15, ఆగస్టు 2026, శనివారం

సమస్య - 5560

16-8-2026 (ఆదివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“త్రొక్కఁగఁ బాదముల జనులు దుష్టిం గనరే”

(లేదా...)

“త్రొక్కఁగఁ బాదయుగ్మహతి తుష్టినొసంగదె చూచువారికిన్”

(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో పిలకా సరోజిని గారి సమస్య)

17 కామెంట్‌లు:

  1. మక్కువగొని గుడికి వెడల
    నెక్కువ దూరము నడువగ నెచ్చుగ సతికిన్
    త్రిక్కునొసగ , బదములతో
    త్రొక్కఁగఁ బాదముల జనులు దుష్టిం గనరే

    రిప్లయితొలగించండి
  2. కందము
    చక్కని వధూవరులు మా
    ప్రక్కింటికి మెరవణిగను రాగ మఱది తా
    మక్కువ డప్పుకు చిందులుఁ
    ద్రొక్కఁగఁ బాదముల జనులు దుష్టిం గనరే!


    ఉత్పలమాల
    నిక్కి వధూవరుల్ మెరవణిన్ కనువిందును జేయు జంటగన్
    పెక్కురు ముచ్చటన్ గనఁగ వేడుక వీధిని వెంట సాగగన్
    మక్కువఁ జూపుచున్ మఱది మానక డప్పుకు నొప్పఁ జిందులన్
    ద్రొక్కఁగఁ బాదయుగ్మహతి తుష్టినొసంగదె చూచువారికిన్!

    రిప్లయితొలగించండి
  3. మక్కవతో గురువద్దకు
    గ్రక్కున జనె వినగ నతని ప్రవచనములతా
    నక్కడి వారిని గురువే
    త్రొక్కగ బాదముల జనులు దుష్టింగనరే

    రిప్లయితొలగించండి

  4. టక్కరి కాముకు డొక్కడు
    పెక్కుగ జనులున్న చోట బేటము కొరకై
    చక్కని చుక్కను జేరుచు
    త్రొక్కఁగఁ బాదముల జనులు దుష్టిం గనరే.


    దుక్కిని దున్ను పాళమున తుప్పల నుండి యపత్య శత్రువే
    వెక్కస మైన వేగమున వేవిలి చేరగ దుక్కి కైదువున్
    బక్కన పెట్టి సైరికుడు పర్వులు పెట్టు తరిన్ శితాగ్రమున్
    త్రొక్కఁగఁ బాదయుగ్మహతి తుష్టినొసంగదె చూచువారికిన్.

    రిప్లయితొలగించండి

  5. టక్కరి కాముకు డొక్కడు
    పెక్కుగ జనులున్న చోట బేటము కొరకై
    చక్కని చుక్కను జేరుచు
    త్రొక్కఁగఁ బాదముల జనులు దుష్టిం గనరే.


    దుక్కిని దున్ను పాళమున తుప్పల నుండి యపత్య శత్రువే
    వెక్కస మైన వేగమున వేవిలి చేరగ దుక్కి కైదువున్
    బక్కన పెట్టి సైరికుడు పర్వులు పెట్టు తరిన్ శితాగ్రమున్
    త్రొక్కఁగఁ బాదయుగ్మహతి తుష్టినొసంగదె చూచువారికిన్.

    రిప్లయితొలగించండి
  6. చక్కగ వధూవరులు కడు
    మక్కువతో తరలి పెండ్లి మంటప మందున్
    జక్కనిదగు సనెకలుపైఁ
    ద్రొక్కఁగఁ బాదముల జనులు దుష్టిం గనరే

    చక్కని జంట లభ్యమని చప్పున పెండ్లికి సిద్ధమౌచు తా
    మొక్కరికొక్కరేనని మహోన్నత జీవన యాత్ర పట్టునన్
    దక్కుఁ బ్రయోజనంబనుచు దంపతులిర్వురు సన్నెకల్లుపైఁ
    ద్రొక్కఁగఁ బాదయుగ్మహతి తుష్టినొసంగదె చూచువారికిన్

    రిప్లయితొలగించండి
  7. మక్కువ తో మొహ రమ్ము న
    చక్కని డప్పు లకు దగిన చలనము దోడ న్
    నిక్కుచు నాడుచు స్టెప్పులు
    ద్రొ క్క గ బాదములు జనులు దుష్టి o గన రే

