15-8-2026 (శనివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శూర్పణఖను వరించెఁ గృష్ణుండు మురిసి”
(లేదా...)
“శూర్పణఖన్ వరించెనఁట సుందరరూపుఁడు గృష్ణుఁ డయ్యెడన్”
(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో పిలకా శాంతమ్మ గారి సమస్య)
తేటగీతిమన పురాణముల నవగాహనము లేనివ్యక్తిఁ దెచ్చితివయ!మంచి వక్తయనుచు వినగ కర్ణ కఠోరము గొనిగె నిట్లు, “శూర్పణఖను వరించెఁ గృష్ణుండు మురిసి”!
ఉత్పలమాల నేర్పరిఁ బిల్చినన్ మనకు నేర్పు పురాణ విశిష్టతల్ దగన్గూర్పులొనర్చి నీతులను కోవిదుడౌచు నటంచుఁ గోరఁగన్దర్పము దప్ప కొంతయును దక్షతలేక లభించె! నక్కటా! "శూర్పణఖన్ వరించెనఁట సుందరరూపుఁడు గృష్ణుఁ డయ్యెడన్!"
అర్భకునొకని దాపునకామతించి ,రామకథను , భారతమంను రంగరించి వాక్యమొకటి జెప్పుమనగ , వదరె నిటులశూర్పణఖను వరించెఁ గృష్ణుండు మురిసి”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మద్యమును హెచ్చు గాగ్రోలి మత్తు తోడ వాగె నిట్టుల సఖులతో పామరుండు మామనట గూల్చి కడు సుకుమారి యైన శూర్పణఖను వరించెఁ గృష్ణుండు మురిసిమార్పును గోరు వారికయి మందుడొకండు పురాణ గాథలన్ నేర్పుగ మార్చుటయ్యదియె నేరము కాదని చెప్పె నిట్లు కం దర్పుని పూల బాణముల ధాటికి తాళగ లేనటంచు నా శూర్పణఖన్ వరించెనఁట సుందరరూపుఁడు గృష్ణుఁ డయ్యెడన్.
సర్పము వంటి వాడు కడు జాల్ముడు భ్రష్టుడు దుష్టబుద్ధియేశూర్పణఖన్ వరించెనట ,సుందర రూపుడు గృష్ణుడయ్యెడన్నేర్పును జూపి దూతగ వినిర్మల మైన ప్రశస్తి గాంచి తాదర్పమడంచె రాక్షసుల ద్వాపరమందును చక్రధారియైవిద్యుజ్దిహ్వుడు శూర్పణఖ భర్తఅతని మారుపేరు దుష్టబుద్ధి
అతడు ఘనుడగు కాలకేయ యువరాజుశూర్పణఖను వరించెఁ; గృష్ణుండు మురిసిపోవు రుక్మిణికి తెలిపె నీవివరమురమణి కోరిక మేరకు రామ కథనుఅర్పణ చేసినాడతడు హాయిగ చిత్తము మచ్చెకంటికిన్దర్పము తోడ నా విభుడు దానవరాజగు కాలకేయుడేశూర్పణఖన్ వరించెనఁట; సుందరరూపుఁడు గృష్ణుఁ డయ్యెడన్నేర్పుగ నుగ్గడించె తరుణీమణి రుక్మిణి కోరినంతటన్[కాలకేయుడు = కాలకేయ వంశజుడు]
