కం:పువులన్ బెట్టుక వచ్చిన నవవథువును నన్ను జూడు నా మగడా!లే! ఇవిగో పా లో జీవ చ్ఛవమా నా మనవిని విని సౌఖ్యం బిడుమా” (భర్త నిద్ర పోతుంటే నవ వధువు పడిన బాధ.)
(పట్టు వదలని విక్రమార్కుడి నిశ్శబ్దాన్మి శవం లో ఉన్న భేతాళుడు మాటి మాటికి భంగం చేస్తూ ఉంటాడు. చివరి విక్రమార్కుడు భేతాళుణ్ని, అతను ఆవహించిన శవాన్ని కూడా తనను మాట్లాడించ వద్దని ఉపాయం తో బతిమిలాడాడు.పూర్వం చందమామ కథలు గుర్తున్నాయా?)
భవ!నీ భక్తుల మెల్లవేళలను నీ పాదాంబుజంబుల్గడున్ స్తవనీయంబని నమ్మినెమ్మనములో సద్భక్తితో బూజలున్ భువనోద్దారక నీ కొనర్చెదము సమ్మోదంబుతో మేము కే శవ! మా విన్నపమాలకించి దయతో సౌఖ్యంబు జూపంగదే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికందం
తొలగించండిభవుఁడు శిరంబున గంగను
భువికిన్ వర్షింపడేలొ? భుక్తికెటుల? కా
వవె! పాదజము విడిచి కే
శవ! మానా మనవిని విని సౌఖ్యంబిడుమా!
మత్తేభవిక్రీడితము
భవుడున్ జూటము జార్చి గంగనిడడే పాపాత్ములంచెంచెనో!
భువిపై క్షామము సుట్టె జీవులకహో! భుక్తిన్ ప్రసాదించి కా
వవె! నీదౌపద పంకజంపు జలమే ప్రాణాల దక్కించుఁ!గే
శవ మా విన్నపమాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే!
అవిరళ సేవను జేసిన
రిప్లయితొలగించండిభవ! భక్తుల మమ్ము బ్రోవు పాపములున్నన్
తవ చరణదాసులము కే
శవ మామనవినివిని సౌఖ్యంబిడుమా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపవమానాత్మజుఁ డెన్నిమారు లనిలోఁ బాపాత్ముఁ జీల్చన్ బున
రిప్లయితొలగించండిర్భవుఁడై నిల్చుచునుండ హరి తోడ్పాటిచ్చుటం జంప వా
స్తవముం గాంచి జనాళి పల్కిరి జరాసంధా! భువిం గూలు నో
శవమా! విన్నపమాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజవముగ ముసలి తనంబున
రిప్లయితొలగించండివివిధరకంబు లయినట్టి వేదన లొందన్
సవరించ మరల మను శై
శవమా ! నా మనవిని విని సౌఖ్యం బిడుమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండికవలలము మేమిచ్చట
స్తవనీయుడ వంచు నిన్ను ధ్యానించెదమే
కువలేశయుoడ వగు కే
శవ! మా, నా, మనవిని విని సౌఖ్యం బిడుమా.
భవ బoధమ్ములశాశ్వతమ్ములని కైవల్యమ్ము నే గోరు చున్
స్తవనీయమ్మగు నీదు నామమునె నే ధ్యానించెదన్ నిత్యమున్
కవనమ్మందు, దయామయుoడవగుచున్ గా రుణ్యమున్ జూపి కే
శవ! మా! విన్నపమాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే.
అవలోకించుము స్వామీ
రిప్లయితొలగించండినవవిధ రీతుల కొలిచెదనయముగ నిన్నే
స్తవమును చేసెదనో కే
శవ!మా నామనవిని విని సౌఖ్యంబిడుమా
1.
