26, ఆగస్టు 2026, బుధవారం

సమస్య - 5571

27-8-2026 (గురువారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“తోయధిన్ క్షారజలమయ్యె దీయగాను”

(లేదా...)

“సాగరమందు నీరమది చక్కెర రీతిని తియ్యనయ్యెనే”

(ఫ్లోరిడా, అమెరికాలో వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధాన సమస్య)

25 కామెంట్‌లు:

  1. నీరధి గమనమున త్రాగు నీరు దొరక
    నందున పిపాస తీరగ , నబ్ధి లోని
    జలకమును దీసి పానము సలిపినంత
    తోయధిన్ క్షారజలమయ్యె దీయగాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నా మెయిల్ కు మీరు పద్యాలను పంపించారు. అవి ఎందుకొరకు పంపించారో స్పష్టంగా పేర్కొనలేదు.

      తొలగించండి
  2. తేటగీతి
    యుద్ధసాగరముప్పుగ నొప్పె గాదె
    మోహమున నరుఁడు నిలువ, పొంది గీత
    కృష్ణమూర్తి దయన్ బోరు గెలిచి నంత
    తోయధిన్ క్షారజలమయ్యె దీయగాను!

    ఉత్పలమాల
    పోగొని ధైర్యమున్ నరుఁడు మోహము మీరగ యుద్ధసాగరం
    బాగతి యుప్పుగన్ దలఁచె, నచ్యుతు గీతను విన్నవెంటనే
    రాగము వీడి విల్లుగొని రంగమునందున దూకి గెల్వఁగన్
    సాగరమందు నీరమది చక్కెర రీతిని తియ్యనయ్యెనే!

    రిప్లయితొలగించండి


  3. ఈ గమనంపు జీవనము
    నేర్పడజూడ మహార్ణవంబగున్
    దోగెడి కాలచక్రమున
    దుఃఖసుఖమ్ముల మున్కలందునన్
    ఆ గతమిచ్చు స్వాదన మ
    హామృతహర్షమనోజ్ఞవీచి హృ
    త్సాగరమందు నీరమది
    చక్కెర రీతిని తియ్యనయ్యెనే!

    రిప్లయితొలగించండి

  4. ఎల్లరులు సూత పుత్రుడంచెగ్గు సేయు
    వేళ నంగరాజ్య మొసగి పెద్ద సేసి
    నట్టి యా సుయోధనుడిక నాప్తు డయ్యె
    తోయధిన్ క్షారజలమయ్యె దీయగాను.


    రాగల కాల మందు నుదర మ్మనివార్యము కుంతి పుత్రుడా
    మేగలి శ్వేత వాహనుని మించిన వాడనుచున్ సుయోధనుం
    డా గడెకారి చాగియయి యర్కికి రాజ్య మొసంగె గాంచగా
    సాగరమందు నీరమది చక్కెర రీతిని తియ్యనయ్యెనే.

    రిప్లయితొలగించండి
  5. సాగర జలాల లోగల క్షారమెల్ల
    తొలగ జేసెడి యంత్రాలు తోడు పడగ
    మాయమై క్షారము మిగిలె మంచినీరు
    తోయధిన్ క్షారజలమయ్యె దీయగాను

    సాగర తీరమందు గల సంపదగల్గిన రాజ్యమేకదా
    భోగము భాగ్యముల్ గన ప్రమోదము తథ్యము తీరమందునన్
    వేగమె యంత్రరాజమును పెట్టగ తొల్గెను క్షారమంతయున్
    సాగరమందు నీరమది చక్కెర రీతిని తియ్యనయ్యెనే

    [డీ శాలినేషన్ ప్లాంట్ పెడితే జరిగే ప్రక్రియ]

    రిప్లయితొలగించండి
  6. సాగరమంథనమ్మున సుసంపద లొందిరి దేవతల్ గదా
    భోగము లందజేయ హరి భూరికృపన్ దగ జూపె నెల్లెడన్
    రాగము తోడ భక్తులకు రమ్యముగా నమృతంబు నిచ్చినన్
    సాగరమందు నీరమది చక్కెర రీతిని తియ్యనయ్యెనే

    #ఛందం #యంత్రం

    రిప్లయితొలగించండి
  7. తే.గీ:వ్రాయరా యిట్లు బాలుడా! "తోయధి గల
    నీరు క్షార" మనగ వాడు "క్షీర " మనెను
    తోయధిన్ క్షారజలమయ్యె దీయగాను”
    వాని వ్రాతలో హాస్యముల్ వంద లుండు
    (పిల్ల వానికి డిక్టేషన్ చెపుతున్నప్పుడు "క్షారము" అని వ్రాయ మంటే " క్షీరము " అని వ్రాసాడు. )



