19, ఆగస్టు 2026, బుధవారం

సమస్య - 5564

20-8-2026 (గురువారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“శవమా మనవిని విని కడు సౌఖ్యం బిడుమా”

(లేదా...)

“శవమా విన్నపమాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే”

(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో దొనపూడి శ్రీనివాస్ గారి సమస్య)

39 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. కందం
      భవుఁడు శిరంబున గంగను
      భువికిన్ వర్షింపడేలొ? భుక్తికెటుల? కా
      వవె! పాదజము విడిచి కే
      శవ! మానా మనవిని విని సౌఖ్యంబిడుమా!

      మత్తేభవిక్రీడితము
      భవుడున్ జూటము జార్చి గంగనిడడే పాపాత్ములంచెంచెనో!
      భువిపై క్షామము సుట్టె జీవులకహో! భుక్తిన్ ప్రసాదించి కా
      వవె! నీదౌపద పంకజంపు జలమే ప్రాణాల దక్కించుఁ!గే
      శవ మా విన్నపమాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే!

      తొలగించండి
  2. అవిరళ సేవను జేసిన
    భవ! భక్తుల మమ్ము బ్రోవు పాపములున్నన్
    తవ చరణదాసులము కే
    శవ మామనవినివిని సౌఖ్యంబిడుమా!

    రిప్లయితొలగించండి
  3. పవమానాత్మజుఁ డెన్నిమారు లనిలోఁ బాపాత్ముఁ జీల్చన్ బున
    ర్భవుఁడై నిల్చుచునుండ హరి తోడ్పాటిచ్చుటం జంప వా
    స్తవముం గాంచి జనాళి పల్కిరి జరాసంధా! భువిం గూలు నో
    శవమా! విన్నపమాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే!

    రిప్లయితొలగించండి
  4. జవముగ ముసలి తనంబున
    వివిధరకంబు లయినట్టి వేదన లొందన్
    సవరించ మరల మను శై
    శవమా ! నా మనవిని విని సౌఖ్యం బిడుమా

    రిప్లయితొలగించండి

  5. కవలలము మేమిచ్చట
    స్తవనీయుడ వంచు నిన్ను ధ్యానించెదమే
    కువలేశయుoడ వగు కే
    శవ! మా, నా, మనవిని విని సౌఖ్యం బిడుమా.


    భవ బoధమ్ములశాశ్వతమ్ములని కైవల్యమ్ము నే గోరు చున్‌
    స్తవనీయమ్మగు నీదు నామమునె నే ధ్యానించెదన్ నిత్యమున్
    కవనమ్మందు, దయామయుoడవగుచున్ గా రుణ్యమున్ జూపి కే
    శవ! మా! విన్నపమాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే.

    రిప్లయితొలగించండి
  6. అవలోకించుము స్వామీ
    నవవిధ రీతుల కొలిచెదనయముగ నిన్నే
    స్తవమును చేసెదనో కే
    శవ!మా నామనవిని విని సౌఖ్యంబిడుమా

    రిప్లయితొలగించండి
  7. 1.
    భవబంధంబులఁ ద్రుంచి శాంతిసుఖముల్ భాసిల్లఁ జేయంగదే
    శివభక్తిన్ గొని పూజసేయ మదిలో శ్రీనాథుఁ డానందమై
    శివుఁ డాత్మేశ్వరుఁ డంచుఁ గొల్చి నిజమై శ్రేయంబు నందించుచున్
    శవమా విన్నపమాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే


    2.
    భవరోగంబుల బాపి సర్వజనులన్ భద్రంబుగాఁ గాచుమా
    తవ సేవాఫలమే సదా సుఖదమై దాసుల్ సుఖింపంగదే
    అవనిన్ బ్రోచెడి తల్లి నీదు కరుణన్ హర్షంబు నింపంగదే
    శవమా విన్నపమాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే

    రిప్లయితొలగించండి
  8. 3.
    అవనిన్ బుట్టితి కర్మబంధనముచే నాపన్నుఁడన్ దేవ నీ
    భవదీయంబగు పాదపద్మయుగమున్ భక్తిన్ భజింతున్ సదా
    ధవళాక్షా! నిను నమ్మినాఁడ కరుణాధారన్ గృపన్ జూడు కే
    శవ! మా విన్నపమాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. దిలీప్ గారికి

      మీ పూరణలు - స్వరకల్పన జిలేబీయముగా ఈ లింకులో వినవచ్చు
      (chandam ప్రతిష్టాపకులకు‌ ఉడతా భక్తితో)

      https://youtu.be/X5B6wAIV-Y4?is=nZmf28BGplcys-n6


      జిలేబి

      తొలగించండి
    3. హా ఛందం అనే పద్య అల్లకల యంత్రాన్ని పరీక్ష చేస్తున్నాను. అందులో కొన్ని నాకు నచ్చిన ఆణిముత్యాలు.

      తొలగించండి
    4. Dileep ji,

      Pl expand Chandam soft with text to speech with audio button when user presses having identified the Meter can render a lovely padyam audition. too :)

      Hope you can consider

      Some ideas here below

      https://prathosh.in/vagdhenu/

      Cheers
      Zilebi

      తొలగించండి
  9. మ॥ నవకమ్మొంది భవాబ్ధి దాటఁగను సన్మానించి సన్మార్గమున్
    జవితోఁ దాల్చుచు నిత్యకర్మములటుల్ సారించి కావించుచున్
    భవదీయాశ్రితులై చరించ ధరలోఁ బ్రార్థించి వర్తిల్ల కే
    శవ, మా విన్నపమాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే

    రిప్లయితొలగించండి
  10. కం:పువులన్ బెట్టుక వచ్చిన
    నవవథువును నన్ను జూడు నా మగడా!లే!
    ఇవిగో పా లో జీవ
    చ్ఛవమా నా మనవిని విని సౌఖ్యం బిడుమా”
    (భర్త నిద్ర పోతుంటే నవ వధువు పడిన బాధ.)


