ఇల ధర్మమ్మును బ్రోచు దీక్షగల యా హేమాంగు కల్లోలు రై యిల లో బుట్టిన వారు సత్పురుషులన్ హింసించి సాధించి రే బలదర్పమ్ముల జూపి, యక్షరుని చే పాకాలి సంసిద్ధి నే బలదర్పాది వికార సంహతులతో బ్రహ్మంబు ప్రాప్తించెడిన్.
మ:ఫల మే ముండును గ్రంథముల్ జదివి నీ వాక్చాతురిన్ బెంచ? ని శ్చల దీక్షన్ గొని నీ రజోగుణమునే చాలింప, శ్రీ రామ కృ ష్ణుల బోధన్ గొని దుష్ట మార్గముల నిన్ జొప్పించు కామాదిదు ర్బలదర్పాది వికార సంహతులతో బ్రహ్మంబు ప్రాప్తించెడిన్” (ఊరకే గ్రంథపాండిత్యం పెంచుకోకు. శ్రీరామ కృష్ణ పరమ హంస గారి మార్గం లో రజోగుణ రూపా లైన కామాది బలహీనతలని,దర్పాన్ని సంహతి చెయ్యి అనగా సంహరించు.అప్పుడే బ్రహ్మం ప్రాప్తిస్తుంది. )
మత్తేభవిక్రీడితము
రిప్లయితొలగించండికలుగన్ శాపము ద్వారపాలకులకున్ గారుణ్య మేపారఁగన్
గలహమ్మొందుచు వైరభక్తి మిగులన్ గల్గంగ వైళమ్మునన్
గలువన్ వచ్చును నన్నటంచు హరి వక్కాణింపఁగన్ వారికిన్
బలదర్పాది వికార సంహతులతో బ్రహ్మంబు ప్రాప్తించెడిన్
కందం
ఆప్తుండై జయవిజయులు
తృప్తిన్ గొన శాపభీతి తేలిక పడఁగన్
గుప్తమ్ముగ హరి పలికెన్
ప్రాప్తించును బ్రహ్మపదము బలదర్పములన్
ఆప్తమునే యలవరచుచు
రిప్లయితొలగించండితృప్తిని బొందుచు శుభమగు తెరగు నరయుచున్
గుప్తముగ బ్రతుకు నీడ్చగ
బ్రాప్తించును బ్రహ్మపదము బలదర్పములన్”
తృప్తిగ సల్పె డు తపమున
రిప్లయితొలగించండిప్రాప్తి o చును బ్రహ్మ పదము :: బల దర్పము లన్
ప్రాప్తించు ను లేశ మయిన
సప్త ద్వీ పము ల యఁదు సాధ్యంబ గు చున్
-
రిప్లయితొలగించండితపమాచరింపగా ప్రతి
భ పరిమళింప మనుజులకు ప్రాప్తించును బ్ర
హ్మపదము; బలదర్పములన్
కపటత్వముపెరుగు వినవె కంద జిలేబీ
రిప్లయితొలగించండిఇల ధర్మమ్మును బ్రోచు దీక్షగల యా హేమాంగు కల్లోలు రై
యిల లో బుట్టిన వారు సత్పురుషులన్ హింసించి సాధించి రే
బలదర్పమ్ముల జూపి, యక్షరుని చే పాకాలి సంసిద్ధి నే
బలదర్పాది వికార సంహతులతో బ్రహ్మంబు ప్రాప్తించెడిన్.
దీప్తీ! యసత్యము లిటుల
వ్యాప్తింజేయ దగదంటి నవివేకిగ ని
న్నాప్తులు తలవరె, యెవ్విధి
ప్రాప్తించును బ్రహ్మపదము బలదర్పములన్.
అలుకన్ బూని మునీశ్వరుండొసగె తానక్కస్సు శాపమ్ము వా
రిప్లయితొలగించండిరలు ప్రార్థింప విమోచనమ్మునకు మార్గంబిట్లు వాచించెనే
ఖలురై పుట్టుచు భూరిచేత హతులై కైవల్యమున్ బొందుడీ
బలదర్పాది వికార సంహతులతో బ్రహ్మంబు ప్రాప్తించెడిన్.
