కం: అల దేవర్షియె వలచెనె లలన నొకతె? కనెనె పుత్రులను? పుక్కిటి గా ధల వండి వార్చు విద్యల నలభీములు వండినారు నారదు పెండ్లిన్” (నారదుడి పెళ్లి అనేది ఒక పురాణ గాధ కానీ దేవర్షి విషయం లో నమ్మ దగింది కాదు. కథలు వండి వార్చటం లో నిపుణు లైన నలభీము లెవరో తయారు చేసారు. కథలు,అబద్ధపు వార్తలు అల్లటం అనే దాన్ని వండటం అని వ్యంగ్యం గా అన్నట్లు. )
చం:"నలుడు,వృకోదరుండు బచనమ్మున దిట్టలు గాదె! తెల్పు వా రల ఘను డెవ్వ?"డం చడుగ బ్రాశ్నికు డా యవధాని యిట్లనెన్ "కలసిరె వారు వంటలను గమ్మ గ జేసెడు స్పర్థ నెన్నడేన్? నలుఁడును భీముఁడుం గలసి నారదు పెండ్లికి వంటఁ జేసిరే” (వంటలో నలుడు గొప్పా? భీముడు గొప్పా? అని అప్రస్తుత ప్రసంగం లో అడిగాడు.ఆ యిద్దరూ పోటీ లో కలిస్తే చెప్పగలం. వాళ్లేమైనా నారదుడి పెళ్లికి వంట చేసారా? అని అవధాని తిరిగి ప్రశ్నించాడు. వాళ్లు కలవటమే అసంబద్ధం కనుక ఎవరు గొప్ప అనేది తేలదు అని.)
కలలోన బెండ్లి జూచితి
రిప్లయితొలగించండినల గాంచితి(గ్రోలితి) కమ్మనైన నాహారమహో!
తిలకించి నాడ నేనట
నలభీములు వండినారు నారదు పెండ్లిన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికలగంటి నిన్నటి నిశను
రిప్లయితొలగించండియిలకు దిగిన నారద ముని యీప్సిత మొందన్
నెలతుకను వివహమాడగ ,
నలభీములు వండినారు నారదు పెండ్లిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"కలగంటిని నిన్నటి నిశ । నిలకు..." అనండి.
రిప్లయితొలగించండితెలియక పోయిన నెప్పుడు
పలువిధ శాస్త్రము లెరిగిన పఠిని యటంచున్
పలికెడి పామరు డిట్లనె
నలభీములు వండినారు నారదు పెండ్లిన్.
పలువురి చేత దూరబడు పామరు డాతడు కల్లు పాకకున్
జెలమరి తోడ జేరి యట శీధువు గ్రోలుచు భూరి జ్ఞానమున్
కలిగిన వాడినంచు కల కాలము చెప్పెడి వాడు చెప్పెనే
నలుఁడును భీముఁడుం గలసి నారదు పెండ్లికి వంటఁ జేసిరే.
పిలిచితి పెండ్లికి రమ్మని
రిప్లయితొలగించండిపొలుపున నారదుని పాత్ర పోషకుడనగా
తరలెను నాటక బృందము
నలభీములు వండినారు నారదు పెండ్లిన్
నలుగురి మెప్పునొందె నవ నాటకమండలి తెల్గునేలపై
పలువురు వేషధారులటఁ బ్రస్తుతు లొందిన గొప్పవారలే
పిలువగ నేగిరా నటులు పెండ్లని నారద పాత్రధారికిన్
నలుఁడును భీముఁడుం గలసి నారదు పెండ్లికి వంటఁ జేసిరే
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండికలనొక పెండ్లిసంబరముఁగాంచితి రాతిరి, స్వప్నమందునన్
రిప్లయితొలగించండినలినదళాక్షి యొక్కరిత నారదునిన్ మనువాడ నత్తరిన్
పలువురు దేవతల్ మునులు వచ్చిరి పెండిలి తంతు చూడగన్
నలుఁడును భీముఁడుం గలసి నారదు పెండ్లికి వంటఁ జేసిరే
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించండికలు ద్రావిన మైకములో
రిప్లయితొలగించండికలవరమున మందుడొకడు కడు చోద్యముగా
పలికెను చవులూరునటుల
నలభీములు వండినారు నారదు పెండ్లిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం: అల దేవర్షియె వలచెనె
రిప్లయితొలగించండిలలన నొకతె? కనెనె పుత్రులను? పుక్కిటి గా
ధల వండి వార్చు విద్యల
నలభీములు వండినారు నారదు పెండ్లిన్”
(నారదుడి పెళ్లి అనేది ఒక పురాణ గాధ కానీ దేవర్షి విషయం లో నమ్మ దగింది కాదు. కథలు వండి వార్చటం లో నిపుణు లైన నలభీము లెవరో తయారు చేసారు. కథలు,అబద్ధపు వార్తలు అల్లటం అనే దాన్ని వండటం అని వ్యంగ్యం గా అన్నట్లు. )
చం:"నలుడు,వృకోదరుండు బచనమ్మున దిట్టలు గాదె! తెల్పు వా
రిప్లయితొలగించండిరల ఘను డెవ్వ?"డం చడుగ బ్రాశ్నికు డా యవధాని యిట్లనెన్
"కలసిరె వారు వంటలను గమ్మ గ జేసెడు స్పర్థ నెన్నడేన్?