తే.గీ:కాలు బట్టుకయును బ్రతిమాలి యొక్క సుమమునకు సాటి మగువ నీసు గొని చూడ, తత్క్షణము సత్య పోలగా దనుజ యైనశూర్పణఖను, వరించెఁ గృష్ణుండు మురిసి(భార్య సత్యభామ ఒక పువ్వు కోసం ఈర్ష్యలో తాత్కాలికం గా శూర్పనఖ నే పోల్8న సత్యభామని కాళ్లు పట్టుకు వరించాడు. )
తే॥ అరయ హిందూ మత పగటు లౌదురొ కనదుష్టులగుదురొ మూర్ఖులొ దురిత గుణమువరలు వారలొ తప్పుగఁ బల్కనిటులశూర్పణఖను వరించెఁ గృష్ణుండు మురిసిఉ॥ శూర్పణఖన్ వరించెనఁట సుందర రూపుఁడు గృష్ణుఁడయ్యెడన్నేర్పుగఁ గల్లలీ విధిని నీతిని వీడుచుఁ బల్కనెంచుచున్గూర్పునుఁ జేయు వారలటు కుత్సితులౌదురొ దుష్టులౌదురోదర్పముతోఁ జరించి చను తాటకు లౌదురొ తెల్ప శక్యమే!తాటకుడు మాయావి టక్కరి
మత్తు నందున మున్గి న మనుజు డొకడుపనికి రానట్టి మాటలు పలుకు చుండి శుర్పణ ఖ ను వరించె కృష్ణుండు మురిసి విన్న వారంత నవ్విరి విస్తు పోయి
ఇంటి పేరఁట కయ్యాల యింతి పేరు శూర్పణఖ యఁట వరుఁడు కస్తూరి వారి బిడ్డఁ డఁట చూడగం బుట్ట దొడ్డ ప్రేమ శూర్పణఖను వరించెఁ గృష్ణుండు మురిసి నేర్పరి యుద్ధ తంత్రముల నేరఁడు భీతి నెదన్ లసద్వపో దర్పుఁడు కాలకేయ కుల తారకుఁ డుగ్రుఁడు కార్య కోటి యం దోర్పన లేని రక్కసుఁడు నుగ్ర తటిద్రసుఁ డందకత్తె నా శూర్పణఖన్ వరించె నఁట సుందర రూపుఁడు కృష్ణుఁ డయ్యెడన్ [కృష్ణుఁడు = నల్లని వాఁడు; తటిద్రసుఁడు = విద్యుజ్జిహ్వుఁడు]
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.లక్ష్మణుడు ముక్కు చెవులను రయముగానుకోసి పంపించె నెవరిని కోరి యతడుశూర్పణఖను; వరించెఁ గృష్ణుండు మురిసివేడ రుక్మిణిన్ వేడ్కతో పెండ్లి యాడె.
తేటగీతి
రిప్లయితొలగించండిమన పురాణముల నవగాహనము లేని
వ్యక్తిఁ దెచ్చితివయ!మంచి వక్తయనుచు
వినగ కర్ణ కఠోరము గొనిగె నిట్లు,
“శూర్పణఖను వరించెఁ గృష్ణుండు మురిసి”!
తొలగించండిఉత్పలమాల
నేర్పరిఁ బిల్చినన్ మనకు నేర్పు పురాణ విశిష్టతల్ దగన్
గూర్పులొనర్చి నీతులను కోవిదుడౌచు నటంచుఁ గోరఁగన్
దర్పము దప్ప కొంతయును దక్షతలేక లభించె! నక్కటా!
"శూర్పణఖన్ వరించెనఁట సుందరరూపుఁడు గృష్ణుఁ డయ్యెడన్!"
