడుపులోని జీర్ణక్రియ ముఖ్యంగా ఆమ్లముతో జరుగుతుందండి. క్షార గుణమున్న చవిటి నేలలో పంటలు పండవండి. దీని ఆధారంగా పూరణ)
ఏది తిని , త్రాగ వలయునో యెరుగ నట్టి
రిప్లయితొలగించండిపశువులదరి విషము వంటి వాటి నుంచ
దోషమదియని దెలియక దొరపి నట్టి
యామ్లముం గ్రోలి గోవు పయస్సు నొసఁగె
రిప్లయితొలగించండితొడుకు గైకొన్న మేతతో దుగ్ధపు రుచి
మార బోదంచు తెలియని మంకు వవ్ ర
తల్లి పాలను మించిన స్త్యానమేది
ఆమ్లముం గ్రోలి గోవు పయస్సు నొసఁగె.
సిమ్‌లకు చెందినట్టి యొక స్నేహితుడిట్లు వచించె మిత్రమా
యామ్లము గ్రోలనేమి యదె యద్భుత మందును తల్లి పాలలో
నామ్లగుణమ్ము చేరదని యాద్యులు చెప్పిరి కాదె యందుకే
ఆమ్లముఁ గ్రోలి గోవు మధురామృత దుగ్ధమునిచ్చె దూడకున్.
తేటగీతి
రిప్లయితొలగించండిఆవులైన నింటిని గేదెలైన నెపుడు
గడ్డి తిను బైట కొట్టాన కడుగు నీరు
త్రాగియే పాలనొసఁగుచు సాగెడున్ గృ
హామ్లముం గ్రోలి గోవు పయస్సు నొసఁగె
ఉత్పలమాల
ఆమ్లము హానికారకము నావుకు గేదెకు నైన క్షీరమం
దామ్ల గుణమ్ములున్ ప్రబలి యాయువు దీరును త్రాగినంత న
య్యామ్లము నే గృహస్తుడిడు? నందరెఱింగిన రీతినందు ధా
న్యామ్లముఁ గ్రోలి గోవు మధురామృత దుగ్ధమునిచ్చె దూడకున్
కటిక దారిద్ర్య బాధతో గంజి త్రాగి
రిప్లయితొలగించండికడుపు నింపెడు వారలు కలరు జగతి
కడుపు నిండుగ పెట్టిన గడ్డి తిని గృ
హామ్లముం గ్రోలి గోవు పయస్సు నొసఁగె
అమ్లకలంబమే మన గృహావసరాలను తీర్చుచుండ శు
క్లామ్లము వంటయింట బహుకమ్మని వంటక మిచ్చుచుండ స్వా
ద్వామ్లము గల్గియుండు సముదంచిత యౌషద ధర్మమంద్రు ధా
న్యామ్లముఁ గ్రోలి గోవు మధురామృత దుగ్ధమునిచ్చె దూడకున్
[అమ్లకలంబము = పుల్లబచ్చలి; శుక్లామ్లము = చింతపందు
స్వాద్వామ్లము = దానిమ్మ; ధాన్యామ్లము = కుడితి]
కమ్లి గృహంబు నందు కడు కమ్మని వంటలు పెక్కు భర్తయౌ
రిప్లయితొలగించండిసోమ్లకు చేసి పెట్టి తన సోదరి తోడుగ నెక్కువైన యా
ఆమ్లపు చారునున్ మరియు నన్నము రెంటిని బైట నుంచ నా
ఆమ్లము గ్రోలి గోవు మధురామృత దుగ్ధము నిచ్చె దూడకున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉ:ఓం! లలితాంబ! నాకు నిడు మొక్క సుధేనువు నంచు వేడ మా
రిప్లయితొలగించండిశ్యాం లలితాంబ నే, త్వరగ జక్కని ధేనువు లభ్య మయ్యెగా
భీంలిని, పేదయౌ నతడు భేషనె,చొప్పను,నిల్వ యున్న యా
యాంలము గ్రోలి గోవు మథురామృతదుగ్ధము నిచ్చె దూడకున్.
