కవనంబెఱుగని యొక్క మృ గవధాజీవుడు వాడు కంజుని దయతో నవ దూత యగుచు కృమి స మ్భవుఁడు రచించెను రఘుకులమాన్యుని చరితన్.
కవనము వ్రాయ జాలని మృగావుడు కొమ్మన యున్న జంట పా రువముల గాంచి కొట్టుతరి రోదన చెందుచు విల్లు వీడి సా ధువుగను మారి బ్రహ్మ దయతోడ కిరాతుడు శక్రమూర్ధ స మ్భవుఁడు రచించె రామకథ మానవకోటికి మేలు సేయఁగన్.
ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట ముప్పది యొకటవ సర్గము. శ్రీమదాంధ్ర రామాయణము యుద్ధ కాండము తోడ సర్వము సంపూర్ణము.
కందం
రిప్లయితొలగించండిరవళించెను శ్లోకమ్మది
వివశత విడి పక్షిజంట వేదన పడ, బో
య వగచ! కిరాత కుల సం
భవుఁడు రచించెను రఘుకులమాన్యుని చరితన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిచంపకమాల
రిప్లయితొలగించండిరవళిగ శ్లోకమే పొరలె రమ్యపు పక్షుల జంట రాగపున్
వివశతఁ బాయుచున్ దనువు వీడగ శోకము రేపినంత బో
య వగచ! నారదాఖ్యు విని యద్భుత రీతి కిరాతవంశ సం
భవుఁడు రచించె రామకథ మానవకోటికి మేలు సేయఁగన్
కవనము పుట్టెనెవ్వని సుగాత్రమునన్ ప్రధమమ్ముగా భువిన్
రిప్లయితొలగించండికవన వనాంతరమ్మున మృగాధిపమంచు కవుల్ ను తింపగా
సవన సమాన దీక్ష గొన సాగఁబ్రచేతస మౌని వంశ సం
భవుఁడు రచించె రామకథ మానవకోటికి మేలు సేయఁగన్
రిప్లయితొలగించండికవనంబెఱుగని యొక్క మృ
గవధాజీవుడు వాడు కంజుని దయతో
నవ దూత యగుచు కృమి స
మ్భవుఁడు రచించెను రఘుకులమాన్యుని చరితన్.
కవనము వ్రాయ జాలని మృగావుడు కొమ్మన యున్న జంట పా
రువముల గాంచి కొట్టుతరి రోదన చెందుచు విల్లు వీడి సా
ధువుగను మారి బ్రహ్మ దయతోడ కిరాతుడు శక్రమూర్ధ స
మ్భవుఁడు రచించె రామకథ మానవకోటికి మేలు సేయఁగన్.
కవికాడు , పుట్ట తెగ సం
రిప్లయితొలగించండిభవుఁడు రచించెను రఘుకులమాన్యుని చరితన్
ద్రువుపయి పక్షి మృతినిగని
నవత బడయ శ్లోకమొకటి నడచుట చేతన్
నవరస భరితపు కథనే
రిప్లయితొలగించండిసవివరముగఁ దెలుపనెంచి చక్కని రీతిన్
గవనముగా ఖోలక సం
భవుఁడు రచించెను రఘుకులమాన్యుని చరితన్
సవివరమైన కావ్యమిది చక్కని పాటవమొప్పురీతినిన్
గవనము కూర్చినట్టి కవి జ్ఞానవిలోచను డగ్నిశర్మ సం
భవుఁడు విలక్షణుండు నగు మౌని తపోనిధి శక్రమూర్ధ సం
భవుఁడు రచించె రామకథ మానవకోటికి మేలు సేయఁగన్
[ఖోలకము = పుట్ట; శక్రమూర్ధము = పుట్ట]
భవహరమైన దాశరథి భవ్యచరిత్రము కావ్యరూపమై
రిప్లయితొలగించండిశివమును గూర్చి తేకువను జీవులకేర్పడ జేయు నిచ్ఛతో
కవనము వ్రాయ బూనుకొని కమ్రముగానిల శక్రమూర్ధసం
భవుఁడు రచించె రామకథ మానవకోటికి మేలు సేయఁగన్
భవహరము శుభకరము కే
రిప్లయితొలగించండిశవు చరితము శ్రీకరమ్ము సకల జనులకున్
కవిగా భువి వల్మికసం
భవుఁడు రచించెను రఘుకులమాన్యుని చరితన్
చం:"అవి యివి వ్రాయ నేల? గవి వైన లిఖింపుము రామగాథ" యన్
రిప్లయితొలగించండిచవి గల తండ్రి బోధ విని శాస్త్ర విదుండగు విశ్వనాథ, త
త్త్వవిదుడు, కావ్యశిల్పి, ఋషిధర్మ విదుండును, విప్రవంశసం
భవుఁడు రచించె రామకథ మానవకోటికి మేలు సేయఁగన్
చం॥ కవియ కిరాతుఁడాతఁడటు కావ్యముఁ గూర్చుట నేర్చి యుండెనా?