రిప్లయితొలగించండిభవబంధంబులఁ ద్రుంచి శాంతిసుఖముల్ భాసిల్లఁ జేయంగదే
శివభక్తిన్ గొని పూజసేయ మదిలో శ్రీనాథుఁ డానందమై
శివుఁ డాత్మేశ్వరుఁ డంచుఁ గొల్చి నిజమై శ్రేయంబు నందించుచున్
శవమా విన్నపమాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే
2.
భవరోగంబుల బాపి సర్వజనులన్ భద్రంబుగాఁ గాచుమా
తవ సేవాఫలమే సదా సుఖదమై దాసుల్ సుఖింపంగదే
అవనిన్ బ్రోచెడి తల్లి నీదు కరుణన్ హర్షంబు నింపంగదే
శవమా విన్నపమాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి3.
రిప్లయితొలగించండిఅవనిన్ బుట్టితి కర్మబంధనముచే నాపన్నుఁడన్ దేవ నీ
భవదీయంబగు పాదపద్మయుగమున్ భక్తిన్ భజింతున్ సదా
ధవళాక్షా! నిను నమ్మినాఁడ కరుణాధారన్ గృపన్ జూడు కే
శవ! మా విన్నపమాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిStress Testing Chandam sir ? :)
తొలగించండిదిలీప్ గారికి
తొలగించండిమీ పూరణలు - స్వరకల్పన జిలేబీయముగా ఈ లింకులో వినవచ్చు
(chandam ప్రతిష్టాపకులకు ఉడతా భక్తితో)
https://youtu.be/X5B6wAIV-Y4?is=nZmf28BGplcys-n6
జిలేబి
హా ఛందం అనే పద్య అల్లకల యంత్రాన్ని పరీక్ష చేస్తున్నాను. అందులో కొన్ని నాకు నచ్చిన ఆణిముత్యాలు.
తొలగించండిDileep ji,
తొలగించండిPl expand Chandam soft with text to speech with audio button when user presses having identified the Meter can render a lovely padyam audition. too :)
Hope you can consider
Some ideas here below
https://prathosh.in/vagdhenu/
Cheers
Zilebi
మ॥ నవకమ్మొంది భవాబ్ధి దాటఁగను సన్మానించి సన్మార్గమున్
రిప్లయితొలగించండిజవితోఁ దాల్చుచు నిత్యకర్మములటుల్ సారించి కావించుచున్
భవదీయాశ్రితులై చరించ ధరలోఁ బ్రార్థించి వర్తిల్ల కే
శవ, మా విన్నపమాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే
కం:పువులన్ బెట్టుక వచ్చిన
రిప్లయితొలగించండినవవథువును నన్ను జూడు నా మగడా!లే!
ఇవిగో పా లో జీవ
చ్ఛవమా నా మనవిని విని సౌఖ్యం బిడుమా”
(భర్త నిద్ర పోతుంటే నవ వధువు పడిన బాధ.)
కవగొన వెనుకాడ వలదు
రిప్లయితొలగించండినవలామణి నీకు నచ్చిన దశ యనినచో
భువిపై యౌవనమా శై
శవమా నా మనవిని విని సౌఖ్యం బిడుమా
భువిపైజన్మము నొంది దుఃఖితులమై పోరాటమున్ సల్పుచున్
భవబంధమ్ముల చిక్కుకొంటిమిలలోఁ బద్మాక్ష వీక్షింపుమా
లవలేశంబగు జాగులేక దయతో రక్షింపుమా చెన్నకే
శవ! మా విన్నపమాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిమ:శవమున్ దాల్చిన విక్రమార్కునకు నిశ్శబ్దమ్ము భంగమ్ము గా
రిప్లయితొలగించండినెవియో ప్రశ్నల నిట్లు బల్కె "విసుగిం తే లేదె భేతాళ? యా
పవె నీ తెల్విని! వీని పాల బడి నన్ బాధించ నో రెత్తు నో
శవమా! విన్నపమాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే”
(పట్టు వదలని విక్రమార్కుడి నిశ్శబ్దాన్మి శవం లో ఉన్న భేతాళుడు మాటి మాటికి భంగం చేస్తూ ఉంటాడు. చివరి విక్రమార్కుడు భేతాళుణ్ని, అతను ఆవహించిన శవాన్ని కూడా తనను మాట్లాడించ వద్దని ఉపాయం తో బతిమిలాడాడు.పూర్వం చందమామ కథలు గుర్తున్నాయా?)