అర్భకునొకని దాపునకామతించి ,
రిప్లయితొలగించండిరామకథను , భారతమంను రంగరించి
వాక్యమొకటి జెప్పుమనగ , వదరె నిటుల
శూర్పణఖను వరించెఁ గృష్ణుండు మురిసి”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిమద్యమును హెచ్చు గాగ్రోలి మత్తు తోడ
వాగె నిట్టుల సఖులతో పామరుండు
మామనట గూల్చి కడు సుకుమారి యైన
శూర్పణఖను వరించెఁ గృష్ణుండు మురిసి
మార్పును గోరు వారికయి మందుడొకండు పురాణ గాథలన్
నేర్పుగ మార్చుటయ్యదియె నేరము కాదని చెప్పె నిట్లు కం
దర్పుని పూల బాణముల ధాటికి తాళగ లేనటంచు నా
శూర్పణఖన్ వరించెనఁట సుందరరూపుఁడు గృష్ణుఁ డయ్యెడన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసర్పము వంటి వాడు కడు జాల్ముడు భ్రష్టుడు దుష్టబుద్ధియే
తొలగించండిశూర్పణఖన్ వరించెనట ,సుందర రూపుడు గృష్ణుడయ్యెడన్
నేర్పును జూపి దూతగ వినిర్మల మైన ప్రశస్తి గాంచి తా
దర్పమడంచె రాక్షసుల ద్వాపరమందును చక్రధారియై
విద్యుజ్దిహ్వుడు శూర్పణఖ భర్త
అతని మారుపేరు దుష్టబుద్ధి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఅతడు ఘనుడగు కాలకేయ యువరాజు
తొలగించండిశూర్పణఖను వరించెఁ; గృష్ణుండు మురిసి
పోవు రుక్మిణికి తెలిపె నీవివరము
రమణి కోరిక మేరకు రామ కథను
అర్పణ చేసినాడతడు హాయిగ చిత్తము మచ్చెకంటికిన్
దర్పము తోడ నా విభుడు దానవరాజగు కాలకేయుడే
శూర్పణఖన్ వరించెనఁట; సుందరరూపుఁడు గృష్ణుఁ డయ్యెడన్
నేర్పుగ నుగ్గడించె తరుణీమణి రుక్మిణి కోరినంతటన్
[కాలకేయుడు = కాలకేయ వంశజుడు]
తే.గీ:కాలు బట్టుకయును బ్రతిమాలి యొక్క
రిప్లయితొలగించండిసుమమునకు సాటి మగువ నీసు గొని చూడ,
తత్క్షణము సత్య పోలగా దనుజ యైన
శూర్పణఖను, వరించెఁ గృష్ణుండు మురిసి
(భార్య సత్యభామ ఒక పువ్వు కోసం ఈర్ష్యలో తాత్కాలికం గా శూర్పనఖ నే పోల్8న సత్యభామని కాళ్లు పట్టుకు వరించాడు. )
తే॥ అరయ హిందూ మత పగటు లౌదురొ కన
రిప్లయితొలగించండిదుష్టులగుదురొ మూర్ఖులొ దురిత గుణము
వరలు వారలొ తప్పుగఁ బల్కనిటుల
శూర్పణఖను వరించెఁ గృష్ణుండు మురిసి
ఉ॥ శూర్పణఖన్ వరించెనఁట సుందర రూపుఁడు గృష్ణుఁడయ్యెడన్
నేర్పుగఁ గల్లలీ విధిని నీతిని వీడుచుఁ బల్కనెంచుచున్
గూర్పునుఁ జేయు వారలటు కుత్సితులౌదురొ దుష్టులౌదురో
దర్పముతోఁ జరించి చను తాటకు లౌదురొ తెల్ప శక్యమే!
తాటకుడు మాయావి టక్కరి
మత్తు నందున మున్గి న మనుజు డొకడు
రిప్లయితొలగించండిపనికి రానట్టి మాటలు పలుకు చుండి
శుర్పణ ఖ ను వరించె కృష్ణుండు మురిసి
విన్న వారంత నవ్విరి విస్తు పోయి
ఇంటి పేరఁట కయ్యాల యింతి పేరు
రిప్లయితొలగించండిశూర్పణఖ యఁట వరుఁడు కస్తూరి వారి
బిడ్డఁ డఁట చూడగం బుట్ట దొడ్డ ప్రేమ
శూర్పణఖను వరించెఁ గృష్ణుండు మురిసి
నేర్పరి యుద్ధ తంత్రముల నేరఁడు భీతి నెదన్ లసద్వపో
దర్పుఁడు కాలకేయ కుల తారకుఁ డుగ్రుఁడు కార్య కోటి యం
దోర్పన లేని రక్కసుఁడు నుగ్ర తటిద్రసుఁ డందకత్తె నా
శూర్పణఖన్ వరించె నఁట సుందర రూపుఁడు కృష్ణుఁ డయ్యెడన్
[కృష్ణుఁడు = నల్లని వాఁడు; తటిద్రసుఁడు = విద్యుజ్జిహ్వుఁడు]
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
లక్ష్మణుడు ముక్కు చెవులను రయముగాను
కోసి పంపించె నెవరిని కోరి యతడు
శూర్పణఖను; వరించెఁ గృష్ణుండు మురిసి
వేడ రుక్మిణిన్ వేడ్కతో పెండ్లి యాడె.