రిప్లయితొలగించండిభవితను దెల్ప శక్యమొకొ బ్రహ్మకుఁ గాని యతండు మారుచున్
జవిఁగొని తప్పుఁ దెల్సికొను సంఘటనమ్మున నౌచు జ్ఞాన సం
భవుఁడు రచించె రామకథ మానవకోటికి మేలు సేయఁగన్
(బ్రహ్మ కూడ వ్రాసి తప్పకోవలసినదే కదండి. గుర్తుండే అవకాశము లేదను భావముతో)
కం:వివరింపగ రామాయణ
రిప్లయితొలగించండిమవిరళముగ బుద్ధి లేని యర్భకుడై, యే
యవిధేయుడు? గార్ధభసం
భవుఁడు ర? చించెను రఘుకులమాన్యుని చరితన్”
(నేను రోజూ రామాయణం చదివి వినిపిస్తుంటే ఎవడో పిల్లాడు దాన్ని చించేసాడు.ఆ అవిధేయుడైన గాడిదకొడు కెవడు రా?)
భవ భయ హర కావ్యమ్మును
రిప్లయితొలగించండిభవ సంచిత పుణ్యమునను భవ దూరుండై
భువిని వెలసి వల్మిక సం
భవుఁడు రచించెను రఘుకుల మాన్యుని చరితన్
అవిరళ శోక తప్తుఁ డయి యద్భుత రీతిని మైథిలీ సతీ
శివతమ సచ్చరిత్రముఁ బ్రచేతసు సూనుఁడు మౌనిపుంగవుం
డవని వెలింగి యాదికవి యబ్జజు కోరిక వామలూరు సం
భవుఁడు రచించె రామ కథ మానవ కోటికి మేలు సేయఁగన్
అవనిజ సచ్చరిత్రమును నంచిత రీతిని వల్మికేద్ధ సం
భవున కొసంగి వందనము భక్తి వినమ్ర మనో భిరాముఁ డా
యవిరళ పోచిరాజ సుకులార్ణవ రత్న వరేణ్య గర్భ సం
భవుఁడు రచించె రామ కథ మానవ కోటికి మేలు సేయఁగన్
శ్రీకార పద్యము:
శా. శ్రీకైవల్య విలగ్న మానసుఁడ నై చింతింతు శ్రీరాఘవుం
లోకోద్ధారుని నిత్యసత్య సువచో రోచిష్ణు యాగావనుం
గైకేయీ వచ నానుకర్ముఁ బితృ వా క్సాఫల్య వాంఛాత్మునిన్
శ్రీకాంతా హరణార్తి రావణ శిరశ్ఛేదైక కార్యోన్ముఖున్ 1.
ముగింపు:
మాలిని. దశరథ నృప సంజాతా సరోజాయతాక్షా!
నిశిత విశిఖ వద్ధన్వీ! వినీ లాభ్ర గాత్రా!
దశవదన శిరో హర్తా! జగత్త్రాణ దక్షా!
స శమ దమ విరాజత్స్వాంత! శ్రీరామ భూపా! 100.
ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట ముప్పది యొకటవ సర్గము.
శ్రీమదాంధ్ర రామాయణము యుద్ధ కాండము తోడ సర్వము సంపూర్ణము.
కవికుల దీపకుండతడు కావ్య మహోన్నతికారకుండహో
రిప్లయితొలగించండిరవికుల దీపు నామమును రమ్యమగాజపియించె ధన్యుడై
భువనములందుతుల్యుడికబుట్టడు కాలమునన్ ప్రచేతసం
భవుడెరచించెరామ కథ మానవ కోటికి మేలు సేయగన్
(ప్రచేతసుడు= వాల్మీకి తండ్రి)
దివపు మునీశ్వరుండు చనుదెంచి ధరిత్రికి గాంచ వల్మికిన్
రిప్లయితొలగించండిబ్రవిమలమైన చిత్తమున పాద్యము నిచ్చి సుభక్తి గొల్వ నా
ప్రవరుడు రామచంద్రు కథ వ్రాయ వచించగ వామలూరు సం
భవుఁడు రచించె రామకథ మానవకోటికి మేలు సేయఁగన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
కవనము నెఱుగని బోయడు
కవియై వాణి దయతోడ కఠిన జపముతో
చవులూరగ వల్మిక సం
భవుడు రచించెను రఘుకుల మాన్యుని
చరితన్.
అవిరళమైన గారవము నాస్థ జనించగ మానసంబులో
రిప్లయితొలగించండిప్రవిమలుడైన వాల్మికి వివరమ్ముగ వ్రాసిన కావ్యమెంచుచున్
అవనిని పేరుఁగైకొనగ అన్నపరెడ్డి కులాన్వయాబ్ది సం
భవుఁడు రచించె రామకథ మానవకోటికి మేలు సేయఁగన్
అసనారె