    రిప్లయితొలగించండి
  8. ఉ॥ సాగరమందు వాసమన సాధ్యమ త్రాగు జలమ్మునొందఁగన్
    సాగుచు శాస్త్ర శోధనలు సంద్రపు నీటిని యోగ్య రూపునన్
    ద్రాగు విధమ్ము చేయఁగను దాగిన యుప్పును తీసి వేయఁగన్
    సాగర మందు నీరమది చక్కెర రీతిని తియ్యనయ్యెనే

    (నేను సముద్రపైన కొన్ని సంవత్సరాలు పని చేసానండి. రివర్స్ ఆస్మాసిస్ పద్ధతిలో ఉప్పు తీసివేసి వాడుకోవాలి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తే॥ శాస్త్ర శోధనల ఫలము సర్వ జనుల
      హితముఁ గోరు రీతి విరియ సతతమట్లు
      సాగరమున వాసముఁ జేయు సాధ్యతఁ గనఁ
      దోయధిన్ క్షార జలమయ్యె దీయగాను

      తొలగించండి
    2. మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  9. ఉ:సాగునులే పురాణములు చక్కని కల్పన,గుంభనమ్ముగా
    సాగెడు తత్త్వమున్ గలిసి, సాగర మంతయు క్షీర మౌనె? పా
    లేగతి వచ్చు ధేనువులె యీయక ? చక్కెర మాట యేమి? యా
    సాగరమందు నీరమది చక్కెర రీతిని తియ్యనయ్యెనే?
    (పురాణకథలు ఏదో గూఢతత్త్వాన్ని తెలుపటానికి ఉంటాయే కానీ నిజం గా ఆవులు లేకండా పాలసముద్రం ఎలా ఏర్పడుతుంది? అందులో చక్కెర కూడా ఉన్నదా? నీళ్లే తియ్యగా మారి పోయాయా?)

    రిప్లయితొలగించండి
  10. ముని యొకండు దాహార్తి యై పోయి జలధి
    జలము రుచి చూచి మార్చ గా దలచి తనదు
    తపపు మహిమను జూపగా తక్షణ o బె
    తోయధి న్ క్షార జలమ య్యె తీయ గాను

    రిప్లయితొలగించండి
  11. (3)తే.గీ:క్షారజలమునే యొక బాత్ర సంతరించ
    తోయధిన్, క్షారజలమయ్యె దీయగాను
    శాస్త్రవేత్త కృషి ఫలించి, చాల వ్యయము
    కనుక నా కృషి విఫలమే మనకు నేడు.
    (సముద్రపు నీటిని మంచి నీటిగా మార్చి ప్రయత్నం లో శాస్త్రవేత్తలు నెగ్గారు కానీ వ్యయము ఎక్కువ కనుక ఉపయోగ పడ లేదు. )

    రిప్లయితొలగించండి
  12. నాగతి నీవె నా ధృతియు నాచెలి నీవ యటంచు నర్మిలిన్
    రాగము రంజిలన్ బలుకు ప్రాణసఖున్ దరిచేరి కౌగిలిన్
    దూగఁగ వెన్నెలల్ విరిసె దొయ్యలి మానస సూమమందునన్
    సాగరమందు నీరమది చక్కెర రీతిని తియ్యనయ్యెనే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మానస సూమము' ?

      తొలగించండి
    2. ఆంధ్రభారతి నిఘంటుశోధన సూమమునకు ఆకాశము అని అర్థం చూపిస్తోంది గురువుగారూ.

      తొలగించండి
  13. అలుక మానవె చిలుకల కొలికియనుచు
    పలుకు తేనియ లొలికించు పతిని గాంచి
    మెలఁత మదిలోన నెలరాజు వెలుఁగు నింపె
    తోయధిన్ క్షారజలమయ్యె దీయగాను

    రిప్లయితొలగించండి
  14. కలవు వింతలు గాంచఁ బెక్కులు పుడమినిఁ
    గలదె హరికి నసాధ్యము తలఁచి చూడ
    జలధి లోన లక్ష్మీ దేవి సంభవింపఁ
    దోయధిన్ క్షార జల మయ్యెఁ దీయగాను


    బాగుగ నుండఁగా జలము వార్ధులఁ గొన్నిటి క్షార నామ త
    త్సాగర మం దిలన్ లవణ సంపద వర్ధిల క్షీర నామ స
    త్సాగర మందు భాసిలఁగఁ జక్కని క్షీరమె యిక్షు నామ త
    త్సాగర మందు నీర మది చక్కెర రీతిని తియ్య నయ్యెనే

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    త్రాగు నీటికి కఱవు నేర్పడంగ
    సంద్ర జలమును మార్చగా శాస్త్రవేత్త
    లు సఫలత నొంద యత్నములున్ ఫలించి
    తోయధిన్ క్షారజలమయ్యెఁ దీయగాను.

    రిప్లయితొలగించండి