    రిప్లయితొలగించండి
  11. కవగొన వెనుకాడ వలదు
    నవలామణి నీకు నచ్చిన దశ యనినచో
    భువిపై యౌవనమా శై
    శవమా నా మనవిని విని సౌఖ్యం బిడుమా

    భువిపైజన్మము నొంది దుఃఖితులమై పోరాటమున్ సల్పుచున్
    భవబంధమ్ముల చిక్కుకొంటిమిలలోఁ బద్మాక్ష వీక్షింపుమా
    లవలేశంబగు జాగులేక దయతో రక్షింపుమా చెన్నకే
    శవ! మా విన్నపమాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే

    రిప్లయితొలగించండి
  12. మ:శవమున్ దాల్చిన విక్రమార్కునకు నిశ్శబ్దమ్ము భంగమ్ము గా
    నెవియో ప్రశ్నల నిట్లు బల్కె "విసుగిం తే లేదె భేతాళ? యా
    పవె నీ తెల్విని! వీని పాల బడి నన్ బాధించ నో రెత్తు నో
    శవమా! విన్నపమాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే”

    (పట్టు వదలని విక్రమార్కుడి నిశ్శబ్దాన్మి శవం లో ఉన్న భేతాళుడు మాటి మాటికి భంగం చేస్తూ ఉంటాడు. చివరి విక్రమార్కుడు భేతాళుణ్ని, అతను ఆవహించిన శవాన్ని కూడా తనను మాట్లాడించ వద్దని ఉపాయం తో బతిమిలాడాడు.పూర్వం చందమామ కథలు గుర్తున్నాయా?)

    రిప్లయితొలగించండి
  13. కొందరి పూరణలను వాట్సాప్ లో సమీక్షించినందున ఇక్కడ వ్యాఖ్యానించలేదు.

    రిప్లయితొలగించండి
  14. భవ బంధంబులు బాపుచు
    జవమున మోక్షంబు నొసగ సతము భజింతున్
    తవచర ణ ము నమ్మితి కే
    శవ: మా నా మనవిని విని సౌఖ్యంబిడు మా!

    రిప్లయితొలగించండి
  15. అవిరళ మొనరించిన పా
    ప వితతి నశియింప స్నాన భాగ్య మొసఁగుమా
    ప్రవిమల గంగా ధారా
    శవమా నా మనవిని విని సౌఖ్యం బిడుమా

    [శవము = జలము]

    సవనౌఘమ్ములఁ జేయ లేను దగ నీ సంకీర్తనల్ సేయఁ జా
    ల వసువ్రాతము లీయ లేను దయ రా రమ్మంటి కావంగఁ గే
    శవ నాపల్కుల విస్మరించితివ విశ్వత్రాత యాశింప శై
    శవమా విన్నప మాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే

    రిప్లయితొలగించండి



  16. అవలోకించగ హరువున
    భవితవ్యమునిచ్చి నాదు బాల్యంబందున్
    రవళించినావె! మఱి శై
    శవమా నా మనవిని విని సౌఖ్యం బిడుమా!

    మఱి=మరల కు....రూపాంతరము


    స్తవనీయుండవు నిత్యుడైవెలిగి ప్ర
    స్తారంబు జేకూర్తువే
    కవనంబందు రచించిచూప నిను శక్తింజాలదే మాకు నీ
    భవమున్ద్రుంచెడి మార్గమీయు మిక
    మా పాలిన్ కృపన్జూపి కే
    శవ! మా విన్నపమాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే!

    రిప్లయితొలగించండి
  17. భవ!నీ భక్తుల మెల్లవేళలను నీ
    పాదాంబుజంబుల్గడున్
    స్తవనీయంబని నమ్మినెమ్మనములో
    సద్భక్తితో బూజలున్
    భువనోద్దారక నీ కొనర్చెదము
    సమ్మోదంబుతో మేము కే
    శవ! మా విన్నపమాలకించి దయతో
    సౌఖ్యంబు జూపంగదే

    రిప్లయితొలగించండి
  18. భవదీయమ్మగు దీవనమ్ములను సంప్రాప్తించె జ్ఞానమ్ము స
    త్కవితల్ వ్రాయుచు నుంటి మేము, దయ విద్యాదేవి తోడుండగా
    స్తవనీయమ్మగు నీదు నామమును సద్భక్తిన్ బ్రశంసించి కే
    శవ! మావిన్నప మాలకించి దయతో సౌఖ్యంబు గూర్పంగదే!

    రిప్లయితొలగించండి

  19. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    భువిలో నిన్నే గొలిచెద
    స్తవనీయుడవని సతతము ధ్యానము చేతున్
    అవగాహన తోడను కే
    శవ!మా మనవిని విని కడు సౌఖ్యంబిడుమా!

    రిప్లయితొలగించండి
  20. అవలోకించుము స్వామీ
    నవవిధ రీతుల కొలిచెదనయముగ నిన్నే
    స్తవమును చేసెదనో కే
    శవ!మామనవినివిని సౌఖ్యంబిడుమా.


    స్తవనీయా!హరి! నన్ను కావగ నిటన్ తండ్రీ! వడిన్ రమ్ము భూ
    ధవ!గోవింద!మురాంతకా! కొలువులో ధాష్టీకమున్ జూపి న
    న్నవమానించె ఖలుండుదుష్టమతితోనానీచుశిక్షించు కే
    శవ!మా విన్నపమాలకించిదయతోసౌఖ్యంబుగూర్పంగదే

    రిప్లయితొలగించండి