(శ్యాం అనే వాడు మా స్నేహితుడు.ఆ బీద వాడు ఆవుని అనుగ్రహించమని లలితాంబని వేడుకొన్నాడు. భీంలీ అనే ఊరు ఉంది.అక్కడ అతనికి ఆవు దొరికింది.)
ఉ॥ ఆమ్ల గుణమ్ము కొంతగద యావులు మేసెడి గడ్డి నెంచఁగా
రిప్లయితొలగించండినామ్లము చేయు జీర్ణమును హాస్యము గాదయ సత్యమిద్ది యా
ఆమ్ల గుణమ్ము తగ్గి యపుడందగఁ జేయును శక్తి నిక్కమే
ఆమ్లముఁ గ్రోలి గోవు మధురామృత దుగ్ధము నిచ్చె దూడకున్
(మ్ల తో మరే పదము కనిపించలేదండి. నిజానికి గడ్డి కాని మరే తిండి కాని చాలా చాలా తక్కువగా ఆమ్లగుణాన్ని కలిగి యుంటాయండి. కడుపులోని జీర్ణక్రియ ముఖ్యంగా ఆమ్లముతో జరుగుతుందండి. క్షార గుణమున్న చవిటి నేలలో పంటలు పండవండి. దీని ఆధారంగా పూరణ)
తే.గీ:కట్టి వేయగన్ బిడ్డను గడ్డి దినుచు,
రిప్లయితొలగించండిమురిగిన పదార్థముల మ్రింగి,మురిగి నట్టి
యామ్లముం గ్రోలి గోవు పయస్సు నొసఁగె”
పాలు త్రాగి గోవును జంపె పాపి నరుడు
సాధు జంతువై వెలసియు సకల జనుల
రిప్లయితొలగించండిపూజ లందు కొను చు మించు పూత చరిత
పచ్చి గడ్డిని మేసియు వాసి యగు గృ
హా మ్ల ముం గ్రోలి గోవు పయస్సు నొస గె
పట్నమందున గనరాక పచ్చగడ్డి
రిప్లయితొలగించండితిండి చాలక నూధము లెండిపోవ
నాకలికి తాళలేక తానటమటమున
నామ్లముం గ్రోలి గోవు పయస్సు నొసఁగె
ఆమ్లమనంగ పుల్లని పదార్థము గోవులకీయరాదు యే
రిప్లయితొలగించండియామ్లములైన దేహమున నంకిలి పెట్టునటంచు నెంచి ధా
న్యామ్లము శ్రేష్ఠమైనదని యావుకుఁ గ్రోలఁగ నిచ్చె రైతు యా
ఆమ్లముఁ గ్రోలి గోవు మధురామృత దుగ్ధమునిచ్చె దూడకున్
పచ్చ గడ్డి యెండిన గడ్డి నిచ్చి చొప్ప
రిప్లయితొలగించండికఱ్ఱల నొసఁగ నింపుగఁ గతికి తనిసి
రంజనమ్మున నడరుచు గంజిఁ గించి
దామ్లముం గ్రోలి గోవు పయస్సు నొసఁగె
ఆమ్లము సుంత క్షారము సమంచిత రీతిఁ జెలంగఁ బ్రీతి ద
ధ్యామ్లము గ్రోలి మర్త్యు లకటా యొనరింత్రు జనాపకారముం
గామ్ల రుచిప్రవృద్ధమును గారవ మొప్ప నొసంగ సంచి తా
న్నామ్లముఁ గ్రోలి గోవు మధురామృత దుగ్ధము నిచ్చె దూడకున్
[అన్నామ్లము = గంజి; దధి+ఆమ్లము = దధ్యామ్లము; పుల్లని పెరుగు; కామ్లము = కొంచెము పుల్లన]
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
నిన్న పులిసిన మజ్జిగ యున్నవనుచు
కుడితి తొట్టెలో పోయగ కూర్మి తోడ
పచ్చగడ్డిని తిని వచ్చి వాసిగాను
నామ్లముం గ్రోలి గోవు పయస్సు నొసగె.