అలుకన్ బూని మునీశ్వరుండొసగె తానక్కస్సు శాపమ్ము వా
రిప్లయితొలగించండిరలు ప్రార్థింప విమోచనమ్మునకు మార్గంబిట్లు వాచించెనే
ఖలురై పుట్టుచు భూరిచేత హతులై కైవల్యమున్ బొందుడీ
బలదర్పాది వికార సంహతులతో బ్రహ్మంబు ప్రాప్తించెడిన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితృప్తికర సాధనముతో
రిప్లయితొలగించండిప్రాప్తించును బ్రహ్మపదము; బలదర్పములన్
లుప్తమొనరింపగా ని
క్షిప్తంబౌ భక్తిభావ చిత్తము వలనన్
బలదర్పంబుల తోడ సౌఖ్యమనుచున్ భావించులే మూఢుడే
తొలగింపన్ దగుఁ దుచ్చమౌ తలపులన్ దూరంబగున్ వ్యక్తికిన్
బలదర్పాది వికార సంహతులతో బ్రహ్మంబు; ప్రాప్తించెడిన్
వలలో చిక్కిన మీనరాశి పగిదిన్ బ్రహ్మంబు మోక్షంబుతో
బలవంతుండను నాకుసాటి భువిలో భావింప లేరెవ్వరున్
రిప్లయితొలగించండిపలుశాస్త్రంబుల నభ్యసించితి ననుంబాండిత్యమందెవ్వరున్
గెలువంజాలరటంచు దర్పమెసగన్ గీలించ నేరీతిగా
బలదర్పాది వికార సంహతులతో బ్రహ్మంబు ప్రాప్తించెడిన్?
వ్యాప్తింజేసిన ధర్మము
రిప్లయితొలగించండిప్రాప్తించును బ్రహ్మపదము, బలదర్పములన్
ప్రాప్తించ దెన్నడేనియు
నాప్తుని బోధనలు వినిన నభవము దొరకున్
కం:ఆప్తులు ఋషు లిట్లనిరి సు
రిప్లయితొలగించండిషుప్తిని విడి ధైర్య మూను శోధించుము ని
ర్లిప్తత, బలహీనత విడు
ప్రాప్తించును బ్రహ్మపదము బలదర్పములన్”
(సమస్యా పాదం సరైనదే. "నాయ మాత్మా బలహీనేన లభ్యతి " అని సాధకునికి ధైర్యం ఉండా లని ఋషులు చెప్పారు."భయమే పాపము" అన్నాడు వివేకానంద స్వామి. కనుక బలదర్పాలే అవసరం.)
మ॥ పలుకంగన్ హరి ద్వారపాలకులు శాపగ్రస్తులై పుట్టగా
రిప్లయితొలగించండినిల యందున్ హరి వైరులై చెలఁగి తామెల్లప్పుడా రీతిగా
నలుకల్ పూనుచు శాప ముక్తిని హిరణ్యాక్షాది దైత్యాళికిన్
బలదర్పాది వికార సంహతులతో బ్రహ్మంబు ప్రాప్తించెడిన్
బ్రహ్మము పరమాత్మ
(అందరికీ కాదండి వారికి మాత్రమే ఈ వెసులు బాటు శాపకారణంగా)
మ:ఫల మే ముండును గ్రంథముల్ జదివి నీ వాక్చాతురిన్ బెంచ? ని
రిప్లయితొలగించండిశ్చల దీక్షన్ గొని నీ రజోగుణమునే చాలింప, శ్రీ రామ కృ
ష్ణుల బోధన్ గొని దుష్ట మార్గముల నిన్ జొప్పించు కామాదిదు
ర్బలదర్పాది వికార సంహతులతో బ్రహ్మంబు ప్రాప్తించెడిన్”
(ఊరకే గ్రంథపాండిత్యం పెంచుకోకు. శ్రీరామ కృష్ణ పరమ హంస గారి మార్గం లో రజోగుణ రూపా లైన కామాది బలహీనతలని,దర్పాన్ని సంహతి చెయ్యి అనగా సంహరించు.అప్పుడే బ్రహ్మం ప్రాప్తిస్తుంది. )
అల వైకుంఠ పురాధి నేత పయి నత్యంతమ్ము సద్భక్తి భా
రిప్లయితొలగించండిసిల డెందమ్మున నర్చనా సహిత లక్ష్మీనాథ సంకీర్తనా
ఫల సంప్రాప్త నిమిత్త మబ్బును మహాభాగ్యమ్ము విధ్వస్త త
ద్బల దర్పాది వికార సంహతులతో బ్రహ్మంబు ప్రాప్తించెడిన్
గుప్త ధనము వెచ్చింపుమ
సప్తాహము లందుఁ గోర్కి సమకూరు నయా
తృప్తిల్లి వేచి చూడుమ
ప్రాప్తించును బ్రహ్మ! పదము బల దర్పములన్
ఇలలో స్వార్థము వీడి తత్పరతతో నిండీవరున్ గొల్చుచున్
రిప్లయితొలగించండిపలుసేవల్ నిరుపేదవారలకు సద్భావమ్ముతో చేయుచున్
కలనైనన్ జెడుదారులన్ గొనక, సంఘమ్మందు నుండన్ వినా
బలదర్పాది వికార సంహతులతో బ్రహ్మంబు ప్రాప్తించెడిన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
తృప్తిగ దేవుని కొలిచిన
ప్రాప్తించును బ్రహ్మపదము;బలదర్పములన్
ప్రాప్తించదు తెలిసికొనుము
నాప్తుడ!జీవించుము తగినట్టి పథమ్మున్.