14, ఆగస్టు 2026, శుక్రవారం

సమస్య - 5559

15-8-2026 (శనివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“శూర్పణఖను వరించెఁ గృష్ణుండు మురిసి”

(లేదా...)

“శూర్పణఖన్ వరించెనఁట సుందరరూపుఁడు గృష్ణుఁ డయ్యెడన్”

(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో పిలకా శాంతమ్మ గారి సమస్య) 

15 కామెంట్‌లు:

  1. తేటగీతి
    మన పురాణముల నవగాహనము లేని
    వ్యక్తిఁ దెచ్చితివయ!మంచి వక్తయనుచు
    వినగ కర్ణ కఠోరము గొనిగె నిట్లు,
    “శూర్పణఖను వరించెఁ గృష్ణుండు మురిసి”!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ఉత్పలమాల
      నేర్పరిఁ బిల్చినన్ మనకు నేర్పు పురాణ విశిష్టతల్ దగన్
      గూర్పులొనర్చి నీతులను కోవిదుడౌచు నటంచుఁ గోరఁగన్
      దర్పము దప్ప కొంతయును దక్షతలేక లభించె! నక్కటా!
      "శూర్పణఖన్ వరించెనఁట సుందరరూపుఁడు గృష్ణుఁ డయ్యెడన్!"

      తొలగించండి
  2. అర్భకునొకని దాపునకామతించి ,
    రామకథను , భారతమంను రంగరించి
    వాక్యమొకటి జెప్పుమనగ , వదరె నిటుల
    శూర్పణఖను వరించెఁ గృష్ణుండు మురిసి”

    రిప్లయితొలగించండి

  3. మద్యమును హెచ్చు గాగ్రోలి మత్తు తోడ
    వాగె నిట్టుల సఖులతో పామరుండు
    మామనట గూల్చి కడు సుకుమారి యైన
    శూర్పణఖను వరించెఁ గృష్ణుండు మురిసి


    మార్పును గోరు వారికయి మందుడొకండు పురాణ గాథలన్
    నేర్పుగ మార్చుటయ్యదియె నేరము కాదని చెప్పె నిట్లు కం
    దర్పుని పూల బాణముల ధాటికి తాళగ లేనటంచు నా
    శూర్పణఖన్ వరించెనఁట సుందరరూపుఁడు గృష్ణుఁ డయ్యెడన్.

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. సర్పము వంటి వాడు కడు జాల్ముడు భ్రష్టుడు దుష్టబుద్ధియే
      శూర్పణఖన్ వరించెనట ,సుందర రూపుడు గృష్ణుడయ్యెడన్
      నేర్పును జూపి దూతగ వినిర్మల మైన ప్రశస్తి గాంచి తా
      దర్పమడంచె రాక్షసుల ద్వాపరమందును చక్రధారియై

      విద్యుజ్దిహ్వుడు శూర్పణఖ భర్త
      అతని మారుపేరు దుష్టబుద్ధి

      తొలగించండి
  5. రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. అతడు ఘనుడగు కాలకేయ యువరాజు
      శూర్పణఖను వరించెఁ; గృష్ణుండు మురిసి
      పోవు రుక్మిణికి తెలిపె నీవివరము
      రమణి కోరిక మేరకు రామ కథను

      అర్పణ చేసినాడతడు హాయిగ చిత్తము మచ్చెకంటికిన్
      దర్పము తోడ నా విభుడు దానవరాజగు కాలకేయుడే
      శూర్పణఖన్ వరించెనఁట; సుందరరూపుఁడు గృష్ణుఁ డయ్యెడన్
      నేర్పుగ నుగ్గడించె తరుణీమణి రుక్మిణి కోరినంతటన్

      [కాలకేయుడు = కాలకేయ వంశజుడు]

      తొలగించండి
  6. తే.గీ:కాలు బట్టుకయును బ్రతిమాలి యొక్క
    సుమమునకు సాటి మగువ నీసు గొని చూడ,
    తత్క్షణము సత్య పోలగా దనుజ యైన
    శూర్పణఖను, వరించెఁ గృష్ణుండు మురిసి
    (భార్య సత్యభామ ఒక పువ్వు కోసం ఈర్ష్యలో తాత్కాలికం గా శూర్పనఖ నే పోల్8న సత్యభామని కాళ్లు పట్టుకు వరించాడు. )

    రిప్లయితొలగించండి
  7. తే॥ అరయ హిందూ మత పగటు లౌదురొ కన
    దుష్టులగుదురొ మూర్ఖులొ దురిత గుణము
    వరలు వారలొ తప్పుగఁ బల్కనిటుల
    శూర్పణఖను వరించెఁ గృష్ణుండు మురిసి

    ఉ॥ శూర్పణఖన్ వరించెనఁట సుందర రూపుఁడు గృష్ణుఁడయ్యెడన్
    నేర్పుగఁ గల్లలీ విధిని నీతిని వీడుచుఁ బల్కనెంచుచున్
    గూర్పునుఁ జేయు వారలటు కుత్సితులౌదురొ దుష్టులౌదురో
    దర్పముతోఁ జరించి చను తాటకు లౌదురొ తెల్ప శక్యమే!

    తాటకుడు మాయావి టక్కరి

    రిప్లయితొలగించండి
  8. మత్తు నందున మున్గి న మనుజు డొకడు
    పనికి రానట్టి మాటలు పలుకు చుండి
    శుర్పణ ఖ ను వరించె కృష్ణుండు మురిసి
    విన్న వారంత నవ్విరి విస్తు పోయి

    రిప్లయితొలగించండి
  9. ఇంటి పేరఁట కయ్యాల యింతి పేరు
    శూర్పణఖ యఁట వరుఁడు కస్తూరి వారి
    బిడ్డఁ డఁట చూడగం బుట్ట దొడ్డ ప్రేమ
    శూర్పణఖను వరించెఁ గృష్ణుండు మురిసి


    నేర్పరి యుద్ధ తంత్రముల నేరఁడు భీతి నెదన్ లసద్వపో
    దర్పుఁడు కాలకేయ కుల తారకుఁ డుగ్రుఁడు కార్య కోటి యం
    దోర్పన లేని రక్కసుఁడు నుగ్ర తటిద్రసుఁ డందకత్తె నా
    శూర్పణఖన్ వరించె నఁట సుందర రూపుఁడు కృష్ణుఁ డయ్యెడన్

    [కృష్ణుఁడు = నల్లని వాఁడు; తటిద్రసుఁడు = విద్యుజ్జిహ్వుఁడు]

    రిప్లయితొలగించండి

  10. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    లక్ష్మణుడు ముక్కు చెవులను రయముగాను
    కోసి పంపించె నెవరిని కోరి యతడు
    శూర్పణఖను; వరించెఁ గృష్ణుండు మురిసి
    వేడ రుక్మిణిన్ వేడ్కతో పెండ్లి యాడె.

    రిప్లయితొలగించండి