కొందరి పూరణలను వాట్సాప్ లో సమీక్షించినందున ఇక్కడ వ్యాఖ్యానించలేదు.
రిప్లయితొలగించండిభవ బంధంబులు బాపుచు
రిప్లయితొలగించండిజవమున మోక్షంబు నొసగ సతము భజింతున్
తవచర ణ ము నమ్మితి కే
శవ: మా నా మనవిని విని సౌఖ్యంబిడు మా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅవిరళ మొనరించిన పా
రిప్లయితొలగించండిప వితతి నశియింప స్నాన భాగ్య మొసఁగుమా
ప్రవిమల గంగా ధారా
శవమా నా మనవిని విని సౌఖ్యం బిడుమా
[శవము = జలము]
సవనౌఘమ్ములఁ జేయ లేను దగ నీ సంకీర్తనల్ సేయఁ జా
ల వసువ్రాతము లీయ లేను దయ రా రమ్మంటి కావంగఁ గే
శవ నాపల్కుల విస్మరించితివ విశ్వత్రాత యాశింప శై
శవమా విన్నప మాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే
మీ పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅవలోకించగ హరువున
భవితవ్యమునిచ్చి నాదు బాల్యంబందున్
రవళించినావె! మఱి శై
శవమా నా మనవిని విని సౌఖ్యం బిడుమా!
మఱి=మరల కు....రూపాంతరము
స్తవనీయుండవు నిత్యుడైవెలిగి ప్ర
స్తారంబు జేకూర్తువే
కవనంబందు రచించిచూప నిను శక్తింజాలదే మాకు నీ
భవమున్ద్రుంచెడి మార్గమీయు మిక
మా పాలిన్ కృపన్జూపి కే
శవ! మా విన్నపమాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే!
భవ!నీ భక్తుల మెల్లవేళలను నీ
రిప్లయితొలగించండిపాదాంబుజంబుల్గడున్
స్తవనీయంబని నమ్మినెమ్మనములో
సద్భక్తితో బూజలున్
భువనోద్దారక నీ కొనర్చెదము
సమ్మోదంబుతో మేము కే
శవ! మా విన్నపమాలకించి దయతో
సౌఖ్యంబు జూపంగదే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభవదీయమ్మగు దీవనమ్ములను సంప్రాప్తించె జ్ఞానమ్ము స
రిప్లయితొలగించండిత్కవితల్ వ్రాయుచు నుంటి మేము, దయ విద్యాదేవి తోడుండగా
స్తవనీయమ్మగు నీదు నామమును సద్భక్తిన్ బ్రశంసించి కే
శవ! మావిన్నప మాలకించి దయతో సౌఖ్యంబు గూర్పంగదే!
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
భువిలో నిన్నే గొలిచెద
స్తవనీయుడవని సతతము ధ్యానము చేతున్
అవగాహన తోడను కే
శవ!మా మనవిని విని కడు సౌఖ్యంబిడుమా!
అవలోకించుము స్వామీ
రిప్లయితొలగించండినవవిధ రీతుల కొలిచెదనయముగ నిన్నే
స్తవమును చేసెదనో కే
శవ!మామనవినివిని సౌఖ్యంబిడుమా.
స్తవనీయా!హరి! నన్ను కావగ నిటన్ తండ్రీ! వడిన్ రమ్ము భూ
ధవ!గోవింద!మురాంతకా! కొలువులో ధాష్టీకమున్ జూపి న
న్నవమానించె ఖలుండుదుష్టమతితోనానీచుశిక్షించు కే
శవ!మా విన్నపమాలకించిదయతోసౌఖ్యంబుగూర్పంగదే