నలుఁడును భీముఁడుం గలసి నారదు పెండ్లికి వంటఁ జేసిరే”
(వంటలో నలుడు గొప్పా? భీముడు గొప్పా? అని అప్రస్తుత ప్రసంగం లో అడిగాడు.ఆ యిద్దరూ పోటీ లో కలిస్తే చెప్పగలం. వాళ్లేమైనా నారదుడి పెళ్లికి వంట చేసారా? అని అవధాని తిరిగి ప్రశ్నించాడు. వాళ్లు కలవటమే అసంబద్ధం కనుక ఎవరు గొప్ప అనేది తేలదు అని.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచం॥ తలఁపుల నిండె రామునకు తల్లి మహీజకు నాలయమ్మునన్
తొలగించండిబలువురు పెండ్లి వేడుకలు భవ్య మనోహర రీతిఁ గాంచఁగన్
వలచి వివాహ భోజనము వాల్చఁగ మేనును స్వప్నమందునన్
నలుఁడును భీముఁడుం గలసి నారదు పెండ్లికి వంటఁ జేసిరే
చం॥ తెలుపఁగ పాకశాస్త్రమున దిట్టలు సాటియె లేని వారలే
నలుఁడును భీముఁడుం గనఁగ నారదుఁడా యొక బ్రహ్మ చారియే
పొలుపుగ పూరణార్థమని ముగ్గురఁ గూర్చె సమస్య నవ్వఁగన్
నలుఁడును భీముఁడుం గలసి నారదు పెండ్లికి వంటఁ జేసిరే
కల యందైనను గాంచని
రిప్లయితొలగించండిపలువురు సమ్మతి తెలుపని వాక్య ము నొక టిన్
దెలుపు మననొక డనె నిటుల
నల భీములు వండి నారు నారదు బెండ్లిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినారదుని స్వప్నము...
రిప్లయితొలగించండికందం
నలభీమ పాకపు రుచులు
పులకింతలు రేప హరియె మోహము రేపన్
గలిగిన స్వప్నమునందున్
నలభీములు వండినారు నారదు పెండ్లిన్
చంపకమాల
నలునిఁ గనంగ నారదుఁడు నర్మిళి విందు నొసంగె కమ్మగన్
వలలుని వంట సైతమును వాంఛను మ్రెక్కిన జ్ఞాపకంబునన్
బులకలు రేపగన్ హరియె మోహముఁ గొల్పుచు స్వప్నమందునన్
నలుఁడును భీముఁడుం గలసి నారదు పెండ్లికి వంటఁ జేసిరే!
చెలఁగి తగవులం బెట్టెడు
రిప్లయితొలగించండిఖలు పెండ్లికిఁ బాక శాస్త్ర గణ్యులు వండం
బలికె నొకం డిబ్భంగిన్
నలభీములు వండినారు నారదు పెండ్లిన్
వలయును వంట వా రనఁగఁ బంపఁగ నెన్నిక సేసి మిన్నగా
నలునిని మించు వా రడరి, నా వచియించిన వారు వండఁగా
నలవడు నయ్య యెట్టి రుచి యన్నఁ గరమ్ము శ్రమించి చేయ నా
నలుఁడును భీముఁడుం గలసి నారదు, పెండ్లికి వంటఁ జేసిరే
[కలసి ను + ఆరదు= కలసి నారదు; కలసిను = కలసి కూడ; ఆరదు = కలుగదు]
“కలసి ను” ప్రయోగమునకుఁ బ్రమాణము:
వాటువడి మూర్ఛవోయిం / బోటర దైత్యుండు దెలిసి.... ఉ. హరి. 4. 235.; మూర్ఛ వోయిను + పోటర దైత్యుండు. – ప్రౌఢ వ్యాకరణము. శబ్ద. 116.
మీ పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండినలుడను వాడు శాకముల నాణ్యపు కూరల చేయ గ్రామమున్
రిప్లయితొలగించండిబలము గలట్టి భీముడును బాగుగ మాంసము వండు చుండెడిన్
తలచుచు నాడు వేల్పు జడదారిగ పేరగు వాడు కోరగా
నలుఁడును భీముఁడుం గలసి నారదు పెండ్లికి వంటఁ జేసిరే