    రిప్లయితొలగించండి
  8. ఎక్కువ తక్కువల్ మరచి యేకమవన్ పతిపత్నులిర్వురున్
    చక్కగ పాదపీడనము సల్పుట తంతు వివాహమందునన్
    మక్కువతో వరుండు చనుమానముగా సతి పాదయుగ్మముం
    ద్రొక్కఁగఁ బాదయుగ్మహతి తుష్టినొసంగదె చూచువారికిన్

    రిప్లయితొలగించండి
  9. మిక్కుటమగు నర్మిలితో
    చక్కని చుక్కను వధువును సారస్యముగా
    మక్కువతో పెండ్లికొడుకు
    త్రొక్కఁగఁ బాదముల జనులు దుష్టిం గనరే

    రిప్లయితొలగించండి
  10. అక్కున జేరిన మనుమలు
    జక్కగ నాడుచు మురిపెము చాలగ జూపన్
    ఫక్కున నవ్వుచు నొడలిన్
    ద్రొక్కగ బాదముల జనులు‌ దుష్టిం గనరే!

    రిప్లయితొలగించండి
  11. ఉ॥ అక్కట పాదముల్ బెణఁకి యంతము గాంచని నొప్పిఁ బొందఁగన్
    మిక్కుటమైన రీతినటు మిక్కిలి బాధలఁ బెట్ట వైద్యుఁడే
    గ్రక్కున నొక్కి పట్టఁగను గమ్మున తగ్గు నటంచు తెల్పఁగన్
    ద్రొక్కఁగఁ బాదయుగ్మహతి తుష్టినొసంగదె చూచువారికిన్

    (కొన్ని రకాల sprains pressure పెడితే బాగుపడగలవండి. ముఖ్యంగా తిమ్మిరి లాంటి బెణకు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరొక పూరణ అండి
      (ఇంట్లో పాపలు తప్పటడుగులు వేసే సమయంలో జరుగగలదు)

      ఉ॥ చక్కని పాప యావిధిగ సర్వులు మక్కువ మీరఁ జూడఁగా
      నొక్కొక అజ్జ నెమ్మదిగ నూగుచు సాగుచు వేయు పద్ధతిన్
      గ్రక్కున క్రిందపడ్డ తఱి గజ్జల సవ్వడి తోడ లేచుచున్
      ద్రొక్కగ పాదయుగ్మహతి తుష్టినొసంగదె చూచువారికిన్

      తొలగించండి
  12. (1)కం:చక్కని గృహమున్ గట్టగ,
    మక్కువతో, నడుగు వేయ మంగళ మనుచున్
    జక్కని ధేనువు గృహమున
    త్రొక్కఁగఁ బాదముల జనులు దుష్టిం గనరే!

    (2)ఉ:చక్కగ మాటలన్ బలుక జాలని బాలుడు " బామ్మ,నాన్న యం
    చొక్కొక మాట నంచు గడు నోర్పును జూపెడు తాత బొజ్జ పై
    నెక్కియు నవ్వులన్ గురిసి "హె హ్హె" యటంచు ముదమ్ము నొందుచున్
    త్రొక్కఁగఁ బాదయుగ్మహతి తుష్టినొసంగదె చూచువారికిన్! ”

    రిప్లయితొలగించండి
  13. చక్కగఁ బర్విడి యిక్కడ
    నక్కడ తిరుగాడుచుఁ దగ నాడుచు నగచున్
    వెక్కసముగఁ బసిపాపఁడు
    త్రొక్కఁగఁ బాదముల జనులు తుష్టిం గనరే


    రక్కసుఁ డాడ వేషమున రాసుతుఁ డర్మిలి నొక్క రొక్కరిం
    ద్రొక్కఁగఁ బాద యుగ్మహతి తోరపు నవ్విడుఁ జూచు వానికిం
    జక్కగఁ బెండ్లి వేళ సరసంపు వధూవరు లొక్క రొక్కరిం
    ద్రొక్కఁగఁ బాద యుగ్మహతి తుష్టి నొసంగదె చూచువారికిన్

    రిప్లయితొలగించండి